Wednesday, May 9, 2012

మానవ హక్కుల కమీషన్‌ – మనం

Posted By on June 1, 2011
హేమ
నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయకుండా నడిచిన బాటలో అతడు నేలకొరిగితే, కలల శకలాలలను మూట గట్టుకొని ఆశయాల సజీవ స్వప్నమై జనసంద్రంలో కలిసి జీవైక హక్కులకై పోరాడాలనుకుంటుంది  ”ఆమె” ఒక అక్క. హింసాహింసల మధ్య  సన్నటి పరదాలను తొలగించి చూస్తే పగిలిన జీవన దర్పణంలో అస్తిత్వం వెయ్యి ముక్కలై పకపకమని నవ్వుతుంది. ”ఆమె” ఒక ఇల్లాలు. గ్రీన్‌ హంట్‌లో భాగంగా సర్కార్‌ సైన్యాలు అడవి బిడ్డల్ని చేరబడితే న్యాయస్థానాల ముంగిటకు నడిచి వచ్చిన ”ఆమె”, వాకపల్లి. ప్రభుత్వఆసుపత్రిలో నీడలేక రోడ్డు మీదే ప్రసవించి, బిడ్డలను కోల్పోయే ”ఆమె” పేదరాలు. వీరందరూ, తమహక్కుల గురించి ప్రశ్నిస్తూన్న వాళ్లే. అయితే ఇంతకు మునుపులా కాకుండా వీరందరూ ‘మానవ హక్కుల కమీషన్‌’ కు రావడం కొత్త మలుపు. అందుకే ఈ మానవ హక్కుల కమీషన్‌ అంటే ఏమిటో తెలుసుకునే చిన్న ప్రయత్నమే ఇది.
రెండు ప్రపంచ యుద్ధాలు  మానవ జీవితంలో అంతులేని విషాదాన్ని, వేదనను మిగిల్చాయి. ఈనేపథ్యంలో మానవహక్కులను నిర్వచించడం ఆనాటి తక్షణకర్తవ్యంగా మారి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనకు దారితీసింది. మానవహక్కులంటే  ”భారతరాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులలో పొందు పరిచి  అభయమివ్వబడిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం లేక ఇంకా అంతర్జాతీయఒప్పందాలలో పొందుపరిచి భారతదేశ కోర్టులలో అమలు పరిచే అవకాశం వున్న హక్కులన్ని మానవ హక్కులే” అని గ్రాంథిక భాషలో చెప్పిన నిజానికి స్త్రీ జీవితంలో పెత్తనాన్ని వ్యతిరేకించేదే హక్కు. స్త్రీ తాను నమ్మినదానికై ఆత్మగౌరవంతో శ్రమించి బుద్దిబలంతో దోపిడీ వివక్షకు వ్యతిరేకంగా జీవించేదే మానవ హక్కు. అందుకే స్త్రీల హక్కులన్ని మానవ హక్కులుగా మనముందుకొచ్చాయి. కొన్ని  స్త్రీల ప్రగతికి బతికే హక్కుకి అడ్డంకులుగా మారినప్పుడు ఆ హక్కుల పరిరక్షణలో భాగంగా వాటిని త్రోసిపుచ్చే ప్రయత్నంలో  సంఘనియమాలను  చట్టాలను ఉల్లంఘిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడితే  అది జీవించే హక్కు వ్యక్తీికరణలో భాగంగా చూడాలి. అందుకే  బ్రతికేహక్కుకోసం అమలులో వున్న నియమాలను ధ్వంసం చేసే హక్కు ప్రతి స్త్రీ కలిగివుంటుంది.  అయితే ప్రశ్నల్లా వాటిని ఎక్కడ ప్రశ్నించాలా అన్నదే. అందుకు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు రాజ్యం ప్రకటించింది.
వాటిలో భాగంగానే  మహిళా జాతీయకమీషన్‌, షెడ్యూల్డ్‌ కులాల, జాతుల జాతీయ కమీషన్‌, మైనారిటీ జాతీయకమీషన్‌, మానవ హక్కుల కమీషన్‌లు ఏర్పడ్డాయి. ఈ మధ్య  మనం  మహిళ కమీషన్‌కంటే  మానవ హక్కుల కమీషన్‌ కొన్ని  సామాజిక పొరపాట్లపై ప్రతిస్పందించడం గమనిస్తాం! (అవి ఏమేరకు న్యాయం చేకూర్చనప్పటికీ కూడా..) ఇదే మానవ హక్కుల కమీషన్‌ స్త్రీల హక్కులకై చేస్తున్న కృషిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మానవ (స్త్రీల) హక్కుల ఉల్లంఘన కమీషన్‌ దృష్టికి వచ్చినప్పుడు కమీషన్‌ తనకుతానుగా గాని, బాధితులుగాని, బాధితుల తరఫునగాని ఎవరైన ఫిర్యాదు చేసినప్పుడు కమీషన్‌ విచారిస్తుంది. ఏదైనా కోర్టులో విచారణలో వున్నప్పుడు ఆ కోర్టు అనుమతితో కమీషన్‌ స్త్రీల హక్కుల విషయంలో జోక్యం కలుగజేసు కోవచ్చు. జైళ్ళను అదేవిధంగా వ్యక్తులను చికిత్సకోసం, సంస్కరణలకోసం, రక్షణకోసం సంబంధించిన ఇతర ప్రభుత్వ సంస్థలను దర్శించి అక్కడ నిర్భంధంగా వున్న వ్యక్తుల బాగోగుల గురించి, స్థితిగతుల గురించి అధ్యయనం చేసి వాటి మెరుగుదలకు కావలసిన చర్యలు చేపట్టవచ్చు. అవసరమైతే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు. మానవ హక్కుల భావవ్యాప్తికై సాహిత్యాన్ని అందరికీ అందేటట్లు చేయడం, సెమినార్‌లు నిర్వహించడం మీడియాద్వారా కృషిచేయడం చేస్తుంది.
సాధారణంగా కమీషన్‌లు పితృస్వామ్యం, కులస్వామ్యం, ధనస్వామ్యం చేసే ఉల్లంఘనలకంటే పోలీసుహక్కుల ఉల్లంఘనకై కమీషన్‌లో వ్యాజ్యాలు వేస్తుంటారు. సమాజంలో వున్న శక్తివంతమైన గ్రూఫులు పాల్పతున్న  మానవ హక్కుల ఉల్లంఘన  విచారణపై కమీషన్‌ సామర్థ్యంపై ప్రజలకు అనుమానం వుంది. (నిజానికి ఎంతోమంది స్త్రీలకు ఈ కమీషన్‌ గురించి తెలియదు) ఇంకో విషయం ఏమిటంటే  మానవ హక్కు ఉల్లంఘనకు పాల్పడుతున్న పబ్లిక్‌ సర్వ్‌ంట్‌లే కాదు ప్రేక్షక పాత్ర వహించేవారు కూడా ఉల్లంఘనకు బాధ్యులవుతారు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని 26వ ఛాప్టర్‌ సె.195 ప్రకారం కమీషన్‌ను  సివిల్‌ కోర్ట్‌గా పరిగణిస్తారు. ఈ కమీషన్‌కు బాధితులకు, బాధితకుటుంబాలకు సత్వర న్యాయసహాయం అందజేయడానికి సిఫారస్సు చేయడానికి మాత్రమే అవకాశం వుంది. అంతేకాని ఆదేశించే అవకాశం అధికారం లేదు. అంటే కమీషన్‌ అధికారానికి నియంత్రణ వుంది. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులపై తగినచర్యలు తీసుకోమని సిఫారస్సు మాత్రమే  కమీషన్‌ చేయగల్గుతుంది.ఈ సిఫారస్సుపై ప్రభుత్వ చర్యలు తెలియజేయాలి. కమీషన్‌ రిపోర్ట్‌లు ఉభయ సభలకు అందజేయపడ్తాయి. దీనివలన ప్రజల నిరసనని ప్రభుత్వాన్ని గురి చూసే అవకాశం వుంది. సాయుధదళాలు స్త్రీలపై జరిపే హక్కుల ఉల్లంఘనపై  కేంద్రప్రభుత్వం నుంచి  రిపోర్టు రాకపోయిన సంతృప్తి చెందకపోయినా విచారణ జరపడానికి అవకాశం లేదు.( మానవ హక్కులు – మంగారి రాజేందర్‌) మానసిక బాధిత స్త్రీలపౖౖె జరిగిన సంఘటన ఈ నేపథ్యాన్నే గుర్తు చేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకి పాల్పడుతున్న ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం కమీషన్‌ బాధ్యత అయినప్పటికీ ఈనాటికీ స్త్రీల హక్కులకోసం పోరాడుతున్న మహిళాసంఘాల సహకారాన్ని తీసుకున్న దాఖలాలు కాని, ప్రోత్సహించిన సందర్భాలు కాని కమీషన్‌కు లేవు. ( ఒక మానవ హక్కుల న్యాయవాదిగా తెలిసినమేరకు) అలాగే జనాభాలో సగభాగమైన స్త్రీలకో కమీషన్‌ సభ్యుల నియామకంలో ప్రత్యేకఅవకాశాలు లేవు. హక్కుల పరిరక్షణలో భాగంగా స్త్రీలకు ఒక హెల్ప్‌లైన్‌ లేక స్త్రీల హక్కుల భావపరివ్యాప్తికి సాహిత్యం, ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లు లేవు. మరి స్త్రీల హక్కుల పరిరక్షణ ఎలా అంటారా? మన హక్కులకై ప్రాతినిధ్యానికై మనమే నడుం కట్టాలేమో! అయితే ప్రభుత్వం లేక రాజ్యం సామాజిక సంబంధాలను యధాతధా స్థితిలో కొనసాగించే పరికరం. అది కూడా కుటుంబాన్ని మతాన్ని, వర్గాన్ని మరీ ముఖ్యంగా పితృస్వామ్య విలువల్ని పరిరక్షించడానికే పాటుపడుతుంది. కాబట్టి సంబంధిత న్యాయమూర్తులకు పితృస్వామ్యంపట్ల అవగాహన ప్రగతిశీల భావాలు లేకపోతే మరింత సమస్యల్లో యిరుక్కున్నట్టే. కమీషన్‌ యొక్క స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వ ప్రమాణాలను ప్రశ్నించవలసిన అవసరం కేవలం బాధిత స్త్రీలకే పరిమితం కాకూడదు. ఈ కమీషన్‌ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యిచ్చే సూచనలలో సిఫార్సులలో, స్త్రీల పాత్ర పెరగాలి. మానవ (స్త్రీల) హక్కుల పరిరక్షణ అన్నది స్త్రీ పురుషుల స్నేహ సంబంధాల కోసం తీవ్ర అన్వేషణ చేసే ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత కూడా.
ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల కమిటీలో భారతదేశం ఒకటి అయిన తరుణంలో అలసిన స్వప్నాలతో ‘ఆమె’ శిథిలం కాకమునుపే, ఆకుపచ్చని జీవితం సాయుధమై తిరగబడకముందే విధ్వంస విస్పోటానికి ‘ఆమె’ నాంది కాకముందే మానవహక్కుల మరో ఇంధ్రధనస్సు ఆవిష్కరణ సాధ్యం కాదేమో!

అభివృద్ధి వెలుగునీడల్ని ఆనాడే చూపించిన ఆర్‌ఎస్‌రావు

Posted By on July 7, 2011
హేమ
అణగారిన వర్గాలకోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది. కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, బుర్రరాములు,  పతిపాటి వేంకటేశ్వర్లు… ఇప్పుడు ఆర్‌ఎస్‌రావు (రేగులగడ్డ సోమేశ్వరరావు)  తెలుగువాడే కాని ఒరిస్సాలోని  బుర్ల యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసారు. అయిన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను, ఉద్యమాలను సాహిత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతడు రాసిన ”అభివృద్ధి-వెలుగు నీడలు” ఒక అద్భుత రచన. అభివృద్ధి గురించి ఇప్పటికే జరుగుతున్న చర్చకి 1990లోనే శాస్త్రీయ సమాధానాన్ని వివరించి చెప్పిన ఆర్‌ఎస్‌రావును ఏ ఉద్యమకార్యకర్త మర్చిపోరు.
ఆర్‌ఎస్‌రావు అంటే ”అభివృద్ధి వెలుగునీడ” అనేవిధంగా గుర్తుండిపోయారు. ఆ తర్వాత కూడా అనేక విషయాల మీద ఆయన చేసిన రచనలు మనకు ఒక స్పష్టమైన అవగాహనని కల్పించే విధంగా వుంటాయి. కాబట్టి అతడ్ని గుర్తు చేసుకోవడం అంటే అతడి రచనల్ని మరొక్కసారి మననం చేసుకొని ముందుకు సాగిపోవడమే.
మీరు ఆనకట్టలకి, విద్యుత్‌కేంద్రాలకు, రోడ్లనిర్మాణాలకి వ్యతిరేకంమా? అంటే ”అభివృద్ధికి వ్యతిరేకులు” అభివృద్ధికి వ్యతిరేకులంటే ద్రోహులు అనే స్థాయికి వెళ్ళిపోయాయి మనలో కొందరి బుర్రలు, ఆ బుర్రలు బూజు వదలగొట్టాలి అంటే” అభివృద్ధి వెలుగు నీడల” గురించి లోతుగా చర్చించాల్సిందే. అభివృద్ధి  గురించి  ఆర్‌.ఎస్‌.రావు మాటలోనే” ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదల అయినా దాని వెనుక నిబిడమయి ఉన్న మానవ శ్రమ, విజ్ఞానాల ఫలితం. ఆ విజ్ఞానం ఒకనొక ప్రాపంచిక దృక్పధం కారణంగా జనిస్తుంది అంటే ఏ రూపంలో కన్పించే అభివృద్ధి పథకం అయినా అంతిమ పరిశీలనలో ఒకానొక ప్రాపంచిక దృక్పథం  నుండే పుడుతుంది. అందుచేత ఆయా అభివృద్ధి పథకాల సారం వాటికి కారణం అయిన  ప్రాపంచిక దృక్పథమే  అని చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఆనకట్టనో ఫ్యాక్టరియో కాలేజినో అభివృద్ధో కాదో తెలుసుకోవాలంటే ఆ అభివృద్ధి పథకం ప్రాపంచిక దృక్పథంలో ఏమైనా మార్పులు తీసుకు వచ్చిందా, లేదా, అప్పటికే బలంగా వున్నా వేరొక ప్రాపంచిక దృక్పధంలో తానే ఒక భాగం అయి పోయిందా అనే అంశాన్ని పరిశీలించాలి. ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటి? నిర్ధిష్ట దేశకాల పరిస్థితుల్లో మనిషికీ ప్రకృతికీ మధ్య గల సంబంధాన్ని లేదా వైరుధ్యం గురించి తెలియజేపే దృక్పథమే ప్రాపంచిక దృక్పథం…
అభివృద్ధి అనే భావన ఏకకాలంలో క్లిష్టం అయినది సులభంగా  అర్ధమయ్యేది కూడా. సులభంగా ఎందుకు అర్ధం అవుతుందంటే దాని బలమైన దర్శనీయత వల్ల (విజుబ్యూలిటీ) క్లిష్టమయినది ఎందుకు అంటే దాని వెలుతురిని అర్ధం చేసుకోగలిగినంత సులభంగా అది సృష్టించే నీడల్ని అర్ధం చేసుకోలేం కాబట్టి.
అయితే అభివృద్ధిసారం దాని భౌతిక రూపంలో కాక ఆ అభివృద్ధి సాధ్యం చేసిన ప్రాపంచిక దృక్పథంలోనే ఉందని సులభంగానే అర్ధమముతుంది. అందుకే భయంకరదుర్ఘటన  జరగక ముందు భోపాల్‌ యూనియాన్‌ కార్భిదే అభివృద్ధికి ప్రతీక. ఆ సంఘటన తర్వాత ఆ భావం బీటలు వారింది.అభివృద్ధి వెలుగు నీడలు ఒక మంచి వ్యాసం అయితే దాన్ని ఒక జీవితంద్వారా చెప్పగలిగిన రచయిత కాళీపట్నం రామారావుగారు. అతడి యజ్ఞం కథ గురించి రాస్తూ గొప్ప విశ్లేషణ చేసారు.
యజ్ఞంకథలో గాంధీజీ ఆశయాలతో ప్రభావితం అయినా శ్రీరాములు నాయుడు గ్రామాభివృద్ధికి రోడ్లు స్కూలు ఏర్పాటు చేస్తాడు. రోడ్ల ద్వార మోటారు వాహనాలు వచ్చి రిక్షాలను మూల పడేశాయి. వ్యాపార పంటలు వలన సంప్రదాయ రీతులు నష్టపోయి అప్పులు పాలవుతారు. ఈ నేపధ్యంలో అప్పలరాముడు అప్పు తగువే ఈ కథ. ఈ తీరని అప్పులు వలన తనలాగే తన కొడుకును బానిస కావడానికి వీలు లేదని తన కొడుకును చంపేసి అప్పల రాముడు పంచాయితీ ముందు పడేస్తాడు.
గ్రామజీవితంలో అభివృద్ధి క్రమం ముందు శ్రీరాములు నాయుడు హీరోగా మొదలుపెడితే కథ అంతానికి అప్పలరాముడు అంటే హీరో నుంచి హీరో అయిపోతాడు. ఇంకా వర్గం రూపొందని కాలంలో అప్పల రాముడు అ వర్గ ప్రతినిధిగానే వర్గ సహకారం లేకుండా ఉండిపోయాడు. కాని ఆ తర్వాత కాలానికి వర్గ పోరాటాలద్వారా వర్గం రూపొందటం మొదలయింది. సంఘర్షణ ప్రదానం అయ్యింది. ఆ మార్పులో నూతన దృక్పథం కనిపిస్తుంది. ఇది ఎటువంటి  అప్పు అనే ప్రశ్న కాకుండా దానికి ఒక సమాధానం ఇస్తుంది. ఇది ఎటువంటి అభివృద్ధి అంటే ఏమిటి అనిఅంటే ఏమిటి అని చెపుతుంది. ఉద్యమం ప్రధానంగా ఉన్న గ్రామాలలోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. రూపాలు వికృతం అవ్వచ్చును. అంటే నిజ జీవితం అంటే హీరో నుంచి ఆల్ట్రానేటివ్‌ హీరోకు మార్పు చెందింది. ఈ అల్ట్రానేటివ్‌ హీరో అట్టడుగు వర్గాల నుంచి అణగార్చబడ్డ ఆడవాళ్ళ దగ్గర నుండి ముందుకు వస్తున్నారు.
దేర్‌ ఇస్‌ నో ఆల్ట్రానేటివ్‌. ఈ అభివృద్ధి తప్ప వేరే దారి లేదు అని చెబుతూ సామ్రాజ్యవాద పెట్టుబడి దారి విధానం తన విధ్వంసకర కార్యక్రమాన్ని అణిచివేత విధానాలతో అమలు చేయ ప్రయత్నిస్తుంది. ప్రత్యామ్నాయం ఉందంటూ ప్రజలు ప్రతిఘటిస్తూనే వున్నారు వారి పక్షాన నిలిచిన ఆర్‌.ఎస్‌.రావు ప్రత్యామ్నాయరాజకీయాలను ప్రతిపాదించి మనందరికీ ”కొత్తచూపు”ను అందించారు.

భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు

Posted By on December 6, 2011
హేమ
జార్ఖండ్‌లో భూనిర్వాసితుల పోరాటానికి మద్దతుగా నిల్చిన సిస్టర్‌ జాన్‌ వల్సను మైనింగ్‌ మాఫియా హతమార్చిందని వార్తాపత్రికలో (18.11.11) చూసి హతాశురాలినయ్యాను. భూవనరులను ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపోనీలకు దోచిపెట్టకుండా ప్రజలతో కలిసి జాన్‌వల్స పోరాడింది. భూమి నుండి స్త్రీలను వేరు చేయడానికి దానిపై ఆధిపత్యానికి పురుషాధిక్య వ్యవస్థ ప్రయత్నిస్తున్నా స్త్రీలు ప్రతి భూపోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కాని వారి మనోభావాలు, ఆవేదన పాలకవర్గాల నిర్ణయాధికారంలో చోటు చేసుకోలేదు. ఫెడరిక్‌ ఏంగిల్స్‌ అన్నట్టు ‘ప్రపంచ మహిళలు చారిత్రక ఓటమికి గురయ్యారు’ ఈ నేపథ్యంలో జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు ఒకసారి పరిశీలిద్దాం.
పట్టణీకరణ-పారిశ్రామికాభివృద్ధి, వాటి మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మూడింట రెండొంతులు స్త్రీలు పాల్గొనే గ్రామీణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి కార్పొరేటు సంస్థలకు భూమిని అప్పగించడానికి ప్రభుత్వం పూనుకుంది. వలస పాలనతో 1894లో చేసిర భూసేకరణ చట్టానికి ప్రతిగా ఈ చట్టం రాబోతుంది. ప్రజల్నుంచి ఎలాంటి అడ్డంగి లేకుండా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను భూ సేకరణ జరపవచ్చు. ప్రేవేటే కంపెనీల కోసం అయితే 80% అనుమతి వుంటేచాలు. కాని ఈ 80%లో ఎంత మంది స్త్రీలు పట్టాదారులు? దళిత బహుజన వర్గాల్లో భూమి సాగుకు స్త్రీలే అధికంగా పాల్గొంటారు. యిక 20% మంది నిర్ణయాలు అసలు పరిగణనలోకి రావు. భూమి విలువను కట్టేదపుడు మార్కెట్టు వ్యవస్థ, దాని వినియోగం బట్టి ధరను నిర్ణయిస్తున్నారే తప్ప స్త్రీల అభిప్రాయాలకు తావే లేదు. స్వాధీనం చేసుకునే భూమి 100 ఎకరాలు మించితేనే సామాజిక పర్యవసానం గురించి ఈ బిల్లు మాట్లాడుతుంది. అంతకంటే తక్కువైతే ఈ భూ యజమానుల సంగతేమటన్న దానికి జవాబు లేదు. నీటివనరుల భూమి, బహుళ పంటలు పండే భూమి స్వాధీనపరుచుకోమని చెప్పినా కాకినాడ, సోంపేట, నందిగ్రాం తదితర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. భూ సేకరణకై గుర్తించబడ్డ స్థలాన్ని బాధిత స్థలంగా నిర్వచించారే కాని ఆ ప్రాజెక్టు ఉత్పత్తుల ఫలితంగా నష్టపోయే ప్రాంతాన్ని గుర్తించలేదు. దాని మూలంగా వెలువడే కాలుష్యం అనారోగ్య పరిణామాలు ప్రసక్తే లేదు. ఎవరి భూమిని సేకరించారో వారినే బాధితులుగా గుర్తించారే తప్ప వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలుదార్ల వర్గం, వారి స్త్రీల గురించి ప్రస్తావన లేదు.
భూమి ఒక వనరుగా కాక ఒక వస్తువుగా మారినక్రమంలో భూవనరులను పోగొట్టుకోవడమే కాకుండా దానితో జీవనాధారమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోగోట్టుకుంటారు. అప్పటివరకు శ్రామిక వర్గంగా వున్న స్త్రీలు కొత్త ప్రాజెక్టులలో స్థానం లేక మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ బిల్లు భూమికి సంబంధించిన పంచాయితీ ఎక్స్‌టెన్షన్‌  అయి షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టానికి, 2006  అది హక్కుల చట్టానికి, గిరిజనులు అధికంగా వుండే 5వ షెడ్యూల్‌ ప్రాంతంలోని భూముల బదలాయింపు చట్టానికి లోబడి వుంటుందని పేర్కొన్నా వాటి అతిక్రమణ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల్లో ఆహార రక్షణ, భద్రత అనేది యు.పి.ఏ కూడమి ప్రజలకు యిచ్చిన వాగ్ధానం. అందుకు మరింత భూమిని సేద్యానికి వినియోగించకుండా ఉన్న భూమిని పారిశ్రామీకరణ పేరుతో కంపెనీలకు బదలాయిస్తున్నారు. దేనికి అనువుగానే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆహారాన్ని బదులుగా నగదు చెల్లిస్తామని ఆహార భద్రతా చట్టాలలో పేర్కొన్నారు. దీనివలన ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి చిల్లర వ్యాపారంలో కూడా విదేశీ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూనుకుంది. యిప్పటివరకు కాస్తో కూస్తో అందుతున్న కుటుంబాలకు అందదు.
యిక ‘పునరావసం’ ఒక రాజకీయ అవసరంగా గుర్తించి జాతీయ విధానాన్ని పొందుపరిచారు ఈ బిల్లులో. భూమి విలువతో పాటు యిల్లు, 20 వ సంవత్సరాలు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి లేనట్లయితే 2 లక్షల రూపాయిలు యివ్వబడతుంది. రవాణాఖర్చులు, సెటిల్‌మెంటు, తాత్కాలిక ఉపశమన గ్రాంటు, పశుశాల, చిన్న దుకాణాల నిర్మాణం చేపడతారు. భూ విలువలో 25% షేర్లరూపంలో యివ్వబడుతుంది. యిల్లు భార్యభర్తల పేరు మీద యివ్వొచ్చు కాని యివ్వాలన్న నిబంధనలేదు ప్రభుత్వం నుంచి కల్పింపబడిన ఏ నష్టపరిహారమైనా, సదుపాయాలైనా పితృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి పోరాటం చేయకుండానే పురుషునికి దక్కుతాయి. పురుషులు వస్తు వినిమయ వ్యామోహంలో పడి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత డబ్బు యిబ్బందితో వాటికి అమ్మి సరైనా ఉపాధి దొరకక మరింత పేదరికంతో కూరుకుపోవడం కాకినాడ సెజ్‌లో అనుభవమే. ఆదివాసి సమాజంతో, సహా నష్టపరిహారాన్ని  విందులు, వినోదాలు, తాత్కాలిక అవసరాలకే హెచ్చిస్తున్నారు.
ప్రజాభిష్టం, కుటుంబాలపై సాంఘిక, ఆర్థిక అంశాల ప్రభావం, భూపరిధి తదితర అంశాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినా అందులో స్త్రీలు ఉండాలన్న నిబంధన లేదు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు జనాభావున్న అసంఘటిత కార్మికులు దేశానికి రెండొంతుల ఆదాయాన్ని అందిస్తున్నారు. అధిక శాతం వీరిలో వ్యవసాయ, అనుబంధిత మహిళా కార్మికులే.
ఈ మొత్తం క్రమాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలను భూమిక, దాని వనరులు నుండి గెంటివేసి ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయేలా చేస్తుంది. పితృస్వామిక భావజాలం ఉన్న సమాజంలో పురుషుల హింస ఈ పేట్రేగి కుటుంబభారం మొత్తం స్త్రీమీద పడుతుంది.కాబట్టి దేశాన్ని కబళించబోయే ఈ భూసేకరణ బిల్లులో మానవీయ ముఖ్యంగా స్త్రీకోణం లోపించింది. అత్యవసర పరిస్థితులలోనే భూసేకరణ పరిమితులతో జరగాలి. భూమికి భూమి యితర సదుపాయాలు కల్పించాలి. కుటుంబాన్ని యిద్దరి కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాల ప్రభావిత యూనిట్‌గా గుర్తించి స్త్రీలకు ప్రాధాన్యం యివ్వాలి. స్త్రీలను ఉత్పత్తి చేసే మనుష్యులుగా చూసి శ్రమ ఆధారిత పరిశ్రమలు ప్రభుత్వ పరంగా తెరవాలి. వికేంద్రీకరణ, వనరులు, స్థానిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకొని నడిపే పరిశ్రమలు కోసం ఉద్యమించాలి. భూమిని వాటి వనరులను బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికి రూపొందించబడిన భూసేకరణ పునరావసం పునర్మిర్మాణం బిల్లు 2011ను వ్యతిరేకించడం పురుషుల కంటే దేశపౌరులుగా మనదే ఎక్కువ బాధ్యత!!
Share

Wednesday, April 25, 2012

warangal,telangana
Mangalore sez
with Vidya Nateshan-Mangalore Sez  
ksez area
disscussing with Medha Patkar- year 2009

Tuesday, April 17, 2012

దడాలపాలెం-దుగ్గాడ

kakinada sezదడాలపాలెం-దుగ్గాడ



రెండూ ఊర్ల పేర్లే !అవే మనుషుల పేర్లుగా ఎలా ఎదిగి వచ్చాయో  చూద్దాం.మామూలుగా అయితే ఒకే ఇంటి పేరు గలవారందరూ వుండే పేట పేరు అయినా ఊరు పేరు అయినా అదే వుంటుంది.కాని ఒక పిల్లని  'దుగ్గాడ' అని పిలుస్తుంటే ఒకింత ఆశ్ర్యపోవడమే  గాక మరింతగా ఆలోచనలో పడిపోయాను.
 అది కాకినాడ సెజ్ ప్రాంతం. అంటే అది ఏదో విహార ప్రదేశం కాదు సుమా!పచ్చని పంట పొలాలలో పెట్టుబడి పెట్టిన చిచ్చు .స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్ ).ప్రత్యేక ఆర్ధిక మండలి .2005 లో పార్లమెంట్ చట్టం కూడా చేసి పారేసింది .నానా దేశాల కంపెనీలు పరిశ్రమలు పెట్టుకోడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులు తమ భూములన్నిటిని నామ మాత్రం నష్టపరిహారం తీసుకొని ఏలిన వారికి అప్పగించడమే తరువాయు.అయితే అప్పుడు వచ్చింది చిక్కు.కడుపు నిండా తిండి పెట్టె కన్నతల్లిని ,పుట్టిన ఊరిని విడిచి పెట్టి ఉండలేని రైతాంగం తిరగబడింది .


                                                                             బాలగోపాల్
బాలగోపాల్ లాంటి మేధావులు ,స్థానిక ప్రగతి శీల శక్తులు వారిని బలపరిచారు .2007  లో అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తి తో పెద్దేత్తున మహిళలు సభ జరుపుకొని ,సెజ్ నిర్మాణాల  ఫై దాడి కి దిగారు .ఆ తర్వాత క్రమము లో సెజ్ వ్యతిరేక పోరాట కమిటి కార్యక్రమాలు కూడా  ఊపు అందుకొన్నాయి .అప్పుడు చాల తెలివిగా సెజ్ యాజమాన్యం భూమి లేని దళిత గ్రామాల ఫై కన్ను వేసింది .ఐదు దళిత గ్రామాలను మొత్తం గా తుడిచి పెట్టె కుట్ర పన్నింది.దడాలపాలెం కేంద్రంగా దళితగ్రామాలు ఐక్య పోరాటాలకు సిద్దమవుతున్నతరుణం.దడాలపాలెం పేరుకే ఊరు ,వాస్తవానికి చిన్న పల్లె,పెద్ద కాలనీ.ఒకప్పుడు ఎలా ఉండేదో కాని ఊరు ,ఇప్పుడు అన్నీఇందిరమ్మ ఇండ్లె.ఓ యాభై గడప దాక ఉంటై 






                                         వడ్డీ నూకరాజు




...అందులో ఒకే ఒక్క సర్పంచ్ వడ్డీ నూకరాజు .అతగాడి ఇల్లు ఒకటే  పెద్ద డాభా.ఓ ఇరవై ఎకరాల భూమికి అధిపతి అతడు .ఆ ఊరు లో చాలా మంది ఇంటి పేరు దడాలే.అందరి గుండెల నిండా దడే కాబోలు!
 ఆ కాలని కి ఒక చివర ఉప్మా బడి .అంగన్వాడి స్కూల్ .ఆ స్కూల్లో పిల్లలకి ఉప్మా పెడతారు కాబట్టి అది ఉప్మా బడి .దాన్ని ఆనుకొనే చిన్న ప్రాథమిక పాటశాల .వాటికి దగ్గర లోనే ఒక చిన్న చర్చి .ఆ పల్లెకి రేడు పక్కలా రెండు మట్టిరోడ్లు .అవి ,రెండు కిలోమీటర్ల దూరం లో బంగాలఖాతం సముద్రానికి పక్కనే వున్నా బీచ్ రోడ్డుకు కలుస్తాయి .రోజులో ఓ నాలుగు మాట్లు పిఠాపురం ,కాకినాడ బస్సులు తిరుగుతాయి ,ఆ రూట్లో .
 ఆ ఇండ్ల చుట్టూ కొబ్బరి చెట్లు కప్పేసి ఉంటాయి.ఆ ఊరి చుట్టూ సరుగుడు ,జీడిమామిడి వృక్షాలు ,తాడి చెట్లు అడివిలా అలుముకొని ఉంటాయి .ఇసుక నేలలు.నేలబావులు .పచ్చటి ప్రకృతి .ప్రశాంత మైన గాలి ,పరమలించే వెన్నల .పలకరించే చుక్కల ఆకాశం .దడాలపాలెం గురుంచి దడ పుట్టేలా చెప్పేసినట్టు ఉన్నాను కదా !
సర్లెండి ,సర్పంచ్ వడ్డీ నూకరాజు గారి డాబా పైకి వెళదాం సరదాగా !ఇంటి బయట, పొలం నుంచి అలిసిపోయు వచ్చి నూకరాజు నిదురపోతున్నాడు.అతడి భార్య నాగవేణి .అరవై ఏండ్ల నూకరాజుకి ముప్పై ఏండ్ల పడుచు భార్య .నలుగురు ఆడపిల్లలు వారికి .ఊరు ఊరంతా నూకరాజు ని 'నాన్న' అని పిలుస్తారు,ఇంట్లో పిల్లల్లాగే .నిజంగా అతడు ఊరంతటికీ తండ్రి లాంటి వాడే .ధరమ తండ్రి .మాట అంటే మాటే .మాట కోసం ,నిజాయీతీ కోసం ఇందిరమ్మ కాంగ్రెస్స్ రాజకీయాలలో ,40 ఎకరాల లోంచి సగం భూమి వేల్లిపోయు దంట.
నూకరాజు ,నాగవేణి ల కడగొట్టు పిల్ల పేరు విజయలక్ష్మి .ఉప్మా బడికి వెళుతుంది .ఆ పిల్లకి ,పక్కింటి పాకలో ,తన ఈడే వుండే బెతేన బేబి బెస్ట్ ఫ్రెండ్ .ఆ అమ్మాయి ది ఆ ఊరు కాదు.వేరే ఊరు .దుగ్గాడ..అయితే ఆ పేట లో అందరు  
దడాలపాలెం  ఊరు పేరు .దుగ్గాడ ఊరు పేరే .కాని ఇక్కడ ఇప్పుడు అమ్మాయి పేరు .నూకరాజు కూతురు విజయలక్ష్మి కూడా రేపు మూలపేట లోని సెజ్ పునరావాస కాలనీ కి వెళ్లిపోవచ్చు.(ఇప్పుడు ఆ పిల్ల అక్కడే వుంటుంది) .అప్పుడు విజయలక్ష్మి పేరు 'దడాల ' అవుతుందా ?ఏమో !చెప్పలేము .






మనిషి నామరూపాలు లేకుండా ,ఊరులన్నిటిని మింగేస్తూ బకాసురుడిలా సెజ్ రాక్షసంగా విస్తరిస్తుంది .అది నేడు కాకినాడ సెజ్ .రేపు కోస్టల్ కారిడార్ .దాన్ని మట్టు బెట్టందే మనిషి బ్రతుక్కి విశ్రాంతి లేదు .మనిషి పేరు కి విలువా లేదు.మనిషి చరిత్రకి మనుగడ లేదు .కాకినాడ సెజ్ కి వ్యతిరేకంగా 16 ఊర్ల ప్రజలు గత ఏడు ఏడ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే వున్నారు .రండి. వారికి అండగా నిలబడదాం.ఇవ్వాళా వారి చరిత్ర మాసిపోవచ్చు !రేపు పొద్దున్న మన చరిత్ర మీదా దాడి జరగవచ్చు .మొత్తంగా నిరాశ్రయ మయ్యే మానవ జాతిని ,మన తరాన్ని కాపాడుకుందాం .సెజ్ కి వ్యతిరేకంగా గళం విప్పుదాం.అందరం కలసి పోరాటం చేద్దాం !కడలి అంచున పొంచి ఉన్న సెజ్ ప్రమాదాన్ని ఆది లోనే తుదముట్టిద్దాం .
-నక్క వెంకట్రావు 
       

Wednesday, June 22, 2011

ఆల్టర్ నేట్   హీరో  ఆర్ ఎస్ రావు


అణగారిన వర్గాల కోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది.  కన్నాభిరాన్ బాలగోపాల్ బుర్ర రాములు పతిపాటి  వెంకటేశ్వర్లు .. ఇప్పుడు ఆర్ ఎస్ రావు (రేగులగడ్డ సోమేశ్వర రావు )  తెలుగు వాడే కాని ఒరిస్సా  లోని బుర్ల యూనివెర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేసారు.  అయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయలను,  ఉద్యమాలను సాహిత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతడు రాసిన "అభివృద్ధి వెలుగు నీడలు" ఒక అద్భుత  రచన.  అభివృద్ధి గురించి ఇప్పటికే జరుగుతున్న చర్చకి 1990 లోనే శాస్త్రీయ సమాధానాన్ని వివరించి చెప్పిన ఆర్ ఎస్ రావు ను ఏ ఉద్యమ కార్యకర్త మర్చిపోరు.  ఆర్ ఎస్ రావు అంటే " అభివృద్ధి వెలుగు నీడ"  అనే విధంగా గుర్తిండిపోయారు.  ఆ తర్వాత కూడా అనేక విషయాల మీద ఆయన చేసిన రచనలు మనకు ఒక స్పష్టమైన అవగాహనని కల్పించే విధంగా వుంటాయి. కాబట్టి అతడ్ని గుర్తు చేసుకోవడం  అంటే  అతడి  రచనల్ని మరొక్కసారి మననం చేసుకొని ముందుకు సాగిపోవడమే. 

      మీరు ఆనకట్టలకి, విద్యుత్ కేంద్రాలు కు,  రోడ్ల నిర్మానాలకి వ్యతిరేకమా? అంటే "అభివృద్దికి వ్యతిరేకులు". అభివృద్దికి వ్యతిరేకులంటే ద్రోహులు అనే స్థాయికి వెళ్ళిపోయాయి ,  మనలో కొందరి బుర్రలు. అ బుర్రలు బూజు వదల గోట్టాలి అంటే  " అభివృద్ధి వెలుగు నీడల"  గురించి లోతుగా చర్చించాలసిందే.  అభివృద్ధి గురించి ఆర్ ఎస్ రావు మాటలోనే" ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదల  అయినా దాని వెనుక నిబిడమయి ఉన్న మానవ శ్రమ, విజ్ఞానాల ఫలితం.  అ  విజ్ఞానం ఒకనొక ప్రాపంచిక దృక్పధం కారణంగా జనిస్తుంది అంటే ఏ రూపంలో కన్పించే అభివృద్ధి  పథకం అయిన అంతిమ పరిశీలనలో ఒకానొక ప్రాపంచిక దృక్పథం నుండే పుడుతుంది.  అందుచేత ఆయ అభివృద్ధి పథకాల సారం వాటికి కారణం అయిన ప్రాపంచిక దృక్పథమే అని చెప్పుకోవాలి.  అలాంటప్పుడు ఆనకట్ట నో  ఫాక్టరియో కాలేజినో  అభివృద్దో కాదో తెలుసుకోవాలంటే ఆ అభివృద్ధి  పథకం ప్రాపంచిక దృక్పథం లో ఎమైన మార్పులు తీసుకు వచ్చిందా, లేదా, అప్పటికే బలంగా వున్నా వేరొక ప్రాపంచిక దృక్పథం లో తానే ఒక భాగం అయి పోయిందా అనే అంశాన్ని పరిశీలించాలి. ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటి? నిర్దిష్ట దేశకాల పరిస్థితిలలో మనిషికి, ప్రకృతి కి మధ్య గల సంబందాని లేదా వైరుధ్యం గురించి   తెలియ చెప్పే దృక్పథమే ప్రాపంచిక దృక్పథం. ....

    అభివృద్ధి  అనే భావన  ఏక కాలం లో క్లిష్ట0 అయినది  సులభంగా అర్ధమయ్యేది  కూడా. సులభంగా ఎందుకు అర్థం అవుతుందంటే  దాని బలమైన దర్సనీయత. (visibility ) వల్ల,  క్లిష్టమయినది  ఎందుకు అంటే  దాని వెలుతురిని అర్థం చేసుకోగలిగినంత సులభంగా అది సృస్తించే నీడల్ని అర్ధం చేసుకోలేము కాబట్టి. 


               అయితే అభివృద్ధి సారం  దాని భౌతిక రూపం లో కాక  ఆ  అభివృద్ధి సాధ్యం చేసిన  ప్రాపంచిక  దృక్పథం లోనే ఉందని సులభంగానే అర్ధమవుతుంది.  అందుకే భయంకర దుర్ఘటన జరగక ముందు భోపాల్ యునియాన్ కార్బిదే అభివృద్దికి ప్రతీక,  ఆ సంఘటన తర్వాత ఆ భావం బీటలు వారింది,  

      అభివృద్ధి వెలుగు నీడలు ఒక మంచి వ్యాసం అయితే  దాని ఒక జీవితం ద్వార చెప్ప్ప గలిగిన రచయత కాలిపతనం రామారావు.  అతడి  యజ్ఞం కథ గురించి రాస్తూ గొప్ప్ప విశ్లేషణ చేసారు.

యజ్ఞం కథలో గాంధిజీ ఆశయాలతో ప్ర భావితం అయినా శ్రీ రాములు నాయుడు గ్రామాభివృద్దికి రోడ్లు స్కూలు ఏర్పాటు చేస్తాడు.  రోడ్ల ద్వార  మోటారు వాహనాలు వచ్చి రిక్షాలను మూల పడేశాయి.  వ్యాపార పంటలు వలన సంప్రదాయ రీతులు నష్ట పోయి అప్పులు పాలవుతారు.  ఈ నేపద్యంలో అప్పల రాముడు అప్పు తగువే ఈ కథ.  ఈ తీరని అప్పులు వలన తన లాగే తన కొడుకును బానిస కావడానికి వీలు లేదని తన కొడుకును చంపేసి అప్పల రాముడు పంచాయితి ముందు పడేస్తాడు.  

   గ్రామా జీవితంలో అభివృద్ధి క్రమం ముందు శ్రీ రాములు నాయుడు హీరోగా మొదలు పెడితే కథ అంతానికి అప్పల రాముడు అంటి హీరో నుంచి హీరో అయిపోతాడు. ఇంకా వర్గం రుపొందని కాలంలో అప్పల రాముడు అ వర్గ ప్రతినిధి గానే వర్గ సహకారం లేకుండా ఉండిపోయాడు.  కాని ఆ  తర్వాత కాలానికి వర్గ పోరాటాల ద్వార వర్గం రూపొందటం మొదలయింది. సంఘర్షణ ప్రధానం అయ్యింది.  ఆ మార్పులో నూతన దృక్పథం కనిపిస్తుంది.  ఇది ఎటువంటి అప్పు అనే ప్రశ్న కాకుండా దానికి ఒక సమాధానం ఇస్తుంది.  ఇది ఎటువంటి అభివృద్ధి అని కాకుండా అభివృద్ధి అంటే ఏమిటి అని చెపుతుంది. ఉద్యమం ప్రధానంగా ఉన్న గ్రామాల లోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది.  రూపాలు వికృతం అవ్వచును. అంటే నిజ జీవితం అంటి హీరో నుంచి alternativeహీరో కు మార్పు చెందింది.  ఈ alternative హీరో అట్టడుగు వర్గాల నుంచి అనగార్చ బడ్డ  ఆడవాళ దగ్గర నుండి ముందుకు వస్తున్నారు..  
                               there is no alternative, ఈ అభివృద్ధి తప్ప్ప వేరే దారి లేదు  అని చెబుతూ సామ్రాజ్యవాద  పెట్టుబడి దారి విధానం తన విధ్వంసకర  కారక్రమాన్ని అణిచివేత విధానాలతో అమలు చేయ ప్రయత్నిస్తుంది. ప్రత్యామ్నాయం ఉందంటూ (alternative ) ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు వారి పక్షాన నిలిచిన ఆర్ ఎస్ రావు ప్రత్యామ్నాయా రాజకీయాలను ప్రతిపాదించి మనందరికీ "కొత్త చూపు" ను అందించారు.    


Text