దళిత ఉద్యమాలకు దిశా నిర్దేశం చేసిన ఆనంద్ తెల్
తుంబ్డే ” ఖైర్లాంజి “

ఇటీవల ఢిల్లీలో ఒక అమ్మాయిపై జరిగిన అత్యాచారం మీద దేశమంతా అట్టుడికిపోయింది . ఈ నేపధ్యంలో మానవ మృగాలు చెలరేగిన నేలంటూ ఖైర్లాంజి లో ఇద్దరు దళిత మహిళలపై, ఇద్దరు దళిత యువకులపై జరిగిన అమానుషం గురించి తెల్ తుంబ్డే రాసిన ఈ పుస్తక పరిచయం తగిన సందర్భం అన్పించింది.
ఒక తల్లిపై కన్న కూతురు ఎదుటే అత్యాచారం …కన్నబిడ్డపై ఆ తల్లి తల్లడిల్లుతుంటే అమానుషం…. కన్నకొడుకులు కన్నీళ్ళ పర్యంతమవుతుంటే కన్నతల్లి, సోదరిపై అత్యాచారం చెయ్యమని పురికొల్పే కులాహంకార సమూహం… కన్నబిడ్డల్ని కాపాడుకోలేని ఆ తల్లి నిస్సహాయత…. అమ్మని, సోదరిని ఆదుకోలేక ఆ పిల్లలు పడ్డ తాపత్రయాన్ని ఎవరైనా మాటల్లో వివరించి చెప్పగలగడం సాధ్యం కాదేమో .. తల్లిపై, సోదరిపై అత్యాచారం చేయడానికి తిరస్కరించిన దానికి ఆ మగపిల్లల మర్మాంగాన్ని కోసివేసి వారి శరీర భాగాల్ని నుజ్జు నుజ్జు చేసి…నిజంగా ఖైర్లాంజి… క్రూరమృగాలు చెలరేగిన నేలే … అయ్యింది.
అంబేడ్కర్ వారసులైన ఆ మహిళలు, యువకులు విగత జీవులై తేలియాడుతున్న దుర్భర స్థితి దళితోద్యమం ఉధృతంగా సాగిన మహారాష్ట్రలో జరగడమే పెద్ద విషాదం. అవయవాల్ని కోసేసి శవాలను మోసుకొని విజయోత్సాహంతో కాలవలో పడవేసిన సంఘటన వరిపంటకు ప్రసిద్ది చెందిన భండారా జిల్లా లో జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వ్యవసాయ రంగంలో సంపన్నమైన జిల్లాగా పేరొందిన భండారా జిల్లా రాజకీయ, ఆర్ధిక నేపధ్యాన్ని విహంగ వీక్షణం చేస్తే ఖైర్లాంజి మూలాలు మరింత స్పష్టమవుతాయి. ఆ విహంగ వీక్షణంమే ఈ పుస్తకం.
స్వాతంత్ర్యానంతర కాలంలో దళితులపై హంతక దాడులు జరిగిన కీలవేన్మణి, బెల్చీ, మోరిచ్ జాంపే, కారంచేడు, చుండూరు, మేలవలుపు,కంబాలవల్లి, జజ్జర్ సంఘటనలకు కొనసాగింపే ఖైర్లాంజి. భారతదేశ స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఇలాంటి సంఘటనలకు ఎక్కడా చోటు లేదు. చాలా మందికి ఈ ప్రాంతాల పేర్లు కూడా తెలియవు. గతంలో లాగే ఖైర్లాంజి కూడా విస్మృతిలోకి వెళ్ళిపోతుంది . విస్మృతికి వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం, రాజ్యానికి వ్యతిరేకంగా చేసే పోరాటం లాంటిదన్న మిలన్ కుందేరా మాటలను గుర్తుచేసు కుంటూ ఖైర్లాంజీని మనముందు ఉంచుతుందీ పుస్తకం.
కులం అనే విషవృక్షం కాసిన విషఫలం “ఖైర్లాంజీ’ గురించి యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలనే రచయిత ఆకాంక్ష ఈ పుస్తకం నిండా…ఈ కులనిర్మూలన కోసం కులాలను ఎలా అర్ధంచేసుకోవాలి? వీటి మూలాలను చరిత్ర నుంచి ఈ నాటి ప్రపంచీకరణ వరకు విశదీకరించడానికి ప్రయత్నం చేస్తుందీ పుస్తకం. అంతేకాకుండా రాజ్య నిర్భంధాన్ని సైతం లెక్క చేయకుండా దళితులు తమ వ్యతిరేకతను ఎట్లా తెలియజేసారో, రాజ్యవ్యతిరేక పోరాటంలో సాధారణ ప్రజలు ఎట్లా భాగమయ్యారో చెపుతుంది .
కార్పోరేటు శక్తులతో మిలాఖతు అయిన రాజ్యం ఈ ఆందోళన మీద నక్సలైట్ ముద్ర వేసి అణిచివేయ చూసినప్పుడు అత్యంత సామాన్యులైన ప్రజలు ఎట్లా ఎదురొడ్డి నిలిచారో చెబుతుంది. దళితులపై దాడుల విషయం వచ్చేసరికి ప్రసార మాధ్యమాలు ఎట్లా వివక్షతతో ప్రవర్తిస్తాయో విశ్లేషిస్తుంది. పద్ధతి ప్రకారం దళితుల్ని అశక్తుల్ని చేసే సామాజిక అసమానతల విషయంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు, భద్రతలకు ఎలాంటి పరిమితులున్నాయో వివరిస్తుంది.
ప్రపంచీకరణ వల్ల కులం బలహీనమవుతుందన్న భ్రమను ఖైర్లాంజీ బద్దలుకొట్టిన విధానాన్ని పరిశీలిస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకునేలా, సమాజాన్ని విశ్లేషించే రీతిలో ఈ పుస్తకం కాలుతున్న నరమాంసం వాసన ఎలా వుంటుందో చవిచూపిస్తుంది. అనూహ్యమైన పరమ దుర్మార్గమైన పరిసరాల గుండా మనల్ని నడిపిస్తుంది. కులంపట్ల, వర్గంపట్ల మనకున్న భ్రమల్ని తొలగించి నిర్దిష్టమైన తాత్విక భూమికను పరిచయం చేస్తుంది .
ఆలోచనాశీలి ఆనంద్ తెల్ తుంబ్డే :
దళితులపై దాడులు జరిగినప్పుడు దానికి సంబంధించిన లోతైన సాంఘిక, రాజకీయార్థిక చర్చ జరుగుతూ వుంటుంది. కారంచేడు (1985) జరిగినప్పుడైతే దశాబ్దాల వెనక్కి వెళ్లి మన సామాజిక వ్యవస్థలోని ‘అభివృద్ధి’ చలనాల పర్యవసానాలు ఎలా ఆ ఘటనకు దారి తీశాయో చాల మంచి విశ్లేషణలు వచ్చాయి. దళిత స్పృహ ఒక సాంఘీక, రాజకీయ చైతన్యంగా వికసించడానికి ఇలాంటి విశ్లేషణలు, వాటి మీద ఆధారపడి నడిచిన ఆందోళనలు కారణం అయ్యాయి. ఆ తరహాలోనే ఖైర్లాంజి (2006) గురించి తెల్ తుంబ్డే రాసిన ఈ పుస్తకం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇది గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూలంకషంగా వివరించింది. అందుకే తెల్ తుంబ్డే ఆలోచనా ధారకు అంత గౌరవం.
తెల్ తుంబ్డే సునిశిత రాజకీయ వ్యాఖ్యాత. ముంబై కమిటీ పర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్
(సి పి డి ఆర్ ) సభ్యుడు. ఖర్గపూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రొఫెసర్ గా, భారత్ పెట్రోలియంతో సహా అనేక పెట్రోలియం కంపినీలలో ఉన్నతాధికారిగా పని చేసిన తెల్ తుంబ్డే ఇటివల కాలంలో అంబేడ్కర్ -మార్కిస్టు రచయితగా ఈ పుస్తకం తో పాటు ‘యాంటి యిమ్పిరియలిజం’ అండ్ ఆనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ‘ , ‘ది పరిసిస్టేన్స్ ఆఫ్ కాస్ట్ ‘ అనే పుస్తకాలు కూడా రాశారు. ‘ హిందుత్వ అండ్ దళిత్స్’ పుస్తకానికి సంపాదకత్వం వహించారు .

కులవ్యవస్థ సహనాన్ని కోల్పోయి ఖైర్లాంజీని సృష్టించింది:
వేల ఏళ్లుగా మనుధర్మం ఈ దేశంలోని కింది కులాలపై పథకం ప్రకారం చేస్తున్న దాడులకు ఖైర్లాంజి ఒక కొనసాగింపు మాత్రమే. దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కుంటున్న గ్రామీణ దళితులు అనివార్యంగా పెత్తందారీ కులాలతో రాజీపడి బతుకుతున్నారు. వందల ఏళ్లుగా మన సమాజంలో అహింసా ,శాంతి కాముకత, సహనం పేరుతో ఇలాంటి రాజీని మసిపూసి మారేడు కాయ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ రాజీ బద్దలవుతుందో కులసమాజం తన దుర్మార్గ ముఖాన్ని బట్టబయలు చేస్తుంది.
2006 సెప్టెంబర్ 29 న ఖైర్లాంజి లో దళితుడైన భయ్యాలాల్ కుటుంబం పై బిసి కులానికి చెందిన వారు జరిపిన అమానుష హత్యాకాండ భారత దేశ అత్యాచార చరిత్రలోనే కనీ వినీ ఎరుగనిది.
దేశ రాజకీయ ఆర్దికవిధానాల నేపధ్యంలో చూసినప్పుడు ఒక ఖైర్లాంజీ మాత్రమే కాదు దళితులపై జరుగుతున్న దాడులన్ని కూడా కుల ఆధారిత సంపన్నవర్గాలకు, పీడిత కులాలైన దళితులకు మధ్య జరుగుతున్నాయని అర్ధం చేసుకోవాలి. ఈ 60 ఏళ్ళ స్వాతంత్రంలో కులవ్యవస్థ రూపాంతరం చెంది భూమి యితర వనరులపై ఆధిపత్యం కలిగిన కులాలను మరింత బలపరిచింది. కాబట్టి దళితులపై అత్యాచారాలు గత కాలపు సంప్రదాయాల వలన మాత్రమే కొనసాగుతున్న కులహింస కాదు. రాజ్య అభివృద్ధి విధానాల వలన బలపడిన కులాలు జరుపుతున్న ఆధునిక హింసా రూపంగా ఈ అత్యాచార ఘటనను చూడాల్సివుంది.

కులం x ఆధునికత :
ఆధునికతపై మన అవగాహన రూపొందడం వలసపాలనా కాలం నుంచే మొదలయ్యింది. ఈ కారణం వలనే మన మేధో రంగం కులాన్ని పెట్టుబడిదారి పూర్వ సమాజంలో ఉండే వ్యవస్థగా చూస్తోంది. ఆర్ధిక, సామాజిక రంగాలలో ఆధునికత ఊపందుకొన్న కొద్దీ కులవ్యవస్థ బలహీనపడుతున్నదన్నది మన బుద్ది జీవుల అంచనా. ఈ దృష్టితో చూసినప్పుడు ఆధునికత తీసుకొచ్చిన మార్పుల నేపధ్యంలో కులం బలహీన పడాల్సింది కాని అది జరగలేదు.
జాతీయోద్యమo లో నాయకత్వ పాత్ర పోషించిన కులీన వర్గాల చేతికి బ్రిటిష్ వలసవాదులు అధికారం అప్పగించారు. భూస్వామ్య, దళారి భూర్జువా కలయికతో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాలు ఆధునికతా ప్రక్రియను ఇటు బూర్జువాల ప్రయోజనానికి అటు భూస్వామ్య పట్టుసడలకుండా ఉండేందుకు ఉపయోగపడ్డాయి. ఈ రెండు వర్గాల సంబంధాలకు విఘాతం కలగకుండా ఉండేంత వరకు మన ఆధునికత ముందుకు సాగింది. పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్థలైన కులం, మతం, గిరిజన సంప్రదాయాలు లాంటి వాటితో పెట్టుబడిదారి విధానం సర్దుకుపోయింది.
ఆధునిక విద్య, పట్టణీకరణ, పారిశ్రామికీకరణలు కులమతాలపై చూపిన ప్రభావం అవి కొత్త రూపంలో కొనసాగడానికి ఉపయోగపడ్డాయే తప్ప వాటిని నిర్మూలించ లేకపోయాయి. ఆధునికత తెచ్చిన కొత్త వ్యవస్థలు కులంతో సౌకర్యవంతంగా కలిసిపోయాయి. ఆధునికతకు కులం ఇతోధికమైన మేలు చేసింది. భూస్వామ్య శక్తుల అభివృద్ధి కోసమే రాజ్యం ఆధునికతను ప్రవేశ పెట్టింది.
కులవ్యవస్థకు ఆధునిక రాజ్యం కొత్త జవ జీవాలు పోసి దాని రక్షణగా ఉంటుంది. రాజ్యం అనుసరిస్తున్న విధానాలు అది రూపొందించే సంస్థలు కులవ్యవస్థను ఎన్నడు లేనంతగా విషపూరితం చేస్తున్నాయి. మన దేశంలో రాజ్యం అమలు చేస్తున్న ఆధునికత యిది. కాకపోతే దాని వలన వచ్చే పరిణామాలు గురించి ఒక ప్రణాళిక లేకపోవడం వలన ఖైర్లాంజి లాంటి ప్రతికూల సందర్భాలను ఎదురుకొంటున్నది .
పీడ’కుల’ శూద్రులు :
సాంప్రదాయ కుల వ్యవస్థలో బ్రాహ్మణీయ కులాలవారే పీడకులుగా ఇతర శూద్ర కులాల వారంతా పీడితులుగా వుండేవారు. అయితే దీనికి పూర్తి విరుద్దంగా శూద్రులు (బిసిలు, ఒబిసిలు) పీడకులుగా దళితులు పీడితులుగా మారిపోయారు. సాంప్రదాయ అగ్రవర్ణాల వారు పట్టణాలకు తరలి భారత దేశాన్ని ప్రపంచీకరించే పనిలో నిమగ్నమై పోవడంతో గ్రామాల్లో శూద్రులు వారి పాత్రల్లో కి వెళ్ళిపోయారు. మారిన ఈ కుల సమీకరణలో ఒక పక్క కొత్త పీడ’కుల’ (శూద్రుల) సంఖ్య పెరగడం, వారిలో నాగరిక మార్పులు చోటు చేసుకోకపోవడం, మరో ప్రక్క పీడితులలో (దళితులలో) ప్రశ్నించే తత్వం పెరగడం ఇవాళ గ్రామాలలో జరిగే కుల హింసకు కారణం. అసలు కులవ్యవస్థే అంతర్గతంగా హింసాత్మకం అయినప్పటికీ దానికి సవాళ్లు ఎదురైనప్పుడు ఆ హింస మరింతగా చెలరేగిపోతుంది. కులవ్యవస్థ బాధితులను తమ దుస్థితికి తామే భాద్యులమనే కర్మ సిద్దాంతాన్ని నమ్మించ గల్గినంత కాలం దానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.
1970 ల నుంచి దాదాపు ప్రతి రాష్ట్రంలోను శూద్రకులాల వారు రాజకీయ శక్తిగా అవతరించారు. అంతవరకు బ్రాహ్మణ ప్రాబల్యంలో ఉన్న రాజకీయ పార్టీలను తమ పాదాక్రాంతం చేసుకున్నారు. డి.ఎం.కె , టి.డి.పి , ప్రజా రాజ్యం, సమాజ్ వాది పార్టీలు ఆవిర్భవించాయి.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే కారంచేడు, కాపు వర్గానికి చెందిన ప్రజారాజ్యం కాంగ్రెస్ తో కలిసిన తరువాత లక్షిమ్ పేట దాడులు ఇందుకు ఉదాహరణలు. ఇవాళ కుల వ్యక్తీకరణ సవర్ణుల (హిందు కులాల) మధ్య సాముహిక రూపం తీసుకుంటూ క్రూరత్వానికి పరాకాష్టగా మారింది.

ఇవాళ గుజరాత్లో నరేంద్ర మోడీ, కర్ణాటకలో ఎడ్యురప్ప మొదలగు నాయకులు జాతీయ రాజకీయాలనే శాసిస్తున్నారు. శివసేన అధిపతి బాల్ థాకరే హిందూ మతానికే ప్రతినిధిగా చూడబడ్డాడు. నరేంద్ర మోడీ బ్రాహ్మణ ఆధిపత్య బిజెపి పార్టీ నుండి దేశ ప్రధాని అభ్యర్దిగా ప్రతిపాదించబడుతున్నాడు.
దళితపులులమ్మా… :
నయా ఉదారవాద ఆర్ధిక విధానాల వలన తీవ్రంగా నష్టపోతున్న దళితులు ఆదివాసీలు నక్సలైట్ల ఉద్యమానికి ఆకర్షితులవుతున్నారు. రాజ్యానికి నక్సలైట్ ఉద్యమం పట్ల ఉండే శత్రుత్వమే దళిత , ఆదివాసీలపై చేసే హింసలో వ్యక్తమవుతుంది. ఇవాళ భారతీయ సమాజంలో నక్సలైట్ అన్న అస్తిత్వం కులం లేదా తెగ అస్తిత్వం(ఇవి మన సమాజంలో మౌలిక అస్తిత్వాలు) కంటే ప్రధానంగా మారింది. ప్రభుత్వమైనా, ప్రైవేటు ఏజెన్సీలైనా, వ్యక్తులైనా నక్సలైటు అనే ముద్ర వేసి దళిత ఆదివాసీలను చంపడాన్ని తీవ్రంగా పరిగణించాలి.
గత దశాబ్దాల కాలంగా భారత ప్రభుత్వం నక్సలైట్ బూచిని చూపెట్టి సాధారణ ప్రజలను ప్రజాస్వామిక ఆందోళనలకు దూరంగా ఉంచుతుంది. నక్సలైట్ అనే ముద్ర పోలీసులకు మంచి ఆయుధం. ఈ బూచితో వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా సామాజిక ఉద్యమాల్ని అణిచివేస్తారు, అరెస్టుల పరంపర తీవ్రమవుతుంది. హిందూ మత స్వభావం కలిగిన భారత రాజ్యం సమరోత్సాహంతో దళిత, ఆదివాసీలపై నక్సలైట్ ముద్ర వేస్తుంది.
నెలరోజుల పాటు ఖైర్లాంజికి వ్యతిరేకంగా కొనసాగిన ఆందోళన పై అమలైన రాజ్యహింస ఖైర్లాంజి కంటే తక్కువ దుర్మార్గమేమి కాదు. ఈ నిర్భందాని కి నక్సలైట్ కోణం తగిలించారు. మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ఆందోళన వెనకాల నక్సలైట్లు ఉన్నారని అనగానే పోలీసులకు లైసెన్స్ దొరికినట్టు అయ్యింది.
ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసే రాజకీయనాయకుల, వ్యాపారస్తుల ప్రయోజనాలు కాపాడుతున్న ప్రభుత్వాలను ప్రజలు కూలదొయ్యాలనుకోవడం చాలా సహజం. ఈ కారణంగానే నక్సలైట్ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తుంది.
భావజాలం, విశ్వాసాలు ఉండటాన్ని , వాటిని ప్రచారం చేయడాన్ని చట్టం నేరంగా పరిగణించదు . నక్సలైట్ ఉద్యమం దళిత ,ఆదివాసీలను తనలో భాగం చేసుకొని విప్లవం ద్వారా సామాజిక మార్పును కాంక్షించడం దళిత వ్యతిరేక రాజ్యానికి గిట్టదు. కులం , వర్గం మధ్య ఉండే అంతః సంభంధం రాజ్య స్వభావంలో వ్యక్తమవుతున్న వాస్తవాన్ని నిరాకరించలేము.
నక్సలైట్ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కులహింస కొనసాగుతుంది. దళిత , ఆదివాసీలు నివసించే అపారమైన వనరులున్న ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా భూమినుంచి బేదఖలు చేసే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది.

రాజ్యం నక్సలైట్లను ఉగ్రవాదులుగా, రక్త పిపాసులుగా చిత్ర్హ్రీకరిస్తుంది. వాస్తవం ఇందుకు భిన్నమైనది. దోపిడీ పీడనలు లేని సమసమాజాన్ని కాంక్షిస్తున్నవాళ్ళు తమ లక్ష్యాన్ని నేరవేర్చుకోవడంలో భాగంగా పీడక వర్గాలతో ఘర్షణకు దిగుతున్నారు. ఈ మార్పు కాంక్షను అణచివేసి యథాతద స్థితిని కొనసాగించాలని రాజ్యం చూస్తోంది. సోకాల్డ్ నక్సలైట్ వ్యతిరేక గిరిజనోద్యమం(సల్వాజుడుం) లో స్థానిక ఆదివాసీలకు ఆయుధాలిచ్చి నక్సలైట్లపై ఉసిగొల్పారు. ఈ సంస్థకు వెన్నుదన్నుగా కార్పొరేట్ శక్తులున్నాయి. వేలాది మంది దళితులను, ఆదివాసీలను అడివి నుంచి వెళ్ళగొట్టేందుకు ఏర్పడిన సంస్థే సల్వాజుడుం. నక్సలైట్ అన్న ముద్రవేసి ఒక వ్యక్తిని చంపేయడమన్నది అంతిమంగా అతని లేదా ఆమె ఇతర అస్తిత్వాలైన కులం, తెగలను అణిచివేయడమే అవుతుంది.
మాయల మరాటీలు దళిత దళారీలు:
ఖైర్లాంజీ సంఘటన దళిత రాజకీయాలను ,రాజకీయ నాయకుల నిజాయితి రాహిత్యాన్ని బయటపెట్టింది. గతంలో దళితులపై జరిగిన దాడులన్నిటి కంటే తీవ్రమైన ఖైర్లాంజీ దాడి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కులవివక్షకు,కులదురహంకార దాడులకు వ్యతిరేకంగా పోరాడవలసిన ,దళిత ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన దళిత నాయకులూ కులతత్వాన్ని కాపాడుతున్నారు. అంతే కాదు దళారులుగా మారి జాతి జాతినే అమ్మేస్తున్నారు.
50 వ వార్షికోత్సవాల దమ్మ-చక్ర ప్రవర్తన దినం నిరాటంకంగా జరగడానికి దళిత రాజకీయనాయకుడొకరు స్వప్రయోజనాలకోసం ఖైర్లాంజీ ఘటనను స్థానిక పత్రికలకే పరిమితం అయ్యేలా చేసాడు. చాలాకాలంగా ఈ సభలు ఇట్లా రాజకీయనాయకులు ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి. యింకో వేపు బహుజనవాద రాజకీయాలకు ప్రాతినిథ్యం వహించే నాయకులూ తమ తాత్కాలిక ప్రయోజానాల కోసం కుంబీ ,కలార్లు దళితులపై దాడులు చేసినపుడు ఎలాంటి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు.
ఖైర్లాంజీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న ప్రజలు రాజకీయ నాయకుల జోక్యాన్ని పూర్తిగా నిరోధించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాట్లాడడానికి సహితం అవకాశము ఇవ్వలేదు. ఖైర్లాంజీ జరగడానికి కులదురహంకారులు, వారితో కుమ్మక్కు అయిన రాజ్యంతో పాటు వివిధ రాజకీయ నాయకులు కూడా భాద్యులు అనేది వారి అభిప్రాయం. ఎప్పుడైతే ఖైర్లాంజి వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యా యో దళిత రాజకీయ నాయకులు తాము ఆ పేరు పొందాలని ప్రయత్నం చేసారు. కానీ ఉద్యమకార్లు వీళ్ళను దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు.
అంబేద్కర్ విగ్రహానికి అవమానానికి నిరసనగా జరిగిన ఉద్యమాలలో సహితం ప్రజలు ఈ నాయకులను దూరంగా ఉంచారు. వారిపట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శించారు. దాడులకు, అరెస్టులకు గురైన వారి విషయంలో దళిత రాజకీయ సంస్థల నుండి ఎలాంటి సహాయం అందలేదు. ప్రజలు ఎన్ని కష్టాలనైనా భరించే సంసిద్దతను ప్రదర్శించారు తప్ప ఈ రాజకీయ నాయకులవైపు చూడలేదు. మొత్తంగా ఖైర్లాంజి ఘటన దళిత ప్రజానీకానికి, దళిత రాజకీయనాయకుల మధ్య స్పష్టమైన విభజన తీసుకొచ్చింది .
మా అనుభవం లో ;
కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటo లో 5 దళిత గ్రామాలు సమూలంగా పెకిలించి వేయబడ్డాయి .
ఉన్న కొంపా గూడు కూల్చేసుకొని బికారులై గ్రామాల నుంచి దళితులు తరలించబడ్డారు. ఫలితంగా అటు ఉద్యమానికి ఇటు పునరావాసానికి లేకుండా ఉద్యమానికి వెన్నుపోటుదారులుగా మిగిలిన వర్గాలచే చిత్రీకరించబడ్డారు. నాయకులుగా చలామణి అవుతున్న దళిత దళారులు కాకినాడ సెజ్ యాజమాన్యానికి నమ్మిన బంటులుగా మారి గ్రామ గ్రామాలనే తాకట్టు పెట్టేసారు. అంబేద్కర్ చెప్పిన భూమి జాతీయకరణ వీరి ఎజండా లోనే లేదు. లక్షిo పేటలో కూడా ఉన్న భూమిని అడిగారు తప్ప భూమి జాతీయికరణ గురించి మాట్లాడ లేదు

దళిత పరాయికరణ :
అధికార వ్యవస్థలో కొంతమంది దళితులు చేరడం వలన మార్పు రావడం అసాధ్యం. ఒకవేళ వ్యక్తులు వ్యవస్థలో భాగమైనా దానికి అనుగుణంగా నడుచుకోనప్పుడు తీవ్రమైన ఒత్తిడి కి గురవుతారు. ఉనికిని కాపాడుకోవడానికి రాజీని ఆశ్రయించడం అనివార్యమే .ఒకవేళ అధికార యంత్రాంగం లో ఉన్న దళితులు ఈ ఒత్తిడి ఉన్నప్పటికి సాటి దళితులు ప్రయోజనాలు రక్షించాలని మొదట్లో అనుకున్నా అధికారంలో పైకి వెళ్ళే క్రమంలో తమకు తెలియకుండానే పై వర్గ స్వభావాన్ని ఇమడ్చుకుంటారు . తన ప్రయోజనాల కోసం వ్యవస్థకు సేవ చేస్తూ తమ వర్గానికి సేవచేస్తున్నానన్న భ్రమలో ఉండిపోతారు.దళితులు అధికార వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడో యాదృచ్చికంగా తప్ప తమ వర్గ ప్రజలకు సేవ చేయలేరు. ఖైర్లాంజీ సంఘటన పై చర్య తీసుకోవలసిన పోలీసు అధికారులు కూడా మరి దళితులే.
కులవ్యవస్థకు వెన్నుదన్ను ఖైర్లాంజి తీర్పు : (21 జూలై 2010)
ఖైర్లాంజి పై పెల్లుబికిన దళిత ఆగ్రహం సరైన రీతిలోనే న్యాయం కోసం డిమాండ్ చేసింది. సి.బి.ఐ విచారణ అడిగి సాధించుకొంది. అయితే సరైన సాక్ష్యా ధారాలు లేవంటూ 35 మందిని నిర్దోశులు గా వదిలేసింది. కేవలం 11 మంది మీద మాత్రమే కేసును నడిపింది. లోపాయికారిగా అడ్వకేట్ శశికాంత్ వహానేను ప్రాసిక్యూషన్ నుంచి తప్పించింది. వహనేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రతిపాదించిన ఖైర్లాంజి కార్యాచరణ సమితి ఆయనను తొలగించడం వెనుక ఏదో కుట్ర వున్నట్టు భావించింది. అయినా జిల్లా కేంద్రం భండారా లో నెలకొల్పిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు కొనసాగింది. అది ఈ కేసు కోసమే ఉద్దేశించిన ప్రత్యేక కోర్టు ఏమి కాదు. ఎస్సి,ఎస్స్తి అత్యాచారాల నిరోధక చట్టము లోని సెక్షన్ 14లో నిర్దేశింఛినట్టు ప్రత్యేక కోర్ట్ హోదా వున్నా కోర్ట్ కాదు.
బాధితుల చుట్టమైన గజియాభాయి కేసులో సాక్ష్యం చెప్పడం వలన నిందితులు కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్గొని బాధితులను హత్య చేసారని ఇది కులసంబందిత దాడులు కావని, ఎస్సి , ఎస్టి (అత్యాచారాల) నిరోధక చట్టం పరిధిలోకి రావనీ హైకోర్ట్ భావించి కింద సెషన్స్ కోర్ట్ ఆరుగురికి విధించిన మరణ శిక్ష బదులుగా యావజ్జీవ కారాగార శిక్షగా మార్పుచేసి తీర్పుని ఇవ్వడం జరిగింది.
అయితే గజియాభాయి కేసులో సాక్ష్యం చెప్పినా కూడా అది బెయిలబుల్ కేసు కింద వెంటనే బయటకు వచ్చేయవచ్చు. అంత స్వల్ప తగాదా కు ఒక కుటుంబం మీద సామూహికంగా కిరాతకంగా దాడి చేయవలసిన అవసరం ఏముందని హైకోర్ట్ ఆలోచించ లేకపోయింది . అదే ఇతర కులాలలో ఇలాంటి సంఘటన జరిగితే ఇoతటి అమానుష చర్య ఉండేదా అని హైకోర్ట్ ప్ర శ్నిoచు కోలేకపోయింది. కోర్ట్లు సహితం దళితులపట్ల జరిగిన దాడిలో కులపరమైన వివక్షతను తమ పరిధిలోకి తీసుకోకుండా కులవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి.
మానవ హక్కుల కమీషన్లో లక్షిo పేట సంఘటనకు సంబందించిన వేసిన కేసులో కూడా ఇప్పటి వరుకు ఎలాంటి బదులు ప్రభుత్వం ఇవ్వక పోయినా కమీషన్ ఎలాంటి చర్య తీసుకో లేదు. ఇందుకు కారణం కోర్టులు, కమీషన్లు కూడా దళితులపై జరిగిన అమానుష చర్యలను తీవ్రంగా పరిగణించక పోవడమే.

దళిత ప్రతీకలు :: ఉత్సవ విగ్రహాలు
అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానం సంఘటనకి తీవ్రంగా వచ్చే స్పందన , ఆగ్రహం దారుణ అవమానాలకు , హత్య కు గురైన మనుషుల విషయంలో రావటం లేదు.అస్తిత్వ ఉద్యమాలకు , అస్తిత్వ చిహ్నాల పట్ల ఉన్న స్పందన సజీవమైన’ మనుషుల విషయంలో లేకపోయింది . ఇక్కడ రెండు అనుకూల, ప్రతికూల ప్రభావాల్ని గమనించాలి .మొదటి అస్తిత్వ చిహ్నాలకు సంబందించినది . దళిత పోరాట వారసత్వ చిహ్నమైన అంబేద్కర్ విగ్రహం భావితరాల్ని పోరాటాల్లోకి వచ్చేలా ఉత్తేజపరచాలి .
ఇక ప్రతికూల విషయం అంబేడ్కర్ దేవుడై పోవడం. ఇప్పటి దళితుల స్థితిని చూస్తే మొదటి దాని కంటే రెండవ దాని ప్రభావమే ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఈ విషయాన్ని మిగితా వాళ్ళ కంటే పాలకవర్గాలు బాగా అర్థం చేసుకున్నాయి. అందువల్లే అంబేడ్కర్ విగ్రహ్నాన్ని (మతాచారంలా కనిపించేలా విస్త్ర్హతంగా) ప్రతిష్టించడాన్ని ప్రోత్సహించడం, ఇంకోవైపు అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడవటం చేస్తున్నాయి.
వ్యూహాత్మకంగా చూస్తే వనరుల లేమిని ఎదుర్కొంటున్న ప్రజలు తమ ప్రాముఖ్యతాంశాలు ఏవో కచ్చితంగా తెలుసుకోవాలి.ఆత్మ గౌరవం పట్ల అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని సహించని మన సున్నిత స్పందన సజీవ మనుషుల పట్ల ప్రదర్శించినప్పుడే సరైన చైతన్యాన్ని ప్రదర్శించిన వాళ్లమౌతాం. చారిత్రిక భౌతిక వాద తాత్వికత ప్రభావంతో వచ్చిన సామాజిక ఉద్యమాల నుండి చారిత్రకంగానూ దళిత ఉద్యమాలు దూరమయ్యాయి. ఈ తిరోగమన ఆలోచనావిధానం దళితుల సమిష్టి మనుగడకు తీరని నష్టం చేసింది. దళిత శక్తులు ఈ నష్టాన్ని ఇప్పటికైనా గుర్తించాలి.

కులం x కులం :
ఖైర్లాంజిలో కాని, లక్షిం పేట లో కాని దళిత స్త్రీలపై జరిగిన అమానుష దాడిలో దళితేతర కులాల స్త్రీలు పాల్గొన్నారు . వారి పై కుల పితృస్వామ్య భావజాలం ఎలా పని చేస్తుందో ఇది బట్టబయలు చేస్తుంది. అందుకే దళిత మహిళలపై సామాజిక దాడులు జరగడమే కాకుండా వాటిని ఖండించే విషయంలో కూడా ఇతర కులసంఘాలు,కొన్ని ప్రగతిశీల శక్తులు మౌనంగా ఉండిపోయి ‘కులం’ యొక్క ప్రభావానికి లోబడిపోతున్నారు. దళిత ఉద్యమాలు కూడా దళితుల పట్ల రాజ్యహింసకు వ్యతిరేకంగా స్పందించడంలో వెనుకంజ వేస్తున్నాయి. రాజ్యం తో యుద్దంలో ‘ ఎన్కౌంటర్’ లో ప్రాణాలు కోల్పోతున్న దళితుల పట్ల, స్త్రీల పట్ల దళిత, మహిళా సంఘాల ప్రతి స్పందనే ఉండదు. జస్సికలాల్, ఆరుషి కేసు పట్ల మీడియా చూపిన అత్యుత్సాహం దళితులపై కిరాతక చర్యల పట్ల ఉండదు. అవినీతిపై ప్రజా ఉద్యమంగా మధ్య తరగతి, మేధావులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చారు. అదే లక్షిం పేట (2012) లో దళితులు ఊచకోతకు గురయితే ఏవో కొన్ని ప్రజాసంఘాలు, దళిత సంఘాలు పట్టించుకున్నాయి తప్ప ఇదే మధ్య తరగతి తమ సామాజిక భాద్యతగా ముందుకు రాలేకపోయింది. దళితుల భాధలు, కష్టాలు సామాజికం చేయబడలేదు. అది వారికే, వారి నాయకత్వానికి పరిమితమైనదిగా దళితేతరులు చూస్తున్నారు..
కులం x వర్గం :
ప్రతి కుల ఘర్షణకు మూలం భూమి సమస్యే అని భావించడం మార్క్సిస్ట్ ఆర్ధిక దృక్పథంలోంచి ఏర్పడిన భ్రమ . అయితే దళితుల విషయంలో ఇంత హింసాత్మక ఘర్షణలు జరిగినట్టు దళితేతరుల మధ్య సరిగ్గా ఇలాంటి ఆర్ధిక లేదా భూతగాదాలే తలెత్తినప్పుడు ఎందుకు దాడులు జరగడం లేదన్నది ప్రశ్న.
దాడి జరిగిన తరువాత ఉవ్వెత్తున ఎగిసిపడే దళితోద్యమం ఆ తర్వాత క్రమంలో ప్రభుత్వ పథకాలతో, ప్రభుత్వ పెద్దలతో రాజీ పడిపోయి దాడియొక్క ప్రధాన వైరుధ్యమైన కుల వ్యవస్థ మూలాలను విస్మరిస్తుంది. దానితో తిరిగితిరిగి ఖైర్లాంజీలు, కారంచేడులు పునరావృతమవుతున్నాయి. కాబట్టి తరతరాలుగా అణిచివేయబడ్డ దళిత వర్గాలు తలెత్తుకొని ఆత్మ గౌరవబావుటాని ఎగరేస్తూనే రాజీలేని విముక్తి పోరాటం చేయవలసి ఉంది.
ఖైర్లాంజి కులదురహంకార దాడి బహుజనవాద రాజకీయాలను గందరగోళానికి గురిచేసింది. ఈ దాడులలో పాల్గొన్నది సోకాల్డ్ ఓబీసీలు కావడమే అందుకు కారణం. కింది కులాల్ని ఐక్యంచేయడం ద్వారా ఎన్నికల రాజకీయాలు విజయం సాధించడం లక్ష్యంగా వచ్చిన బహుజన రాజకీయాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో ములాయం సింగు, శరద్ పవార్లు విజయం సాధించిన మధ్యకులాల అస్తిత్వ రాజకీయాల కంటే భిన్నమైనవి కావు. అయితే కులాస్తిత్వ ప్రాతిపదికన ఈ కులాల్ని ఐక్యం చేయాలనుకున్నప్పుడు అవర్ణ,సవర్ణుల విభజన ముందుకు వస్తుంది. ఈ విభజనను నిరోధించాలను కుంటే దీనికి భిన్నమైన మార్గాన్ని అనుసరించాలి. అది వర్గ దృక్పథం.
నర నరాన జీర్ణించుకు పోయున కులవ్యవస్థ కుత్సితమే ఒక ఖైర్లాంజిని అతి కిరాతకమైన అత్యాచారంగా, దాడిగా మార్చింది .దళితులు తిరిగి మళ్లీ దాడి చేస్తారనే భయం తగ్గటం వల్లే ఈ దాడులు పెరుగుతున్నాయి.కాబట్టి దళితోద్యమం భ్రమల్ని వదలి శ్రామి’కుల’తో కలిసి బలపడాలి.

-నక్కా హేమా వెంకట్రావ్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment