బుజ్ బుజా పోరాటాల భూమిక
బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లోని రెండు
గ్రామాల ప్రజలు చేస్తున్న ఆ పోరాట స్వభావాన్ని
అధ్యయనం చేసి ఆ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు హేమా వెంకట్రావ్
2005 తర్వాత సెజ్‌లు, థంర్మల్ పవర్‌ప్లాంట్లు పుట్టుకొచ్చిన
విధానం చూస్తే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న
చందాన ఏ రాష్ట్రం ఏగినా అదే వనరుల దోపి, దాని చుట్టూ వ్యథంల
కథంల సమాహారమే ఆయా ఉద్యమ ప్రాంతాల వారు తమ అవగాహన
చైతన్యాన్ని అనుసరించి వివిధ దశలలో వివిధ పోరాట రూపాల్ని
ఎంచుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లా, బుజ్ బుజా
డొకారియా అనే రెండు గ్రామాల్లోని ప్రజలు వెల్స్‌పర్ బహుళజాతి
కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాట రూపాలు మన పోరాటాల
కంటె విభిన్నంగా ఉండి ఆలోచింపచేస్తాయి.
2013 న్ నుంచి అక్టోబరు వరకు ఉద్యమకారుల నిరసనను
ఎలక్ట్రానిక్ మీడియా అతిసాదాగానే ప్రసారం చేసింది. వెల్స్‌పర్
కంపెనీలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో కంపెనీ
సమాచారం దళారుల పాత్ర, భూ వివరాల కంటె కూడ ప్రజలు
తిరుగబడిన తీరు మేధావులనే కాదు మామూలు పళిలిరులను సైతం
ఆకట్టుకొని మద్దతు కూడగట్టేలా చేసింది. అక్కడే ఉన్న సహచరుడు
వెంకట్రావ్ ఇచ్చిన సమాచారం, వనరుల దోపి ికి వ్యతిరేకంగా
సాగుతున్న ఉద్యమాలతో ఉన్న అనుబంధం అధ్యయనం కోసం ఉద్యమ
ప్రాంతాలకి తోడ్కెల్లింది.
ఈ పర్యటనలో వారు ఎంచుకున్న ప్రతిఘటనా పోరాట రూపాల
గురించి అధ్యయనం చేయదలచాం. వివిధ బహుళజాతి సంస్థలపై
జరుగుతున్న పోరాటాలలో కాకినాడ నుండి నందిగ్రాం, కూడంకుళంల
వరకు ఉద్యమాలు పలు పోరాట రూపాల్ని పరిచయం చేశాయి. వాటికి
కొంత భిన్నంగా 'చితి' పోరాటం కింద చెప్పబడిన పితృస్వామ్య
భావజాలం నుంచి పుట్టుకొచ్చిన ప్రక్రియ దేశ వ్యాప్తంగా కాకపోయినా
ఆ రాష్ట్ర వ్యాప్తంగా (మధ్యప్రదేశ్) కదిలించింది. తెలుగు రాష్ట్రాలలోలాగా
హక్కుల పోరు వాతావరణం కూడ లేదు కాబట్టి ప్రజలు కూడ వత్తికి
సరెండర్ అవుతారనే అవకాశాలు ఎక్కువనే అంచనాలతోనే
బయలుదేరాం. ఈ ఆత్మాహుతి పోరాట రూపం తెలంగాణ ఉద్యమంలో
సుపరిచితమే. కాకపోతే బుజు బుజా డొకారియా ప్రజలు ఏ మేరకు
ఈ పోరాట రూపాలతో సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలను
అడ్డుకోగలరు అన్న ఆసక్తి ఉత్తేజపరిచింది.
ముందస్తుగా ఒక దృక్పథంం ప్రాతిపదికగా ఉన్నప్పటికీ ప్రజా
పోరాటాల అధ్యయనంలో మా దృక్పథాన్ని మరింత పదునుపెడుతుందనే
ఆశాభావం కార్యోన్ముఖులను చేసింది. తెలుగు రాష్ట్రాల వనరుల దోపిు
వ్యతిరేక పోరాటాలలో మా అవగాహనను బలపరిచే అంశాలను,
తిరస్కరించే అంశాలను క్రోడుకరించవలసిన సందర్భంగా తీసుకోవడం
జరిగింది. స్వీయ మానసిక దృక్పథంం నుండి ఉద్యమాల్ని నిరపేక్షంగా
చూడలనే స్ప ృహతో బుజ్ బుజా డొకారియా ఉద్యమం ముంగిట
మమ్మల్ని నిలిపింది. వీటిని అర్థం చేసుకునే క్రమంలో స్థానిక పురోగమన
శక్తుల కృషి, పోరాటంలో వారి మద్దతు, ఇతర ఉద్యమాల సంఫీుభావం
కోరంలో వారు తీసుకుంటున్న చొరవ, చర్యలు కార్యకర్తలుగా ఎంత
వరకు ఉపయోగప తాయో అధ్యయనం చేయాలని, అవసరమైతే
సహకారాన్ని అందజేయాలనే సదుద్దేశంతో బయలుదేరాం.
ఉద్యమ ప్రాంత వివరాల్లోకి వస్తే హైదరాబాద్‌లో పాట్నా ఎక్స్‌ప్రెస్
ఎక్కి 20 గంటలు ప్రయాణం చేస్తే కట్ని అనే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు
చేరుకుంటాం. ఇక్కడ నుంచి వారణాసికి 10 గంటలు ప్రయాణం.
రైల్వేస్టేషన్ నుంచి సుమారు గంట రోడ్డు ప్రయాణం చేస్తే బుజ్ బుజా
డొకారియా గ్రామాలు వస్తాయి. ఈ కట్ని అనే ప్రదేశం దేశానికి
నాభిస్థానంలో ఉంది. పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం
దేశంలోని 250 వెనుకబడ్డ జిల్లాలో ఇది ఒకటి. సుమారు 70 శాతం
ఆదివాసులు నివసించే ప్రాంతం. మిగతా వారు వివిధ కులవృత్తులు
చేసుకుంటున్న కులాలు. అత్యల్ప సంఖ్యలో ఆధిపత్య కులాలకు చెందిన
బ్రాహ్మణులు, బనియా, ఠాగూర్లు ఉన్నారు. రెండు గ్రామాల్లో సుమారు
5000 జనాభా, 3000 ఓటర్లు ఉంటారు. మొత్తం భూమి 600 ఎకరాలు
ఉండగా 5వ వంతు భూమి రైతులది. తక్కినది ప్రభుత్వ భూమి. భూమితో
పాటు సుమారు 6000 పశుసంపద గ్రామ సొంతం.
కూడ నేరంగా పరిగణించమని చేసిన సిఫారసుని అంగీకరించ లేదు.
గత నెల, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించమని దాఖలైన
పిటిషన్‌ని సుప్రీం కోర్టు సాంకేతిక కారణాల మీద తోసిపుచ్చింది.
సుప్రీంకోర్టులో ప్రగతిశీల తీర్పులు రావడమనేది లాటరి
లాంటిదన్నది కాదు ఇక్కడ సమస్య, నా ఉద్దేశంలో సమస్య అసలు
రాజ్యాంగంలోనే ఉంది. పెరుగుతున్నప్పుడు నేను అనుకొన్నట్టుగా అది
ప్రగతిశీల పత్రం కాదు, రకరకాల సర్దుబాట్లతో ఏర్పడిన, మధ్యస్తమైన
నాణ్యత గల పత్రం. దానిలోని ఉత్తమ నిబంధనలు కూడ సవరణల
మూలాన పలుచనైపోయాయి. వ్యక్తి హక్కులను తగ్గించి, రాజ్యాధికారాన్ని
విపరీతంగా పెంచిన మొదటి సవరణ అన్నిటికన్నా చ్డెది. ఈ మొదటి
సవరణ ముసాయిదా తయారు చేసి, పార్లమెంటులో ప్రవేశ పెట్టినది
నెప్ర˙, అంబేద్కర్. కాబట్టి, వాళ్ల మంచి పనిని తరువాతి వాళ్లు
చెగొట్టారని నిందించ లేము.
మోర్జాపూర్ నుంచి సింగ్‌రోలి మధ్య రేవా, సత్నా, కట్ని, ఉమారియా,
షాడోల్, అనూప్‌పూర్ జిల్లాలను కలుపుతూ కోస్టల్ ఇండస్ట్రీయల్
కారిడర్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. టైగర్ జోన్‌కు ప్రసిద్ధి గాంచిన
బాంధవాఘడ్ ఇక్కడు నుంచి కేవలం 2.2 కిలో మీటర్ల దూరంలోనే
ఉంది. నిజానికి బఫర్‌జోన్ 10 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి
ప్రాజెక్టులు తీసుకోకూడదు. ఇంతటి ప్రజాగ్రహానికి గురైన థంర్మల్ విద్యుత్
ప్రాజెక్టు వాల్స్‌పన్ సినిటెక్స్ ప్రైవేట్ లిమిటె ్ (కేంద్ర మంత్రి
వెంకయ్యనాయుడు బినామి కంపెనీగా సమాచారం) 1980 మెగవాట్లతో
తలపెట్టదలిచింది. గతంలో ఈ కంపెనీ ఒకప్పటి మన ఉమ్మడి రాష్ట్రంలో
కూడ 500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు ఒప్పందం
కుదుర్చుకుంది. (వెల్స్‌పర్ ఎనర్జీ - వికిపియా). ఈ కంపెనీకి రాజస్థాన్,
గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో పవర్ ప్రాజెక్టులను నిర్మించి
ప్రజలను నిర్వాసితులను చేసిన చరిత్ర గత శతాబ్దం నుండి ఉంది.
అప్పటి స్థానిక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ (ఇప్పుడు బిజెపిలోకి మారాడు)
వెల్స్‌పర్ కంపెనీకి బంగారుబాట వేసి సహజంగానే దోపి ిలో
భాగమయ్యాడు.
వలసవాద ప్రభుత్వం తయారు చేసిన భూసేకరణ చట్టం 1894
ప్రకారం మే 2011న 593.44 ఎకరాలు వెల్స్‌పర్ కంపెనీ కోసం
నోటిఫికేషన్ ఇచ్చారు. సహజంగానే రైతుల గుండెల్లో ఆందోళన
మొదలైంది. నోటిఫికేషన్ కంటె ముందే బనియా, బ్రాహ్మణ కమ్యూనిటీి
దళారులు భూముల కోసం ప్రజల్ని మభ్య పరచనికి ప్రయత్నించారు.
అక్కడున్న ప్రజలు మాజీ సర్పంచ్, పాఠశాల టీచర్‌గా పనిచేసిన వారి
నాయకత్వంలో ఐక్య సంఘటన కట్టారు. ప్రభుత్వం గ్రామ సభ
నిర్వహించనికి ప్రజలు ప్రతిబంధకం కాగా జనాభాలోని చనిపోయిన
వారి పేర్లతో దొంగ ముద్రలు వేసుకున్నారు. షరా మామూలే ప్రజాభీష్టం
మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని రిపోర్టులు రాసుకున్నారు.
చట్టంలోని ముసుగులను ఆధారం చేసుకొని బలవంతంగా ప్రభుత్వ
అంచనాల ప్రకారం రైతుల పేరిట బ్యాంకుల్లో చెక్కులు వేశారు. (కాని
ఇప్పటి వరకు రైతులు అంగీకరించలేదు) ప్రభుత్వ కంపెనీ అధికారులు
భూమిని కొలవడనికి వస్తే మహిళలు తరిమికొట్టారు. పోలీసు బలగాలు
పంపినప్పుడు మహిళలు అగ్రభాగాన ఉన్న ఈ ఉద్యమంలో 'సోనుబాయి'
అనే మహిళ 'తమ భూముల్లోకి రావద్దని హెచ్చరిస్తూ కిరోసిన్ పోసుకొని
ఆత్మహత్య చేసుకుంది. కోపోద్రిక్తులైన ప్రజలు చితులు పేర్చుకొని భూమిని
బలవంతంగా లాక్కొంటే ఆ చితులకే ఆహుతి అవుతామని హెచ్చరికలు
ప్రభుత్వానికి జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజా
సమూహాలు ఉద్యమ ప్రాంతానికి వెళ్లి సంఫీుభావంతో ప్రాజెక్టుకు
వ్యతిరేకంగా నినదించారు. తిరుగుబాటు చర్యగా ప్రభుత్వ కుట్టు ట్రైనింగ్
సెంటరును ధ్వంసం చేశారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా
అన్నట్టు ప్రభుత్వం పోలీసుల్ని ఆయుధంగా వాడి 21 మందిని
బలితీసుకుంది. ప్రజల్ని భయ బ్రాంతులకు గురి చేశారు. దాదాపు
ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేయబడ్డయి. చావోరేవో
తేల్చుకోవాలనుకున్న ఉద్యమకారులు మరింత బలాన్ని పుంజుకొని
ఉద్యమాన్ని గ్రామం నుంచి కలెక్టరు ఆఫీసుకు తరలించారు. 2013
న్ నుంచి సెప్టెంబర్ 15 వరకు చితులు తామే పేర్చుకొని కలెక్టరు
ఆఫీసు ముందు సుమారు 100 రోజులుపైగా తమ ఉపాధిని కూడ
వదలిపెట్టి కుటుంబాలతో సహా ఉద్యమించారు. అయినా ప్రభుత్వం
నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బహుళజాతి కంపెనీలకు అమ్ముడు
పోగా మిగిలిన మీడియా వీరి పోరాటాల్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
అదే సెప్టెంబర్‌లో కాంగ్రెస్ కిసాన్‌సభ జరగవల్సి ఉండగా అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇస్తున్నట్టు నమ్మించి టెంటులను
ఎత్తి వేయించింది. అపనమ్మకంతో ప్రభుత్వానికి కొంత సమయాన్ని,
అవకాశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రజలు ఉద్యమాన్ని సలించారు.
కాని కొన్ని నెలల పాటు ఎదురు చూసిన ప్రజలకు ఎటువంటి
జవాబుదారీతనం ప్రభుత్వం నుంచి కనప లేదు. పైగా పోలీసు
బలగాలతో రాజ్యం అండతో కంపెనీ అధికారులు పొలాల్లోని చెట్లను
బుల్డోజర్ల సహాయంతో నరికివేసి మట్టి దిబ్బలుగా మార్చేశారు. ప్రభుత్వ
దాష్టికాన్ని చూసి విసిగి పోయిన ప్రజలు తమ నిరసనగా గ్రామాల్ని
వదిలేసి సామాన్లతో సహా వలస పోవడనికి తమ ఇళ్లను సైతం వదిలేసి
మూకుమ్మడిగా బయలుదేరినప్పుడు పోలీసు నిఘా వర్గాలు రైలును
మధ్యదారిలో అడ్డుకొని అటకాయించి గ్రామాలకి ప్రజల్ని తరలించారు.
అప్పటికే ఉపాధి కోల్పోయి, అప్పులపాలై బయట ప్రజాతంత్ర శక్తుల
నుంచి ఆశించినంత మద్దతు రాక పోవడంతో ప్రజలు కొంత గుపు
తీసుకోదలిచారు. ప్రభుత్వ సహాయంతో కంపెనీ భూముల చుట్టూ ప్రహారి
గోడ కట్టేసింది. దేవాలయ ప్రాంతాల్ని ఆక్రమించుకోదల్చితే ప్రజల
నుంచి తీవ్ర ప్రతిఘటన రాగా కాస్తంత భూమిని ఉద్యమాన్ని నిలవరించ
డనికి కేటాయించారు. అక్కడే ప్రజలు ప్రతి ఏటా ఉత్సవాల్ని
జరుపుకుంటారు.
తిరగబడ్డ ప్రజలపై అధికారుల మీద హత్య ప్రయత్నం, అనధికారం
గా ఇతరుల ఆస్తులలో ప్రవేశించం (భూమి ప్రజలదైనప్పటికి) దాడి
మొదలగు సెక్షన్లలో కేసులు బనాయించారు. ఇప్పటికే కోర్టుల చుట్టూ
తిరుగుతున్నారు. ఉద్యమ కారులు కూడ తమ అభ్యర్థనలను న్యాయ
వ్యవస్థ ముందు మొరపెట్టు కున్నారు. చనిపోయిన వారి జాబితాతో
గ్రామ సభలు నడిపారని, అసలు గ్రామసభ తీర్మానాలు చెల్లవని,
పంచాయితీరాజ్ చట్టానికి తిలోదకాలు ఇచ్చారని తమ భూములు తిరిగి
ఇచ్చేయాలని వే ుకున్నారు. స్పందించిన హైకోర్టు 'స్టేటస్-కో'
ప్రకటించింది. స్టేటస్-కో అంటే యథాతథంంగా ఉంచ ం అంటే
దిబ్బలుగా మార్చిన ప్రాంతాన్ని యథాతథంంగా ఉంచం. అంటే ప్రజల్ని
నిస్సహాయులుగా ఉండమే. బాలగోపాల్ మాటలు ఈ సందర్భంలో
గుర్తొస్తున్నాయి. 'న్యాయస్థానాల కంటె ప్రజా ఉద్యమాలే బలీయమైనవని,
కోర్టులు పాలక యంత్రాంగానికి కొమ్ముకాస్తాయి కాబట్టి ఆచితూచి
అంచనా వేయాలని' సెజ్ ఉద్యమ కారులకు సలహా ఇచ్చేవారు. ఇంక
తుదితీర్పు వెలువడలేదు కాబట్టి కంపెనీ తమ కార్యక్రమాలను మొదలు
పెట్టలేదు.
'ప్రకృతి అనేది ప్రజానీకానికి జీవనాధారం. సహజ వనరుల దోపి
గురించి మాట్లాుతున్నాం అంటే ప్రకృతి మీద ఆధారపి బతికే హక్కును
కూడ వారే తీసుకుపోతున్నారని అర్థం' అంటారు హక్కుల ఉద్యమ
నాయకుడు బాలగోపాల్ (రాజ్యం - సంక్షేమం) ఈ ప్రాతిపదికన జీవించే
హక్కును కాపాడుకోవడం కోసం, భూమి నుంచి పర్యావరణ కేవలం
సహజవనరుల నుంచి భ∫తికంగా నిర్వాసితులు కావడమే కాకుండ
జీవనశైలి నుంచి నిర్వాసితులు కావడం అనే జాగురుకతతో వివిధ
పోరాటరూపాలతో ఉద్యమకారులు ప్రాణాలను తెగించి పోరాడ ం
విశేషం.
ఒక అంచనా ప్రకారం ఆరు దశాబ్దాల మన అధికార మార్పిడి
చరిత్రలో ఆరు కోట్లకు పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈనాడు
పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం మతాన్ని మిలాఖతు చేసి పారిశ్రామీకరణ,
పట్టణీకరణ, మøలిక సళిలికర్యాలు అభివృద్ధి అనే నీతి మాటల్ని ప్రజల
ముందు పెట్టి మునపటి ప్రభుత్వాల కంటె సామ్రాజ్యవాద
గుత్తపెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ పరుస్తుంది. అవసరమైనచోట
'గ్రీన్‌హంట్'ను ప్రయోగిస్తుంది. మరి అప్పుడు ఉద్యమకారులకు అండగా
నిలిచే ప్రజాస్వామిక వాదులు, ఉద్యమాలకు తాత్వికతను అందించే
సెక్షన్ల పాత్ర ఏమిటి? అన్న ప్రశ్న రావచ్చు. ప్రజల మాటల్లోనే చెప్పాలంటే
'ఎంతో మంది వచ్చి పోతుంటారు. కాని ఈనాటికి అండగా నిలిచింది
ఎవరూ లేరు' అని వాపోయారు. ప్రశాంత్ భూషణ్, (సుప్రింకోర్టులో
ఉద్యమాలకు అండగా నిలిచే సీనియర్ న్యాయవాది), రాజ్‌గోపాలన్,
ఎక్తాపరిషత్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి వచ్చినా వారి ప్రభావం,
సహకారం ఉద్యమకారులకు ఆశించినంతగా దక్కలేదు. స్థానికంగా
సోషలిస్టుపార్టీ నాయకులు వచ్చినా ఎలక్షన్లలో ఓటర్లను ఆకట్టుకోవడనికి
ప్డపాట్లే కాని వేరు కాదు అని ప్రజల నమ్మకం. ఈ క్రమంలోనే
నాయకులు జైరాం రమేష్ (అప్పటి కేంద్రమంత్రి)ని కలిశారు. వాగ్దానాలు
వెల్లువ ప్రవహించింది కాని ఫలితం శాన్యం. స్థానిక మీడియా
పెట్టుబడిదార్ల కొమ్మే కాసింది.
ఒకింత ఊరట నిచ్చే విషయమేమిటంటే సోంపేట ఉద్యమంలా
సమాజంలో చైతన్యవంతులైన మేధావులు కొంత మంది ఈ ఉద్యమానికి
మద్దతునిస్తూ సహకరిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు అరవింద్ వర్మ,
స్వంతంగా కట్నీలో పాఠశాలను నడిపిస్తున్న నార్వాణి, తెలుగు నేల
నుంచి వెళ్లి అక్కడ స్థిరప్డ నార్ల కుటుంబం ఉన్నది. గమనించవలసిన
విషయం ఏమిటంటే తెలంగాణ, ఆంధ్రలో ఉన్న హక్కుల స్ప ృహ,
వాతావరణం మేము పర్యటించిన నాలుగు, ఐదు జిల్లాలో కూడ
కనపలేదు. బహుశా అక్కడ ఉన్న ఉద్యమ నేపథ్యంం వేరు కావడం
చేత అనుకుంటాను. రాజ్యాన్ని, ప్రస్తుత పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమాన్ని,
మార్గాన్ని వ్యతిరేకించే మøలిక ఉద్యమ నిర్మాణం. మేధావి వర్గం కొరత
మనకు ఈ ఉద్యమంలో స్పష్టంగానే కనిపిస్తుంది. అందుకే ఆర్థికవేత్తలు,
సామాజిక శాస్త్ర నిపుణుల, మానవ హక్కుల కార్యకర్తల పాత్ర మద్దతు
ఈ ఉద్యమాలకు లభించం లేదన్నది వాస్తవం.
భారతదేశంలో అభివృద్ధి కోసం ఎంచుకున్న పెట్టుబడిదారీ మార్గం
అశేష ప్రజానీకాన్ని తమ ఆర్థిక వ్యవస్థ నుంచి నిర్వాసితులను చేస్తుంది.
అలాగని కొత్తగా ఏర్పడబోతున్న ఆర్థికవ్యవస్థలో కూడ కలవలేక
పోతున్నారు. ఇలా ప్రజావ్యతిరేకంగా బలవంతంగా నెట్టబడ్డ సమూహాలు
రోజురోజుకు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. మందు
గుళికలుగా పెట్టుబడి దారీ విధానం బుజ్జగించనికి సరికొత్త విధానాలు
ఎలా ప్రవేశ పెడుతుందో, ప్రజా సమూహాలు అంతేధీటుగా తమ చైతన్య
స్థాయిలో వివిధ పోరాట రూపాలకు ఎంచుకుంటున్నారు. ఈ పోరాట
రూపాలు మొత్తంగా ఆపలేక పోవచ్చు. కాని అభివృద్ధి గమనాన్ని పాక్షికం
గానైనా అడ్డుకుంటాయి. డ. ముదునూరి భారతి వివరించినట్టు (2012
నవంబరు 11న హైదరాబాద్ లో జరిగిన ఆర్.ఎస్ దాని స్మారక
సదస్సులో సమర్పించిన పత్రం ప్రచురణ వీక్షణం జనవరి 13 దశాబ్ది
ప్రత్యేక సంచిక) అభివృద్ధిని కొత్తగా విభిన్నంగా పునర్మించి
పునరాలోచించి మిగులు మనుష్యులకు కొత్త వ్యవస్థలోకి ప్రదర్శమేళనం
చేసే క్రమాన్ని మొదలు పెట్టకుండ, నిర్వాసితులకు ప్రధాన పాత్ర
ఇవ్వకుండ, నిర్వాసితం అభివృద్ధి క్రమాలను ఐక్యం చేయకుండ సమాజ
పరివర్తన వాస్తవరూపం ధరించదు. అప్పటివరకు ప్రజలు
వ్యూహాత్మకంగా తమ లక్ష ్యసాధనకు వివిధ పోరాట రూపాలను
ఎంచుకుంటారు.
దేశంలో వివిధ రూపాల్లో సాగుతున్న ప్రతిఘటనా పోరాటలన్నిటిని
ఒకేగాటిన కట్టి వాటికి వ్యతిరేకంగా రాజ్యం నిర్భంధాన్ని ప్రవేశపెట్టదు.
ప్రజాస్వామ్యబద్దంగా జరుపుతున్నామని చెపుతున్న ధర్నాలను, పాద
యాత్రలను, వీటిని ప్రాణంతో సహ పణంగా పెట్టనికి సిద్ధప్డ ప్రజల
పోరాట పటిమను రాజ్యం అంచనా వేస్తుంది. అడవి బిడ్డలుగా
బతుకుతున్న వారి గురి ఎక్కడ పెట్టగలరోననే పాలకుల గుండెల్లో
గుబులు రేపింది. చితిమీద కూర్చోని భూమి కోసం బూడిద అవ్వడనికి
సిద్ధప్డ వారి సరికొత్త వ్యూహాన్ని సర్వశక్తులు వెచ్చించి అడ్డుకున్నారు.
వేలకు వేలుగా మిలటరీ పోలీసులను తరలించారు. మా భూమే కాదు
మా ఊర్లను కూడ ఏలుకోండి అని నిరసన తెలిపితే అడవి
అంటుకుంటుందేమోనన్న భయంతో ప్రజల్ని దారి మధ్యలో అడ్డుకొని
వెనక్కి తీసుకొచ్చి దింపారు. గ్రామంలో కొంత మందిని ఇన్‌ఫార్మర్లుగా
డబ్బులిచ్చి కొనుకున్నారు. బ్రిటిష్ వారి పద్ధతిలో 'విభజించు పాలించు'
అన్న ప్రాతిపదికన భూమి ఉన్న రైతులను, రైతు కూలీలను
విభజించ నికి ప్రయత్నాలు జరుపుతున్నారు. కాస్తోకూస్తో
మద్దతునిస్తున్న ప్రజాతంత్ర శక్తులను అడ్డుకోవడనికి అన్ని విధాల
ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అయినా సరే పట్టువిడువని భూమిపుత్రులు తమను తాము
సమ్మాళించు కుంటూ, విశ్లేషించుకుంటూ సమాయత్తమవుతున్నారు.
ప్రజలు ఎంచుకున్న పోరాట రూపాల్లో ఫ్యూడల్ భావజాలం ఉండొచ్చు.
గత అనేక ఏళ్లు ఉద్యమ శక్తులు పొరుగున ఉన్న చత్తీస్‌గ్‌లోనూ,
ఒడిశా, జారేండ్, పశ్చిమబెంగాల్ లో భారీ కార్పొరేషన్లను
నిలుపగలిగారు. కాని ఇక్కడ ప్రజా పోరాటాల అనుభవాన్ని సైద్ధాంతిక
దృక్పథాన్ని, రాజకీయ పదునును, నిశితంగా సమీక్షించే శక్తులు ఇక్కడ
లేకపోవడం ఒక లోపమే. అయినా ఒకసారి యుద్ధం మొదలైంది ఇది
ఇతర యుద్ధాల మాదిరిగానే విస్త ృతం అవుతుంది. దాని తర్కం, ఎత్తుగ
ప్రజలకు తెలుసు. ఈ యుద్ధం వారి జీవనసరళిలో భాగమైంది. కాబట్టి
వెనక్కి మళ్ల ం అనేది ఉండదు. ఇదే వారి జీవితాల్లో ఇప్పుడు
సాగుతుంది. తుపాకీలు, లాఠీలు యుద్ధక్షేత్రంలో వారి బలాబలాలు
తెలుసు. మరికొన్ని ప్రాణాలు పోతాయని తెలుసు. అవి ఎటువైపైనా
పోవచ్చని ప్రజల వాదన. పాలకులు సాగించే వ్యవస్థీకృత హింసకు,
ప్రజా ప్రతిఘటనకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడి ప్రజలకు,
మద్దతుదార్లకు స్పష్టమైన అవగాహనే ఉంది. వివిధ దేశ, విదేశీ ఏజెన్సీల
నుండి నిధులు పొందుతున్న స్వచ్ఛంద సంస్థల గోడ మీద పిల్లివాటం,
మోసపూరిత వ్యవహారాలు, రిపోర్టింగులతో డబ్బు తెచ్చుకొనే వారి
ఎత్తుగలను గ్రహించే వారి మద్దతును పోరాట నాయకత్వం కోరలేదు.
చత్తీస్‌గ ్‌కు పొరుగున ఉన్న ఈ ప్రాంతం మీద మావోయిస్టుల
ప్రభావంలేదు. వామపక్ష హక్కుల సంఘాల ప్రమేయం లేదు.
ప్రజలు పాలకుల అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా స్వాలంబన
మీద ఆధారప ి ప్రత్యామ్నాయ అభివృద్ధిని సాధించే ప్రయత్నంతో
ఉన్నందున ప్రభుత్వం అణిచివేతతో యుద్ధానికి దిగింది. పెట్టుబడి
తరుఫున ప్రజలపై రాజ్యం యుద్ధానికి దిగుతున్న సందర్భం.వలసవాద
పాలనలో కాకుండ ముడి సరుకులను తరలించుకు
పోవడమేగాక మన అవసరాలను అదనుగా చూపించి పరిశ్రమలను
స్థాపించి అదనపు విలువను దోచుకోవడనికి ముమ్మర ప్రయత్నాలు
జరుగుతున్నాయి. దానికి జాతీయత, హిందూత్వ అనే ముసుగుని ధరించి
సంపదంతా ఒకచోట పోగుచేసి పళ్లెంలో పెట్టి సామ్రాజ్యవాద
పెట్టుబడిదారీ వర్గానికి అప్పనంగా అందించనికి అభివృద్ధి పేరిట
గారు చేసే మోడుి వచ్చేసాడిక.
గత ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బిజెపి అధికారాన్ని
హస్తగతం చేసుకుంది. వనరుల దోపిలో దళారులుగా మారనికి
ఏ పార్టీ అయినా ఒకటే. అవకాశాన్ని బట్టి పార్టీలు మారే క్రమంలో
అప్పటి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంజయ్‌ుపాఠక్ బిజెపి గాలివాటం చూసి
ఎన్నికల ముందే ఆ ఆపార్టీలోకి దూకేశాడు. అప్పటి వరకు కాంగ్రెసు
తరపున సెక్యులరిజం గురించి మాట్లా ిన ఎంఎల్‌ఎ, ఇప్పుడు
హిందూత్వం దేశాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకొస్తుందో, హిందూ ప్రజల
మనోభావాలకు మార్గదర్శ కత్వాన్ని ఎలా ఇస్తాదో ప్రకటిస్తున్నాడు. అదే
పోరాట ప్రాంతంలో హిందూ గుడులకు గజం కోసం ప్రజలతో
(హిందువుల) సహకరించ ు. ప్రజలే పోరాడి గుడులున్న భూమిని
ఆక్రమించుకొని యాగభూమిగా మార్చుకున్నారు. ప్రతి ఏటా గత రెండు
సంవత్సరాలుగా జనవరిలో యాగాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ సర్పంచ్
లెక్కల ప్రకారం ఈ సంవత్సరం 8 లక్షలు చందా వసూలు చేసి
ఖర్చుపెట్టారు. ఇదీ ఒక ఎత్తుగ గానే ప్రజలు చెప్పారు. ఇలాంటి
ఎత్తుగలు, నిరసన రూపాలు శత్రువుని తిప్పిగొట్టనికి అవసరమా?
అవి ప్రజల్ని సంఘటిత పరుస్తాయా? అన్నది ప్రశ్న.
ఈ ప్రతిఘటనా పోరాట రూపాలు ఫ్యూడల్ పితృస్వామిక
భావజాలానికి ప్రతీకలుగా కన్పిస్తాయి. నిజానికి 'చితి' అన్నది హిందూ
పితృస్వామిక భావ జాలానికి ప్రతీక. స్త్రీని స్వంత ఆస్తిగా వ్యవహరించిన
దశలో మొన్న 80ల వరకు కొన్ని చోట్ల ఆచరింపబడిరది. తమని
తాము ఆహుతి చేసుకుంటామనే హెచ్చరికతో కూడ నిరసన రూపాన్ని
ఒక పోరాట స్పూర్తిగా ఎత్తిపట్టనికి ఇది అడ్డంకి కాకపోయినా మన
ఆలోచనలు ఆ వైపుకు నెట్టివేస్తాయి. అలాగే ఊర్లను ఒక నిరసన
ప్రకియగా వదిలి వేయడం ప్రతిఘటనా రూపంగా చేయోచ్చా లేదా
అన్నది మనకు ప్రశ్న రావచ్చు. పోరాటంలో వివిధ రూపాలను
ఎంచుకోవడం అన్నది ఉద్యమకారుల చైతన్యం, స్ప ృహ, స్థానిక
అవసరాలు, అనుభవం, తాత్వికత మీద ఆధారపి ఉంటుంది. వాటికి
సరైన తాత్వికత, నిర్దేశన, పోరాటాలతో పాటు పీనలేని సమాజాన్ని
కోరుకునే ప్రతి మేధావి, ప్రజా సంఘాల, పార్టీల బాధ్యత.
ఏది ఏమైనప్పటికి దేశంలోని వైవిధ్యాలను ఆలంబన చేసుకొని
పెట్టుబడి వర్గం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రూపాల్లో ఎంచుకున్న ఈ
దోపి ి స్వభావాల గుర్తించి ప్రత్యామ్యాయ పోరాట రూపాలను
పోరాటస్పూùర్తితో ఆలోచించాలి. ఇది మొత్తంగా పెట్టుబడికి వ్యతిరేకంగా
సాగుతున్న జీవన్మరణ పోరాటం. దేశంలో పెట్టుబడి సృష్టిస్తున్న
విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఉద్యమం నుంచి మనం
నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆ ఉద్యమ స్పూùర్తిని ఎత్తిపట్టే
ప్రత్యామ్నాయ పోరాట రూపాలను, నమూనాలను ఆవిష్కరించవలసి
ఉంది.
No comments:
Post a Comment