"ఆమె ఆవేశం అర్థం కావాలంటే ఆమె స్థానం లో మన ముండాలి . అంతే కాదు , ఆమె గుండె కూడా మనకుండాలి " - కాళీ పట్నం రామారావు మాష్టారు
Wednesday, April 25, 2012
Thursday, April 19, 2012
Tuesday, April 17, 2012
దడాలపాలెం-దుగ్గాడ
kakinada sezదడాలపాలెం-దుగ్గాడ
రెండూ ఊర్ల పేర్లే !అవే మనుషుల పేర్లుగా ఎలా ఎదిగి వచ్చాయో చూద్దాం.మామూలుగా అయితే ఒకే ఇంటి పేరు గలవారందరూ వుండే పేట పేరు అయినా ఊరు పేరు అయినా అదే వుంటుంది.కాని ఒక పిల్లని 'దుగ్గాడ' అని పిలుస్తుంటే ఒకింత ఆశ్ర్యపోవడమే గాక మరింతగా ఆలోచనలో పడిపోయాను.
అది కాకినాడ సెజ్ ప్రాంతం. అంటే అది ఏదో విహార ప్రదేశం కాదు సుమా!పచ్చని పంట పొలాలలో పెట్టుబడి పెట్టిన చిచ్చు .స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్ ).ప్రత్యేక ఆర్ధిక మండలి .2005 లో పార్లమెంట్ చట్టం కూడా చేసి పారేసింది .నానా దేశాల కంపెనీలు పరిశ్రమలు పెట్టుకోడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులు తమ భూములన్నిటిని నామ మాత్రం నష్టపరిహారం తీసుకొని ఏలిన వారికి అప్పగించడమే తరువాయు.అయితే అప్పుడు వచ్చింది చిక్కు.కడుపు నిండా తిండి పెట్టె కన్నతల్లిని ,పుట్టిన ఊరిని విడిచి పెట్టి ఉండలేని రైతాంగం తిరగబడింది .
బాలగోపాల్
బాలగోపాల్ లాంటి మేధావులు ,స్థానిక ప్రగతి శీల శక్తులు వారిని బలపరిచారు .2007 లో అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తి తో పెద్దేత్తున మహిళలు సభ జరుపుకొని ,సెజ్ నిర్మాణాల ఫై దాడి కి దిగారు .ఆ తర్వాత క్రమము లో సెజ్ వ్యతిరేక పోరాట కమిటి కార్యక్రమాలు కూడా ఊపు అందుకొన్నాయి .అప్పుడు చాల తెలివిగా సెజ్ యాజమాన్యం భూమి లేని దళిత గ్రామాల ఫై కన్ను వేసింది .ఐదు దళిత గ్రామాలను మొత్తం గా తుడిచి పెట్టె కుట్ర పన్నింది.దడాలపాలెం కేంద్రంగా దళితగ్రామాలు ఐక్య పోరాటాలకు సిద్దమవుతున్నతరుణం.దడాలపాలెం పేరుకే ఊరు ,వాస్తవానికి చిన్న పల్లె,పెద్ద కాలనీ.ఒకప్పుడు ఎలా ఉండేదో కాని ఊరు ,ఇప్పుడు అన్నీఇందిరమ్మ ఇండ్లె.ఓ యాభై గడప దాక ఉంటై
వడ్డీ నూకరాజు
...అందులో ఒకే ఒక్క సర్పంచ్ వడ్డీ నూకరాజు .అతగాడి ఇల్లు ఒకటే పెద్ద డాభా.ఓ ఇరవై ఎకరాల భూమికి అధిపతి అతడు .ఆ ఊరు లో చాలా మంది ఇంటి పేరు దడాలే.అందరి గుండెల నిండా దడే కాబోలు!
ఆ కాలని కి ఒక చివర ఉప్మా బడి .అంగన్వాడి స్కూల్ .ఆ స్కూల్లో పిల్లలకి ఉప్మా పెడతారు కాబట్టి అది ఉప్మా బడి .దాన్ని ఆనుకొనే చిన్న ప్రాథమిక పాటశాల .వాటికి దగ్గర లోనే ఒక చిన్న చర్చి .ఆ పల్లెకి రేడు పక్కలా రెండు మట్టిరోడ్లు .అవి ,రెండు కిలోమీటర్ల దూరం లో బంగాలఖాతం సముద్రానికి పక్కనే వున్నా బీచ్ రోడ్డుకు కలుస్తాయి .రోజులో ఓ నాలుగు మాట్లు పిఠాపురం ,కాకినాడ బస్సులు తిరుగుతాయి ,ఆ రూట్లో .
ఆ ఇండ్ల చుట్టూ కొబ్బరి చెట్లు కప్పేసి ఉంటాయి.ఆ ఊరి చుట్టూ సరుగుడు ,జీడిమామిడి వృక్షాలు ,తాడి చెట్లు అడివిలా అలుముకొని ఉంటాయి .ఇసుక నేలలు.నేలబావులు .పచ్చటి ప్రకృతి .ప్రశాంత మైన గాలి ,పరమలించే వెన్నల .పలకరించే చుక్కల ఆకాశం .దడాలపాలెం గురుంచి దడ పుట్టేలా చెప్పేసినట్టు ఉన్నాను కదా !
సర్లెండి ,సర్పంచ్ వడ్డీ నూకరాజు గారి డాబా పైకి వెళదాం సరదాగా !ఇంటి బయట, పొలం నుంచి అలిసిపోయు వచ్చి నూకరాజు నిదురపోతున్నాడు.అతడి భార్య నాగవేణి .అరవై ఏండ్ల నూకరాజుకి ముప్పై ఏండ్ల పడుచు భార్య .నలుగురు ఆడపిల్లలు వారికి .ఊరు ఊరంతా నూకరాజు ని 'నాన్న' అని పిలుస్తారు,ఇంట్లో పిల్లల్లాగే .నిజంగా అతడు ఊరంతటికీ తండ్రి లాంటి వాడే .ధరమ తండ్రి .మాట అంటే మాటే .మాట కోసం ,నిజాయీతీ కోసం ఇందిరమ్మ కాంగ్రెస్స్ రాజకీయాలలో ,40 ఎకరాల లోంచి సగం భూమి వేల్లిపోయు దంట.
నూకరాజు ,నాగవేణి ల కడగొట్టు పిల్ల పేరు విజయలక్ష్మి .ఉప్మా బడికి వెళుతుంది .ఆ పిల్లకి ,పక్కింటి పాకలో ,తన ఈడే వుండే బెతేన బేబి బెస్ట్ ఫ్రెండ్ .ఆ అమ్మాయి ది ఆ ఊరు కాదు.వేరే ఊరు .దుగ్గాడ..అయితే ఆ పేట లో అందరు
దడాలపాలెం ఊరు పేరు .దుగ్గాడ ఊరు పేరే .కాని ఇక్కడ ఇప్పుడు అమ్మాయి పేరు .నూకరాజు కూతురు విజయలక్ష్మి కూడా రేపు మూలపేట లోని సెజ్ పునరావాస కాలనీ కి వెళ్లిపోవచ్చు.(ఇప్పుడు ఆ పిల్ల అక్కడే వుంటుంది) .అప్పుడు విజయలక్ష్మి పేరు 'దడాల ' అవుతుందా ?ఏమో !చెప్పలేము .
మనిషి నామరూపాలు లేకుండా ,ఊరులన్నిటిని మింగేస్తూ బకాసురుడిలా సెజ్ రాక్షసంగా విస్తరిస్తుంది .అది నేడు కాకినాడ సెజ్ .రేపు కోస్టల్ కారిడార్ .దాన్ని మట్టు బెట్టందే మనిషి బ్రతుక్కి విశ్రాంతి లేదు .మనిషి పేరు కి విలువా లేదు.మనిషి చరిత్రకి మనుగడ లేదు .కాకినాడ సెజ్ కి వ్యతిరేకంగా 16 ఊర్ల ప్రజలు గత ఏడు ఏడ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే వున్నారు .రండి. వారికి అండగా నిలబడదాం.ఇవ్వాళా వారి చరిత్ర మాసిపోవచ్చు !రేపు పొద్దున్న మన చరిత్ర మీదా దాడి జరగవచ్చు .మొత్తంగా నిరాశ్రయ మయ్యే మానవ జాతిని ,మన తరాన్ని కాపాడుకుందాం .సెజ్ కి వ్యతిరేకంగా గళం విప్పుదాం.అందరం కలసి పోరాటం చేద్దాం !కడలి అంచున పొంచి ఉన్న సెజ్ ప్రమాదాన్ని ఆది లోనే తుదముట్టిద్దాం .
-నక్క వెంకట్రావు

Subscribe to:
Posts (Atom)