Wednesday, May 20, 2015

కన్నీరొలుకుతున్న కరవాక

కన్నీరొలుకుతున్న కరవాక
మార్చ్‌ 2011

-హేమా వెంకట్రావ్


అటు భూమి, ఇటు సముద్రానికి మధ్య తెరచాప లాంటి తీరప్రాంతాన్నే 'కరవాక' అంటారు. రెక్కలు తప్ప ఆస్తులు లేని ఈ
మత్స్యకారులు అనంతమైన సముద్రాన్ని నమ్ముకుని బతుకు పోరులో కష్టాల్ని దిగమింగుతూ ఎన్నో తరాలుగా జీవితాల్ని నెట్టుకొస్తున్నారు.
ప్రతి సంవత్సరం 80 మిలియన్‌ టన్నుల మత్స్య సంపదను వేటాడి వెలికి తీస్తున్నారు. మత్స్య పరిశ్రమ ద్వారా సమాజానికి ఆర్థిక, ఉపాధి
ఉద్యోగ కల్పనతో పాటు ప్రపంచ జనాభాలో 40 శాతం జనాభాకు ఆహార భద్రత కల్పిస్తున్నారు. సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌
ప్రకారం 12 మిలియన్ల మంది మత్స్యకారులు తీరప్రాంతాలలో జీవిస్తున్నారు. దేశంలో 8118 కి.మీ. తీరప్రాంతం ఉండగా రాష్ట్రంలో 974
కి.మీ. విస్తరించి ఉంది. మన రాష్ట్రంలో 498 చేపల రేవులు 2278 మరబోట్లు, 9735 మీటరు బిగించిన నావలు, 13083 సాంప్రదాయ
నావలు ఉన్నాయి. ఏప్రిల్‌16 నుండి న్‌15 వరకు చేపల వేట నిషేధం.
ప్రకృతి పరంగా తమకు లభించిన సహజ వనరులను మత్స్యకారులు ఉమ్మడిగా పొందుతూ ఉమ్మడి జీవన విధానానికి ఈనాటికి
మారుపేరుగా ఉన్నారు. దానికి కారణం వారి బతుకు తెరువు వారి జీవనవిధానంపై ఆధారపి ఉండటమే. ఇప్పటికి తీరంలో ఉన్న
వనరులపై, వాటి వినియోగంలో కట్టుబాట్లు పాటిస్తారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వలకట్లను కేటాయిస్తారు. నీటిలో దిగకున్నా,
ఒడ్డున ఉన్నా వాటా లభిస్తుంది. మత్స్యకారులు చేపల వేటలో వనరుల పరిరక్షణ, పర్యవేక్షణను దృష్టిలో ఉంచుకొని అవసరాల మేరకు
వేటచేసి మత్స్యసంపద పరిరక్షణకు చర్యలు తీసుకొంటారు. అలాగే సముద్ర తీరంలోని బంజరు భూములను సాగు చేసుకుంటారు. అయితే
ఈ భూములు గ్రామానికి చివర్న ఉండం వలన నీటి సరఫరా కొరకు అగ్రకుల వర్గాల మీద ఆధారపం జరుగుతుంది. ఆక్వాకల్చర్‌
వలన భూముల విలువ పెరగంతో ఆధిపత్య కులాలవారు నయానా భయానా వారి భూములు ఆక్రమించుకుంటున్నారు.
మత్స్య పరిశ్రమలో పట్టిన చేపలను రేవులలో గ్రేడిరగ్‌ చేయడం, వేలం పాడం, శుభ్రపరచం, ఎండబెట్టం, నిల్వ చేయడం
అమ్మకం తదితర అన్ని పనులు మహిళలు చేస్తారు. వీటితో పాటు కుటుంబ బాధ్యతలను తీర్చే మరో కర్తవ్యం మహిళపై ఉంది. వలలు
తయారు చేయడం వేటకు అవసరమైన వనరులు సమకూర్చడం, నావ తదితర పరికరాలను శుభ్రపరచం వగైరా పనుల్లో ప్రధాన పాత్ర
వహిస్తారు. గతంలో స్త్రీలు చేపల వేటలో పాల్గొనేవారు కాదు. కాని ఇప్పుడు అడవి వేటలో పాల్గొంటున్నారు. వేటకు వెళ్లకపోయినా తమ
పురుషులతో పాటు నావలపై వలను లాగనికి సహాయపతారు. వ్యవసాయ ఉత్పత్తిలో స్త్రీల భాగస్వామ్యం విషయమై ఓ మేరకు లెక్కలు
ఉన్నా కరవాక మహిళ దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె శ్రమశక్తి, ఉత్పత్తిలో ఆమె భాగం గురించి గణాంకాలు ఏమీ లేవు. ఇన్ని చేసినా
పితృస్వామ్య భావజాలం ఈ మహిళల జీవితాలపై ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఇంట్లో పురుషుని పెత్తనం, అధిక పని, బయటకు వెళితే
బి.సి. కులానికి చెందిన వీరిపై ఆధిపత్యకులాల పెత్తనం, లైంగిక దోపిు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బి.సి. వర్గీకరణలో ఉన్న
ఈ పల్లెకారులు తమను ఎస్‌.టి.లలో చేర్చాలని కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నా ఫలితం శాన్యం.
సంవత్సరానికి రు. 7000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి అందిస్తున్న మత్స్యకారులపై ప్రపంచీకరణ చావు దెబ్బకొట్టింది.
ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ మద్దతుతో యాంత్రీకరించబడిన పెట్టుబడిదారీ రంగం వేళ్లానుకోగా ప్రభుత్వ మద్దతు లేక సాంప్రదాయ
మత్స్యకార రంగం నానాటికి కునారిల్లుతున్నది. దాని ప్రభావం కరవాక జీవులపై కూడ పిరది. సరళీకరణ, ప్రైవేటీకరణలో భాగంగా
పెట్టుబడుల ఆకర్షణ పేరుతో మత్స్యకారేతర వర్గం సహజవనరులతో పాటు మత్స్యకారుల జీవన విధానంపై కూడ దెబ్బతీసింది. పెట్టుబడిదారీ
వర్గం ఉత్పత్తితోపాటు వ్యయాన్ని పెంచి కనీస ప్రమాణాలకు నీళ్లొదిలేసింది. సంప్రదాయ మత్స్యకారులు చేపల వేటకు వాడే వలను అర
అంగుళం వలకన్ను నిడివి ఉండేటట్లు తయారు చేసేవారు. కాని లాభాలే లక్ష ్యంగా ప్రవేశించిన పెట్టుబడిదారీ వర్గానికి ఇవేవి పట్టవు.
మరబోట్లలో లోతట్టు జలాల్లో ప్రవేశించి మత్స్యసంపద పరిరక్షణ, పర్యావరణ నియమ నిబంధనలకు విరుద్ధంగా భవిష్యత్తు తరాల సంపదనూ
దోచేస్తున్నారు. నావల తయారీ, వలల తయారీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల చేతులలోకి వెళ్లిపోయింది. ఫైబర్‌ వాడకం, ఇంజన్‌ వినియోగం
ఎక్కువైంది. ప్రభుత్వం కాంట్రాక్టర్లు, డులర్ల నుండి వచ్చినంత దండుకోవడం, వారికి కొమ్ముకాయడం వలన రెట్టింపు ధరలకు తమ
వస్తువులను అమ్మకానికి పెడుతున్నారు. దాని వలన మత్స్యకారులు నష్టాలపాలవుతున్నారు. వలల తయారీ స్థానికంగా ఉన్నప్పుడు స్త్రీలు,
పిల్లలకు ఉపాధి దొరికేది. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఫిషింగు నౌకలకు కస్టమ్స్‌ సుంకం మినహాయింపు, ఉత్పాదక పరికరాలు,
విడిభాగాలు, ముడిపదార్థాల దిగుమతిపై వందశాతం కస్టమ్స్‌ ఎకై ్సజు మినహాయింపు, వినియోగిస్తున్న డుజిల్‌ ధరలో 10 శాతం రాయితీ
ఇస్తున్నారు. అదే డుజిల్‌ ఆయిల్‌పై సబ్సిడు ఇచ్చినా సాంప్రదాయ మత్స్యకారులకు 200 లీటర్లకే పరిమితం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్డర్‌ చేసే
నావలు వలలు సరఫరా ధరలు మార్కెట్‌ ధరకంటే ఎక్కువే. ప్రభుత్వమే దోపిుకి పూనుకుంటే ఇంక తిరుగేముంది?
ఇక స్థానిక వ్యాపార వ్యవస్థ స్థానంలో కమిషన్‌ ఏజెంటు వ్యవస్థ మొదలయింది. కష్టించే వర్గం ఒకటైతే పెట్టుబడుల పేరుతో కమిషన్ల
పేరుతో ఇతర వర్గాలవారు వేళ్లానుకున్నారు. వ్యాపార దృష్టితో ఈ వృత్తిలో ప్రవేశించిన వారందరిని మత్స్యకారులుగా గుర్తించి అన్ని రకాల
ప్రయోజనాలను వారికి కల్పించం ప్రభుత్వ దమన నీతికి పరాకాష్ట. ప్రభుత్వ పర్యవేక్షణలో ఏర్పాటు చేసే ఫిషరీస్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో
మత్స్యకారుల కంటే ఇతర వర్గాల వారి స్టాల్స్‌ ఎక్కువగా ఉండం గమనించవచ్చు. ప్రభుత్వం మత్స్యకారులకు కల్పిస్తున్న రాయితీలతో
ప్రపంచీకరణ ప్రభావం పి సాంప్రదాయ మత్స్యకారుల స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చిన్నబోయింది. పెద్ద కంపెనీలు తమ పలుకుబడితో
ప్రభుత్వ విధానాలనే మార్చివేసాయి. ఉపాధిపరంగా పెరిగిన పెట్టుబడి వ్యయంతో సాంప్రదాయ మత్స్యకారులు అప్పులపాలై మరబోట్లలో
కూలీలుగా, కాంట్రాక్టు కూలీలుగా మిగిలారు. మార్కెట్‌ను శాసిస్తున్న వర్గాలు అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రాసెసింగ్‌, గ్రేడిరగ్‌ ప్యాకింగ్‌
చేయడం వలన స్థానికులకు ఉపాధి మృగ్యం అయింది. దీనితో సాంప్రదాయ మత్య్యకారులు అనేకమంది ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
వీరు కుటుంబాలను స్థానికంగా వదిలివేయడంతో స్త్రీలు, పిల్లలు అనేక రకాల దోపిుకి గురవుతున్నారు. కోట్ల రూపాయల ఉత్పత్తిని దేశానికి
అందిస్తున్న మత్స్యకారులు తమ వనరుల సమీకరణకై వడ్డు వ్యాపారులపై, మధ్య దళారులపై ఆధారపి తమ ఆదాయంలో 60 శాతం వారికే
ధార పోస్తున్నారు. 82 శాతం మత్స్యకారులకు స్వంత నావలు, వలలు లేవు. సరైన రుణ, మార్కెట్‌ సళిలికర్యం, శీతలీకరణ, రవాణ సళిలికర్యాలు,
19
గిట్టుబాటు ధరలు లేక రోడ్డుపాలవుతున్నారు. అందుకే మత్స్యకారులకు సంవత్సరానికి 200 రోజులు కూడ చేపలవేట సాగం లేదు.
ప్రస్తుతమున్న పరిజ్ఞానంతో సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలో రాత్రిళ్లు వలలను వదిలి ఉదయం లాగేస్తారు. నీటి ఎద్ది ప్రవాహాన్ని
బట్టి ఆ వలలు 4, 5 గంటలలో 60, 70 కి.మీ. దూరం వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ పరిస్థితులలో నియంత్రణ రేఖ దాటారని కోస్టు
గార్డులు వారిని కస్టులో తీసుకొని వేధిస్తూ ఉంటారు.
అంతర్జాతీయ కార్మికసంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది మత్స్యకార్మికులలో సాలీనా ప్రమాదవశాత్తూ 80 మంది
మరణిస్తున్నారు. సగటున 2,40,000 మంది ప్రాణాపాయం కాని ప్రమాదాల బారిన పి అంగవైకల్యం పొందుతున్నారు. ఈ కార్మికులు
ఎటువంటి సామాజిక భద్రత, హక్కులు లేని అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్నారు. గుర్తింపు లేని అసంఘటిత కార్మిక రంగంలో పని
చేస్తున్నందున కార్మిక చట్టాలు వర్తించం లేదు. 1920 నుండి 2007 వరకు జరిగిన వివిధ సదస్సులలో అంతర్జాతీయ సంస్థ ఎన్నో
తీర్మానాలను చేసింది. నౌకల పైన, మత్స్య పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఎనిమిది గంటలు లేదా వారానికి నలభై ఎనిమిది గంటలు పని
ప్రామాణికంగా ప్రతిపాదించింది. 15 సంవత్సరాలు ఉన్నవారినే కార్మికులుగా నియమించాలని, వాణిజ్యపరమైన నౌకలలో ఉద్యోగ
నియామకాలలోని నియమ నిబంధనలపై యజమాని, కార్మికుడు పరస్పర అంగీకార పత్రంపై సంతకాలు చేయాలని, ఇంకా భద్రతా,
ఆరోగ్యంపై విధివిధానాలు రూపొందించారు. వినోదపు వేట మినహాయించి సంప్రదాయ మత్స్యకారులలో సహ భద్రత, ఆరోగ్యం, సళిలికర్యాల
కల్పనకు తీర్మానాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడ జాతీయ ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలు, యంత్రాంగం కూడ
మత్స్యకారులకు పనిగంటల పని ఒప్పందాలు, పని ప్రదేశాలలో సురక్షితమైన పారిశుద్ధ్య వసతులు, సామాజిక భద్రత వంటి విషయాలపై
దృష్టి సారించలేదు. మత్స్య పరిశ్రమాభివృద్ధికి జాతీయ మత్స్యాభివృద్ధి మండలి ఏర్పాటు చేసినా అది నిధుల కేటాయింపు తదితర విషయంలో
సంప్రదాయ మత్స్యకార్మికులను పూర్తిగా విస్మరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వనరుల వినియోగంలో సంప్రదాయ మత్స్యకారులను
భాగస్వాములను చేయటానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించలేదు. అక్వా కల్చర్‌ అభివృద్దికి నిధులు కేటాయిస్తూ సముద్ర జలాల్లో
సముద్ర జీవరాశి ఉత్పత్తి చేయడనికి ఆయా నీటి వనరులపై హక్కులు కల్పించనికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పైగా మత్స్యకారులకు
విడుదలవుతున్న నిధులలో 10 శాతం కూడ మత్స్యకారులకు చేరం లేదు. ఎక్కువ భాగం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది. ఈ
శాఖలో అగ్రకులాల వారిదే పెత్తనం. ఇక మత్స్యకార కో-ఆపరేటివ్‌ సొసైటీలు మత్స్య కార్మిక వ్యతిరేక విధానాలతోను, అవినీతితోను
నిండిపోయి రాజకీయ జోక్యంతో పనికి రాకుండ పోయాయి. స్వచ్ఛంద సంస్థల విషయానికి వస్తే తీర ప్రాంతంలో వైపరీత్యాలు, సునామీ,
తుఫాను లాంటివి వచ్చినపుడు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విదేశీ సంస్థల నుంచి నిధులను పొంది వారు లాభప్డరే తప్ప
మత్స్యకారులకు ఒరిగింది ఏమీ లేదు.
ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం 60, 70, 80 దశాకాలలో సముద్ర వనరులపై త్వరితగతిన లాభాలు గిరచం చూసింది. చేపల
వేటలో అనైతిక విధానాలు, కాలుష్యం వల్ల వార్షిక చేపల వేట 8.5మిలియన్లకు పిపోయింది. సముద్రతీర పర్యావరణం దెబ్బతినడంతో
ఆయా దేశాలు అట్లాంటిక్‌, పసిఫిక్‌, మధ్యదరా సముద్రజలాలో చేపల వేట నియంత్రణ చట్టాలు చేసాయి. 60 వ దశకంలో ఐక్యరాజ్య
సమితి తీర్మానాల ప్రకారం అభివృద్ది చెందిన దేశాలు ప్రత్యేక చట్టాలు చేసాయి. చాలా చోట్ల చేపల వేట ప్రదేశాలు రక్షిత ప్రదేశాలుగా
మలచబడ్డయి. ఇలాంటి దశలోనే భారత సరళీకృత విధానం సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గానికి తలుపులు బార్లా తెరిచింది. నగరీకరణ,
పారిశ్రామికీకరణ, ఓడరేవుల అభివృద్ధి, ఆధునీకరణ పర్యాటకాభివృద్ది పేరిట కరవాక కార్మికుల జీవితాలలో సునామి సృష్టించింది. అభివృద్ది
చెందిన దేశాలలో మూలప్డ ఫిషింగ్‌ వెస్సల్స్‌ భారత ప్రత్యేక వాణిజ్య మండలిలోకి చొచ్చుకువచ్చాయి. సబ్సిడులు, వందశాతం ఎగుమతుల
అనుమతి, విదేశీ పోర్టులను వాడుకోవడనికి అనుమతులు, భారత తీరంలో ఆగి తీరాలన్న నిబంధన సలింపులతో మరింత దోచుకున్నాయి.
తరతరాలుగా సంపాదించు కున్న పరిజ్ఞానంతో పర్యావరణం, మత్స్య సంపద దెబ్బ తీయకుండ వేట కొనసాగించిన మత్స్యకారుల స్థానంలో
బడ కంపెనీల నావలు, ట్రాలర్స్‌ పుట్టుకొచ్చాయి. ఇందులో టాటా, మహీంద్రా, ఐ.టి.సి. హిందుస్థాన్‌ లీవర్‌, డన్‌లప్‌ వారి స్వదేశీ,
అమెరికా, జర్మనీ, జపాన్‌వారి విదేశీ నౌకలు తీరంలో కొన్ని వందల అనుమతులు సంపాదించాయి. వారి వేటలో సగానికి పైగా పరిణతి
చెందని జీవరాశులే. అభివృద్ధి చెందిన దేశాలు సముద్రంలో నిక్షిప్తమైన ఖనిజ సంపదపై కూడ కన్ను వేశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు,
కోస్టల్‌ కారిడర్‌ల కోసం రాజ్యాంగ స్పూùర్తికి విరుద్ధంగా చట్టాలు చేసి, నీరు, భూమి, అడవుల్ని విదేశీ గుత్త పెట్టుబడిదారులకు అతి చౌకగా
అప్పగిస్తూ దేశ సారభ∫మత్వాన్ని తాకట్టుపెడుతున్న పాలకవర్గాలు సాంప్రదాయ మత్స్యకారుల ప్రాథంమిక హక్కులను కూడ కాలరాసాయి.
సాంప్రదాయ మత్స్యకారులు తమ సాంప్రదాయ ఉమ్మడి హక్కుల కోసమే కాకుండ యాంత్రీకరణ, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ
వర్గానికి వ్యతిరేకంగా పోరాడరు. 70వ దశకంలో చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీరు ప్రధానంగా తీరంలో
20 కి.మీ. మేర మరబోట్లు రాకూడదని, వలకన్ను చిన్నదిగా ఉండకూడదనే డిమాండ్లతో పోరాడరు. రాత్రిపూట ట్రాలర్లు వేట చేయరాదని,
తమ ప్రాంతాల్ని ఖాళీ చేయించరాదని, టూరిజానికి వ్యతిరేకంగా పోరాడరు. ఎడతెగని పోరాటాల ఫలితంగా 1979లో తీర ప్రాంత ప్రాదేశిక
జలాల చేపల వేట నియంత్రణ నియమావళి రూపొందించారు. కేరళ, గోవాలు 1980లో చట్టాలు చేసాయి. ఆ తరువాత అన్ని రాష్ట్రాలు
కూడ చట్టాలు చేసాయి.
1990 సంవత్సరంలో లోతట్టు సముద్ర జలాలలో చేపల వేట విధి విధానాలను ప్రకటించి విదేశీ పారిశ్రామిక నౌకలు, దేశ విదేశాల
సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే నౌకలకు చేపల వేటకు అనుమతి ఇచ్చారు. దేశవ్యాప్త ఆందోళన ఫలితంగా కేంద్రం మురారి కమిటీని
నియమించింది. కమిటీ అనుమతులు ఇవ్వరాదన్న కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం తూట్లు పొడిచింది. 1991 లో కోస్తాతీర ప్రాంత నియంత్రణ
ప్రకటనను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం 500 మీటర్ల లోపల ఎలాంటి కట్టలు కట్టకూడదు. బహుళజాతి సంస్థలు,
బడ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కోస్టల్‌ మేనేజిమెంట్‌ జోన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినా మత్స్యకార ప్రజాసంఘాల ద్వారా ప్రభుత్వం
విరమించుకుంది. అయినప్పటికీ టూరిజం పేరిట, ప్రాజెక్టుల పేరిట పర్మినెంటు కట్టలు కుతూనే ఉన్నారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీరప్రాంత ప్రాదేశిక జలాలలో చేపల వేట సంబంధిత కార్యకలాపాలను నియంత్రించం, మత్స్య
సంపదను కాపాడం, చేపల వేటకు ఉపయోగించే అన్ని పవలు, బోట్లు, నౌకలను నియంత్రించం, సముద్ర ప్రాంతంలో జాతీయ భద్రతా
ప్రయోజనాలను కాపాడలనే లక్ష ్యంతో 'ది మెరైన్‌ ఫిషరీస్‌(రెగ్యులేషన్‌ అండ్‌ మేనేజిమెంట్‌) చట్టం 2009 పేరుతో పార్లమెంట్‌లో బిల్లు
ప్రవేశపెట్టి చట్టం చేయడనికి ప్రయత్నం చేస్తున్నది. పేరయితే మత్స్యకార జాతీయ ప్రయోజనాలు కాని ఇప్పటికే తీర ప్రాంతాన్ని బహుళ
20
జాతి కంపెనీలకు ధారాధత్తం చేసింది. నిన్న మొన్నటి వరకు తీరంలోని ఇసుక తిన్నెలు, సముద్ర తీర జలాలు, నీటి కయ్యలు, చింకలు, ఆల్చి,
గ్డి గోదాములు నిండిన ఉప్పునీటి పరీవాహక ప్రదేశాలు, మడ అడవులు మొదలైన వాటిని పరులకు ధారాధత్తం చేసాయి. ఈ చట్టం అంటే
మత్స్యకారుల దృష్టిలో నావలు, తెప్పలు రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ ఫీజులు కట్టమే. ఈ బిల్లు ప్రకారం మత్స్యకారులు 24 కి.మీ. పరిమితులు
లేకుండ వేట చేసుకోవచ్చు. కానీ సరిహద్దుల నియంత్రణలో శాస్త్రీయత లోపించం, మరబోట్లు, ట్రాలర్లు ఇష్టానుసారంగా మత్స్యకారులకు
కేటాయించిన ప్రాంతంలో జొరబడి ఇప్పటికే వేట చేయడంతో పాటు వారి వలలను, నావలను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది.
కాకినాడ దగ్గర హోప్‌ ఐలాండ్‌ ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు, అమలాపురం దగ్గర ఓ.ఎన్‌.జి.సి. వదులుతున్న కాలుష్యం లాంటి సంఘటనలు
తీరప్రాంతాన సర్వ సాధారణమయ్యాయి. కోస్టల్‌ కారిడర్‌ ప్రాంతంలో విశాఖకు దగ్గరగా కాలుష్యం వలన చనిపోయిన మత్స్యజీవరాశులెన్నో.
వివిధ రకాల, పరిమాణాలతో నిర్మించబడే నావలు, నౌకలపై, వాటి సంఖ్యను పరిమితి చేయడం చట్టం లక్ష ్యం అయినా అది కేవలం
సాంప్రదాయ మత్స్యకారులకే పరిమితం అవుతుంది. చట్టం ప్రకారం రాష్ట్రాలలో ప్రకటించబడిన ప్రాదేశిక జలాల సరిహద్దు (ఆంధ్ర తీరం
నుండి 8 కిలోమీటర్లు ఒడిశా నుండి 5 కిలోమీటర్లు, కర్నాటక 10 కిలోమీటర్లు సరిహద్దులుగా ఆ రాష్ట్రాలు ప్రకటించాయి) లలో వేట
చేసుకోవడనికి రాష్ట్ర మత్స్యశాఖ వారి నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ పరిధి దాటి 24 కిలోమీటర్ల లోపల వేట చేసుకోవడనికి కేంద్రం
నుంచి అనుమతి తీసుకోవాలి. అతిక్రమించి నట్టయితే బోటును స్వాధీనం చేసుకోవచ్చు. దానితో పాటు 9 లక్షల రూపాయలు లేదా బోటు
విలువ కాని వాటిలో ఏది ఎక్కువ ఉంటే దానిని జరిమానాగా చెల్లించాలి. లేదా మూడేళ్ల జైలుశిక్ష కూడ విధించవచ్చు. లేదా జరిమానాతో
పాటు జైలు శిక్ష విధించే నిబంధనలు ఈ కొత్త చట్టం ద్వారా అమలయ్యే అవకాశం ఉంది. ఈ నియమ నిబంధనలన్నీ యూరోపియన్‌
యూనియన్‌ ప్రమాణాలకు అనుగుణంగా చేయబడ్డవే. ఈ చట్టం లక్ష ్యం సాంప్రదాయ మత్స్యకారుల హక్కులకు పరిమితులు విధించి,
బహుళజాతి కంపెనీలకు సర్వహక్కులను కట్టబెట్టమే. అంతేకాక భారతదేశ సార్వభ∫మాధికారం కింద ఉన్న ప్రత్యేక వాణిజ్య మండలాల
పరిధిలో గల సముద్రజలాల్లో విదేశీ నౌకలకు ప్రవేశాన్ని చేపల వేట పేరుతో లైసెన్సు అందచేయడం దేశభద్రతకే ముప్పు.
గిరిజనులు అడవిని నమ్ముకున్నట్టే మత్స్యకారులు కలిని నమ్ముకున్నారు. అయితే మహిళలు, కార్మికులు తమ దోపి, అణచివేతపై
పోరాడి మార్చి 8, మే 1 తేదీలను తమ హక్కుల దినంగా ప్రకటించు కున్నారు. కాని మత్స్యసంపద, తీరప్రాంత పర్యావరణ రక్షణ ఆయా
ప్రాంతాలలోని సహజ వనరులపై ఆధారపిన సాంప్రదాయ మత్స్యకారు లను, పశుపక్ష్యాదులను రక్షించుకోవడనికి అంతర్జాతీయ ఆహార
సంస్థ నవంబరు 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రకటించినా దానిపట్ల అవగాహనను, ఆచరణను గ్రామస్థాయిలోకి ప్రభుత్వం
తీసుకెళ్ల లేకపోయింది. అది కేవలం కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమైంది.
అయినప్పటికి గిచిన దశాబ్దకాలంలో తీరంలో పరిశ్రమలకు వ్యతిరేకంగా, పర్యాటక కేంద్రాల స్థాపన, దేశ సార్వభ∫మత్వాన్ని తాకట్టు
పెడుతున్న పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా తమ తీరాల పరిరక్షణ కోసం, సాంప్రదాయ ఉమ్మడి హక్కుకోసం ప్రజలు పికిలెత్తుతున్నారు.
వారి ఆక్రందనల అలల హోరు, తాకి సోంపేట, గంగవరం, వాన్‌పిక్‌, కాకినాడ, మహాముంబయి సెజ్‌, మంగుళారు, ముంద్రా తదితర
ప్రాంతాల ఉద్యమాలను తాకింది. తమ హక్కులకై ఉవ్వెత్తున లేచిన మత్స్యకారులు తమపై దోపి ఏ రూపాన ఉన్నా సునామీలా ముంచేస్తారని
చరిత్ర చెప్పిన సత్యం. పోటెత్తిన సంద్రపు అలలపై వెండి జలతారులా మెరిసే వెన్నెల్లాగా వారి స్పూùర్తి, చైతన్యాన్ని మన ఆలోచన ఆచరణలో
భాగం చేసుకొని వారి పోరాటానికి బాసటగా ఉంటామని బాస చేస్తూ మనం కూడ వారితో కలిసి నడుద్దాం.!
(సాంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు నాయుడు వెంకటేశ్వర రావు సహకారంతో...)

No comments:

Post a Comment

Text