Wednesday, May 20, 2015

ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌, సెజ్‌, థర్మల్‌, అణు విద్యుత్తు, కోస్టల్‌ కారిడార్‌ వ్యతిరేక ఉద్యమాలకు సంఫీుభావంగా కలిసి నడుద్దాం జీవనోపాధిని, జీవించే హక్కుని, పర్యావరణాన్ని కాపాడుకుందాం

కరపత్రం  November 2010
ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌, సెజ్‌, థర్మల్‌, అణు విద్యుత్తు, కోస్టల్‌ కారిడార్‌ వ్యతిరేక 
             ఉద్యమాలకు సంఫీుభావంగా కలిసి నడుద్దాం
జీవనోపాధిని, జీవించే హక్కుని, పర్యావరణాన్ని కాపాడుకుందాం

-హేమా వెంకట్రావ్


నిర్వాసితుల్ని చేయడం, పంటభూమితో పాటు సర్వస్వాన్ని లాక్కోవడంÑ అన్యాయమని ఎదురు నిలబడితే ప్రాణాలు తీయడానికి వెనుకాడని పాలకులపట్ల రగులుతున్న ప్రజాగ్రహం పెల్లుబుకి నందిగామ్‌, సోంపేటలలో కొత్త పోరాట మార్గాన్ని చూపాయి. పోరాటాలన్నింటికీ మార్గదర్శకంగా నిలిచాయి. వాటి స్పూర్తిని కాపాడుకుంటూ అన్ని ప్రజా ఉద్యమాలకు సంఫీుభావంగా నిలబడాల్సిన సామాజిక బాధ్యత మనందరిపైనా వుందని భావిస్తున్నాం.
రష్యాలో వర్షం పడితే ఇక్కడ కమ్యూనిస్టులు గొడుగుపట్టుకొని తిరుగుతారని అప్పట్లో ఒక కువిమర్శ. కాని ఇప్పుడు అమెరికాలో వాన పడితే ప్రపంచమంతా గొడుగు పట్టుకుంటుంది. ప్రజా ఉద్యమాల గురించి తెలిసిన వాళ్ళకి ప్రపంచ బ్యాంకు పాలసీల గురించి చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో జరుగుతున్న ‘విధ్వంసం’ గురించి వివరించాల్సిన అవసరం లేదు. అమెరికా, దాని అనుకూల పశ్చిమ రాజ్యాల ప్రయోజనాలే ప్రధానంగా ‘అభివృద్ధి’ నమూనాగా ప్రచారం చేయబడుతుంది. దానికనుగుణంగా ‘అణచివేత’ రాజ్యమేలుతుంది. దానితో రెక్కాడితే కాని డొక్కాడని సగటు మనిషి జీవితం పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. భూమిలాంటి ప్రాకృతిక వనరులపై ఆధారపడి బ్రతికే ప్రజలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారు. ప్రకృతిపైనే ఆధారపడి జీవించే ఆదివాసులు, సాంప్రదాయ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సామాజిక బలహీన వర్గాలైన దళితులు, స్త్రీలపైన దీని ప్రభావం వలన సామాజిక అంతరాలు మరింత పెరుగుతున్నాయి.
సామాజిక విధ్వంసమేకాదు, దీనిలో ప్రాకృతిక విధ్వంసమూ వుంది. మనిషి తన అవసరాల కోసం ప్రకృతిని నిరంతరాయంగా మార్చుకుంటూ తనకు అనుకూలంగా మలచుకుంటూ వచ్చాడు. పెరిగిన అవసరాల మేరకు ప్రకృతిలో మనిషి జోక్యమూ పెరిగింది. అయినప్పటికీ మనుషుల అవసరాల స్థానంలో పెట్టుబడి అవసరాలు వచ్చేదాక ఒక సమతుల్యం వుండేది. పెట్టుబడి అవసరాలు కోటాను కోట్ల మూలధనం వున్న కార్పొరేట్‌ పెట్టుబడిగా మారడం ఈ సమతుల్యాన్ని నాశనం చేసింది. ఒక కాలువ, ఒక నది కలుషితం కావడం కాదు మానవ మనుగడకు ప్రాకృతిక పునాది అయిన జీవావరణమే ధ్వంసమయ్యే స్థితి ముంచుకొచ్చింది.
గత రెండు దశాబ్దాలుగా ఈ విధ్వంసమే అభివృద్ధిగా చెలామణీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాలను వ్యవస్థీకరించే పని మొదలుపెట్టిన వాడు ప్రపంచబ్యాంకు సి.ఇ.వో.గా చెప్పుకొని పరిపాలించిన చంద్రబాబు నాయుడు. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటినే మరింత తీవ్రంగా అమలు పరుస్తుంది. రాజకీయ పార్టీలన్నీ ఈ అభివృద్ధి మంత్ర జపంలో మునిగిపోయాయి. యిక ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు తమ పరిధుల దాటి ముందుకు రావడం లేదు. దాంతో చాలా చోట్ల ఎన్‌.జి.వో. సంస్థలు సంఫీుభావం పేరటి ఈ ప్రజా ప్రతిఘటనను నీరుగారుస్తున్నాయి. కాని సోంపేట ఉద్యమం స్థానిక బుద్ది జీవులు, ప్రజల నాయకత్వంలో ఆదర్శంగా నడిచింది. అందుకే అట్లాంటి పోరాటాల స్పూర్తిని పోరాడే ప్రజలు ఒంటరిగా లేరని, చెప్పటానికి వారికి మనందరి అండ వుందని చెప్పటానికే మేము తాపత్రయ పడుతుంది.
సోంపేటలో పోలీసు కాల్పులు జరిగి ఇరువురి ప్రాణాలు బలిగొన్న తర్వాతే సభ్య సమాజం
ఉలిక్కిపడిరది. విస్తృతంగా సంఫీుభావం ప్రకటించబడిరది. మరి మనుషులు ప్రాణాలు కోల్పోతే కాని స్పందించని స్థితిలోకి మనందరం నెట్టివేయబడటం ప్రపంచీకరణ మాయలో భాగమే కావచ్చు కాని బుద్దిజీవులుగా, నాగరీకులుగా మన కర్తవ్యం ఏమిటో గుర్తించవల్సిన అవసరం వుంది. మనిషి ప్రాణాల్ని కాపాడటానికి మన తెలివితేటలు, జ్ఞానం ఉపయోగపడాలి. అప్పుడే దానికి సార్థకత. అభివృద్ధి కుట్రాజకీయాల గుట్టు రట్టు చేయాలి. మన మౌనాన్ని పాలకవర్గాలు చాలా తెలివిగా వాడుకుంటాయి. వారు చేసే దుర్మార్గాలకు మన మౌనం అర్థాంగీకారం కాకూడదు. మనం నేరస్తులం కాకూడదు. ప్రజల పోరాటాన్ని మనం చేయలేకపోవచ్చుÑ వారితో కలిసి నడవలేకపోవచ్చుÑ కాని వారికి మన మాట సాయమే కొండంత ధైర్యాన్నిస్తుంది.
ఈ సందర్భంగా కాశ్మీర్‌ నుంచి కాకినాడ సెజ్‌ వరకు రాష్ట్రంలో అన్ని ప్రజాఉద్యమాలు అండగా నిలిచిన మానవహక్కుల వేదిక నాయకుడు డా॥ బాలగోపాల్‌ కృషి మరవలేనిది. అలాగే ప్రజా సంఘాల జాతీయ సమాఖ్య నాయకురాలు మేధాపాట్కర్‌, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్‌ పాండే లాంటివారు ఈ ఉద్యమాలకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కాని అది సరిపోదు. ఎందుకంటే ఇంతగా సోంపేట కాల్పుల పట్ల వ్యతిరేకత పెల్లుబుకినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ప్రజల ప్రాణాలను బలిగొన్న పోలీసు అధికారులకు ఉత్తమ పోలీసు అవార్డులిచ్చి సత్కరించింది. అందువల్ల మనందరి అప్రమత్తత, ఆందోళనే ఈ అప్రజాస్వామిక ధోరణులను నిలువరించగలుగుతాయి.
అయితే ప్రజా ఉద్యమాలు బలహీనంగా వుండటానికి కారణం మనందరికి తెలిసినట్టి నాయకత్వం లోపమే. స్థానిక నాయకత్వాల పోరాటాలు రైతుల, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను ఓమేరకు కాపాడగలుగుతున్నాయి తప్ప రైతు కూలీల, దళితుల, స్త్రీల, సాంప్రదాయ మత్స్యకారుల, ఆదివాసీల హక్కులను, జీవనోపాధిని పరిరక్షించ లేకపోతున్నాయి. దాని కోసమే ప్రజాఉద్యమాలకు నిజాయితీ కల్గిన బుద్దిజీవుల నాయకత్వం ఒక తప్పనిసరి అవసరం అవుతుంది.
సామాజిక వనరుల యాజమాన్యం, నియంత్రణ వాటిని సమాజంలోని సామాన్యులందరి ప్రయోజనాలకు ఉపయోగపడేలా పంపిణి జరిగేట్టు చూడటం (ఆర్టికల్‌ 39(ఎ)), ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, సంపద ఒకేచోట పోగవకుండా, ఉత్పత్తి విధానాలు ప్రజా ప్రయోజనాలకు భంగం కల్గించనిరీతిలో వుండేలా చూడటం (ఆర్టికల్‌ 39(సి)) పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఈ రంగాలన్ని ఇవాళ అశాంతిలో కూరుకు పోయాయి. ప్రభుత్వం తన ప్రాథమిక బాధ్యతలను నిర్వర్తించడంలో వైఫల్యం చెందినప్పుడు, రాజ్యాంగం గుర్తించిన న్యాయమైన హక్కుల రక్షణ గురించి బుద్దిజీవులు, హక్కుల సంఘాలు ఆందోళన చేయవలసి ఉంది.
ఈ నేపథ్యంలో సహజ వనరుల దోపిడీని వ్యతిరేకిస్తూ పెల్లుబుకుతున్న ప్రజాఉద్యమాలకు మద్దతుగా వివిధ వర్గాల వారిని ఐక్యపరచడంర ద్వారా ఉద్యమశక్తిని పెంచడం, ‘విధ్వంసక అభివృద్ది’ని ముందుగానే గుర్తించి ప్రజలను సమాయత్తపరచడం, వనరుల దోపిడీకి అనుకూలమైన ‘సెజ్‌’ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాల రద్దుకై ఉద్యమించడంÑ ఉద్యమాలకు ఎప్పటికప్పుడు న్యాయ సహాయాన్ని అందించడంలో న్యాయవాదులను కూడగట్టడం, అన్ని ప్రజాఉద్యమాల సమన్వయానికి కృషి చేయడంÑ ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తీసుకురావటంÑ ఈ కార్యాచరణ ద్వారా అట్టడుగు, అణగారిన వర్గాల ఉద్యమాలకు అండగా నిలబడాలని ఆకాంక్షిస్తున్నాం.
‘‘దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌’’ అన్నాడు గురజాడ. కాబట్టి ఈ మట్టి మనుషుల పోరాటాలకు అండగా నిలబడటం మనకింత బువ్వ పెడుతున్న ‘మట్టి ఋణం’ తీర్చుకోవడం తప్ప మరింకేవీ కాదు.
ప్రజా ఉద్యమాల సంఫీుభావ కమిటీ
ఆవిర్భావ సదస్సు
తేది : 17`11`2010 (బుధవారం), ఉ. 10 గం.ల నుండి సా. 5 గం.లవరకు
స్థలం : శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, సుల్తాన్‌బజార్‌, కోఠి, హైదరాబాద్‌.

సోంపేట ఉద్యమ నేపథ్యంలో మేధావుల పాత్ర
అధ్యక్షత : హేమావెంకట్రావ్‌, న్యాయవాది, సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ
ముఖ్య అతిథి : ప్రొ॥ హర గోపాల్‌, రాష్ట్ర పౌరహక్కుల ఉద్యమ నాయకులు
వక్తలు : ప్రొ॥ రామచంద్రయ్య, పర్యావరణ వేత్త (సెస్‌)
: ఎం. రత్నమాల, నిర్వాసిక వ్యతిరేక ప్రజాభివృద్ధి పోరాట కమిటీ

ఉద్యమాల ` అనుభవాలు ` గుణపాఠాలు (ఉ. 11.30 ని.లకు)
అధ్యక్షత : ప్రొ॥ కె. శ్రీనివాసులు, ఉస్మానియా యూనివర్సిటీ
వక్తలు : సోంపేట థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ` బీన ఢల్లీిరావు,
కాకరాపల్లి ఈస్టుకోస్టు ఎనర్జీ ప్రాజెక్టు ` బి. నర్సింగరావు, న్యాయవాది,
ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ ` పిట్టల రవీందర్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక,
పోలేపల్లి సెజ్‌, శేషాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ` మధు కాగుల, సామాజిక కార్యకర్త,
అణువిద్యుత్‌ కేంద్రాలు పర్యావరణం ` ప్రొ॥ చెన్న బసవయ్య, ఓ.యూ.

భోజన విరామం 1.30 ` 2 గం.ల వరకు

అభివృద్ధి ` ఛిద్రమవుతున్న మత్స్యకారుల జీవితాలు (మ 2గం.లకు)
అధ్యక్షత : కొండవీటి సత్యవతి, ఎడిటర్‌, భూమిక పత్రిక
వక్తలు : నాయుడు వెంకటేశ్వరరావు, సాంప్రదాయ మత్స్యకారుల సేవాసమితి
: కదిరి కన్నయ్య, దిబ్బపాలెం నిర్వాసితుల ఐక్యవేదిక
  దాసరి ఇమ్మానుయేల్‌, సామాజిక కార్యకర్త, వాన్‌పిక్‌ ప్రాజెక్టు ` మత్స్యకారులపై ప్రభావం

కమిటీ దృక్పథంపై చర్చ (మధ్యాహ్నం 3. గం.లకు)
 కమిటీ ఏర్పాటు ` భవిష్యత్తు ప్రణాళిక
అధ్యక్షత : హేమావెంకట్రావ్‌
: నాయుడు వెంకటేశ్వరరావు

No comments:

Post a Comment

Text