Wednesday, May 20, 2015

పర్యావరణానికి ముప్పు - మంగుళారు సెజ్‌

పర్యావరణానికి ముప్పు - మంగుళారు సెజ్‌
వీక∆ణం ఖి మార్చ్‌ 2010

-హేమా వెంకట్రావ్




ప్రాజెక్ట్‌లకΩ అనుమతులివ్వడంలో పరిమిత, అశాస్త్రీయ ప్రమాణాలను ఆధారం చేసుకΩంటున్నారనీ, సామాజిక, ఆర్థిక,
రాజకీయ, పర్యావరణ నష్టాలను గమనంలోకి తీసుకోవడంలేదానీ అంటున్నారు నక్కా హేమా వెంకట్రావ్‌
తరతరాలుగా వ్యవసాయం అయినా, చేపల వేట అయినా ప్రకృతి
సమతుల్యాన్ని కాపాడే విధాంగానే కొనసాగింది. తనకెంత అవసరమో
అంతమేరకే తీసుకΩంటూ, ప్రకృతిని కన్నతల్లిలా ఆరాధిస్తూ, ఆ విధామైన
సమాజ నిర్మాణాలు చేస్తూ మనిషి ప్రస్థానం జరిగింది. ఎపుడైతే యంత్ర
నాగరికత వచ్చిందో ప్రపంచ యుద్ధాలు మొదాలయ్యాయి. ప్రకృతి విధ్వాంసం
ప్రారంభమయ్యింది. పెట్టుబడుదారి వ్యవస్థలో ఆర్థికసంక∆ోభం ముదిరి
నపుడల్లా ఆ విధ్వాంసం మరింత తీవ్రతరం కావడం మామూలే అయింది.
'సెజ్‌' (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) అందాులో భాగంగానే తెరపైకి వచ్చాయి.
అనాదిగా గ్రామ ప్రాంతాలలో వ్యవసాయం 'లాభసాటి'ది
కాకపోయినా రైతులు భూమినెపుడూ వదిలిపెట్టలేదాు. అడవిని పోడు
చేసుకΩన్నా, బంజర్లను సాగుచేసుకΩన్నా ప్రకృతి సంరక∆కΩలుగానే ఉన్నారు.
కాని గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న 'అభివృద్ది' కొండల్ని పిండేస్తూ,
అడవుల్ని మింగేస్తూ, వాతావరణంలోకి అనేక విషవాయువుల్ని వదిలేస్తూ,
విచక∆ణా రహితంగా పారిశ్రామిక వ్యర్థాలను జలవనరుల్లో కలిపేస్తూ పెద్దా
ఎత్తున పర్యావరణ వినాశనానికి పాల్పడుతోంది. మనిషి ప్రాథామిక
అవసరాల్ని తీర్చే వ్యవసాయాన్ని, వృత్తుల్ని విధ్వాంసం చేస్తూ సాగే ఏ
అభివృద్ధ్షెనా మానవజాతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. మంగుళారు సెజ్‌ ఏర్పాటుకΩ కేంద్రా ప్రభుత్వం ఫిబ్రవరి 2006లో
అనుమతిని ఇచ్చింది. ఈ సెజ్‌లలో ఒ.ఎన్‌.జి.సి.కΩ 26 శాతం, కర్ణాటక
ఏరియా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకΩ 23 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
లీజింగ∑ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కΩ 49 శాతం, కర్ణాటక ఛాంబర్‌
ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కΩ 2 శాతం వాటా ఉంది. కర్ణాటక
పారిశ్రామిక అభివృద్ది సంస్థ (కె.ఐ.టి.సి.) ద్వారా 3,985 ఎకరాల
భూసేకరణకΩ 'పూనుకొన్నారు'. నేషనల్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజనీరింగ∑
రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - నీరి (ఎన్‌ఇఇఆర్‌ఐ) అనే ప్రభుత్వ సంస్థ పర్యావరణ
ప్రభావంపై అధ్యాయనం చేసి మొదాట సేకరించిన భూమిలో పరిశ్రమల
ఏర్పాటుకΩ పచ్చజెండ ఊపింది. రెండోదాశలో 2,128 ఎకరాలకΩ
నోటిఫికేషన్‌ ఇచ్చారు. కానీ రైతుల నుంచి ప్రతిఘటన ఎదాురయ్యింది.
దాంతో 'నీరి' ఇక్కడకΩ రానే లేదాు.
మంగుళారు సెజ్‌ వలన కేవలం భూమిని కోల్పోవడం మాత్రమే
అయితే పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికΩలు ఇంతగా కదాలక
పోయేవారేమో! 1972లో ఏర్పడిన మంగుళారు పెట్రోలియం రిఫైనరీ
వలన కలుగుతున్న కాలుష్యం ఇంకా వారిని భయపెడుతూనే ఉంది.
వ్యవసాయంతో పాటు నీటి వనరులు కూడ వీరి జీవనోపాధికి
ఆధారలయ్యాయి. సెజ్‌ ఏర్పాటు చేస్తే రసాయన వ్యర్థాల ద్వారా మత్స్య
సంపదా ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే విద్యాుత్‌, ఎరువులు,
రసాయన పరిశ్రమలతో 2000లో 69,412 టన్నులు ఉన్న మత్స్య సంపదా
విధానవిమర్శ

2008 నాటికి 39,937టన్నులకΩ పడిపోయింది. అలాగే ఇతర జీవజాతుల
ఉత్పత్తి వినాశనం కూడ జరుగుతుంది.
కర్ణాటకలో 300 కిలోమీటర్ల తీరం వెంబడి 25,000 చేపలు
పట్టే యూనిట్లు ఉన్నాయి. చేపల ఎగుమతి పరిశ్రమలలో వేలకొద్దీ
మహిళలు కాంట్రాకΩ్ట పద్దాతిలో పని చేస్తున్నారు. వీటి ద్వారా లక∆లాది
రూపాయల వ్యాపారం జరుగుతోంది. దాకి∆ణ కన్నడ జిల్లాలోని మంగుళారు
కర్ణాటక ప్రధానమైన రేవు పట్టణం. ఆదాయాభివృద్ధిలోనైనా
మానవాభివృద్దిలోనైనా ఈ జిల్లా అభివృద్ది చెందిన జిల్లాల్లో ఒకటి.
మంగుళారును ఆనుకΩని ఉన్న నేత్రావతి నది 5 కిలోమీటర్ల
పొడవునా జరిగే చేపల వేటలో 350 కΩటుంబాలకΩ సాలీనా 7800
లక∆ల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఒక మత్స్యకార పరిశ్రమ
1,48,200 పనిదినాలు కల్పిస్తుంది. చేపలు పట్టే కార్యక్రమానికి ముందాు
తరువాత పనిదినాలను లెక్కిస్తే ఈ మొత్తం రెట్టింపవుతుంది. అంతేకాక
ఒక్కొక్క యూనిట్‌కΩ 35,000 నుంచి 40,000 పెట్టుబడితో ఈ మత్స్య
కారులు 14-15 వేల కేజీల చేపల ఉత్పత్తిని చేస్తున్నారు. సెజ్‌ నిర్వహణ
కోసం నీటిని, విద్యాుత్‌ని సరఫరా చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హామి
కూడ ఇచ్చింది. నేత్రావతి, గురుపూర్‌ నదాులలో ఉండే నీరు 98 శాతం
వరకΩ వృథా అవుతోందాని కాబట్టి దానిని వినియోగించుకోవచ్చని
తెలియచేసింది. నదీ ప్రవాహం దాృష్ట్యా చూసినా 2-3 శాతం కంటే
నీటిని ఎకΩ్కవగా వినియోగించుకోలేం. ఇది మత్స్య సంపదాకΩ, ఆహార
భద్రాతకΩ పెనుముప్పే. వాస్తవానికి ఇప్పటికే 4,16,262 మంది జనాభా
కలిగిన మంగుళారు వాసులకΩ పెనుఘాతం.
అంచేత సెజ్‌ కంపెనీలు నదిలోకి కాలుష్యం వదిలివేయడం లేదా
ఆ నీటి నాణ్యతకΩ కీడు కలిగించేలా ఏ చర్య తీసుకΩన్నా పేదా మత్స్యకారుల
కΩటుంబాల ఆదాయానికి గండి పడుతుంది. వారు ఇంత ఆదాయాన్ని
చేకూర్చే వేరే ఏ ఇతర పనులను చేపట్టలేరు. నది 8 కిలోమీటర్ల ప్రాంతంలో
ఆనకట్టలతో నీటి ప్రవాహాన్ని దారి మళ్లించడం వలన కలిగే నష్టం అంతా
ఇంతా కాదాు. ప్రధానంగా చేపల వేట లేకΩండ పోతుంది.
రైతులు అనువంశికంగా వారికి సంక్రమించిన భూమి ప్రకృతి
వనరులపై హకΩ్కలతో పాటు పర్యావరణాన్ని భవిష్యత్‌ తరాలకΩ
అందించాలని తాపత్రయపడతారు. అలాంటి వారి నుండి అన్నీ లాక్కొని
సెజ్‌ యాజమాన్యం తిరిగి వారికిచ్చేదేంటి? పునరావాస పథాకాలని చెప్పి
వారిని, రాబోయే తరాలను దాగా చేయడం తప్ప! మెట్టభూమికి ఎకరానికి
ఎనిమిది లక∆లు, నీటి వసతి కలిగిన భూమికి ఎనిమిదాన్నర లక∆లు ధార
నిర్ణయించారు. నిర్వాసితుల ఇంటి స్థలానికి కనిష్టంగా 2.5 సెంట్లు,
గరిష్టంగా 12.5 సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించారు.
భూమితో పాటు చెట్లకΩ, బావులకΩ, ఇళ్లకΩ వెలకట్టడంతో పాటు
రవాణా తదితర ఖర్చులు కూడ భరిస్తామన్నారు. గ్రామీణ వృత్తిదారులకΩ,
చిన్న వ్యాపారులకΩ వృత్తి శిక∆ణ, ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
నిర్వాసితులకΩ నష్టపరిహారంతో పాటు కΩటుంబానికి ఒక ఉద్యోగ
అవకాశాన్ని లేదా మూడున్నర లక∆లు ఇస్తామన్నారు. మందిరాలను
నిర్మిస్తామని వాగ్దానం చేశారు. ఇంటి ఆవరణలో కట్టబడ్డ విగ్రహాలకΩ
పదివేల రూపాయలు (మంగుళారులో దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో
దేవతా విగ్రహాలని ప్రతిష్టించుకΩంటారు). గృహప్రవేశ ఖర్చుగా 20 వేల
రూపాయలు ప్రకటించారు. ఇపుడు నివసిస్తున్న ఇంటికి అడుగుకి
రు.575లు చొప్పున వెలకడుతున్నారు. పునరావాస కాలనీలో కొత్త ఇంటిని
కట్టించి ఇచ్చే వరకΩ సంవత్సరానికి 36వేల రూపాయలు అద్దె కిందా
చెల్లిస్తామన్నారు. రవాణా ఖర్చుగా పదివేల రూపాయలు, ఉపాధికి
నష్టపరిహారంగా 75వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. రోడ్లు,
డ్రైనేజి, నీటి సరఫరా, స్కూళ్లు, పార్కింగ∑ తదితర స్ధకర్యాలన్నీ కల్పిస్తామని
ఆశ చూపారు. కానీ ఇప్పటి వరకΩ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర
పనులకΩ ఉపయోగించడం వలన రైతులు ఎంతగా నష్టపోతారో బాధితుల
మీదా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒక అధ్యాయనం కూడ జరగలేదాు.
ఈ సెజ్‌ ద్వారా నాలుగు వేల మందికి ప్రత్యక∆ంగాను, మరొక
నాలుగు వేల మందికి పరోక∆ంగాను ఉపాధి కల్పిస్తామని చెపుతున్నారు.
ఇంతేకాకΩండ ఐటి సెక్టర్‌, ఇతర శాఖలలో మరెన్నో ఉద్యోగాలనీ
ఊరిస్తున్నారు. కానీ అన్నీ కంప్యూటరీకరణ ప్రాజెకΩ్టలే కాబట్టి కొద్ది మందికే
ఉపాధి దొరుకΩతుంది. దాకి∆ణ కన్నడ జిల్లాలో కΩటుంబ తలసరి వార్షిక
ఆదాయం రు.22,000. 9 శాతం మంది మాత్రమే పేదారికంలో
బతుకΩతున్నారు. 84.35 శాతం పెంకΩటింట్లో, 4.76 శాతం రేకΩల
ఇళ్లలో, మిగిలిన 10.7 శాతం గుడిసెలలో బతుకΩతున్నారు. 9.65శాతం
పురుషులు, 17 శాతం స్త్రీలు మాత్రమే డిగ్రీ వరకΩ చదాువుకΩన్నారు.
కాబట్టి వారికి మాత్రమే గౌరవప్రదామైన ఉద్యోగాలు దొరకవచ్చు. మిగిలిన
వారు కాంట్రాకΩ్ట కూలీలుగానో నైపుణ్యత లేని ఉద్యోగాలలోనో స్థిరపడవలసి
వస్తుంది. సెజ్‌ చూపిస్తున్న ఆదాయం కంటే మూడు నాల్గురెట్లు ఎకΩ్కవే
సామాన్యులు సంపాదించగల్గు తున్నారు. ఇపుడు రైతులు ఎకరానికి సాలీనా
40 వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
సెజ్‌ రిపోర్టులో కేవలం కΩటుంబాల సంఖ్య మాత్రమే ఉంది.
సామాజిక, ఆర్థిక, సాంస్క ృతిక పర్యావరణ నష్టాల గురించి అసలు
ప్రస్తావనే లేదాు. పైగా ప్రజలు స్వచ్ఛందాంగా భూమిని ఇచ్చేస్తున్నారని
కంపెనీ వాదిస్తున్నది. నిజానికి మంగుళారు రిఫైనరీ వదాులుతున్న
కాలుష్యానికి భయపడి ప్రజలు వెళ్లిపోతున్నారే తప్ప తమ భూముల్ని
వదాలడనికి ఇష్టపడి మాత్రం కాదాు. ఒక్కసారి నిర్వాసితులైతే ఉమ్మడి
కΩటుంబ వ్యవస్థ నాశనం అయిపోవడం, స్పర్థలు, నష్టపరిహారం
దాుర్వినియోగం జరుగుతాయి.
ప్రకృతిపై ఆధారపడి బతుకΩతున్న స్త్రీలు ఉపాధి కోల్పోతారు.
బలవంతంగా కΩటుంబ పోషణకై బయటకΩ వస్తే వారు దోపిడికి
గురవుతారన్నది వాస్తవం. క్రమేణా వారి సామాజిక స్థాయి కూడ
పడిపోతుంది. ఇది స్త్రీలపై మరింత భారాన్ని పెంచుతుంది. ఇదొక
సామాజిక వైపరీత్యం. కాలం చెల్లిపోయిన పునరావాస పథాకాలు ఇపుడు
వారికి ఉపయోగపడకపోగా వారి జీవన విధానంలో చిచ్చురేపుతున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సెజ్‌ పొందిన పన్ను మినహాయింపు
లో పునరావాసానికి ఉపయోగిస్తునది కేవలం 0.5 శాతం (725 కోట్లు)
మాత్రమే. పునరావాస ప్యాకేజిలో కౌలుదారు, వ్యవసాయ కూలీల
హకΩ్కలను గుర్తించలేదాు. నిజానికి నష్టపోయే వారిలో వీరి శాతమే ఎకΩ్కవ.
భూమికి ధార కట్టారే తప్ప, వాటి సహజ వనరులకΩ, భూగర్భ జలాలకΩ
వెలకట్టలేదాు. భవిష్యత్తులో సంభవించే పర్యావరణ ముప్పును సెజ్‌
ప్రతిపాదిత ప్రాంతాలకే కాక బయట ప్రాంతాలకΩ కూడ లెక్క కట్టాలి.
కాని అలా జరుగలేదాు.
మంగుళారు పట్టణం వివిధా సంస్క ృతులకΩ నిలయం. వారందారినీ
పర్యావరణం ఇప్పటివరకΩ ఒక్కటిగా కలిపి ఉంచింది. ఇంటి పెరటి
గోడ మీదా, పైకప్పులపైనా మొలచిన మొక్కలు సిమెంటు పొరలను కూడ
దాచేస్తు మనల్ని ముగ్ధుల్ని చేయడమే కాక ప్రకృతి ప్రియులుగా కూడ
మార్చేస్తాయి. మంగుళారు దాగ్గరగా ప్రతిపాదించిన పెట్రో రసాయన
పరిశ్రమల సెజ్‌ పారిశ్రామిక వాడలకΩ చేరువగా ఉండటం వలన జన
జీవనానికి, పర్యావరణానికి ముప్పు. ఈ పట్టణానికి సంబంధించి 2021
వరకΩ ఉద్దేశించబడిన మాస్టర్‌ ప్లాన్‌లో సెజ్‌ ఏర్పాటును పొందాుపరచలేదాు.
సెజ్‌ ఏర్పాటు భూవినియోగం, వాతావరణం, సామాజిక పరిస్థితులపై
విధానవిమర్శ

గణనీయమైన దాుష్పùలితాలను చూపుతుంది. మంగుళారు సెజ్‌కΩ ఇచ్చిన
అనుమతి ప్రభుత్వ అవగాహన రాహిత్యానికి నిదార్శనం.
మంగుళారు పట్టణం భూకంపాలు ఎకΩ్కవగా వచ్చే అవకాశం
ఉన్న సెస్మిక్‌ జోన్‌గా గుర్తించబడిరది. కనుక ఇక్కడ పెట్రో రసాయనాల
పరిశ్రమలు స్థాపించదాల్చుకΩంటే అది మన వినాశనాన్ని కొని తెచ్చుకΩన్నట్టు
అవుతుంది. ఈ ప్రతిపాదిత పరిశ్రమలు జాతీయ రహదారికి, మంగుళారు
(బాజ్‌పే) విమానాశ్రయానికి దాగ్గర కాబట్టి బెంజిన్‌ లాంటి రసాయనాల
ప్రాజెకΩ్ట ఏర్పడితే ప్రమాదాం మన పెరట్లో ఉన్నట్లే లెక్క. బయోడుజిల్‌ ఉత్పత్తి కోసం పెట్రో రసాయనాలకΩ సంబంధించిన
మొక్కల పెంపకం వలన ఈ వృత్తి మీదా ఆధారపడి జీవించే కార్మికΩల
ఆరోగ్యం గణనీయంగా కీ∆ణిస్తుంది. ఇది వారికే కాక 10-15 కిలోమీటర్ల
వైశాల్యంలో ఉన్న సాధారణ ప్రజలకΩ కూడ ప్రమాదాకరమని అంచనా
వేయబడిరది. చదారపు కిలోమీటర్‌కΩ 1500 జనాభా కలిగిన మంగుళారు
పట్టణంలో పెద్దామొత్తంలో బెంజిన్‌ లాంటి రసాయన పదార్థాలు నిల్వ
చేసినపుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా మరణాలు కొన్ని
వేలల్లో ఉంటాయి. క్లోరిన్‌, ఫారాక్సిలిన్‌ రసాయనాల దాుష్పùలితాల గురించి
సమగ్రమైన పరిశోధాన జరగవలసి ఉండగా దాని గురించి ప్రాజెకΩ్ట
రిపోర్టులో చర్చించలేదాు.
నిజానికి కర్నాటక రాష్ట్ర వ్యవసాయ విధానం, 2006 ప్రకారం
రాబోయే దాశాబ్దంలో వ్యవసాయోత్పత్తిని రెట్టింపు చేసి సాలీనా 4.5 శాతం
వృద్ధిరేటు సాధించాలి. అలాగే రైతు నికరాదాయం పెంచాలి. రాష్ట్ర
వ్యవసాయం విధానానికి లోబడి సమగ్ర జిల్లా వ్యవసాయ విధానం
రూపొందించబడి ప్రభుత్వ ఆమోదానికి ఎదాురుచూస్తుంది. జాతీయ ఫల,
పుష్ప సేద్యా సంస్థ 2011-12 నాటికి ఫలపుష్పోత్పత్తి రెట్టింపు చేయాలని
చెబుతుంది. ఈ రంగంలో కృషిచేయడనికి ఉద్దేశించబడిన 17 జిల్లాల్లో
దాకి∆ణ కన్నడ జిల్లా ఒకటి. ఇలాంటి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర
పనుల కొరకΩ కేటాయించడం, సెజ్‌ల వలన కాలుష్యాన్ని పెంచడం,
ప్రకటించిన ప్రభుత్వ విధానాలకే వ్యతిరేకం. పరిశ్రమలు మంత్రిత్వశాఖచే
జారీ చేయబడి పి.సి.ఐ.ఆర్‌ విధానపత్రం వ్యవసాయ భూమిని పరిశ్రమలకΩ
తీసుకోవద్దాని చెబుతుంది. ఒకవేళ భూసేకరణ అవసరం అయితే అందాుకΩ
బంజరు లేదా పడవు భూములను తీసుకోవాలంటుంది
ఏ సెజ్‌ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా రాష్ట్రాలు
వేరైనా అదే మోసం, అదే దాగా! అది కాకినాడ కావచ్చు, లేదా మంగుళారు
కావచ్చు. అధికార యంత్రాంగం పోలీసు వ్యవస్థ మోసపూరితంగా
రైతులనుంచి భూముల్ని లాక్కొంటుంది. ఎపుడైతే రైతుల ప్రతిఘటన
మొదాలయ్యిందో సెజ్‌ యాజమాన్యం మొదాటి దాశ భూసేకరణకΩ
సహకరించిన పెద్దా రైతులతో బినామీ సంఘం పెట్టించి, పోరాటానికి
అడ్డంగా నిలబెట్టింది. లోపాయికారితనంగా సెజ్‌ యాజమాన్యం సంఘ
సభ్యులకΩ కాంట్రాకΩ్టలు, కమీషన్లు ఇస్తుంది. వారి మధ్యా అంత:కలహాలు
సృష్టించి పోరాడుతున్న రైతులను అభివృద్ధి నిరోధాకΩలుగా ప్రచారం చేస్తుంది.
అయినా సరే ఉద్యామబాటలో నడుస్తున్న రైతులు ప్రకృతి విధ్వాంసానికి,
భూమిపై వారసత్వ హకΩ్కలకΩ భంగం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం
లేదాు. తమ పోరాటాన్ని కొనసాగిస్తూ చారెడు నేలను కూడ సెజ్‌కΩ
అప్పగించలేదాు. ఎటువంటి పునరావాస ప్యాకేజిలను ఆమోదించటం లేదాు.
ఇప్పుడు పెద్దా ప్రాజెకΩ్టలకΩ, సెజ్‌లకΩ పర్యావరణ శాఖ అనుమతులు,
అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అయినవి, కానీ అవి మొకΩ్కబడిగా
జరుగుతున్నాయనేది ఒక వాస్తవం. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా
సెజ్‌లోని పర్యావరణ రిపోర్టు గురించి గ్రామస్తుల సమక∆ంలో పబ్లిక్‌
హియరింగ∑ జరిగింది. వాళ్లంతా తమ బాధాలు, సమస్యలు చెప్పుకొచ్చారు.
అక్కడి ప్రజలు తమ భూముల్ని సెజ్‌లు తీసుకోకూడదాని తెగేసి చెప్పారు.
ఇక్కడే కాదాు భారతదేశంలో ఎక్కడైనా వనరుల్ని, భూమిని పోగొట్టుకΩంటున్న
బాధితులు బహిరంగ విచారణను (పబ్లిక్‌ హియరింగ∑) తిరస్కరించారే
తప్ప ఒప్పుకోలేదాు. 2008 నవంబరు 29న ప్రభుత్వం తలపెట్టిన బహిరంగ
విచారణను ప్రజలు పెద్దాఎత్తున నిరసన తెలియజేసి తిప్పి కొట్టారు.
నూతన ఆర్థిక విధానాలలో భాగంగానే భారత ప్రభుత్వం 1991లో తీరప్రాంత పరిశ్రమల స్థాపన, విస్తరణ సంబంధిత ప్రక్రియలకΩ
సంబంధించిన నియంత్రణ పేరిట 'కోస్తా తీర క్రమబద్ధీకరణ'
మండలి(కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌)ని ప్రకటించింది. దాని తరువాత
సామ్రాజ్యవాదా ప్రపంచీకరణకΩ అనుగుణంగా వనరులన్నిటినీ గుత్త
పెట్టుబడిదారులకΩ కారుచౌకగా అప్పగించడం కోసం 'కోస్టల్‌ రెగ్యులేషన్‌
జోన్‌'ను 'కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌'గా మార్చింది.
మంగుళారు సెజ్‌లో దీని పరిణామాలు మత్స్యకారుల జీవనో
పాధిని పెద్దాఎత్తున దెబ్బతీసింది. ఉప్పెనలాంటి ప్రకృతి వైపరీత్యాలను
అడ్డుకోగలిగి, చేపలు, రొయ్యలు, పీతల ఉత్పత్తికి అనుకూలమైన మడ
అడవులను, కోస్తా తీరప్రాంత రక∆ణ చర్యలను చేపట్టే బదాులు కాలుష్యం
చిమ్మే సెజ్‌లను ప్రోత్సహిస్తున్నారు. అందాులో మంగుళారు సెజ్‌ ఒకటి.
ఈ 'సి.ఎం.జడ్‌.' ప్రకటన మేరకΩ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల నిర్మాణం,
విస్తరణ, ఆధాునీకరణలో భాగంగా బాజ్‌పే (మంగుళారు) విమానాశ్రయాన్ని
విస్తరించారు. గ్రీన్‌ఫీల్డ్‌ (పచ్చని భూమి) అని చెపుతూ ప్రకృతి విధ్వాంసానికి
పూనుకΩంటున్నారు. అందాుకే పెద్దాఎత్తున పర్యావరణ ఉద్యామకారులు
మంగుళారు సెజ్‌ను వ్యతిరేకిస్తున్నారు.
మంగుళారు సెజ్‌ వ్యతిరేక పోరాటం ధార్నాలు, రాస్తారోకోలు వంటి
ప్రజాస్వామిక రూపాల వరకే పరిమితం అయ్యింది తప్ప ఉధాృతమైన
ప్రతిఘటనా రూపం తీసుకోలేదాు. సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ, 'కృషి
భూమి సంరక∆ణ' సభ్యులకΩ, వారికి మద్దాతునిస్తున్న విద్యా నటేష్‌కΩ
అరెస్టులు, వారెంట్లు సర్వసాధారణమయ్యాయి. అయినప్పటికీ ఆంధ్రాప్రదేశ్‌
సెజ్‌ వ్యతిరేక పోరాట కార్యకర్తల మీదా ఉన్న నిర్బంధాంతో పోలిస్తే అణచివేత
తకΩ్కవే. ఇక్కడలా కార్యకర్తలను నక్సలైట్లుగా ముద్రావేసే సంస్క ృతి అక్కడి
పోలీసులకΩ ఇంకా అబ్బినట్లుగా లేదాు.
మేము సెజ్‌ ప్రతిపాదిత ప్రాంతాలకΩ వెళ్లినపుడు (అక్టోబరు 2009) కొండలను పగలగొట్టి గుట్టలుగా పడున్న రాళ్లు, అభివృద్ధి పేరిట
జరుగుతున్న ప్రకృతి విధ్వాంసాలను ఎలుగెత్తి చాటుతూ ఉన్నాయి. ఈ
దాష్టికాలను ఆపడనికి మంగుళారు పట్టణానికి చెందిన 'సిటిజన్‌ ఫోరం'
ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలు ప్రయత్నించారు. రెండవ దాశలో
తీసుకొన్న భూములను, కΩడిబి ఆదివాసుల మాన్యాన్ని తిరిగి వారికి
అప్పగించాలని లేకపోతే ఫిబ్రవరి 4, 2010 నుండి ఆమరణ నిరాహార
దీక∆కΩ పూనుకొంటామని రామచంద్రా మఠానికి చెందిన విశ్వతీర్థ తేజోవర
స్వామిజీ ప్రకటించారు.
ఈ సందార్భంలో సామ్రాజ్యవాదా ప్రపంచీకరణ నేపథ్యాన్ని మనం విస్మరించలేం. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పాలక వర్గాలు మైదాన
ప్రాంతాన్ని, సముద్రా తీరాన్ని బహుళజాతి కంపెనీలకΩ అప్పగించడం కోసం,
ఆర్థిక స్వావలంబన కలిగిన ప్రాంతాలను కూడ వదిలిపెట్టడం లేదాన్న
వాస్తవాన్ని గుర్తించాలి. ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది.
ఒకవైపు పర్యావరణానికి చేటుతెచ్చే సెజ్‌లను అనుమతిస్తూ, మరోవైపు
పర్యావరణ రక∆ణకΩ వివిధా చట్టాలను చేస్తున్నామని బుకాయిస్తూ అదే
చట్టం ద్వారా, కోర్టుల ద్వారా మన కన్నుని మన వేలుతోనే పొడుస్తోంది. అందాుకΩ ఉదాహరణగా ఇపుడు పార్లమెంట్‌లో సుప్రీంకోర్టు సలహాల
మేరకΩ రాబోయే పార్లమెంట్‌ సమావేశంలో నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ బిల్‌
ప్రవేశపెట్టబోతున్నారు. 1997లో నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అపల్లేట్‌
ఆధారిత (ఎన్‌.ఇ.ఎ.ఎం.) చట్టం బదాులుగా ఈ చట్టం పనిచేస్తుంది. ఈ
ట్రిబ్యునల్స్‌ పర్యావరణ సంబంధిత, సివిల్‌ వివాదాల కేసుల్ని స్వీకరిస్తాయి.
ఈ ట్రిబ్యునల్‌లో జడ్జులతో పాటు శాస్త్రవేత్తలు, జీవ శాస్త్రవేత్తలు, సాంకేతిక
నిపుణులు ఉంటారే కానీ ప్రజా ఆరోగ్యవేత్తలు, పర్యావరణ వేత్తలు
విధానవిమర్శ
వీక∆ణం ఖి మార్చ్‌ 2010 45
ఉండకపోవడం లోపమే కాక చట్టం లక∆ా్యనికే విరుద్ధాం. ఇవి జాతీయ
స్థాయిలోనే కాకΩండ ప్రాంతీయ స్థాయిలో కూడ నెలకొల్పుతారు. అయితే
ఈ చట్టాలేవి బడ పెట్టుబడిదారులకΩ, సామ్రాజ్యవాదా బహుళజాతి
సంస్థలకΩ, వాటి తొత్తులయిన పాలకవర్గాల దాుర్మార్గాలకి అడ్డుకట్ట వేసే
నిబద్ధాత కలిగిన శక్తివంతమైనవి కావు. నర్మదా బచావో ఆందోళనకారుల పిటిషన్‌కΩ స్పందించిన సుప్రీం
కోర్టు పరిమిత నష్టంతో డ్యం కట్టమని ఆదేశించినా పాలకవర్గాలు మాత్రం
తమ ఇష్టానుసారమే చేసారు. డ్యం నిర్మాణం పూర్తవుతున్నా, కొన్ని వేల
మంది బాధితులకΩ ఇప్పటివరకΩ పునరావాసం అందాలేదాు. మరి
సుప్రీంకోర్టు ఆదేశాలనే తుంగలో తొక్కిన పాలక వర్గాలు, పెట్టుబడిదారులు
ఈ ట్రిబ్యునల్‌ ఆదేశాలని పాటిస్తారా అన్నది ప్రశ్నే. ప్రకృతి కోసం, జీవించే
హకΩ్క కోసం పోరాడుతున్న రైతాంగం, ఆదివాసులు, దాళితులు,
కౌలుదారులు, కూలీలు తమ ఉద్యామానికి మద్దాతు కోరుతున్నారు.
పశ్చిమ కనుమల్లో కార్చిచ్చును ఆర్పడం కేవలం బాధిత
రైతాంగానికి, స్థానిక పర్యావరణ వేత్తలకΩ, ప్రజాస్వామ్య వాదాులకΩ
సాధ్యాపడకపోవచ్చు. మన అందారి మద్దాతు తప్పని సరి అవసరం.
ప్రతిఘటన మరింత బలోపేతంగా మారి, మరింతగా విస్తరించాలి. ప్రపంచ
దేశాలన్ని అంతర్జాతీయ సదాస్సుల వేదికలపై వాతావరణంలో కార్బన్‌
వాయువుల శాతం పెరుగుదాల, గ్రీన్‌ హ∫స్‌ ఎఫెక్ట్‌ మొదాలైన అంశాల
పట్ల ఆందోళన చెందాుతున్నాయి. ఈ భూగోళంపై కార్బన్‌ పాదాముద్రాలను
ప్రకృతినీ, పర్యావరణాన్ని కాపాడలని కోరుతున్నారు. కోపెన్‌హాగెన్‌లో
డిసెంబరు 2009లో పర్యావరణం పై సదాస్సు ఎలాంటి చర్య
తీసుకోకΩండనే ముగిసింది.
ప్రతీ సంవత్సరం డిసెంబర్‌ 3న 'భోపాల్‌'లో యూనియన్‌ కార్భైడ్‌
దాురాగతానికి బలయిపోయిన వేలాదిమందిని స్మరించుకΩంటున్నట్లుగానే,
ఇప్పటికీ నష్టపరిహారం అందాక, నయం కాని భయంకర వ్యాధాులతో
బాధాపడుతున్న వేలాది మంది కోసం పోరాడవలసిన ఆవశ్యకతను కూడ
మర్చిపోకూడదాు. భోపాల్‌ దాురంతానికి 25 ఏళ్లు నిండినా, అంతర్జాతీయ
స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ న్యాయం జరిగిన దాఖలాలు
లేవు. ఇప్పటికీ ఇంకా సెజ్‌ల రూపంలో దేశమంతటా 'భోపాల్‌'లు
విస్తరిస్తున్నాయి. చివరికి దేశం పేరు కూడ భారతదేశం బదాులుగా
'భోపాల్‌'గా స్థిరపడిపోతుందేమో!. ఆ విధాంగా మన దేశం ప్రపంచంలోని
అతి పెద్దా స్మశానంగా చరిత్రకెకΩ్కతుందేమో. దానికి ఈ దేశవాసులుగా
మనందారం సిద్ధాంగా లేమని నినదిద్దాం.

No comments:

Post a Comment

Text