దళితులను దగా చేస్తున్న కాకినాడ సెజ్
veekshanam October 2009
2009 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ ప్రజావ్యతిరేక ధోరణి, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం, మహాకూటమి ఏర్పాటు, వివిధ
పార్టీల ప్రచార హోరు సెజ్ ప్రతిపాదిత ప్రాంతాలలో ఒక ఆశను రేకెత్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచలేదని, తద్వారా కనీసం సెజ్‌ల
ఏర్పాటు వేగం తగ్గుతుందని, ఆశ కలిగింది. ఈ ప్రాంతాలలో కాంగ్రెస్ వ్యతిరేక ఓటింగ్ కూడ ఎక్కువగా జరిగింది. ఎన్నికలు ముగిసి అటు
కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారాన్ని చేజిక్కించుకుంది. దానితో సెజ్ ఉద్యమాలలో ఒక్కసారిగా నిరాశ నిస్ప ృహలు
ఆవహించినా, ఈ మధ్య మన రాష్ట్రంలో వాన్‌పిక్ ఆక్రమిత భూములపై హైకోర్టులో స్టే, కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ వేసిన
వ్యాజ్యంలో రైతుల భూములను బలవంతంగా పోలీసు జోక్యంతో ఆక్రమించరాదనే హైకోర్టు ఆదేశం, మహారాష్ట్రలోని మహా ముంబయి,
గుజరాత్‌లోని ముంద్రా ప్రాంత సెజ్ భూముల ఆక్రమణను ఆపవల్సిందిగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటంతో సెజ్ పోరాటాలలో
మళ్ళీ కదలిక మొదలయ్యింది. రాష్ట్రంలో ప్రతీ సెజ్ ఉద్యమం మరొక్కసారి సమీక్షించుకొని ముందుకు వెళ్లనికి సమాయత్త మవుతోంది.
ఈ సందర్భంలోనే కాకినాడ సెజ్ ఉద్యమ కార్యకర్తలు హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నప్పటికి, అవసరమైతే పోరాటానికి సిద్ధం కావాలనే
ఆలోచనలో ఉన్నారు. అయితే అందులో మెజారిటీ దళిత, పీితవర్గాలు పోరాటపంథా నుంచి తప్పుకుంటు న్నాయి. ప్రతిఘటన రెండుగా
చీలిపోనప్పటికీ పోరాట పరిణామ క్రమంలో దళిత, పీిత (కులాల) ప్రజల పాత్ర, వారి ప్రాధాన్యతలను గుర్తించం ఈనాటి ఉద్యమ
అవసరంగా భావిస్తూ చేసిన పరిశీలనే ఈ వ్యాసం.
రాజ్యం, గ్రామాలకు గ్రామాలను బడ కంపెనీలకు ధారాదత్తం చేసి కట్టబొతుంటే భూమి(పొలం-పుట్ర) లేని పేద దళితులు అటు
చేతిలో చారెడు భూమిలేక, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సెజ్‌ను ఎదిరించే శక్తి లేదు అనుకొని, ప్రత్యామ్నాయం దిక్కు తోచక,
ఉన్న ఊరిని వదిలి పోతూ ఎప్పటిలాగే ఇతర సామాజిక వర్గాల అవహేళనకు గురవుతున్నారు. ఒక మేరకు సెజ్ ఉద్యమం బలపుతుంటే
దళిత వాడలు కొన్ని ఉద్యమ సంఘంతో సంబంధాలు తెంచుకొని సెజ్ వర్గాలు చూపించే ఆశలకు, ప్రలోభాలకు ఎందుకు లోబడి పోతున్నారు?
కాకినాడ సెజ్ ప్రతిపాదిత గ్రామాలలో సుమారు 20-25 శాతం ఉన్న దళితులు మాత్రమే అభివృద్ధి పేరిట ఎందుకు బలవుతున్నారు?
వీరి ఆర్థిక వెనకబాటుతనమా లేక సామాజిక కారణాలా? ఇతర సామాజిక వర్గాలలో పేదలు లేరా? ఇతర సామాజిక వర్గాల వారిని ఎందుకు
ఖాళీ చేయించలేకపోతున్నారు? వీటి వెనుక వున్న దగాకోరు శక్తులు ఏమిటి? కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట నాయకత్వంలో దళితుల పాత్ర
ఎంత? నాయకత్వ స్థాయిలలోని వారి నిర్ణయాత్మక శక్తి, వాస్తవ పరిస్థితులను పరిశీలించవలసి ఉంది. దళితులు దగాపటానికి రాజ్యం, దాని
అంగాలైన అధికార యంత్రాంగం, సెజ్ యాజమాన్యం యొక్క వ్యూహాత్మక ఎత్తుగలలో భాగంగా దళితులలోని ఒక చిన్న వర్గాన్ని కూడ
రాజ్యం ఎలా ఉపయోగించు కుంటుందో పరిశీలించాలి.
దళితులకు భూమి లేదు కాబట్టి భూమితో రైతులకు ఉన్న అనుబంధం వీరికి లేదనే వాదనలకు కాకినాడ సెజ్ పోరాట అనుభవాలు
ఏమి చెబుతాయి? తరతరాలుగా ఉంటున్న గ్రామాల్ని దిక్కుతోచని పరిస్థితులలో వదలి, అభద్రతా భావంతోనే సెజ్ పునరావాస కాలనీలలోకి
అడుగిడుతున్న వైనం, ఇన్నేళ్ళుగా తమతో సామాజికంగా ఓ మేరకు కలిసి ఉన్న ఆధిపత్య కులాల వారు అనే సూటిపోటి మాటలు దళితుల్ని
క్షోభకు గురిచేస్తున్న సందర్భం ఉంది. ఈ వాస్తవాలపై సమాధానాలను వెతికి వివరించే ప్రయత్నంతో పాటు మొత్తం సెజ్ పోరాట క్రమంలో
దళితులు నిర్ణయాత్మక శక్తిగా ఉద్యమాన్ని బలపరచనికి ఎంత అవసరం అన్న ఆలోచనాత్మక అంశాన్ని తట్టిలేపనికి చేసే ప్రయత్నమే ఈ
వ్యాసం. ఇది కేవలం ప్రతిపాదిత కాకినాడ సెజ్ దళితుల పరిస్థితి మాత్రమే కాక దేశ రాజకీయ ఆర్థిక రంగాలలో దళితుల ఉనికి, వారి
రాజకీయ ప్రాబల్యాల గురించి మనలను పునరాలోచింప చేస్తుంది. దళిత పీిత కులాల సామాజిక స్థితిగతుల భిన్నత్వాన్ని, భూ పోరాటాల
ఆవశ్యకతను, నయా సామ్రాజ్యవాద ప్రపంచీకరణను ఎదుర్కొనటానికి నిర్మించవలసిన పోరాటాల గురించి, నాయకత్వం సమస్య గురించి
మరింత లోతుగా ఆలోచించవలసి ఉంది.
కాకినాడ సెజ్ కోసం నయానా, భయానా సుమారు ఎనిమిది వేల ఎకరాలు సెజ్ లెక్కల్లో చేర్చుకున్నారు. (కొన్ని ప్రత్యక్ష కొనుగోలు
పేరిట, మరికొన్ని అవార్డులు ప్రకటించి, అసైన్డు భూములు లాక్కొని). ఇందులో పునరావాస కాలనీ కొరకు తీసుకొన్న భూమి, అక్కడక్కడ
కొంత ఆక్రమించుకున్న భూమి తప్ప, మొత్తంగా భూమి అంతా ప్రజల ఆధీనంలోనే ఉంది. కాకినాడ సెజ్ యాజమాన్యం ఎన్నిసార్లు పాలక
వర్గాల అండతో రైతులపై, మహిళలపై, న్యాయవాదిపై కేసులు పెట్టి బెదిరించినా భూమిని స్వాధీనపరుచుకోవాలనుకున్న ప్రతీసారి ప్రజల
పోరాట పటిమను పరీక్షిస్తున్నట్టుగా ఒక్కసారిగా పోలీసులు ఊళ్లమీద పితే, అంతే తీవ్రంగా నిర్బంధాన్ని ఎదిరించి ప్రజలు తిరగబడ్డరు.
మార్చి 2007లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల నాయకత్వంలో పునరావాస కాలనీలో కట్టలను ధ్వంసం చేసి,
కంచె కోసం వేసిన స్తంభాలు పీకి వేశారు. డిసెంబర్ 24, 2008న వందలాది పోలీసులు భూ ఆక్రమణలకు పాల్పడబోతే ప్రజలు మూకుమ్మడిగా
సెజ్‌కు వ్యతిరేకంగా నినదిస్తూ తిరగబడ్డరు. అందుకే ఎలక్షన్ల ముందు కాకినాడ మరో నందిగ్రాంగా మారితే మొదటికే మోసం వస్తుందని
ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.
ప్రజల నుంచి ఉద్యమ తీవ్రతను ఎదుర్కొనలేని సెజ్ యాజమాన్యం దృష్టి సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన దళిత వర్గాలపైన
పిరది. సెజ్ పరిధిలోని గ్రామాలలో సుమారు మూడోవంతు దళిత వాడలే. తెల్లోి పాలన పోయి ఆరు దశాబ్దాలు పైన గచినా గ్రామాలలో
దళిత వాడలు ఒక మూలకు విసిరివేయబడి ప్రత్యేక గ్రామాలుగా ఏర్పడ్డయి. ఇలాంటి పరిస్థితులలోనే పేదరికం, సామాజిక వెనుకబాటులో
కునారిల్లుతున్న దళిత వర్గాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం సెజ్ యాజమాన్యం వాడుకుంటోంది. పేద ప్రజల మధ్య విభేదాలు సృష్టించి,
దళితవాడలలోని నాయకుల్ని నయానో భయానో లొంగ దీసుకొని, తమకనుకూలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాయి. గ్రామంలోని
దళితుల్నే కాదు దళిత కార్డును ఉపయోగించుకొని సొమ్ము చేసుకునే నాయకుల ద్వారా ఒక 'లాబీ'ని ఏర్పాటు చేసుకొని దళిత జాతి
2
ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. దుర్భర జీవితం గుపుతున్న దళితుల బాగోగులు ఈ వర్గానికి అవసరం లేదు. ఈ దళారీలకు ఇంటికి ఇంత,
ఊరుకు ఇంత అని సొమ్ము ముట్ట చెబుతున్నారు. ఉద్యోగాలు ఇస్తున్నారు. వారి పిల్లలకు అనేక రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నారు.
అదీగాక ఈ వర్గానికి డబ్బే కాదు సెజ్‌లో చిన్న చిన్న కాంట్రాక్టులు, కమిషన్‌లు ఇబ్బడి ముబ్బడిగా విసిరి వేస్తుంటారు. ఈ ప్రత్యేక వర్గమే
దళితులకు, ఇతర సామాజిక వర్గాలకు మధ్య వైషమ్యాన్ని నింపుతుంది. ఈ వర్గమే సెజ్ మార్కెట్లో దళిత ప్రయోజనాలను అతి చవకగా
అమ్మేస్తుంది. వర్గాల మధ్య పోటీని కూడ పెంచి మరింత లాభపుతుంది సెజ్ యాజమాన్యం.
దళిత, బహుజన హక్కుల కోసం ఉద్యమిస్తున్నాం అంటున్న ప్రొ. కంచె ఐలయ్య, చంద్రభాన్ ప్రసాద్ లాంటి మేధావి వర్గం ఈ రోజున
అమెరికా తరహా పెట్టుబడిదారీ వ్యవస్థను పొగిడి ఈ జాతుల అభివృద్దికి భారతదేశంలో కూడ ఇదే విధానాన్ని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ
సామాజిక చిత్రాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించి ప్రజల పక్షాన నిలబడ్డ రచయిత రఘోత్తమ రెడ్డి లాంటి వారు ఈ రోజున సెజ్‌లను
సమర్థిస్తున్న వారి భావజాలానికి చేరువయ్యారు. ఇక సాధారణ దళితుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చును.
అయితే ఇతర సామాజిక కులాలలోని వారు తమ భూములు, ఇళ్ళను అమ్మివేయలేదా? వారిలో దళారీ వర్గం లేదా అని చూస్తే ఇతర
కులాలలోని రైతులు, మత్స్యకారులు, కులవృత్తి చేసుకునే కొంత మంది తమ ఇళ్లను అమ్మేసారు. కాని అమ్మకాలు సంఖ్యాపరంగా దళితుల
అమ్మకాలతో పోలిస్తే తక్కువే. ఈ కులాలవారిలో కూడ సెజ్‌లో కాంట్రాక్టు పొందినవారున్నారు. అయినా సరే వారు తమ భూములను,
ఇళ్లను సెజ్ యాజమాన్యానికి అప్పగించి పునరావాస కాలనీలకు తరలిపోవడం లేదు. ఇప్పటికి వీరు ఉద్యమ ఫలితాలను అనుభవిస్తూ,
వచ్చిన కాంట్రాక్టులు చేసుకుంటున్నారే తప్ప, గ్రామాల ఎత్తివేతకు బలమైన దళారీ వర్గంగా తయారు కాలేదు.
కాకినాడ సెజ్ భూసేకరణ మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటగా దళిత గ్రామాలే ప్రతిఘటించాయి. కొల్లవారి పాలెంకు చెందిన
కొనాల సూరిబాయి నాయకత్వంలో ప్రభుత్వ, సెజ్ వాహనాలకు అడ్డం పి ధర్నాలు చేశారు. అలాగే దలపాలెం మాజీ సర్పంచ్, పొన్నాడ
పంచాయితీ వడ్డి నూకరాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికి తమ గ్రామాలలోకి ప్రభుత్వ, సెజ్ అధికారులను రానివ్వలేదు.
తెలుగుదేశానికి చెందిన మండలాధ్యక్షురాలు మాతా విజయకుమారి కూడ సెజ్ ప్రయత్నాలను నిలువరించి తమ సంబంధిత గ్రామాల్ని
ఐక్యపరచనికి ప్రయత్నించారు. అవసరమైతే వీరు సెజ్‌ను ఎదిరించి జైళ్లకు పోవటానికి సైతం సిద్ధప్డరు. రావిపాడు గ్రామానికి చెందిన
మత్స్య చందర్‌రావు, పెద్దబ్బాయిలను సెజ్ వ్యతిరేకంగా పని చేస్తున్నారని కేసులు బనాయించి జైళ్లలోకి తోసారు. కొంతమంది స్థానిక దళిత
నాయకులు ప్రాణాలిచ్చి అయినా సరే సెజ్‌ను తరిమివేస్తామని పట్టుదలతోనే ఉన్నారు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పడి గ్రామాలలో
మీటింగ్‌లు పెట్టినప్పుడు సొంతానికి భూమిలేని దళిత పేటలకు వీరి మీటింగులు విస్తరించాయి. అయితే ఈ కమిటీ దళిత గ్రామాలలో
కమిటీలు ఏర్పరచి, వాటిని సంఘటిత పరచలేకపోయింది. దళితుల సమస్యలు ప్రధాన ఎజెండలోకి రాలేకపోయాయి. నాయకత్వ శ్రేణిలో
వీరి పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలోను లేకపోయింది. సామాజిక వర్గాల చైతన్యస్థాయి రాజకీయాధికారాన్ని ఎలా నిర్దేశిస్తుందో, అదే విధంగా
అట్టుగువర్గాల చైతన్య స్థాయి, నాయకత్వం ఉద్యమ దిశను నిర్దేశిస్తుంది. ఏ ఉద్యమం అయినా సమాజంలోని అన్నివర్గాల ప్రయోజనాలను
ముందుకు తీసుకొని వెళ్లినప్పుడే అది విజయవంతమవుతుంది. కాని సెజ్ ఉద్యమ నాయకత్వం ఎక్కువగా ఒసి, బిసి రైతుల చేతుల్లో ఉండటం
చేత ఆస్తి పరిరక్షణగా మారిందన్న వాదన దళితులలో నెలకొంది.
భూమిని కోల్పోయిన రైతులు వేరొకచోట భూమిని సంపాదించ వచ్చును. అదే భూమి మీద ఆధారప్డ భూమి లేని భూమి పుత్రుల
బతుకులకు ఆసరా ఏమిటన్నది ఒక ప్రశ్నగా వారిలో మిగిలిపోయింది. సెజ్ పోరాట ఉద్యమం వ్యక్తుల సొంత ఆస్తి పరిరక్షణ నుంచి
భూమిలేని పేద దళితులకు భూపంపకం వైపు విస్తరించలేకపోయింది. అందుకే భూమిలేని నిరుపేద వర్గమైన దళితులు ఉద్యమంలో నిర్ణయాత్మకమైన
పాత్ర వహించలేకపోతున్నారు. అత్యధిక శాతం వ్యవసాయ కూలీలు అయిన దళితులు ఈ రోజున అభివృద్ధి పేరిట వచ్చే సెజ్‌లలో కూలీలుగా
వలసపోవడనికి సిద్ధపుతున్నారు. ఏ ఆస్తి లేక, కులం కూడ ఆస్తి సంబంధాలకు ఉపయోగపక సర్వం కోల్పోయి అభద్రతాభావంతో
ముందుకు సాగుతున్నారే తప్ప సెజ్ స్థాపనలో భాగమై కాదు. వీరు మోసపోవడనికి వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను
విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది.
కారణాలు తెలుసుకొనే ముందు దళితులు అంటే ఎవరు, వీరి వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలను విశ్లేషించవలసిన
ఆవశ్యకత ఉంది. దళిత అనే పదం మొదటగా జ్యోతి బాఫూలే ఉపయోగించారు. బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వారు డ.బాబా
సాహెబ్ అంబేద్కర్. 'దళితం' అంటే గొలుసు నుంచి విడగొట్టబడి, తెగగొట్టబడి వేరు చేయబడినది. అటువంటి వారే దళితులు. దళిత
హక్కుల కోసం పోరాడే క్రమంలో కాంగ్రెస్ పార్టీ విదిలిస్తున్న ఎంగిలి మెతుకుల కోసం కాక ఆత్మగౌరవ పోరాటంగా రూపుదిద్దుకొనే క్రమంలో
ఈ పదం మరింత స్థిరపిరది.
దళితులు అంటే సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా అణచివేతకు గురి అవుతున్న వారని, ఒక విశాల అర్థంలో వాడటం
జరుగుతున్నది. అయితే ఆర్థిక అణచివేతకు గురి అవుతున్న కులాలు కొన్ని సామాజిక, రాజకీయ అణచివేతకు ప్రత్యేకంగా గురి కావటం
లేదు. కాని సామాజిక అణచివేతకు ప్రత్యేకంగా గురి అవుతున్న కులాలు ఆర్థిక, రాజకీయ అణచివేతకూ గురి అవుతున్నాయి. అందుకనే
వాటికి ఒక ప్రత్యేకత ఉంది. సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపికి, రాజకీయ నిర్లక్ష్యానికి గురి అవుతున్న కులాలను దళితులుగా
గుర్తించం జరుగు తోంది. అందులో కుల పరంగా, వర్ణ పరంగాను దోచుకోబడుతున్న వాళ్లే దళితులు.
భారతదేశ జనాభాలో 16 శాతంగా ఉండి అస్ప ృశ్యతకు గురవుతున్నది దళితులే. అందులో 90 శాతం పేదరికానికి చెందినవారే. 80
శాతం గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారు. వీరిలో 86 శాతం భూమి లేనివారు, 60 శాతం రోజువారీ కూలీలు, 37 శాతం చదువుకున్న వారు
(అనగా సంతకం చేయగల్గిన వారు). ప్రతి పదిమందిలో ముగ్గురు దళిత స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారు. ప్రతి 18 నిమిషాలకు
దళితుల మీద దాడి జరుగుతోంది. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 1999 లో 25,445 నేరాలు నమోదు అయ్యాయి. ప్రతి గంటలో
ఇద్దరిపైన దాడి జరుగుతోంది. ఇద్దరు దళితులు హత్యకు గురవుతున్నారు. వారి నివాసాలు ధ్వంసం కాబడుతున్నాయి. ఇందుకు ప్రధాన
కారణం స్వాతంత్య్రం తెచ్చిన ఫలాలు దళితులకు అందకపోవడమే. భూ సంస్కరణలు, వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కేవలం
ఆధిపత్య కులాలకు, ఓ మేరకు వెనుకబడ్డ కులాలకు అందుబాటులోకి వచ్చాయి. భూమిలేని నిరుపేద దళితులకు మిగిలింది ఇందిరమ్మ
3
పథంకాల కింద ఇళ్లు, చారెడు భూమి, కూలీ డబ్బులు తప్ప, వేరే విధంగా లబ్ది పొందం జరగలేదు. గ్రామాల్లోని 80-90 శాతానికి పైగా
భూమి ఆధిపత్య కులాల చేతుల్లో ఉంది. వీరిలో మోతుబరి, సన్నకారు వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయ కూలీల శాతం దళిత
వర్గాలతో పోల్చితే చాలా తక్కువే. అందుకే ఓసి, బిసి కులాలవారు ఈనాడు తమ సామాజిక, శ్రామిక వర్గాన్ని అదుపులో ఉంచగల్గుతున్నారు.
భూమి, వనరులు వీరి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఒక విధమైన సామాజిక కట్టుబాటు చేయగలిగారు. తమ వర్గం వారికి భరోసా ఇవ్వగలిగారు.
దళితులు ఇప్పటికీ తమ బతుకుదెరువు కోసం శాద్ర కులాల మీద ఆధార పవలసిందే. ఈ వర్గాలు దళితుల్ని తమలో కలుపుకోలేకపోయారు.
దళిత పిల్లలు ప్రభుత్వం పెట్టిన ఉప్మా బడిలోను, (అంగన్‌వాడులు) బోర్డు స్కూలులో (ప్రభుత్వ పాఠశాల) చదువుకోవాలి తప్ప పిల్లల్ని
పట్నాలకు పంపి ఇంగ్లిష్ చదువు చెప్పించలేరు. తమ పిల్లలు పెద్ద పెద్ద దొరబాబుల్లాగా ఉద్యోగాలు చేసుకుంటారన్న గ్యారంటీ లేదు.
తరాలుగా డబా ఇల్లు చూసింది లేదు. వాటిలో బతికిందిలేదు. ఒక్కసారిగా వేల రూపాయలు వారి చేతిలో ఆడిరది లేదు. ఈ రోజుకూ
ఆధిపత్య కులాల ముందు చేతులు కట్టుకు నిలబడవలసిందే. వారి భూములపైన ఆధారపవలసిందే. భ∫తిక వనరులు, డబ్బు లేక సామాజికంగా
వెనుకబడ్డ దళితుల్ని అర్థం చేసుకోవాలంటే పైన చెప్పిన కోణాల నుండి కూడ పరిశీలించాలి. సరిగ్గా ఈ దళితుల మనోభావాలపైన,
సామాజిక ఆర్థిక స్థితిగతుల పైన దెబ్బకొట్టి సెజ్ యాజమాన్యం లాభపుతోంది.
ధనిక, ఆధిపత్య కులాల్లో నాయకత్వం తమ భూమి కోసం పోరాడుతున్నారు తప్ప భూమి లేని నిరుపేద దళితులు ఈ పోరాటంతో
నష్టపోతారని సెజ్ యాజమాన్యం చెపుతున్నారు. ఇల్లు, వాకిలి, ఉపాధి లేని దళితులకు (లేక ఉన్నా కూడ) పూరిపాకల స్థానంలో సెజ్ డబా
ఇల్లు కట్టిస్తుందని, ఇది గిట్టని రైతులు దళితులను అడ్డుకుంటున్నారని దళితవాడలలో ప్రచారం చేస్తున్నారు. సెజ్ రావడం ఎలాగూ తప్పదు
కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది దళితులేనని బెంబేలెత్తిస్తున్నారు. జాతి భవిష్యత్తుకు సెజ్ తప్పనిసరి వాస్తవికత అని నమ్మబలుకుతున్నారు.
అసలు కార్పొరేట్ శక్తుల ప్రైవేటీకరణ దళిత జనాభ్యుదయానికేనని వక్కాణిస్తున్నారు. తమ పొలాల్లో కూలీలుగా పని చేయించుకోవటానికే
ధనిక రైతులు దళితుల అభివృద్దిని అడ్డుకుంటున్నారని సెజ్ యాజమాన్యం వాదిస్తోంది.
ఇంతేనా? డబ్బున్న రైతుల పిల్లలు ఇంగ్లిష్ కాన్వెంటులకు వెళుతున్నారని కానీ దళితుల పిల్లలు మాత్రం ఉప్మాబడిలోనో, బోర్డు
స్కూలులోనో చదువుకోవలసిన స్థితి వున్నదని, ఇలాంటి స్థితిగతులను గమనించే కాకినాడ సెజ్ యాజమాన్యం ప్రతి ఇంటికీ, ముఖ్యంగా
దళితులకు ఉపాధి కల్పించి వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తుందని అసత్య ప్రచారాలతో ఊదరకొడుతున్నారు. అసలు కార్పొరేట్
స్కూల్స్ అన్ని దళితవాడల ముంగిట్లోకి వచ్చేస్తున్నాయనే భ్రమల్లో దళితుల్ని ముంచి తేల్చుతున్నారు. రేపో మాపో కంపెనీ అధికార్లుగా దళిత
పిల్లల్ని చూడవచ్చని ఊరిస్తున్నారు.
ఈ అభివృద్ధి ప్రచారకులైన ప్రభుత్వం కానీ, అభివృద్ధి కోసం కృషి చేస్తామంటున్న పెట్టుబడిదారీ వర్గం కాని కాకినాడ సెజ్‌లో ఏమి
చేస్తున్నారో దళిత ప్రయోజనాలను ఎలా పరిరక్షిస్తున్నారో చూద్దాం. అన్నింటికన్న మిన్నగా అభివృద్ధి పేరిట భూస్వామ్య విలువలను కాపాడుతూ,
కులం మూలాల్ని ఎలా వేళ్ళానుకునేలా చేస్తున్నారో ఒక్కసారి గమనిస్తే తెలుస్తుంది.
ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానం ప్రకారం ఇంటిని సెజ్‌కు అప్పగిస్తున్నపుడు వారి ఇంజనీర్లు తనిఖీ చేసి నిర్ణయించిన
రేటు ప్రకారం ఇంటి యాజమానికి నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించాలి. సదరు ఇంటి స్థలానికి కూడ విలువ కట్టి చెల్లించాలి. భూమి
లేని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇళ్లే దిక్కు. అవి అసైన్డు కింద లెక్క కట్టి సెజ్ యాజమాన్యం ఇళ్ళకు విలువ కట్టి స్థలానికి డబ్బు
ఎగ్గొుతున్నారు. ఈ లెక్కలు కూడ అన్ని కాకి లెక్కలే. సెజ్‌ను ఎదిరిస్తే వారి ఇంటి విలువ మరింత తగ్గుతుంది. ప్రభుత్వ జి.ఒ.లు ఉన్నా,
కోర్టు డైరెక్షన్లు ఉన్నా వీరికి పట్టదు. దిక్కు మొక్కు లేని జనం, అడిగేవారు లేరు అని మరింత అన్యాయానికి పూనుకొంటున్నారు. దారిద్య్రరేఖకు
దిగువ ఉంటే మాత్రమే కాలనీలో ఇళ్లు నిర్మిస్తామన్నారు. పునరావాస కాలనీలోని ఇళ్లు చూస్తే కాంక్రీటు జంగిల్ జ్ఞాపకమొస్తుంది. సాధారణంగా
దళితులు నివసిస్తున్న ఇళ్లు పాకలైనా, పెంకుటిల్లైన చుట్టూ ఉన్న ఉమ్మడి స్థలాన్ని తమ అవసరాలకు వాడుకుంటారు. అగ్గిపెట్టెల్లాంటి
పునరావాస కాలనీలో ఉన్న ఇంటిలో రెండు చిన్న గదులు. వంటిల్లు లేదు, దానికి వసతి లేదు. మొండి గోడలతో వున్న ఇంటిలోకి వర్షం,
ఎండ ధారాళంగా వస్తాయి. డబాకు పిట్టగోడ లేదు, ప్రహరీ గోడ లేదు. ఏమైనా ప్రశ్నిస్తే సమాధానం ఒక్కటే, 'దళితుల జీవితంలో డబా
ఇల్లు కట్టుకోవడం సాధ్యమా అని? ఇదే చాలా గొప్ప' అని దబాయింపు.
ఇళ్ల ఎలాట్‌మెంట్ కూడ పాక్షికమే, కుతర్కాల మోసమే. భర్త కోల్పోయిన వారికి ఇళ్ళు ఇవ్వరు. సెజ్ యాజమాన్యం సమాధాన
మేమిటంటే, వారు ఎన్నాళ్లు బతుకుతారో తెలియదు. వారు కచ్చితంగా పిల్లల దగ్గర ఉండలే తప్ప వ్యక్తిత్వం కోసమైనా సరే విడిగా
ఉండనవసరం లేదని. అదీ వారి మానవతా దృక్పథంం! ఇక 21 సంవత్సరాలు నిండిన వారికి ఉద్యోగం లేకపోయినా, పెళ్ల్షెతే ఉపాధి ప్యాకేజి,
ఇళ్లు ఇస్తారన్న ఆశతో మగ పిల్లలకు పెళ్లిల్లు చేస్తున్నారు. స్త్రీలు సెజ్ యాజమాన్యం దృష్టిలో పళిలిరులే కాదు. ఇదీ వీరి మనువాద దృక్పథంం.
ఆవాసాలు స్మశానాలుగా మారిన వేళ వలస వెళుతున్న దళిత పీితవర్గానికి ఎలాంటి గ్యారంటీ లేని ఇళ్లను కేటాయిస్తున్నారే తప్ప వాటి
రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు జరగనే లేదు. కట్టనికి ఉపయోగించిన వస్తు సామాగ్రి కారు చవకైనది. ఇందులో ప్రభుత్వ వాటా కూడ ఉంది.
అయినా సరే సెజ్ కనుసన్నల్లో ఉన్న కాంట్రాక్టు వర్గం, అధికార సిబ్బంది ఇంటి నిర్మాణం కోసం వెచ్చించవలసిన దాంట్లో వాటాలు
పంచుకొని స్వాహా చేస్తున్నారు. కొబ్బరి, మామిడి తదితర ఫలవృక్షాలకు, హ్యాండు పంపులకు మొదలగు వాటికి నష్టపరిహారం అసలే
చెల్లించం లేదు.
ఏ వాదం చేయనిపని కాకినాడ సెజ్ యాజమాన్యం చేసింది. అదేమిటంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా, (పెళ్ళైన వారు, కానివారు)
అంతకు పూర్వం ఎలాంటి ఇంట్లో ఉన్నా సరే వీరికి సంబంధం లేదు. దళతుల ఇష్టాయిష్టాలకు స్థానం లేదు. అంతా ఒకే మూసలో ఉండే
ఇళ్ళు. అవే రెండు గదుల డబాలు. అసలు కులాలు పోయాయని ఎవరన్నారు? ఒక్కసారి ఈ పునరావాస కాలనీలోకి వెళితే మనకు అర్థం
అవుతుంది. రాజ్యం ఆధునికత పేరుతో కులవ్యవస్థను ఎలా పునర్‌స్థాపిస్తుందో. ఇక్కడ దళితులకు, బిసిలకు, ఓసిలకు వేరు వేరు వీథుంలు
కేటాయించారు. ఏమైనా మనం ఎదురు ప్రశ్నిస్తే హోమోజినిటి గురించి ఏలినవారు తిరిగి మనల్నే ప్రశ్నిస్తారు. ఒక్క అదేనా వీరు ఏర్పాటు
చేయబోయే స్మశానాలు కూడ కులాలవారిగానే.
కాలనీలో మøలిక సదుపాయాలైన కరెంటు, నీరు కొన్ని గంటలు మాత్రమే ఇస్తున్నారు. కరెంటు కోత ఎందుకంటే రేపటి సెజ్‌లో
4
పెట్టబోయే పరిశ్రమల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే ప్రజలకు అలవాటు చేస్తున్నారట. ఇంక గొడ్డు, గోదా, కోళ్ళకు స్థలమే లేదు. పశువుల
పాకలకు డబ్బును ప్రకటించిన సెజ్ యాజమాన్యం వాటిని ఇవ్వకపోగా కాలనీలో పశుసంపదకు ఎలాంటి సదుపాయాలు కల్పించ లేదు.
ఎందుకంటే వాటిని పరోక్షంగా కాలనీలోకి తీసుకురాకూడదు కాబట్టి. దళిత వీథిలోకి వెళితే ఇంటి బయట వంట చేసుకుంటూ, పెంపుడు
కోళ్లతో భయం భయంగా బతుకుతున్న స్త్రీలు కన్పిస్తారు. గ్రామాల్లో ఏరుకొని వెంట తెచ్చుకున్న వంట చెరుకు తప్ప వేరే దారి లేదు. ఇక
ముందు వంట చెరుకును మార్కెట్లో కొనవలసిందే. దళితవాడలో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయటానికి సరైన స్థల వసతి లేకపోవడం
వల్ల మానసికక్షోభకు గురవుతున్న దయనీయమైన పరిస్థితి.
పునరావాస ప్యాకేజిలో మరొక అంశం ఏమిటంటే జీవనభృతిని శ్రామికులు కోల్పోతారు. కాబట్టి 625 రోజుల కూలిని అందచేయాలి.
ఇళ్లు అమ్మిన డబ్బు, వేతనాల డబ్బు స్థిరాస్తి సంపాదనకు పెట్టుబడిగా సరిపోవటం లేదు. కూలివర్గంగా ఉన్న దళితులకు తమ ఆదాయం
అవసరాలకే అరకొరగా సరిపోగా, ఆరోగ్యం, పెళ్లిళ్లు, చదువుల కోసం చేసిన అప్పులు తీర్చడనికి ఆ మొత్తాల్ని వాడుతున్నారు. మిగిలిన ఏ
కొంచెమో వారి జీవితాల్ని దిద్దుకునే పెట్టుబడిగా వాడుకునే అవకాశం లేక చిన్న చిన్న అవసరాలకు మిగిలిన డబ్బును ఖర్చు పెట్టేసు
కుంటున్నారు. ఇది కొంత మంది దళితులకు ఉపయోగపకపోగా స్త్రీలను మరిన్ని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. వస్తు వినియోగ సంస్క ృతి వారిని
ఒక విధమైన వ్యామోహంలో, మత్తులో ముంచేస్తుంది. వచ్చిన డబ్బుతో టివిలు, బైకులు, సెల్‌లు ఇంకా మిగిలిన డబ్బుతో రోజంతా తాగి
పనికి వెళ్లకపోతే స్త్రీలే మొత్తంగా కుటుంబ బాధ్యతను ఎత్తుకోవలసి వస్తుంది.
స్థానిక కూలీరేట్లు రోజుకు 200 రూపాయలైతే కనీస దినసరి వేతనం 120 రూపాయలుగా ప్రభుత్వమే ప్రకటించినా, కేవలం 106
రూపాయలు చొప్పున మాత్రమే కూలీ కట్టం వలన శ్రామికులకు ఎంతో అన్యాయం, దోపి జరుగుతోంది. దళిత, పీిత కులాల్లో
ప్రతిఒక్కరు కష్టపేవారైనా ఉమ్మడి కుటుంబంలో కేవలం ఒక్కరికే ఉపాధి కల్పిస్తామనటం ద్వారా మిగిలిన వారి బతుకుతెరువును దెబ్బ
తీస్తున్నారు. దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విడదీయలేని భాగమైన ఉమ్మడి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇక శ్రామికవర్గానికి
చెందిన దళిత స్త్రీలది పనికి వెళ్లనిదే పూట గవని పరిస్థితి. వారంతా వ్యవసాయ కార్మికులే. వీరు రోజుకు కనీసం 120 నుండి 150
రూపాయలు వరకు తెచ్చుకుంటారు. వేతనాలు మగవారితో పాటు సమానంగా రాకపోయినా భర్తల్ని కోల్పోయిన స్త్రీలు, తమ కుటుంబాలను
సైతం పోషించుకుంటున్నారు. అసలే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న స్త్రీలకు, ఏ ఆధారం లేని స్త్రీలకు నేు పునరావాస ప్యాకేజిలో ఉపాధి,
ఇళ్ళు, వేతన నష్టపరిహారం లాంటి ప్రతిపాదనలు లేవు. మరి స్వతంత్య్ర భారతదేశంలో స్త్రీలకు ముఖ్యంగా దళిత స్త్రీలకు చోటు లేకపోవడం
రాజ్యాంగ సూత్రమైన సమానత్వానికే విరుద్ధం. అయినా సరే లెక్క చేయరు. తరతరాల పితృస్వామ్య ధోరణికి ఇది ఓ మచ్చుతునక మాత్రమే.
ఊరి ఉమ్మడి ఆస్తులైన చర్చ్‌లకు, దేవాలయాలకు, మసీదులకు సరైన ధర కట్టం గాని, పునరావాస కాలనీలో వాటిని తిరిగి
నిర్మించం గురించి గాని ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంగన్‌వాడు, ప్రాథంమిక పాఠశాలలు ఎక్కడ పెడతారో చెప్పని యాజమాన్యం,
'మీ పిల్లల భవిష్యత్తుకే సెజ్‌లనే' ప్రకటనలను ఇవ్వడం హాస్యాస్పదమే కాక వంచన కూడ. దళితుల ఆరాధ్య నాయకుడైన బాబాసాహెబ్
అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో లేదో స్పష్టపరచలేదు. ఉమ్మడి ప్రయోజనాలకు వాడుకొనే కమ్యూనిటీ హాలు నిర్మిస్తారో, లేదో,
నిర్మించినా ఎంత స్థలంలో కతారో ఇప్పటికీ తెలియజెప్పలేదు. పునరావాస కాలనీలో భద్రత లేని కారణంగా దలపాలెంకు చెందిన దల
వెంకటేశు, రాణిల కుమారుడైన ఉదయ్‌ు కిరణ్ ప్రాణాలను కోల్పోయాడు. దానికి సెజ్ యాజమాన్యం ఏ మాత్రం మానవత్వంతో స్పందించలేదు.
ఇలా ప్యాకేజిలు వచ్చినా దళితుల పరిస్థితులలో గణనీయమైన మార్పులు లేకపోగా ఉన్న ఊరిని, రైతుల విశ్వాసాన్ని, పనిని పోగొట్టుకొని
దళితులు మరింతగా దారిద్య్రంలోకి మునిగి పోతున్నారు. దళితులకు, భూమికి మధ్య ఉన్న దూరాన్ని వైరుధ్యంగా సెజ్ యాజమాన్యం మలచి
రైతాంగ సెజ్ పోరాటానికి వ్యతిరేకంగా వీరిని నిలబెట్టింది. ఇది దళితులకు, వారి అభివృద్దికి ఏమాత్రం ఉపయోగకరం కాదు. ఇక ఉపాధి
కల్పన పేరిట ఏమి జరుగుతుందో చూద్దాం.
కాలనీలోకి వచ్చిన వారికి ఉపాధి కార్డు పేరిట గుర్తింపు కార్డుని ఇచ్చి ఉపాధి కార్డుగా ప్రతి దళితుడ్ని దగా చేస్తున్నారు. సుమారు 40
మంది యువకులకు శిక్షణ ఇచ్చి శిక్షణకు సంబంధంలేని టాయిలెట్ క్లీనింగ్ కూడ చేయించారని యువకులు చెప్పారు. స్థానికంగా పనులు
కల్పిస్తామన్న యాజమాన్యం తమను దూరప్రాంతాలకు పంపి వెట్టిచాకిరీ చేయించుకున్నారని, అభిమానవంతులైన యువకులు వెనుదిరిగారు.
గ్రామాలలోని ప్రజలు పునరావాస కాలనీలకు తరలడం మొదలుకాగానే సెజ్ యాజమాన్యం కొత్త ఎత్తుగలతో తమ పథంకాలు కొనసాగించారు.
దళితుల మధ్య పోటీ పెట్టి, వారిలో ఒక రకమైన అభద్రతా భావాన్ని కల్పించి, ఊర్లకు ఊర్లు కదిలేలా చేసిన సెజ్ యాజమాన్యం తన
నిజస్వరూపాన్ని బయట పెట్టుకొని కాలనీలలోకి వచ్చేవారికి వెంటనే ప్యాకేజి ఇవ్వలేమని, ఇంకా రావద్దని కూడ హెచ్చరించారు. దీనికి
ఆర్థికమాంద్య ప్రభావం కూడ తోడు కావచ్చు. దళితుల పరిస్థితి యిలా ఉంటే మిగిలిన ప్రజలు కూడ క్రమంగా అభద్రతకు లోనవుతున్నారు.
వాస్తవానికి కాకినాడ సెజ్‌ను ప్రారంభిస్తామన్న ఒ.ఎన్.జి.సి. మొదట్లోనే తప్పుకుంది. ఆ తర్వాత జి.ఎమ్.ఆర్., రిలయన్స్ పవర్ ఇలా ఇంకా
ఎవరో ఇదమిద్ధంగా తెలియని పరిస్థితి. ఎవరు పోయి, ఎవరు వచ్చినా సెజ్‌లో వాటాలు కలిగిన బడ పెట్టుబడిదారీ వర్గం అంతా కూడ
ఆధిపత్య, ప్రాబల్య కులాలదే కాబట్టి దళితులకు న్యాయం జరుగుతుందని ఆశించం అత్యాశే అవుతుంది.
సమాజంలో ఉన్నటువంటి భ∫తిక వనరులపైన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంటుంది. కాని కొన్ని ఆధిపత్య
కులాలే వాస్తవంలో అన్ని హక్కులు అనుభవిస్తున్నాయి. సామాజికంగా అణచివేయబడ్డ కులాల కోసం, వారి హక్కుల్ని కాపాడేందుకు
రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడ్డయి. ఇప్పటి ప్రపంచీకరణ నేపథ్యంంలో కంపెనీలు అన్ని బడ గుత్త పెట్టుబడిదారుల (బహుళజాతి కంపెనీల)
చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. అప్పుడు సెజ్‌లు విదేశి హస్తాల్లోనో లేక దళారీ స్వభావం గల స్వదేశి పెట్టుబడిదారుల అజమాయిషీలోనే
కేంద్రికృత మవుతాయి. విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు ఆధారిత సెజ్‌లలో సామాజిక అంశమైన రిజర్వేషన్లకు స్థానముండదు. ఇది
జగమెరిగిన సత్యం. ఈ పెట్టుబడిదారీ వర్గం రిజర్వేషన్‌లు భారతీయ సామాజిక వైకల్య నిర్మూలనకు అవసరమని గుర్తించగలదా! ప్రభుత్వరంగ
సంస్థల లోనే నియామకాలు జరగటం లేదు. ఇక సెజ్‌ల్లోనా? విప్రో లాంటి సంస్థలు ఈ విషయాన్ని బాహాటంగానే బయటపెట్టాయి. ఇప్పటికే
సామాజికంగా అట్టుగు వర్గాలు మరింత అధ్వాన్నంగా తయారయి దోపికి గురవుతున్నాయి. ధనవంతులు ఇంకా ధనవంతులై, దళితులు
మరింత దరిద్రులుగా మిగులుతారు.
దళితులకు ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ల విషయం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. దేశాన్ని గుత్తపెట్టుబడిదారీ వర్గానికి తాకట్టు
5
పెట్టదల్చుకున్న పాలకవర్గానికి దాన్ని శాసించే ఆసక్తి లేదు. ఆ సాహసం చెయ్యదు. ఎల్లప్పుడూ అభద్రతలో ఉంచి విధేయులుగా మార్చే
ప్రైవేటు రంగం వాటి నియంతృత్వ ధోరణి వదులుకొని ఎలాంటి హామీలు ఇవ్వటానికి సెజ్ యాజమాన్యం సిద్దపటం లేదు. పదు కూడ.
ప్రతిభ పేరుతో దళితుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతోంది. అసలు ప్రతిభ అంటే పాలకవర్గ అధికార సంబంధాల
తో ముడిపి ఉంటుందన్న విషయం అందరూ గుర్తెరిగిందే. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కార్పొరేట్
విద్యా సంస్థలు. వాటి మేనేజ్‌మెంట్ కోటాలు వీటికి మచ్చు తునక. మరి ఏ అధికార సంబంధాలు, డబ్బు లేని దళితులకు ప్రతిభ ఎక్కడ
నుండి వస్తుంది? ఎటు చూసినా దళితుల పరిస్థితి మరింత విషమిస్తుంది తప్ప రాణించదు. అనేక విధాలుగా ప్రభుత్వం నుంచి రాయితీలు
పొందుతున్న సెజ్‌లు దళితులకు రాయితీలు ఇస్తామన్న ప్రస్తావనే తేలేదు. అసలు ప్రభుత్వమే ఇంతశాతం రిజర్వేషన్లు అనే నిబంధనల వంటి
చర్యలు చేపట్టలేదు. ప్రజలకు బాధ్యత వహించవలసిన ప్రభుత్వానికే బాధ్యత లేనప్పుడు లాభాల బాటే ధ్యేయంగా ఉన్న పెట్టుబడిదారీ
వర్గానికి వాటి ప్రతిరూపాలైన సెజ్‌లు రిజర్వేషన్ల పట్ల బాధ్యత ఎందుకు వహిస్తాయి? ఇది పాలకవర్గాలు అభివృద్ధి ముసుగులో దళితులకు
చేస్తున్న సామాజిక ద్రోహంగా పరిగణించాలి. భారతదేశంలోని యావత్తు సొత్తు, సంపద, వనరులు కొంతమంది సొంతం కాదని, అది జాతి
యావత్తు సొత్తని, ముఖ్యంగా దళిత బహుజనులదని రాజ్యాంగం స్పష్టపరచినా శ్రామికవర్గమైన వీరి హక్కులుగా గుర్తించనికి ఇష్టపని
రాజకీయ నేపథ్యంం మనది. ఒకవేళ గుర్తించినా అది నటనకే పరిమితం. ఈ పరిస్థితులలోనే తమ హక్కుల కోసం అస్తిత్వ ఉద్యమాలు
పుట్టుకొచ్చాయి.
ఈ రోజున అస్తిత్వ ఉద్యమాల ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా బలప్డ నాయకులు పాలకవర్గాల కుట్రలో భాగంగా బడ పెట్టుబడిదారీ
వర్గానికి కొంతమంది తమ జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. కాకినాడ సెజ్ ప్రతిపాదిత ప్రాంతంలోనూ ఇదే జరిగింది.
ఈ దళారీ వర్గం అంబేద్కర్ వారసులుగా ఉన్న దళితులకు అన్యాయం చేస్తూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. నిజానికి
దళిత ఉద్యమాలకు తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. అటు మాల మహానాడు, ఇటు దండోరా ఉద్యమాలు ఇక్కడే ఊపందు కున్నాయి.
సింహగర్జనలు, విశ్వరూపాలు మామూలే. ఇక్కడ ఆత్మగౌరవ పోరాటాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆర్థిక అంశాలకు ఇవ్వడం లేదు. దళిత అస్తిత్వ
చిహ్నాలకు ఎలాంటి అవమానం జరిగినా దోషులకు శిక్ష పే వరకు జిల్లానే కాదు రాష్ట్రాన్ని సైతం గగ లాడిరచారు. అలాంటి సందర్భాలలో
దళితులలోని ఉపకులాలు అన్ని ఒక్క తాటిపై నిలిచాయి. కాని అదే స్పందన సెజ్‌ల వలన నష్టపోతున్న దళితుల పట్ల రాలేదు. పాలక వర్గాలు
కూడ తమ లక్ష్యాలకు అనుగుణంగానే దళిత అభివృద్ధి అంటే ఆత్మగౌరవ పోరాటాల మాదిరిగానే ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి సంఘటనలకు
వ్యతిరేకంగా ప్రభుత్వం దన్నుగా ఉంటుందన్న ప్రచారం చేసుకుంటుంది. (నిజానికి చాలా సంఘటనలలో దోషులు దొరికింది లేదు, శిక్షింపబడిరది
లేదు.) పాలకవర్గాలు ఒక వర్గాన్ని తమ దళారీ వర్గంగా మార్చుకుంటున్నారు. ఈ దళారీవర్గం చేత కులం పేరుతో వారి కన్నుని వారి వేలితో
పొడుచుకునేలా దళిత జాతిని మోసగిస్తున్నారు. ఈ దళారీ వర్గం సెజ్ యాజమాన్యం చేతిలో కీలుబొమ్మలు.
దళిత ప్రాతినిథ్యంం చట్ట సభలలో లేదా, అంటే రాజకీయ భాగస్వామ్యం అయితే లభించింది కాని అధికార భాగస్వామ్యం ఇంకా
లభించలేదు. సెజ్ చట్టాన్ని దానిలో ఉన్న దళిత వ్యతిరేక అంశాలని ప్రశ్నించి ఆ చట్టం అమలు ద్వారా జరిగే జీవన విధ్వంసాన్ని ఎత్తి
చూపటానికి వీరి నిర్ణయాత్మక శక్తి చట్ట సభల్లో పరిమితమైంది. ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న ఈ ప్రక్రియలో ఆధిపత్య కులాల
నియంతృత్వ ధోరణికి ఇది మచ్చు తునక. కాగా ఎన్నికల గారిలో దళితులు ప్రధాన రాజకీయ పార్టీల పావులుగా మారిపోయారు. దళిత
ప్రయోజనాలను దెబ్బతీసే పాలకవర్గాల కుట్రను బయట పెట్టటానికి ఎన్నికలు వీరి చేతిలో ఆయుధం కాలేదు. అవసరమైతే ఎన్నికల
ప్రక్రియను తిరస్కరించే ధైర్యాన్ని, చైతన్యాన్ని సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కూడ ఇవ్వలేకపోయింది. ఏ పార్టీ అయిన గతి తప్పిన ప్రజాస్వామ్యంలో
దళితులకు ఏమీ ఒరగబెట్టదని వీరు గ్రహించారు.
మరొక విషయం గమనించవలసింది ఏమిటంటే రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన జీవించే హక్కు, సమానత సిద్ధాంతాలకు మూలమైన
అధికరణలు, భ∫తిక వనరులపై సమాన ఆధిపత్యం ఇవన్నీ కూడ ఖాతరు చేయకుండ రాజ్యం అమలు పరుస్తున్న నిర్భంధ సెజ్‌ల వలన
దళితులు పొట్ట చేతబట్టుకొని ప్రకృతి వనరులతో సంబంధాలు తెంచుకొని తరలిపోతున్నా, దళిత ప్రజా ప్రతినిధులు మøనంగా ప్రేక్షకపాత్రను
వహిస్తున్నారు. ఇక రాజ్యం ఆధిపత్య కులాల, వర్గాల చేతుల్లో దోపి సాధనంగా మారినవేళ దళితుల్ని రక్షిస్తుంది అనుకోవడం వట్టి భ్రమ
మాత్రమే. దళితుల జీవిత అనుభవాల సారాంశం కూడ ఇదే.
ఒక్కసారి చరిత్రను తిరగేస్తే కనుక ఏ ఉద్యమానికైనా ఆయువు పట్టు దళితవాడలే. అటు విప్లవ పార్టీలకు, స్వచ్ఛంద సంస్థలకు, మత
సంస్థల కార్యకలాపాలకు ఆలంబన దళిత పేటలే. కాకినాడ సెజ్‌లో జరిగింది వేరు. మొదట్లో కొన్ని విప్లవ పార్టీలు ప్రవేశించినా ఒక
సిపిఐ(ఎం.ఎల్) లిబరేషన్ తప్ప కొనసాగలేదు. 2007 ఆగస్ట్‌లో 6 విప్లవ పార్టీలు సెజ్ వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడినా, దళితులు
అందులో భాగస్వాములు కాదు. దళిత గ్రామ కమిటీలు ఏర్పరచలేదు. వలసలు ఆపలేదు. అలాగే కలి అనే స్వచ్ఛంద సంస్థ పని చేసినా,
దళిత సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధను పెట్టలేదు.
అలాగే ఈ రోజున దళితులు సెజ్‌ను ప్రత్యక్షంగా వద్దనకుండ వారిలో మెజార్టీవర్గం పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నారు. వీరు
దళిత దళారీవర్గాన్ని ఎదిరించి ఎండగుతున్నారు. ఒకప్పుడు తమ చెప్పుచేతల్లో బతికి, రిజర్వేషన్ల కారణంగా తమ అండదండలతోనే స్థానిక
రాజకీయ ప్రతినిథుంలుగా ఎదిగి తమనే లెక్కచేయడం లేదన్న ధోరణి ఒసి, బిసి నాయకత్వంలో కన్పిస్తుంది. వీరి యజమాని-బానిస సంబంధాలలో
సమానత్వ స్ప ృహ ఉండదు. ఇక దళితులు మిగిలిన కులాలతో పాటు నాయకత్వంలోకి ఎలా ఎదగగలరు. అందుకే ఈ రోజున దళితులు
వారి నాయకత్వ శ్రేణులలో ఇమడలేక తమ న్యాయపోరాటాలకై 'కాకినాడ సెజ్ బాధిత అంబేద్కర్ సంఘాన్ని' ఏర్పాటు చేసుకున్నారు. సెజ్‌ను
నిలువరించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ న్యాయమైన డిమాండ్‌ల కోసం సంఘంలో చర్చించి పరిష్కరిం చాలని పట్టుబడుతున్నారు.
ఈ అంబేద్కర్ సంఘం ఏర్పడకుండ సెజ్ యాజమాన్యం తమ దళారీలతో విశ్వప్రయత్నం చేసింది. అయినప్పటికీ గ్రామ కమిటీల నాయకత్వంలో
అంబేద్కర్ జయంతిని 'దళిత సెజ్ వ్యతిరేక పోరాట దినం'గా జరుపుకున్నారు. ఎప్పుడైతే దళిత నాయకత్వం మొదలయ్యిందో సెజ్ యాజమాన్యానికి
దపుట్టి 'విభజించు-పాలించు' పద్ధతిలో నాయకత్వశ్రేణిలోని కొంత మందిని బెదిరించి భయపెట్టి దళిత గ్రామాల్ని ఖాళీ చేయించటానికి
పూనుకుంటున్నారు. కొందరు నాయకుల చేతులు కూడ తుపుతున్నారు.
ఇక్కడ శ్యామల అనే దళిత స్త్రీ చేస్తున్న సాహసోపేతమైన పోరాటం గురించి చెప్పవలసిందే. మొత్తం దలపాలెం అనే దళిత గ్రామాన్ని
సెజ్ యాజమాన్యం ఖాళీ చేయించినా పట్టు వదలని దీక్షతో తన ఇద్దరు కొడుకులతో ఒంటరిగా ఆ గ్రామంలో ఉంటూ న్యాయమైన కోర్కెల
6
సాధనకై పోరాటాన్ని కొనసాగిస్తుంది. గ్రామపంచాయితీ (పొన్నాడ) కరెంట్, తాగునీటి సళిలికర్యాలను తీసివేసినా, గ్రామస్తులు ఇళ్లను పగొట్టుకొని
ఈమెని ఒంటరిగా వదిలేసి పోయినా మొక్కవోని ధైర్యంతో సెజ్ యాజమాన్యాన్ని సవాలు చేస్తూనే ఇంది. ఎన్ని ఎత్తుగలు వేసినా వారి
గుండెల్లో ద పుట్టిస్తూనే ఇంది.
ఈ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలోనే ఐదు గ్రామాలలో 'ప్రజాభిప్రాయ సేకరణ' జరిగింది. అందులో ఏ ఒక్క వ్యక్తి కూడ సెజ్ పట్ల
సుముఖత చూపించలేదు. సెజ్ యాజమాన్యం ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేసి ఎలా వశపరచుకుంటుందో దీనిని బట్టి తెలుస్తుంది. ఈ
సంఘం నేతృత్వంలోనే న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తుంది.
మెజార్టీవర్గం ఈ రోజున పునరావాస ప్యాకేజిని ఒప్పుకొని సెజ్‌లకు ఆమోదం తెలపం వెనుక బలమైన సామాజిక, ఆర్థిక రాజకీయ
కారణాలు ఉన్నట్టే, బలమైన నాయకత్వ లోపం ఉన్నట్టు కన్పిస్తుంది. కాని మొన్న మొన్నటి వరకు తగాదాలు, తగవులు ఈ నాయకులు
మాత్రమే తీర్చేవారు. అప్పుడు గ్రామ కట్టుబాటు ఉండేది. కాని ఇపుడు ఆ పరిస్థితులు లేవు. దగాపిన దళిత వర్గం ఐక్యమై తమ నాయకత్వంలో
సమస్యలు పరిష్కరించనికి కాక పోరాటానికి నేతృత్వం వహించ గలగాలి. కులతత్వంతో దళారీవర్గంగా తయారైన వారిని ప్రజలు బహిష్కరించే
స్థాయికి స్థానిక నాయకత్వం ఎదిగినప్పుడే ఇది సాధ్యం. దీనికి సెజ్ వ్యతిరేక ఉద్యమం కూడ ప్రధాన భూమిక పోషించాలి. ఇది సెజ్ వ్యతిరేక
కమిటీ బాధ్యత కూడ కావాలి. అప్పుడే భూమిపై ఆధారప్డ దళితులు భూమిపై హక్కుగల రైతులతో సెజ్ వ్యతిరేక పోరాటాన్ని సవ్యమైన
దిశలో కలిసికట్టుగా తీసుకెళ్ళగలరు.
అంబేద్కర్, పూలే, పెరియార్ అస్తిత్వ ఉద్యమాల అనుభవాలను క్రోడుకరిస్తూ విశాల ఐక్య పోరాటాల ద్వారా ఇతర పీిత ప్రజలతో
కలిసి సెజ్‌లను దళితులు ఎదుర్కోవాలి. లేనట్టయితే చరిత్రలో తాత్కాలిక ప్రయోజనాలకు బలయ్యే వర్గంగా మిగిలిపోతారు. అభివృద్ధి పేరిట
పెట్టుబడిదారీ వర్గంతో మిలాఖత్ అయిన ప్రభుత్వం కూడ దళితుల పట్ల బాధ్యత వహించదు. కాబట్టి వీరు దీర…కాలిక ప్రయోజనాలను
కాపాడే శక్తులతో (సమూహాలతో) కలిసి పయనించవలసిన చారిత్రాత్మక బాధ్యత చైతన్యవంతులైన దళిత నాయకులపైన ఉంది.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో అభివృద్ధి పారిశ్రామికీకరణ పేరిట కోస్టల్ కారిడర్, సెజ్‌ల కోసం రాష్ట్రంలోని అడవులను, సముద్రాలను,
భూములను బహుళజాతి బడ కంపెనీలకు అప్పగించే నిమిత్తం ఆదివాసుల్ని, మత్స్యకారుల్ని, దళితుల్ని, రైతుల్ని నిర్వాసితుల్ని చేస్తున్న ఈ
ప్రక్రియను కేవలం నేరుగా బాధితులవుతున్న వారే ఎదుర్కోవాలా? ఎక్కడ చూసినా ప్రజలు తమ స్థాయిలో పోరాటాలు జరుపుతున్న మాట
వాస్తవమే. కాని నందిగ్రాం, సింగూర్, లాల్‌గè్ ప్రజల చైతన్యం, పోరాటాల స్పూర్తి వీరికి ఎందుకు కొరవడిరది? వీటి వెనుక ఉన్న బలమైన
మేధావి వర్గం, ప్రజాస్వామిక వాదులు, పోరాట శక్తులు ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్‌లో కొరవడ్డయా! ఎందుకు సామ్రాజ్యవాద
ప్రపంచీకరణ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తూ, స్వావలంబన నమూనా కోరుకుంటున్న ప్రజలకు ఆలంబన దిశగా బలమైన ఉద్యమాలు
నిర్మించలేక పోతున్నాం? ఇది ప్రజా సంఘాల కర్తవ్యం కాదా? దేశ సార్వభ∫మత్వానికి పెనుముప్పును తెచ్చే ప్రత్యేక ఆర్థిక మండలాలను
వ్యతిరేకించే నైతిక బాధ్యత ప్రతి పళిలిరుడిది కాదా? ఒక్కసారి ఆలోచించాలి. దగాప్డ దళితుల్ని వర్గస్ప ృహతో నడిపించి ఉద్యమాలను నిర్మించే
ఈ బాధ్యత విప్లవ ప్రజాస్వామిక శక్తులపై నే మరింత ఉంది.
అక్టోబర్ - నవంబర్ 2009
veekshanam October 2009
-హేమా వెంకట్రావ్

No comments:
Post a Comment