చట్టం - అభివృద్ధి - హక్కులు
నవంబర్ 2010
'చట్టం తన పని తాను చేసుకుపోతుంది' ఇది సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు తమకు అనువుగాని పరిస్థితులలో చెప్పే
మెట్ట వేదాంతం. ఇదంతా సమస్యను దాటవేసే ప్రయత్నం. ప్రజలకు అసలు చట్టాలు తెలియవన్న ధీమాతో చేస్తున్న ప్రభోదాలు. అవి అణచివేత,
దోపిులకి గురవుతున్న తెలంగాణ విషయంలో కావచ్చు. అభివృద్ధి పేరుమీద సోంపేటలో జరిగిన హత్యాకాండలో కూడ కావచ్చును. చట్టాల పేరు
చెప్పి అభివృద్ధి అనే మేడిపండును చూపిస్తూ జీవించే హక్కును సైతం కాలరాస్తున్నారు.
మొదట్లో సామాజికంగా ఆమోదం పొందిన కట్టుబాట్లనే ప్రవర్తనా నియమాలుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ కట్టుబాట్లే సాంప్రదాయాలు,
శాసనాలుగా మారాయి. ప్రైవేటు ఆస్తి ఏర్పాటయ్యే క్రమంలో ఆదిమ సమాజం రూపురేఖలు మారిపోయాయి. బానిస యాజమానులు అధికార
శాసనాలు అమలులోకి వచ్చాయి. వాటిపై బానిస తిరుగుబాటు చోటు చేసుకోగా కొన్ని మార్పులు జరిగాయి. భూస్వామ్య వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.
బానిసలు కౌలు రైతులుగా మార్పు చెందారు. ఉత్పత్తి చేసే శక్తి పెరిగిన కొద్ది వాటికి మార్కెట్ కావలసి వచ్చింది. అదే ఆసియా, ఆఫ్రికాలలో వలస
పాలనకు నాంది అయింది. ఆ తర్వాత వచ్చిన వలస పాలన ఈ దేశంలోని వనరుల నుండి లబ్ది పొందనికి కావలసిన చట్టాలను తయారు చేసింది.
ప్రజలు తిరుగుబాటు చేసే నేపథ్యంంలో కొన్ని సాంఫిుక సంస్కరణలు చేపట్టింది. వాణిజ్యానికి కావలసిన శ్రామికులను తయారు చేసుకోవడనికి వారి
విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టింది.
ప్రపంచంలో జాతీయోద్యమాలు మొదలైన తర్వాత భారత దేశంలో గూడ వాటి ప్రభావం ప ి స్వతంత్రాన్ని వలస పాలకుల నుంచి
సంపాదించుకుంది. వలస పాలన అయితే పోయింది గానీ ఆనాటి చట్టాలే ఈనాటి వరకు (ఎక్కడో కొన్ని తప్ప, మరికొన్ని మార్పులు తప్ప)
కొనసాగుతూ వచ్చాయి. ఒక్కసారిగా 1990లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు ఆ తర్వాత ప్రైవేటీకరణ, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంంలో
పాలకవర్గాలు పెట్టుబడిదారీ దేశాల చేతుల్లో కీలు బొమ్మ లయ్యాయి. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు మోకరిల్లాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ, సళిలిభ్రాతృత్వం
వాటికి తిలోదకాలు ఇచ్చి తమకున్న మెజార్టీ బలంతో పార్లమెంటులో ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి పాలకులు వనరులను బహుళజాతి
కంపెనీల కోసం అనేక చట్టాలను సవరించారు. మరికొన్ని తమకు అనుకూలంగా పెట్టుబడుదారులకు లాభసాటిగా చట్టాలు చేసారు. వ్యవసాయం
వద్దని, వ్యవసాయం గిట్టుబాటు కాకుండ రైతువ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రజలే పారిశ్రామికీకరణ కోరుకుంటున్నట్టు వారిపై
రుద్దుతున్నారు. చాలా పక్బందీగా, తెలివిగా రాజ్యాంగం, చట్టాల ద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. దోపిు నిరాటంకంగా కొనసాగించనికి
ఏర్పడిన కోర్టులు, చట్టాలు కష్టజీవులకు కన్నీళ్ళే మిగిలిస్తున్నాయి.
ఇప్పుడు విప్లవ కమ్యూనిస్టు పార్టీలు మినహా ఏ పార్టీ నోటవిన్నా 'అభివృద్ధి' మంత్రమే. ఈ అభివృద్ధిని కూడ వారు చేయలేమని చేతులెత్తేసి ఆ
పనిని బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తున్నారు. వారు యువతకు ఇచ్చే ఉపాధి, విదేశి మారక ద్రవ్యం మీద గంపెడశ పెట్టుకున్నట్టు ప్రకటించారు
(నటించారు). రాయలవారు తలచుకుంటే దెబ్బలకు కొదవేమిటి అన్నట్టు పార్లమెంట్‌లో రెండురోజుల్లో ప్రత్యేక ఆర్థిక మండలుల బిల్లును 2005లో
ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. అలాగే పిసిపిఐ.ఆర్. పాలసీను! ఈ చట్టం గురించి అప్పట్లో కొంతమంది మేధావులకు తప్ప సామాన్యులకు
తెలియనే తెలియదు. తెలిసిన ప్రజా ప్రతినిధులు కిమ్మనలేదు. చట్టాల కార్చిచ్చు గ్రామాల్ని తాకుతుంటే బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ పేరిట
భూసేకరణ జరుగుతూనే ఉంది. ఒక వైపు 'ప్రత్యేక ఆర్థిక మండలుల చట్టం', మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథంకం కింద శ్రామిక కుటుంబాలకు
365 రోజులకు గాను 100 రోజుల పని గ్యారంటీ చట్టం. శ్రామికుని కుటుంబంలో ఐదుగురు ఉంటే అందులో ఒక్కరికి పని గ్యారంటీ. పని చేసే
దినాలలో సుమారు సంవత్సరంలో పావురోజులకంటే కాస్త ఎక్కువ పనిదినాలు. మరి మిగతా పని రోజులకు పని గ్యారంటీ లేదు. 'ఉద్యోగం పురుష
లక్షణం' అని నమ్మే సమాజంలో గ్రామీణ స్త్రీకి పని గ్యారంటీ ఏమీ లేదు. ఆ వచ్చే ఆదాయం కుటుంబానికేమాత్రం సరిపోదు. ఇది నిశ్చయంగా స్త్రీ
వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టమే. సమాజంలో స్త్రీ పురుష అసమానతలు విపరీతంగా పెరుగుతున్న దశలో కుటుంబ హింస చట్టం-2005, సమాచార
హక్కు చట్టం-2005 లాంటి చట్టాలు కంటి తుడుపు చర్యలే.
చట్టాలలోని ద్వంద్వ నీతిని, లొసుగులను, కంటి తుడుపు చర్యలను ప్రజలు ప్రశ్నించినప్పుడల్లా పాలకవర్గాలు వీరిని అణగదొక్కే ప్రయత్నం
చేస్తూనే ఉన్నాయి. భూమి, అడివి, నీటి వనరులు రాజ్యాధికారంపై తమ హక్కుల కోసం ప్రజలు పోరాటం చేసినప్పుడల్లా అప్రకటిత నిషేధం అమలు
చేస్తూనే ఉన్నాయి. తొంబయ్యవ దశకంలో 'టాడ', 2002లో 'పోటా', సరికొత్తగా 2005లో 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' ఇలా ఎన్నో
చట్టాలను ప్రజా ఉద్యమాలను అణగదొక్కడనికి నయా పెట్టుబడిదారీ వ్యవస్థ తయారు చేసుకుంది.
ఇన్నాళ్లు చట్టం పేరుతో దాని వెనకాల ఇష్టారాజ్యాన్ని కొనసాగిస్తున్న పాలక వర్గాల ముసుగును తొలగించనికి ప్రయత్నిస్తే వచ్చే ఫలితమే
లై 14న సోంపేటలో జరిగిన హత్యాకాండ! ఇన్నాళ్ళు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామన్న రాజ్యం చట్టాన్ని ఎందుకు
అమలు చేయడం లేదన్న ప్రశ్నకు సమాధానం రాబట్టక ముందే రెండు నిండు ప్రాణాలు నేలకొరిగాయి. బుల్లెట్ గాయాలతో సోంపేట చిత్తినేల
రక్తసిక్తమయింది. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఇంక చట్టాల గుట్టును ప్రశ్నిస్తే ప్రజలకు పాలకవర్గాలు ఇచ్చిన ఒక హెచ్చరిక!
ఇది ఉద్యమాలు చేస్తున్న వారికి, వారికి సహకరించే వ్యక్తులనే కాదు, నీడనిచ్చే చెట్టు, పుట్టను ఒకే గాటన కట్టి టార్గెట్ చెయ్యడం పాలకులకు
కొత్త ట్రెండ్‌గా మారింది. పోలేపల్లి సెజ్‌నే తీసుకుందాం! అక్కడ ఉద్యమ నాయకత్వం మీద కక్ష కట్టనికి ఒక అర్థముంది. కానీ నాయకులు, ప్రజలు
ఒక చెట్టు కింద సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటే సహించలేని సెజ్ యాజమాన్యం ఆ చెట్టునే నరికి వేసారు. హరితాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని
మారుస్తామన్న ప్రభుత్వం అడవుల్ని, చెట్లని కాపాడుతామని చట్టం కూడ చేసింది. ఒకవైపు చెట్లు నాటే కార్యక్రమం, మరోవైపు పెట్టుబడిదారీ వర్గానికి
లాభాలు చేకూర్చడనికి అదే చట్టపరిధిలో చెట్లు నరికే ప్రక్రియ ఎలా ఇమిడుతాయో!
వాన్‌పిక్ వ్యతిరేక కమిటీ నాయకుడిని 'మావోయిస్టు'గా ముద్రవేసారు. కాకినాడ సెజ్ పోరాటానికి న్యాయసహాయం అందచేసే న్యాయవాదిని
కూడ వదిలిపెట్టలేదు. మరి సోంపేటలో ప్రతి ఒక్కరూ 'నక్సలైటు'గా కనప్డరను కుంటాను. ఎదురు కాల్పులలో చంపినట్లే ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్టు
కాల్చివేశారు. చట్టాన్ని అతిక్రమిస్తున్నారని ప్రభుత్వం అరుంధతీరాయ్‌ు, బినాయక్ సేన్ వంటి మేధావుల్ని, హక్కుల సంఘాల ప్రతినిధుల్ని శిక్షించిన
సందర్భాలెన్నో! 24 సెప్టెంబర్‌న మధ్యాహ్నం సోంపేట ఉద్యమ నాయకుని ఆసుపత్రిపై బాంబుదాడి జరిగింది.
నిజమే మరి! చట్టం తనపని తాను చేసుకుపోతూనే ఉంది. అందుకు అనువైన పరిస్థితులను కల్పించుకుంటుంది. రాజ్యం యొక్క అన్ని
అంగాలను, హంగులను వాడుకుంటుంది. అవసరమైతే తిమ్మిని బమ్మిని చేయగల పాలకవర్గాలు ఉండగా అదెందుకు సాధ్యపదు? అది ఎలా
14
సాధ్యమో 4660 మెగావాట్ల బొగ్గు ఆధారిత థంర్మల్ పవర్ ప్లాంటును నిర్మించదలచుకున్న నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ వద్ద సమాధానం పుష్కలంగానే
ఉంది. వీరు నెలకొల్పే ప్రాజెక్టుకు సుమారు 1604 ఎకరాల భూమి కావలసి వచ్చింది. అందుకు అక్కడ ఉన్న చిత్తి నేలలు, తంపర, నీటి కయ్యలు,
సారవంతమైన భూములు ఏమి అడ్డుకాలేదు. కేంద్ర పర్యావరణ అటవీశాఖ నుండి అనుమతిని కూడ తెచ్చుకున్నారు. ఈ ప్రాంతాన్ని స్థానికులు
'బీల'అని పిలుచుకుంటారు. ఇందులో పెద్ద బీల, చిన్న బీల, తంపర ఉన్నాయి. తూర్పు కనుమలలో నున్న మహేంద్రగిరి నుండి వచ్చిన వర్షపు నీరు
బీలలను నింపుతాయి. అలాగే సాగరాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నుండి ఇక్కడ పొలాలకు నీరు అందుతుంది. ఒక్క మే నెలలో తప్ప మిగిలిన నెలల్లో
ఎప్పుడు చెరువులాగే కన్పిస్తుంది.
ఒడిషాలోని చిలకా సరస్సు, మన రాష్ట్రంలోని కొల్లేరు, పులికేటు సరస్సులకంటే బీల చిన్నది. కాని అంతే ప్రయోజనాలను స్థానికులకు
అందచేస్తుంది. ఇక్కడి 'పాములమిట్ట' అని పిలవబడే 25 ఎకరాల విస్తీర్ణం కలిగిన కొండ ఉంది. కొన్ని తరాలుగా పాములు ఇతర జంతువులకు నెలవై
ఉంది. 118 రకాల పక్షులు (కొన్ని వలస వచ్చేవి), నక్కలు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, తోక గబ్బిలాలు, గుడ్లగూబలు ఇలా అనేక రకాలజీవ వైవిధ్యం
గల ప్రాంతం. ఇక్కడ ప్రజలు నివసించక పోయినా తమ పశువులను మేపుకుంటారు. ఇద్దువారి పాలెం వద్ద సముద్రపు నీరు మంచినీటితో కలవడం
వలన చేపలు, రొయ్యల పునరుత్పత్తి జరుగుతుంది. కొన్ని వందల మత్స్యకార కుటుంబాలు బీలను ఆధారం చేసుకొని బతుకుతున్నాయి. ఎత్తిపోతల
పథంకం కింద 750 ఎకరాలలో నీరును వ్యవసాయానికి అందిస్తున్నారు.
28 ఫిబ్రవరి 2010న కేంద్ర పర్యావరణ అటవీశాఖామాత్యులు పక్షుల కంటే మనుష్యుల జీవితమే ముఖ్యమని శెలవిచ్చారు. అయినా సరే
జాతీయ పర్యావరణ పథంకం, పర్యావరణ పరిరక్షణ చట్టం దాని నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ప్రాజెక్ట్
నిర్మాణానికి పచ్చజెండ ఊపారు. అలాగే చిత్తి నేలలు, భద్రత ప్రమాణాలు కాలరాసి మరింత ముందుకు వెళ్లి అనుమతులిచ్చారు. ఆంధ్రప్రదేశ్
పరిశ్రమల మøలిక సదుపాయాల సంస్థ భూముల్ని, నీటి వనరుల్ని కంపెనీ యాజమాన్యానికి కట్టబెట్టింది.
భూములు కట్టబెట్టం అంతా చట్టపరిధిలోనే జరుగుతున్నట్టు కన్పిస్తుంది. నిజానికి ఇదంతా పేపరు/ఫైళ్ల మాయాజాలంతోనే జరుగుతుంది.
కేంద్రం ప్రాజెక్టులకు అనుమతులివ్వడనికి భూమికి సంబంధించిన వివరాలన్నీ కేంద్ర పర్యావరణ అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాలి. ఆ
సమాచారం అంతా తప్పుగా ఉన్నట్లయితే అనుమతులు నిరాకరించబడతాయి కూడ. ప్రాజెక్ట్ కోసం నిర్ణయించ బడిన 1604 ఎకరాలభూమి
(అందులో 972.67 ఎకరాలు ప్రభుత్వ భూమి) అంతా రెవెన్యూ రికార్డులలో చిత్తి నేలగానే గుర్తించబడిరది. ఈ భూమి రుషికుట్ట, గొల్లగుండి,
బారువాపేట, బెంకిలి గ్రామాలకు చెందినది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోంపేట తహసిల్దారు లెటరు నం.26/08/బి, 23-06-08 ద్వారా జిల్లా
కలెక్టరుకు తెలియజేసారు. ప్రభుత్వ భూమి 972.6 ఎకరాలలో 170 ఎకరాలు బీల గయలు, 199 ఎకరాలు బీల తంపర, 209 ఎకరాలు తంపర
పోరంబోకు, 396 ఎకరాలు కాలువ పోరంబోకుగా తెలియబర్చారు. ఈ భూములను 1993, 1995, 2000లలో ప్రభుత్వ ఖర్చు కిందే ఎత్తిపోతల
పథంకం కింద నీరందించారు. ప్రభుత్వ భూమిని ప్రాజెక్టు కోసం అప్పగించిన భూమిలో 78.9 ఎకరాలను డి-పట్టా పొందినవారు, 31.35 ఎకరాల
భూమిని సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. భూస్వాముల నుండి, ధనిక రైతుల నుండి ఎస్.సి. కులస్తులకు ఇచ్చిన పట్టా భూములకు రక్షణ
కల్పించాలని (మెమో నెం.1786/ఎస్.సి./ఎస్.టి. సెల్/70-3, 2-11-1970, మెమో నెం.2854/పోలిస్, ఎఫ్/77-1, 27-10-77) లో ఆదేశించింది.
ప్రభుత్వం దాని యంత్రాంగమే భూములను చేతుల్లోకి తీసుకొని ధనికులకు అప్పగిస్తే ఎవరికి చెప్పాలి? ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ సదరు సోంపేట
తహసిల్దారు గారు ఆ భూములు వ్యవసాయానికి పనికిరావని, ఎవరూ నివసించం లేదని జిల్లా అధికారులకు తెలియచేసారు. ఇదే ప్రాంతానికి
వన్యప్రాణుల కొరకు ఏర్పడిన జాతీయ బోర్డు మెంబర్లు సందర్శించి ఇవే భూముల్ని థంర్మల్ పవర్ ప్లాంటుకు ఇవ్వకూడదని చెప్పినా అధికారులకు
తలకెక్కలేదు.
చీఫ్ కమిషనర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీిరగ్స్ డి2/2225/2003, 20-07-2003 ప్రకారం రాష్ట్రమంతట నీటి వనరుల్ని, వాటి ద్వారా
నీరు అందుతున్న భూమి వివరాలను ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్‌లో జిల్లా అధికారి నమోదు చెయ్యాలి. అలా చేసినట్టయితే ఈ రోజున భూమి పరిశ్రమలకు
ఇవ్వడనికి వీలు చిక్కేదికాదు. కాని జిల్లా అధికారి ఎందుకు అలా చెయ్యలేదో కారణాలు మనకంటే ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికే బాగా
తెలుసు. చిన్న చిన్న తప్పులు చేసిన చిరు ఉద్యోగులు శాఖాపరంగా శిక్షలు పి కేంద్ర రాష్ట్ర ట్రిబ్యునల్స్ చుట్టూ తిరిగే వారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి, విధిని నిర్లక్ష ్యం చేసిన అధికారుల మీద ఎలాంటి చర్యలు శాఖాపరంగా తీసుకోలేదు. నిజానికి ప్రజాద్రోహం కింద
వీరిని క్రిమినల్ కేసులలో బుక్ చేయవలసి ఉంది. జిల్లా అధికారులు 18-08-2009న జరిగిన బూటకపు ప్రజాభిప్రాయ సేకరణలో జరిగిన
మీటింగు మినిట్సును తారుమారు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి సిఫారసు చేసారు. గొల్లగొండి గ్రామంలోని సర్వే నం.18,19,20,43,44లోని భూమి
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలోనికి వస్తుంది. అయినా దాని ప్రస్తావన అధికారుల రిపోర్టులో లేదు. జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం గురించి కలెక్టరు
సదరు బోర్డును సంప్రదించలేదు. 118 రకాల పక్షులు వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. రాష్ట్ర జాతీయ బోర్డులు చెప్పినా జిల్లా అటవీశాఖ
అధికారి మనóపూర్వకంగానే గుర్తించలేదు.
చీఫ్ కమిషనర్ ల్యాండు అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉన్న భూమికి సంబంధించి అవగాహన ఉన్న శాఖ మాత్రమే కాదు, అధికార యంత్రాంగం
కూడ. ఒకవైపు సోంపేట తహసిల్దారు, టెక్కలి ఆర్.డి.ఒ. జిల్లా కలెక్టరు ప్రభుత్వ భూములలో నీటి కయ్యలు ఉన్నాయని, అయినా అవి వ్యవసాయానికి
పనికిరావని తెలిపితే ఆ నివేదిక పట్ల విజ్ఞత చూపకుండ కనీస పరిజ్ఞానం లేని వారిలా (లేక లేనట్లు నటించమా?) ప్రవర్తించారు, భూమికి మార్కెట్టు
రేటును నిర్ణయించారు. ప్రజలు తరతరాలుగా తమ ప్రకృతి వనరులను కాపాడుకుంటుంటే వాటిని చట్టపరిధిలో పరిరక్షించవలసి అధికారులు వాటి
యంత్రాంగం పని చేసే తీరు ఇదా!
రాష్ట్ర యంత్రాంగం మొత్తం చట్టం పేరుతో చట్టవ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన
సర్వేలలో బొగ్గు ఆధారిత థంర్మల్ విద్యుత్ ప్రాజెక్టులవలన గాలి, నీరు, బావులలో కాలుష్యాలు విరజిమ్ముతాయని తెలియజేసినా దేశంలోనే అత్యుత్తమ
చదువును సొంతం చేసుకున్న అధికార్లకు తెలియదని కాదు. కాని వాటిని ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు అంతే. బంగాళాఖాతం
సోంపేటకు చేరువుగా ఉండం, అక్కడ ప్రజలు చేసుకున్న పాపం అయితే ప్లాంటు యాజమాన్యానికి వరం. పవర్‌ప్లాంటు కోసం సుమారు రోజుకు
ఒక లక్ష 88వేల ఘనపు లీటర్ల నీరు సముద్రం నుండి తీసుకుంటారని చెప్పారు. ప్లాంటులో ఆవిరయిన నీటిని కూలింగ్ టవర్లలో చల్లబరచి ద్రువీకరణ
చేసి ప్లాంటులోనే వాడుకుంటామని చెప్పినా అది సాధ్యం కాదని ప్రాజెక్టు యాజమాన్యానికి తెలుసు. ఎలాగు కొంత నీరు సముద్రంలోకి పోతుంది.
సముద్రంలో నీటి పంపింగ్ వలన, వదిలే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండం స్థానిక వాతావరణం మొత్తం వేెక్కిపోతుంది. ప్రపంచం అంతా భూగోళం
మొత్తం వేెక్కిపోతుందని ఆక్రోశిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడ ఉండదు. నిజానికి ఈ చిత్తి నేలలు కార్బన్‌ై ఆకై ్సడ్‌ను తమలో
15
ఇముడ్చుకుంటాయి. ఒక్కసారి ఈ నేలను ధ్వంసం చేసి కాంక్రీటు వేస్తే భూమిలో ఉన్న కార్భన్ డై ఆకై ్సడ్ మొత్తం పర్యావరణంలోకి వెదజల్లుతుంది.
ఇది స్థానికులు అజ్ఞానంతో తెలియచేసిన బూటకపు మాటలు కావు. కర్బన వ్యర్థాలు, గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచానికి తెలియచేసిన రామ్‌సర్
ఒప్పందాలకు సంబంధించి ప్రమాణాలు తెలియచేసిన వాస్తవాలు. ప్లాంటు కోసం ఏర్పాటు చేసే యాష్‌పాండ్ గురించి, అది చేసే హాని గురించి
పొరుగున ఉన్న ప్రాజెక్టులను చూసి ప్రజలు పదే పదే చెబితే అవి ప్రభుత్వ చెవికెక్కలేదు.
1971 ఫిబ్రవరి 2వ తారీఖున రామసర్ అంతర్జాతీయ సదస్సు చిత్తి నేల గురించి, వాటి భద్రత గురించి చేసిన తీర్మానాలకు ఏకీభవించి
మనదేశం కూడ ఒప్పందాలపై సంతకం చేసింది. దాని ప్రకారమే ప్రధానమంత్రి కార్యాచరణ ప్రణాళిక, జాతీయ పర్యావరణ పాలసీ 2004లో
తయారు చేస్తే 2006లో యూనియన్ కాబినెట్ ఆమోదించింది. ఈ ప్రమాణాల ప్రకారం దేశంలో ఉన్న చిత్తి నేలలను గుర్తించి అవి తరిగిపోకుండ
భద్రపరచాలి. వాటిని నమోదు చేసి వాటి రక్షణకు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర పర్యావరణ నివేదిక 2009 కూడ చెరువులను, చిత్తి
నేలలను, టాంకులను, తంపరలను కాపాడలని, ఆ వనరులను ఉపయోగించుకొని పేదరిక నిర్మూలనకు, ఉపాధికి కృషి చేయాలని తెలియచేస్తుంది.
గ్రామాల్లో మøలిక సదుపాయాల అభివృద్ధిలో భాగం కావాలని స్పష్టపరిచింది. ఆహార హక్కు చట్టం 2009 (ముసాయిద), రాజ్యాంగం ఆర్టికల్ 21
ప్రకారం జీవించే హక్కును ప్రాథంమిక హక్కులలో చేర్చింది. వ్యక్తి స్వేచ్ఛతో పాటు ఆహార హక్కును కూడ చేర్చింది. రాజ్యాంగం ఆర్టికల్ 39
సార్వభ∫మ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఆహారం పొందే హక్కు ఉండలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. సారవంతమైన భూములను వ్యవసాయ
యోగ్యంగా మార్చే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. చిన్న మధ్య తరగతి రైతులకు హాని కలిగించేవి, ఇప్పటికి ఉనికిలో ఉన్న వ్యవసాయ,
వ్యాపారాలను తక్షణమే విడనాడలి. దేశంలో ఆహార ధాన్యాలవృద్ధి సాధించనికి దేశీయంగా వ్యవసాయ కులాలకు తగిన ప్రోత్సాహం అందించం
ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకుంటూ ఆహార సార్వభ∫మాత్వాన్ని పెంచేలా ఉత్పత్తి పెంచాలి. సన్నకారు రైతులను
ప్రోత్సహించాలి. ఈ చట్టాలకు తూట్లు పొడుస్తూ సెజ్‌లు, పవర్‌ప్లాంటు పేరిట జరుగుతున్నదేమిటి?
ఈ మొత్తం ప్రహసనం గమనించినట్లయితే రాష్ట్ర యంత్రాంగం పాలకుల చేతుల్లో కీలుబొమ్మ అయిందని అర్థమవుతుంది. ఈ అధికార
యంత్రాంగం ఒక్కోచోట ఒక్కోలాగా వ్యవహరిస్తుంది. పొరుగునే ఉన్న విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలాలలోని కోటిపాలెం, పెద్ద కార్జాల,
రేగులపాడు, శివరాంపురం, కొమరాడ గ్రామాలపరిధిలో న్యూఢిల్లీకి చెందిన ఆల్పాù ఇన్‌ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిట్‌ె వారు 2640 మె.వా.బొగ్గు
ఆధారిత థంర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం 22 మే 2010న ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వ భూమిని ఇవ్వడనికి ఆదేశాలు ఇస్తూ అక్కడి నీటి
కయ్యలగల భూమిని తొలగించారు. కాని నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ కోసం రెవెన్యూ ప్రిన్సిపాల్ జీ.వో. నెం.1107, 15 సెప్టెంబర్ 2008లో
ప్రభుత్వ భూమిలో కాలువ పోరంబోకు, తంపర పోరంబోకు, బీలగయిలు, బీలతంపర ఉందంటూనే 972.69 సెంట్ల భూమిని ధారాదత్తం చేయడనికి
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం చర్యలు పాలకుల కుటిల యత్నాలకు మచ్చు తునక.
ఎన్నో వ్యవస్థలు మారి ప్రజాస్వామ్య వ్యవస్థగా (ప్రజాస్వామ్యం ఎంత వరకు దేశంలో ఉన్నదన్నది ఇక్కడ చర్చించం లేదు.) మారిన మన
దేశంలో అన్ని చట్టాలు, అభివృద్ధి పేపరు మీద సజావుగానే కన్పిస్తాయి. కాని ఆచరణలో ఏమి జరుగుతుందో ప్రజానీకానికి తెలుసు. 'చట్టం కలవారి
చుట్టం' అన్న నానుడి ప్రజల అనుభవాల నుంచి పుట్టిందే. రాష్ట్ర యంత్రాంగానికి తెలుసు ప్రభుత్వం పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లో ఆటబొమ్మగా
మారిందని. అందుకే కంచె చేను మేస్తే అన్న చందాన అధికారులు తమకు వచ్చినంత దండుకొని లాభపనికి ప్రయత్నిస్తున్నారు. సామ్రాజ్యవాద
ప్రపంచీకరణలో అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డుపెట్టుకొని పెట్టుబడిదారీవర్గాలను ప్రోత్సహించే నెపంతో పాలకవర్గాలు ప్రజల జీవితాలతో
ఆటలాడుకుంటున్నాయి. తప్పనిసరి పరిస్థితులలో ప్రజాస్వామ్యం ముసుగులో చట్టాలు చేసినా అవి కాగితపు పులులే. వాటిని ఖాతరు చెయ్యవలసిన
పని పాలక వర్గాలకు లేదు. ప్రజల చైతన్య స్థాయిని బట్టి వారిని మభ్యపెట్టనికి ప్రోత్సాహకాలు ప్రకటించినా అవి పరిమితమైనవే. సోంపేట ప్రజలకు
అదే జరిగింది. కొన్ని తరాలుగా వేలకుటుంబాలు భూమి సముద్రపు వనరులమీద ఆధారపి బతుకుతున్నామని ప్రజలు ప్రాధేయపినా యాజమాన్యం
ఉపాధి చూపిస్తామని ఆశ చూపబోయారు. ఇంతా చేస్తే యాజమాన్యం మాటిచ్చిన ఉద్యోగాలు 750 మాత్రమే. అందులో సాంకేతిక నైపుణ్యం, శిక్షణను
బట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయం పరిశీలించం జరుగుతుందన్నారు. అంటే కొన్ని వేల కుటుంబాలలో కొన్ని పదుల ఉద్యోగాలు. అది
సాంప్రదాయ వ్యవసాయ, మత్స్య రంగానికి చెందిన నిపుణులకు పవర్‌ప్లాంటులో ఉపాధి గ్యారంటీ లేదు. పోనీ ఇంతమంది కుపుకొట్టి మనకు
జరింగిందేమిటి?
ప్రస్తుత మన రాష్ట్ర విద్యుత్ అవసరాలు ఏటా 14,500 మెగావాట్లు (మె.వా.), రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పాటు కేంద్ర విద్యుత్
ప్రాజెక్టులనుండి (ఎన్టీపిసి) ఉమ్మడి పవర్‌గ్రిడ్ నుండి ఈ విద్యుత్ లభిస్తుంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందితే ఇంకొక 2000 మె.వా.
అవసరమవుతుంది. అలా క్రమంగా విద్యుత్ అవసరాలు పెరుగుతాయి. ఇప్పుడు మన విద్యుత్ అవసరాల్లో అత్యధిక భాగం (సుమారు 70శాతం)
ప్రభుత్వ రంగం నుండే లభిస్తుంది. తక్కిన 30శాతం ప్రైవేటు రంగానిది. అందులో ప్రభుత్వ సబ్సిడు చాలా ఉంది. ప్రస్తుతం జెన్‌కో ఇంకొక 17,500
మె.వా. విద్యుత్ ప్లాంటునకు అనుమతి కోరుతున్నది. ఆ ప్లాంటుకు అనుమతించినా రాబోయే 10,15 సంవత్సరాలకు విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చు.
అదీగాక ఉమ్మడి పవర్‌గ్రిడ్ నుండి కూడ మన రాష్ట్రం అదనపు వాటా ద్వారా విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే సోంపేటలోగానీ,
సంతబొమ్మాళిలో గానీ, రాష్ట్రంలో సముద్రతీర ప్రాంతాన రాష్ట్ర ప్రభుత్వ 20,000 మె.వా. మేరకు అనుమతులిచ్చింది. అందులో ఒక శ్రీకాకుళం
జిల్లాలోనే 8000 మె.వా. మేరకు అనుమతులిచ్చారు. ఇవన్నీ మర్చెంటు పవర్‌ప్లాంట్లు. అంటే మన రాష్ట్ర అవసరాలకోసం కాదు. దేశంలో ఎక్కడైనా
అధిక ధరలు పలికిన చోట విద్యుత్‌ను అమ్ముకుంటారు. మన రాష్ట్ర అవసరాలకోసం అయితే కొనుగోలు ఒప్పందాలను ముందే ఖరారు చేసుకుంటుంది.
ఈ మర్చెంటు పవరు ప్లాంటులో అటువంటి ఒప్పందాలు ఏమిలేవు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రివర్యులు ఇదంతా తమను
ఎన్నుకున్న ప్రజల అభివృద్ధి కోసమేనని బాహాటంగా చాటుతున్నారంటే దాని వెనకాల ఉన్న పరమార్థాన్ని గ్రహించలేని అమాయకులేం కాదు ప్రజలు.
అందుకే తిరగబడ్డరు.
ఏ చట్టాల్ని ఉపయోగించి సమాచారాన్ని గోప్యంగా ఉంచి పాలకవర్గం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుందో వాటినే సమాచార హక్కులచట్టంతో
పొంది ఆ చట్టాల్నే ప్రజలు సవాలు చేసారు. ప్రజలకు అందుబాటులో లేని సమాచారం వారికి ఉద్యమకారులు అందిచ్చి ఉండవచ్చును. గానీ
వ్యతిరేకించాలన్న నిర్ణయం ప్రజలదే. దాని ఫలితమే న్ 14న జరిగిన హత్యాకాండ! ఏలిన వారి అభివృద్ధి నమూనాను ప్రజలు ప్రశ్నించిన ప్రతిసారి
చరిత్ర ఇలాగే పునరావృతమవుతుంది. అభివృద్ధి పేరిట హరిత విప్లవం భోపాల్‌ను సృష్టించి ఎన్నో ప్రాణాలను బలి తీసుకోగా రైతులకు కన్నీటిని
మిగిల్చింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగ్, హిరట్ తదితర జిల్లాల్లో భూసేకరణ పరిహారం పెంచాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణ వ్యవధి తగ్గించనికి ఉద్దేశించిన ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం వలన వందలాది గ్రామాలలోని రైతులు భూమిని కోల్పోతున్నారు.
16
రైతులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మరణించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఆలీగ్, హిరట్ తదితర జిల్లాల్లో భూసేకరణ
పరిహారం పెంచాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అభివృద్ధి అంటే ప్రజల దృష్టిలోని నమూనా వేరు. పాలకుల దృష్టిలో మాత్రం అది
విధ్వంసానికి దారి తీసినా ఫర్వాలేదు.
ఇంకొక విషయమేంటంటే వ్యవస్థలో నెలకొన్న అన్నిరకాల భావజాలాలను తమకు అనుగుణంగా పెట్టుబడిదారీ వర్గం మలచుకుంటుంది. అది
పితృస్వామ్యం కావచ్చు, అస్తిత్వాలు కావచ్చు. సోంపేటలో చూస్తే ఉద్యమ నాయకత్వాన్ని అందిస్తున్న వారి స్త్రీలను టార్గెటు చేసారు. నడివీథిలో స్త్రీలను
వివస్త్రలను చేయడనికి ప్రయత్నం చేసారు. కాల్పుల సంఘటనకు మూడు రోజులు ముందే కంపెనీ యాజమాన్యం ఏర్పాటు చేసిన గూండలు,
పోలీసులు ఊరూరా తిరిగి వారిని భయపెట్టారు. ఈ విషయాన్ని ఉద్యమ నాయకత్వం కాల్పుల సంఘటనకు ముందు రోజు సోంపేటలో బసచేసిన
కలెక్టరుకు, ఎ.సి.పి.కి తెలియచేసినా ఫలితం శాన్యం. వారి ద్వారా నాయకత్వం వహిస్తున్న మగవాళ్లను కట్టి చేద్దామనుకున్నారు. మరో నాయకుడి
నర్సింగ్‌హోమ్ మీదపి గర్భిణీ స్త్రీలను ఈడ్చి, మహిళా రోగుల నగలు కొల్లగొట్టి నానా బీభత్సం సృష్టించారు. స్వతంత్య్రం వచ్చి రాజ్యాంగం స్త్రీలకు
స్వేచ్ఛా, సమానత్వం ప్రతిపాదించినా ప్రాజెక్టు, అధికార యంత్రాంగానికి స్త్రీలు సాటి పళిలిరులుగా కనపక, కేవలం భయభ్రాంతులకు గురిచేసి
దోచుకోబడే వర్గంగా మాత్రమే కన్పించారు. పితృస్వామ్య భావజాలంతో స్త్రీలను బెదిరించే పద్ధతులు వీరి దగ్గర ఎన్ని నేర్చుకోవాలో?! ఇలాంటి వారు
వారి ప్రాజెక్టులలో స్త్రీల ఉపాధి కోసం హామి ఇవ్వగలరన్న నమ్మకం ప్రజలకు, ముఖ్యంగా స్త్రీలకు లేదు.
అలాగే ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్‌ల వలన సమాజంలో దళితులు ముందుగు వేస్తున్నారు. కారంచేు
సంఘటన కళ్లు తెరిపించగా దళిత వర్గాల చైతన్యం చూసి వారి ఓటు బ్యాంకు పోగొట్టుకోలేక ఎస్.సి., ఎస్.టి. ప్రొటెక్షన్ యాక్టు చేసారు. ఆ చట్టం
ద్వారా మూడు శాతం కేసులలో కూడ దళితులకు న్యాయం జరగలేదన్నది వాస్తవం. కాని నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం దళితులలోని
కొంతమందిని తమ వైపుకు తిప్పుకొని తమ కన్నును తామే పొడుచుకునేటట్టు చేస్తున్నారు. అది సోంపేటలోనైనా, కాకినాడలోనైనా, వాన్‌పిక్‌లోనైనా
వారి సారాంశం ఒక్కటే. నాయకత్వంపై కక్ష గట్టిన ప్రాజెక్టు యాజమాన్యం కొంతమంది దళితులకు డబ్బు, ఉపాధి ఆశ చూపి నాయకత్వంపై తప్పుడు
కేసులు బనాయించేలా చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన ప్రెస్‌ను కంపెనీ యాజమాన్యం డబ్బు, వాహనాలు, ల్యాప్‌టాప్‌లతో
కొనేస్తున్నారు. అందుకే సోంపేటలో పోలీసులు కాల్పులు జరిపినప్పుడు ప్రజలు పాలక వర్గాలకు, కంపెనీ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్న స్థానిక
ప్రెస్‌పై తిరగబడ్డరు.
మానవ హక్కుల కమిషన్‌లో కాల్పుల సంఘటనపై ప్రజలు ఒక్కటే కోరారు. చట్ట విరుద్ధంగా ఎస్.పి., కలెక్టరు నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ
యాజమాన్యానికి ఇస్తున్న మద్దతు గురించి, విచారణ జరపాలనీ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా, దౌర్జన్యం,
లూటీ, స్త్రీలపై అసభ్య ప్రవర్తనపై చర్య తీసుకోవాలనీ, పోలీసు బలగాలని వెనక్కి పంపాలనీ, తక్షణమే కమీషన్ వేయాలనీ, లేదా హైకోర్టు సిట్టింగ్
జడ్జితో విచారణ జరపాలనీ కోరారు. అలాగే ప్రభుత్వం క్షతగాత్రుల కుటుంబాలకు వైద్య సదుపాయం అందించలేని నిర్దయని వారు పిటిషన్‌లో
ప్రశ్నించారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. మానవ హక్కుల కమిషన్ పోలీసు బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని
ఆదేశాలు ఇచ్చినా మరింత కక్షతో పోలీసులు గ్రామాలపై పి ప్రజల్ని చావబాదారు. ఇదీ రాష్ట్రంలోని మానవ హక్కుల పరిస్థితి. ఇంకా విషాదమేమంటే
అన్యాయంగా ప్రజల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిన పోలీసు ఆఫీసర్లను ప్రభుత్వ అవార్డులతో సత్కరించం!
ప్రజలకు ఉపాధి, విద్య, ఆహార హక్కులు సంక్షేమ పథంకాలు ఇవన్నీ ఉండగా ఇంకా అభివృద్ధి పథానికి ప్రజలు, మేధావులు ఎందుకు అడ్డం
పుతున్నారని ప్రభుత్వం అమాయకంగా ప్రశ్నిస్తుంది. ఆ హక్కులు, పథంకాల వెనక ఎంత డొల్లతనం ఉందో అనుభవంలోకి వచ్చిన ప్రజలకు తెలుసు.
ఆహారపు హక్కు చట్టాన్నే తీసుకుందాం! ఇప్పటి వరకు కిలో రెండు రూపాయలు చొప్పున 35 కిలోలు ఇచ్చే ప్రభుత్వం ఇక మీదట కిలో మూడు
రూపాయలకు 25 కిలోలు ఇస్తుంది. అవి కూడ అందరికి చేరవు అన్న సంగతి పేదలందరికి తెలుసు. గ్రామీణ ఉపాధి హామీ పథంకం తీసుకుంటే పని
చూపించలేని రోజుల్లో నిరుద్యోగ భృతి ఏమి ఇవ్వదు. అందులో అవినీతి లెక్కలకు అంతేలేదు. విద్యాహక్కు కూడ ఇలాంటిదే.
'అభివృద్ధి ఉంటే ఎలా ఉండలి!' పరిణామాత్మకంగా గుణాత్మకంగా ఉండలా? భూమ్మీద ప్రజలందరి జీవితం ఎలా ఉండలి అన్న ఆదర్శాన్ని
ప్రజలే సాధించేదాక ప్రపంచ అభివృద్ధి అనే భావనకు అర్థమే లేదు. అయితే మానవ పారిశ్రామిక అనుకూలత అందించే పరికరాలు, యంత్రాలు
మెరుగుపమే అభివృద్ధి అని కాదు. యోగ్యమైన మానవ లక్ష్యాలు దర్శకత్వం వహించి, నియంత్రించకపోతే శాస్త్ర విజ్ఞానం, మరిన్ని నైపుణ్యాలు
మాత్రమే అభివృద్ధి అనిపించుకోవు. మామూలుగా అభివృద్ధి నిటారు రేఖలా సాగుతుందన్న భావనకు భిన్నంగా క్రమం, అభివృద్ధి అనేవి స్థిర చట్రం
లోపలే చలనంలో ఉన్నట్టు చూడకూడదు. ఆ చట్రాలను ఛేదించుకొని, నూతన నిర్మాణాలను, వ్యవస్థలను సృష్టించేతీరులో కూడ ఉంటాయి. అందుకే
మార్క్స్, ఏంగెల్స్ ఆధునిక సమాజంలో ఈ చలనం మనిషిని మనిషి దోచుకోకుండ ఉండే స్వేచ్ఛాయుత సమాజ సాధనకేసి సాగుతుందని భావించారు.
వాళ్ళు దీనికిగాను 'స్వేచ్ఛ' అనే పదబంధాన్ని వాడరు. ఎంగెల్స్ 'స్వేచ్ఛ' అన్న మాటను 'యాంటీ - డూరింగ్' అన్న గ్రంథంంలో సంపూర్ణంగా పురోగతి
అంటూ వివరించారు. అది ఒక దిశ, ఒక లక్ష ్యం, ఆ దిశలో సాగనికి మనిషికి తోడ్పడేంతా అభివృద్ధికరమైందే. ప్రతికూల దిశలో మనిషిని
పవేసేది ఏదైనా ప్రతిఘాతకమైనదే. ఆ స్వేచ్ఛకేసి సాగమే అభివృద్ధి అంటారు మార్క్స్. ఉత్పత్తి లాభాలకి, సొంతవృద్ధికి మాత్రమే సాధనంగా ఉండే
పరిస్థితి పోయినపుడు మానవుడే ఉత్పత్తికి లక్ష ్యం అయినపుడు మనుష్యుల సామర్థ్యత, పరోక్షంగా అభివృద్ధి జరుగుతుంది. ఉత్పత్తి సాధనాల మీద,
పంపిణీ మీద ప్రజలస్వీయ నియంత్రణ ఉండం ద్వారానే ఈ లక్ష ్యసాధన జరుగుతుంది.
అయితే భారతదేశ వ్యవస్థ కుల, పితృస్వామ్య ప్రాతిపదికపైన నిర్మించ బడిరది. ప్రాంతీయ, కుల, లింగ, మతపరమైన అసమానతలు తీవ్రంగా
ఉన్న ఈ సమాజంలో అభివృద్ధి ఎలా సాధ్యం అన్నది మరో ప్రశ్న. ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ భారత వ్యవస్థపై స్పందిస్తూ
'భారతదేశం సాధించిన ఘనవిజయం ప్రజాస్వామ్యాన్ని రక్షించం, చవిచూసిన ఘోరవైఫల్యం సామాజిక అసమానతలు కొనసాగం' అన్నారు.
భారతదేశం ఆర్థికశాఖ వృద్ధిలో 9 శాతం రికార్డు సాధించినా, సామాజికాభివృద్ధిలో వెనుకబడిరది. ప్రజలజీవన ప్రమాణాలతో ప్రత్యక్ష సంబంధమున్న
అంశాలను సామాజిక అభివృద్ధి కొలబద్దలుగా కొలుస్తారు కూడ. ఉదాహరణకు అక్షరాస్యత, శిశు మరణాలు, మాతృ మరణాలు, సగటు జీవిత
కాలం, స్త్రీ, పురుష నిష్పత్తి, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్య సేవల అందుబాటు, మహిళా సాధికారత, సామాజిక న్యాయం మొదలైనవి, భారతదేశంలో
ఇప్పటికి అనేక అసమానతలు కొనసాగుతున్నాయని తాజాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్ష్లె ్ ఎకనమిక్ రిసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్
సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన కూడ వెల్ల ిరచాయి. సామాజిక అసమానతలు, గ్రామీణ పట్టణాల మధ్య అసమానతలు, పళిలిర సేవల
అందుబాటులలో తారతమ్యాలు, వర్గాలవారి దిగువ స్థాయిలో ఉండం. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు ముఖ్యమైనవి. విద్యారంగంలో అక్షరాస్యతలో
స్త్రీ పురుషుల మధ్య తే ఉంది. ఆదాయంలో స్త్రీ వెనుకబడి ఉండం వలన ఆర్థిక దోపికి గురవుతున్నారు. పురుషులు ఒక్క రూపాయి సంపాదిస్తే,
17
స్త్రీలు కేవలం 53 పైసలు మాత్రమే సంపాదిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు కావడంలేదు. అలాగే పట్టణాలలో19 శాతం మందికి
కంప్యూటర్ నైపుణ్యం తెలిస్తే గ్రామాలలో కేవలం 2 శాతం మందికి మాత్రమే తెలుసు. దేశంలోని 17 శాతం ఎస్.సి.లలో 86.25 శాతం భూమి లేని
పేద కుటుంబాలే. వారంతా 49.1 శాతం వ్యవసాయ కార్మికులే. నేషనల్ క్రైమ్ రికార్డ్‌ల బ్యూరో ఇచ్చిన గణాంకాల ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, తెగల
అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. రిజర్వేషన్లు అమలైన తరువాత కూడ ఐఎఎస్, ఐపిఎస్,
ఐఎఫ్‌ఎస్ లాంటి అత్యున్నత కేంద్ర ప్రభుత్వోద్యోగులలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ప్రాతినిధ్యం జనాభాలో వారి జనాభా కంటే తక్కువగా
ఉంది. ప్రజాభిప్రాయాన్ని నిర్మించే ప్రసార మాధ్యమంలో అత్యున్నత స్థాయిలో పనిచేసే పాత్రికేయుల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు లేరు. రోజు
రోజుకు పేదరికం పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి చావులు, అనారోగ్యం, అవిద్య,
అభద్రత, అవినీతి, ఆహార కొరత, నీటి ఎద్ది వంటి ఎన్నో సమస్యలతో ప్రజల జీవితాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం ప్రజలను
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
శతాబ్దాల సామాజిక అణిచివేత, కులవివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సమాజ వనరుల ఆధిపత్యం అగ్ర వర్గాల, కులాల దళారి చేతుల్లోనే
ఉంది. రూపాలు మారుతున్నాయి. ఇప్పటి సెజ్, థంర్మల్ పవర్‌ప్లాంట్ యాజమాన్యాలను చూస్తే ఈ సంగతి విదితమే. వీరి చెర నుంచి విముక్తి
పొందినప్పుడే అభివృద్ధి సాధ్యం. సర్వ మానవుల శ్రేయస్సు కోసం హేతుబద్ధంగా సకలఉత్పత్తిని శ్రామిక వర్గ అజమాయిషీ కింద తెచ్చుకోవాలి. ప్రజల
అందరి సామాజిక, సాంస్క ృతిక స్థాయిని పెంచం, మానవుని ఆర్థిక, రాజకీయ సామాజిక సంబంధాలను వివేచనాయుతమైన ఆధిపత్యం కింద తెచ్చి
సమష్టి మానవాళి సామర్థ్యాన్ని పెంచం, గతంలో ఏ సమాజ రూపమూ చెయ్యని విధంగా నిరంతరంగా మరింత పరిపూర్ణంగా శాస్త్రాల్ని అభివృద్ధి
చెయ్యడం, వాటిని మానవ శ్రేయస్సు కోసం వినియోగించం, సకలశాస్త్రాల్ని కళల్ని వినియోగించం ద్వారా మానవ జీవిత ఉన్నత ప్రమాణాన్ని
ఉండ గలిగిన, ఉండవలసిన ఆదర్శాలని రూపొందించి సాధించగలగం మాత్రమే నిజమైన అభివృద్ధికి నిర్వచనం.
అశేష ప్రజానికానికి కావలసింది ఈ అభివృద్ధే. ఈ తరహా అభివృద్ధిని అందించనికి పాలకవర్గాలకు చిత్తశుద్ధి, అంకితభావం లేవు. అందుకే
ప్రజలు న్యాయమైన హక్కుల కోసం పోరాడినప్పుడల్లా సమస్యలను ప్రక్కదోవ పట్టించి, వామపక్ష తీవ్రవాదులుగా ముద్రవేసి ప్రజలను విచక్షణారహితంగా
చంపుతూ, విధ్వంసానికి పాల్పడుతూ ఒక భయానక బీభత్స వాతావరణాన్ని సృష్టించి ఆ గ్డ నుంచే ప్రజలను తరిమి వేయాలని పాలకవర్గం ఎదురు
చూస్తోంది. తమ హక్కులకై చేస్తున్న పోరాటం కేవలం వారికి సంబంధించినది మాత్రమే కాదు. ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. ఈ హక్కుల
పోరాటం దేశ సార్వభ∫మత్వానికి, స్వాతంత్య్రానికి, స్వావలంబనకు, స్వయంప్రతిపత్తికి సంబంధించిన విషయం.
ఒక పక్క దేశ వనరుల్ని, సార్వభ∫మత్వాన్ని తాకట్టుపెట్టి కొన్ని హక్కుల్ని ప్రజలకు విదిల్చడం అభివృద్ధి పథంం కానేరదు. అందుకే సోంపేటలో
ప్రభుత్వ పథంకాల్ని తిప్పికొట్టి ప్రజలు ఉద్యమ బాట పట్టం చూసాం. మనిషి కింద నేల కదలకుండ ఆకలికి, అభద్రతకు వ్యతిరేకంగా అభివృద్ధిని
పొందం ప్రతి మనిషి ప్రజా స్వామ్య హక్కు. అప్పుడే పెట్టుబడి కబంధ హస్తాల్లో పళిలిరుడు చిక్కకుండ శ్రమ ఆధారిత ప్రత్యామ్నాయ అభివృద్ధి సాధ్యం.
ప్రజాస్వామ్యంలో చట్టాల ముసుగులో జరుగుతున్న దోపికి పాలకులు బాసటగా నిలిచి చట్టాలు తమ పని తాము చేసుకొని పోతాయని తాకీదులు
ఇస్తుంటే, ప్రజలు తమ పని తాము చేసుకుపోవడనికి వెనకాడరని చరిత్ర చెబుతున్న పోరాట సత్యం! కాని తమ ధర్మాన్ని ప్రజాధర్మంగా బోధించే
ధర్మాన ప్రసాద రావు వంటి వారు కూడ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త!!
నవంబర్ 2010
-హేమా వెంకట్రావ్

No comments:
Post a Comment