మైనింగ్ మాఫియాపై చింతలూరు దళితుల పోరాటం
June 2014 veekshanam
పచ్చని ప్రకృతి ఒడిలో జన సమూహాల మధ్యే ఒక మైనింగ్ బ్లాస్ట్ పేలవచ్చు. మన కాళ్ల కింద నేల పాతాళంలోకి వెళ్లవచ్చు. సహజ
వనరుల సముద్రతీరాన్నే మింగేయొచ్చు. సామ్రాజ్యవాద దేశాల బహుళజాతి కంపెనీల కుట్రలు అనేకం. ప్రజల నెత్తుటితో, చెమటతో, ఈ
నేల తుస్తోంది. జీవనం కోసం ప్రజలు అల్లాుతూనే ఉన్నారు. అభివృద్ధి భ్రాంతి కల్పించి దళారీ పాలకవర్గాలు మరింతగా దోపి
చేస్తున్నారు. వర్గచైతన్యం ఉన్నచోట ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. వారికి మద్దతు ప్రకటించమే కాదు వారితో మమేకం కావాల్సిన అవసరాన్ని
గుర్తిస్తూ ఈ రిపోర్టు.
తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు చేబ్రోలు దగ్గర గిరిజన ప్రాంతం నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. చింతలూరు గ్రామంలో అక్రమ మైనింగ్
తవ్వకాలు జరుగుతున్నాయని, దళితుల భూమి కబ్జా అవుతుందని, సెజ్ ప్రాంతంలో లాగానే ఇక్కడ కూడ కంపెనీలు తమ సహజ
వనరులను కొల్లగొడుతున్నారని దాని సారాంశం. నిజానికి అది ఒక సందేశంలాగా అనిపించలేదు. ఒక ఆదేశమే అది. బహుశా కాకినాడ
సెజ్ పోరాటాలతో మాకు ఉన్న అనుబంధమే కారణం అనుకుంటాను.
జనవరి 29-31 తేదీల్లో హైదరాబాద్, కాకినాడ, కోనసీమ నుంచి కొంతమంది లాయర్లు, సామాజిక కార్యకర్తలు కలిసి చేబ్రోలు
చేరుకున్నాం. దారి పొడుగునా గోదావరి జిల్లాల్లో సెజ్, కోస్టల్ కారిడర్, థంర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, పోర్టులు, హోప్ ఐలాండ్, కొల్లేరు
ఆక్రమణ లకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలను చర్చించాం. అన్ని కులాల ధనిక, మధ్యతరగతి, పేదరైతులు కలిసి పోరాటాల్ని
కొనసాగిస్తున్నారు. చింతలూరు మైనింగ్‌పై, ప్రత్యేకంగా దళితులు జరుపుతున్న పోరాటం గురించి వివరంగా తెలుసుకోవాలనే అక్కడికి
వెళ్లాం. ఎందుకంటే అధికార అండదండలతో కొనసాగే అక్రమ మైనింగ్ యాజమాన్యంతో ఒంటరిగా దళితులు తలపం అంటే సాహసమే.
కొంతమంది స్థానిక దళిత నాయకులు కలిశారు. ఒక సెక్షన్ ప్రజలను సంఘటితపర్చడనికి ప్రయత్నిస్తున్న ఒక నాయకుడు మాత్రం
కలువలేదు. అక్కడున్న సిపిఐ(ఎంఎల్) కార్యకర్తలు కొన్ని వివరాలు ఇచ్చారు. మైనింగ్ కొండ మీదకు అన్నివర్గాల కార్యకర్తలు లేకుండ
వెళ్లలేము కాబట్టి కార్యక్రమాన్ని మరునాటికి వాయిదా వేసుకున్నాం.
దారి మధ్యలో కొంతమంది పాత్రికేయ మిత్రులు కలిశారు. వాళ్లు చెప్పిన విషయాలు, నాయకులు చెప్పిన వాటికి భిన్నంగానే ఉన్నాయి.
మొత్తంగా వ్యవహారమంతా కొంత గందరగోళంగానే అనిపించింది. అయినా సరే ఎవరు సహకరించకపోయినా కనీసం ప్రజలను కలిసి
మాట్లాి వచ్చేయాలనే నిర్ణయానికి వచ్చాం. నాయకులు కొండ చరియ ప్రాంతానికి రావడనికి సిద్ధప్డరు. పత్తిపాడు మండలం చేబ్రోలు
నుంచి సుమారు నలభై నిమిషాలు గిరిజన ప్రాంతం గుండ ప్రయాణిస్తే చింతలూరు వచ్చింది.
ఆ పచ్చటి ప్రాంతం గుండ వెళుతుంటే ప్రకృతిని ప్రేమించి సేదతీరే మనుషుల గుడరాల మధ్య 'అడవి తల్లికి దండలు' అనే గద్దర్ పాట
జ్ఞప్తికి రాకుండ ఉండదు. అందరిని పలకరిస్తూ ఊరు మొదట్లో నున్న గుడి చావిట్లో కూర్చున్నాం. ప్రతి ఒక్కరి కళ్లలో అనుమానపు చూపుల
వలన చాలా ఇబ్బంది ప్డం. మాతో ఉన్న నాయకులు మమ్మల్ని పరిచయం చేయడనికి ప్రయత్నం చేస్తన్నారు. 'ఆ' 'వూ' అంటున్నారు తప్ప
ఎలాంటి సమాధానం వారి నుంచి లేదు. అప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు 'అసలు మీరు ఎవరూ, ఎందుకు వచ్చారు, ఏమిటి అవసరం' అని
నిలదీశాడు.
అడివంటుకుంటే రాత్రిపూట కనపే ఎర్రని వెలుగుజీర అతని కళ్లలో కనబడింది. అంతేకాదు దళారీలు అయితే దగ్ధమై పోతారు అన్న
భావం కనిపించింది. మా గురించి వివరాలు చెప్పాం. నమ్మగలిగితేనే మాట్లామని, ఉద్యమానికి మద్దతు తెలియచేయడనికే వచ్చామని
చెప్పాం. అతని ఎర్రజీరల్లో దగాప్డ ముందు జాగ్రత్తలు ఉన్నాయి. నిజనిర్ధారణ, మద్దతు సహాయం పేరిట ఎన్నో గ్రూపులు వస్తాయి. అవే
గ్రూపులు (చాలా వరకు అతి అభిప్రాయం ప్రకారం) మైనింగ్ కంపెనీల నుండి డబ్బులు (దొబ్బేసి) తీసుకొని వెళ్లిపోతుంటారు. మా
సంభాషణ మధ్యలోనే అక్కడికి వచ్చిన ఒక టీచరు నన్ను గుర్తుపట్టారు. మీరు కాకినాడ, సెజ్, కోస్టల్ కారిడర్ పోరాటాలలో ఉన్నారు కదా
అని, తెలుసని చెప్పాడు. మా పాత్రని ప్రజలకు తెలియచేశాడు. ఇక మేము దోపిుదారుల పక్షం కాదని తెలిసిన తరువాత ప్రజలు ఎంతో
ఉద్వేగంతో మాతో మాట్లారు. ఆ కళ్లలో రౌద్రం మాయమై మా మనుషులన్న ఆప్యాయత కనిపించింది. పచ్చటి అడవే కాదు, భీకర
రూపంలో ఉన్న పోరాట పటిమ వాళ్ల కళ్లల్లో చూశాం. ఇక వాళ్లే మా మార్గదర్శకులుగా మమ్మల్ని కొండకు నడిపించారు. కంపెనీ వాళ్లతో
ఎలా మాట్లాలో, కాదంటే ఎలా చొచ్చుకుపోవాలో ఆరితేరిన యోధుల్లా బోధించారు.
మైనింగ్ కొండ చుట్టూ దుర్బేధ్యమైన గోడలు లేవు. ప్రకృతి విలయానికి ముందు ఉండే ప్రశాంతత తాండవిస్తుంది. ఏ హడవుడి లేదు,
వరుసగా బారులు ్వన లారీలు, పదుల సంఖ్యలో ఉన్న కార్మికులు ఆ ఎర్రటి దిబ్బల ముందు మమ్మల్ని ఆకర్షించలేదు. మా మనసులనే
తవ్వినట్లు ఒక భావన మాలో కదలాడిరది. అటుపక్క పచ్చటి ప్రాంతం, ఇటుపక్క ఎర్రటి ఎడరిలా మారిన ప్రాంతం. ప్రజలు చెప్పినట్లే
మమ్మల్ని కంపెనీవాళ్లు వాళ్ల సామ్రాజ్యంలోనికి రానివ్వలేదు. వాళ్లు గ్రామస్తులను గుర్తుపట్టారు. మేనేజరు సీటులో లేు. కూలీలు, సూపర్‌వైజర్లు
ఆ ఊరి వాళ్లే. వారు కంపెనీ ఉద్యోగులుగా మమ్మల్ని ఎదుర్కొంటున్నారు తప్ప నిజానికి మమ్మల్ని ఆపాలన్న సీరియస్‌నెస్ వాళ్లలో లేదు.
ఎందుకంటే ఉపాధి కోసం కూలీలుగా చేరారే తప్ప గ్రామస్తులుగా కంపెనీకి వ్యతిరేకులే. విషయం తెలిసి మేనేజరు వచ్చాక అతు ససేమిరా
కాదంటే గ్రామస్తులు తిరగబడ్డరు. మేము మానవహక్కుల సంఘాల నుండి వచ్చామని లేదంటే హైకోర్టు నుంచి పర్మీషన్ తీసుకొని వస్తామని
హెచ్చరించాం. గ్రామస్తుల రౌద్ర రూపం, మా హెచ్చరికలతో యాజమాన్యం కొండ మీదకు కాదు కాని, దిబ్బల మీదకి వెళ్లనికి సరేనన్నది.
వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చింతలూరు, అటు మెట్ట ప్రాంతంగా లేదా షెడ్యూల్డ్ ప్రాంతంగా
ప్రకటించలేదు. అక్కడ దళితులు అధికశాతం. సంవత్సరంలో ఆరు నెలల కాలం ఇతర జిల్లాలకు వలసపోతారు. వారి మాటల్లోనే చెప్పాలంటే
వలసపక్షులు. వలస జీవితంలో పశువుల పాకలలో, చెట్టు కింద, రోడ్డు పక్కల ఉంటూ కూలీనాలీ పనిచేసుకుంటూ సరైన తిండు, నీరూ లేక,
కొద్దిపాటి సంపాదించిన డబ్బుతో తిరిగి ఊరు చేరుతారు. సంపాదించిన కాస్త డబ్బు అప్పటివరకు చేసిన అప్పులకు, అనారోగ్యానికి
సరిపోతుంది. మళ్లీ అప్పులు, అప్పులు తీర్చడనికి మళ్లీ వలస ఇలా ఎప్పుడూ ఒక విష వలయంలో చిక్కుకొనే ఉంటారు. ఈ వలసల
జీవితంలో కనీస ప్రభుత్వ పథంకాలైన తల్లీ బిడ్డల సంరక్షణ, గర్భిణీ స్త్రీలకు మందులు, పల్స్ పోలియో, రేషన్, విద్యా మøలిక అవసరాలు,
సదుపాయాలు పొందలేకపోతారు. వారి పిల్లలు కూడ బాల కార్మికుల చట్టంలోకి లాగబడతారు.
గత కొన్ని దశాబ్దాలుగా చింతలూరు దళితులకు పెద్ద అండ రెవెన్యూ పోరంబోకు కొండ. అక్కడి నుంచి వంట చెరకు, ఇంటికి కావలసిన
కొంత కలప, పశువుల మేత సమకూర్చుకుంటారు. పశుపక్ష్యాదులకు, వన్యప్రాణులకు ఆ కొండే ఓ పెద్ద దిక్కు. వర్షాధారానికి ఈ కొండే. ఈ
22
కొండ ఐదువందల ఎకరాలనీ, ఏడువందల ముప్పైù ఎకరాలని, కాదు కొండ నానుకొని ఉన్న అటవీ భూమితో సహా రెండు వేల మూడు
వందల పైచిలుకు ఎకరాల భూమి అని రిపోర్టులు ఉన్నాయి. 1996-97లో ప్రభుత్వం ఈ భూమిని వాటర్‌షెడ్ - భూమి అభివృద్ధి పథంకం
కింద దళిత నిరుపేద బడుగు బలహీన వర్గాలకు స్వయంగా సదరు కొండపైన (మే 4, 1997) బహిరంగసభ పెట్టి 217 కుటుంబా లకు
238 ఎకరాలు ఇచ్చారు. భూమితో పాటు భూమి బాగు చేసుకోవడనికి పనిముట్లు, మామిడి, జీడిమామిడి, టేకు, యూకలిఫ్టస్, జామ
మొదలగు చెట్లు సోషల్ ఫారెస్ట్ ద్వారా ఇప్పించి, జీవనోపాధి కల్పించారు. ఈ మొత్తం భూమిని పొందనికి దళితులే నాయకత్వం వహించారు.
ఒక దశాబ్దకాలం కొండలని బాగు చేసుకుంటూ పోడు వ్యవసాయం చేసుకుంటున్న దళితుల భూమిపై పెట్టుబడి వర్గాల కన్నుపింది.
కుట్రలు మొదలయ్యాయి. విఫలమైనా మళ్లీమళ్లీ ప్రయత్నించారు. అప్పుడు మైన్స్ డి.ఎం.జి డి. రాజగోపాల్, ఇండస్ట్రీస్ కామర్స్ సెక్రటరీ వై.
శ్రీలక్షి ్మ మైనింగ్ మాఫియాకు అనుమతిలిచ్చారు. ఈ ఆఫీసర్ల అక్రమాల గురించి తెలియని తెలుగు పళిలిరుడు లేు. మైనింగ్ లీజు కోసం
గ్రామ పంచాయితీ తీర్మానం లేదు. నియమ నిబంధనల ప్రాతిపదిక లేదు. చటాన్ని మభ్యపెట్టి అధికార యంత్రాంగాన్ని డబ్బుతో వశపరుచుకొని
2006లో మూడు కంపెనీలకు 200 ఎకరాల విస్తీర్ణంలో ఆరు నెలల్లో అనుమతులిచ్చారు. నిరుపేదలు పెంచుకున్న జీడిమామిడి తోటలను
పెకిలించి దౌర్జన్యంగా అంగబలంతో, ధనబలంతో సహజ వనరులు దోచుకోవడం ప్రారంభించారు.
ఈ అన్యాయం, అవినీతిపై దళితులు 2007 నుండి రెవెన్యూ, ఫారెస్ట్, మైన్స్ అధికారులతోనూ, లోకాయుక్త, హెచ్.ఆర్.సి హైకోర్టులకు
వందలాది రిపోర్టులు తయారుచేసి న్యాయం చేయమని విన్నవించుకు న్నారు. అక్రమ తవ్వకాలపై 2 న్ 2013న కేంద్ర గనుల పరిరక్షణ
కమిటీ సభ్యులు ఎంపిలు వి.హనుమంతరావు టి. రత్నాబాయి, మల్లు భట్టివిక్రమార్క, జివి హర్షకుమార్ బృందం పర్యటించి దళిత భూములు,
ఖనిజ సంపదపై జరుగుతున్న దోపిు గురించి ఆరా తీశారు. పర్యావరణంపై, వాటి అనుమతులపై ప్రశ్నించగా మైనింగ్ కంపెనీల యాజమాన్యం
మహేశ్వరి మినరల్స్ సత్తి లక్ష ్మణరెడ్డి, టి. గంగాధరరెడ్డి నోరు వెళ్లబెట్టారు. అనుమతి పత్రాలు చూపేవరకు మైనింగ్ కొనసాగ కూడదని
అధికారులు మøఖికంగా చెప్పారే తప్ప రాత పూర్వకంగా ఏమీలేదు. అంటిముట్ట నట్లుగా వారు పాలకవర్గాల ప్రతినిధులుగానే వ్యవహరించారేకాని
ప్రజానీకానికి, ఈ పర్యటనల వలన ఒరిగింది ఏమీలేదు.
ఉన్న ఉపాధి కోల్పోవడంతో ఎదురు తిరిగిన ప్రతి గ్రామస్తుని మీద కంపెనీ యాజమాన్యం దాడికి దిగింది. ఏ సెజ్, ఏ మైనింగ్ చూసినా
ఏమున్నది? అక్రమ కేసులు బెదిరింపులు ప్రాణభయంతో సర్వం కోల్పోయి బతకం తప్ప! అధికార యంత్రాంగం కక్ష గట్టినట్లు 'మీకిచ్చిన
భూములు పోరంబోకు అసైన్డ్ అయినంత మాత్రాన మీ దళితులకు హక్కు అవుతుందా? మా ఇష్టం! మళ్లీ మేం ఎవరికైనా ఇస్తాం. మీకిచ్చిన
ఎంజాయ్‌ుమెంట్ పత్రం సంవత్సరర లేదా రెండు సంవత్సరాలు మాత్రమే చెల్లుతుంద'ని తహసీల్దార్, ఆర్.డి.ఒ కలెక్టర్ మైన్స్ అధికారులు
బెదిరిస్తున్నారు. తుప్ప, మోడు, రాళ్లను ఏరేసి భూమిని అభివృద్ధి చేసి పెంచుకున్న తోటల్లో బాంబు బ్లాస్టింగ్ ప్రొక్లెయిన్స్ ద్వారా సుమారు 50
అడుగుల లోతు గొయ్యలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రజలు చేసుకున్న కష్టానికి, నమ్ముకున్న భూమిని, ప్రాజెక్టులు తీసేసుకున్న
వనరులకు నష్ట పరిహారాన్నీ ఉపాధిని మøలిక సదుపాయలను కల్పించాలన్న నియమ నిబంధనలు ప్రభుత్వానికి తెలియనవి కాదు. అంతే
కాకుండ పెట్టుబడిదారులు తమకిచ్చిన భూమితో పాటు దళితుల హక్కులు కలిగిన భూమిని తవ్విపారేస్తున్నారు. పేపరు మీద భూమి
హద్దులు ఒకటి చూపిస్తూ ఆచరణలో హద్దులు దాటి సరిహద్దులు చెరిపివేసి తమకిష్టము వచ్చిన రీతిలో దోపి చేస్తున్నారు. దళితుల లెక్కల
ప్రకారం 1997-98 లో ప్రభుత్వం ద్వారా ఇచ్చిన భూమిలో సుమారుగా, పుట్టారామక్రిష్ణా, మహేశ్వరీ మినరల్స్ వారు 60 ఎకరాలలో నలభై
ఏడు ఎకరాల భూమి, సత్తి లక్ష ్మణ్‌రెడ్డి 108.15 ఎకరాలలో 48 ఎకరాల భూమి సుమారుగా 97 ఎకరాల దళితుల భూములలో అక్రమ
మైనింగ్ జరుగుతుంది. అసలు మైనింగ్ లీజు మొత్తం అక్రమంగా తీసుకుంటే లీజు పేరిట హద్దులు దాటి దళితుల భూములలోకి చొచ్చుకొని
దిబ్బలుగా మార్చడం మరో మోసం.
మైనింగ్ మాఫియాకు బుద్ధి చెప్పడం కోసం, తమ భూములను కాపాడుకోవడం కోసం దళితులు చేబట్టని పోరాట రూపం లేదు. ధర్నాలు,
నిరాహార దీక్షలు, ముట్టులు లెక్కకు మించి చేశారు. దళితులు, మా ఊరిలో మాకిచ్చిన భూమిలో మేమే మైనింగ్ చేసుకుంటామంటూ
మైనింగ్‌శాఖ వారికి అనుమతుల కోసం అర్జీ పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ పోరాట రూపంలోని ఎత్తుగగానే చేశారు. ప్రజలు భావించినట్లే
అనుమతులు ఇవ్వడనికి అధికార యంత్రాంగం ససేమిరా అంది. రంపచోడవరం ఐటిఎ అధికారి ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు
తీర్పు 'సమతా వర్సెసెస్ ఆంధ్రప్రదేశ్'ను అనుసరించి చెట్లు చేమలు తుప్పలతో ఉన్న ప్రాంతాన్ని అడవని ప్రకటించక పోయినా ఆ ప్రాంతాన్ని
ఎటువంటి మైనింగ్‌కు ఇవ్వకూడదు కాబట్టి దళితులు పెట్టుకున్న మైనింగ్ లీజ్‌కు అనుమతి నిరాకరించ వచ్చని తూర్పుగోదావరి జిల్లా
కలెక్టర్‌కు సిఫారసు చేశారు. మరి ఇవే నిబంధనలు, తీర్పులు ఇతర ధనిక వర్గానికి ఇచ్చినప్పుడు ఏలిన వారికి ఎందుకు స్పుùరణకు రాలేదో
అర్థంకాని అమాయకులు కారు ప్రజలు. తరతరాలుగా మోసపోతున్న దళితులకి కారణాలు తెలుసు కోవడం కష్టం కాదు. అందుకే వారు
వ్యూహాత్మకంగానే మైనింగ్ లీజు కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఈ రిపోర్టుతో ఇక మైనింగ్ వ్యతిరేక పోరాటం మరింత పదునెక్కనుంది.
యాజమాన్యం గుండెల్లో గుబులు పుట్టించకమానదు.
మైనింగ్ రవాణా వలన దుమ్ము, దూబరా, ఎర్రబురద, క్రషర్‌లతో పర్యావరణం దెబ్బుతినడమే కాకుండ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం
చూపిస్తుంది. అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులు, వన్యమృగాలు చని పోతున్నాయి. కోతులు, కొండముచ్చులు, గ్రామాలపై దాడులు
చేస్తున్నాయి. ప్రజలకు వంట చెరుకు, ఇళ్ల నిర్మాణానికి వనరులు కరువయ్యాయి. పశువులు కాచుకోవడనికి వనరులు లేకపోవడం వలన
వాటిని తెగ నమ్ముకుంటున్నారు. అడవి రోడ్డుని ఆనుకొని ఉన్న వై.ఆర్.సి కాలువ ఎర్ర బురుదతో కూరుకుపోతుంది. ఈ విషయాలపట్ల
ఉద్యమించినా ప్రయోజనం లేకుండ పోయిందని ప్రజలు నిజనిర్ధారణ కమిటీకి తెలియజేశారు. చింతలూరు, శాంతి ఆశ్రమం, నర్సీపట్నం
మీదుగా, విశాఖపట్నం స్టీలు ప్లాంటు వరకు దుమ్ము, దూబరతో, బురుదలతో నీరు ప్రవహిస్తుంది. ఈ నీరు వన్యమృగాలు, పక్షులు,
పశువులు, మనుషులు తాగుతున్నారు. చివరకు స్టీల్ ప్లాంట్‌కి ఈ నీరు చేరుతుంది. ముగ్గురు పెట్టుబడిదారులు తమ లాభం కోసం ప్రత్తిపాడు
మండలంలోని నలభై గ్రామాల ప్రజల, వన్యప్రాణుల జీవితాలతో ఆడుకుంటున్నా ఏ చట్టం అడ్డుచెప్పలేక పోయింది. పైగా అక్రమంగా తమ
భూములలో తవ్వకాలు జరిగిపోతున్నాయని సత్యశాంతి సంక్షేమ సేవా సమితి ద్వారా హైకోర్టుకు విన్నవించుకున్నా స్థానిక కోర్టులలో
తేల్చుకొమ్మని సలహా ఇచ్చి కేసు కొట్టేసింది. మరోవైపు మైనింగ్ కంపెనీ యాజమాన్యం దళితులు తమ మైనింగ్‌కి అడ్డు వస్తున్నారని
హైకోర్టులో అప్పీిలు చేసుకొంటే, దానికి మాత్రం స్పందించిన హైకోర్టు దళితుల పోరాట సంఘానికి నోటీసులు పంపించారు. ఇది మనదేశంలో
జరుగుతున్న రాజ్యాంగబద్ధ న్యాయం!
వాస్తవానికి జిఒఎంఎస్ నెం. 384, 1983 న్ 10 ప్రకారం మినరల్ సెస్ ద్వారా 12 శాతం గ్రామ పంచాయితీకి నిధులు అందాలి.
ఈ నిధుల కేటాయింపుతో గ్రామ అభివృద్ధి చేయాలి కాని ఏ అభివృద్ధి పనులు చేపట్టలేదు. నిధులు ఏ మేరకు గ్రామ పంచాయితీకి బట్వాడ
అవుతున్నాయో ప్రజలకు తెలియదు. అందుకే ప్రజలు, చట్టపరంగా న్యాయపరంగా కమిషన్ వేసి సోషల్ ఆడిట్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన
23
ఖనిజసంపద సెస్ విలువ కట్టించి నిరుపేదల అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 1997-98లలో ఇచ్చిన పట్టాలు రద్దుపరిచి
ప్రత్యామ్నాయంగా వేరేచోట పట్టా ఇవ్వవచ్చునని ఐటిఐ ప్రాజెక్టు ఆఫీసర్ రంపచోడవరం 2004 ఫిబ్రవరిలో కలెక్టర్‌కు రాసిన ప్రత్యుత్తరంలో
పేర్కొన్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. గ్రామ ప్రజలకు తాత్కాలిక వ్యవసాయ రుణాలు మంరు చేయమని సిఫారసు చేసినా లాభం
లేకపోయింది.
దళితుల ఉపాధి, సంపదను దోచుకుంటున్న ఈ పోరంబోకు భూమి ఈనాం భూమి అని మేకాసా భూమి అని తగువు నడుస్తూనే ఉంది.
ప్రజలు ఏమి అడిగినా హైకోర్టు భూతం చూపించి తప్పుదోవ పట్టిస్తుంది. కోర్టులో ఉన్నప్పటికి మైనింగ్ ఎలాంటి అడ్డులేకుండ జరుగుతున్నప్పుడు
దళితులకు నష్ట పరిహారానికి, లీజు డబ్బు గ్రామాభివృద్ధికి వినియోగించ డనికి, వాటి లెక్కలు ప్రజలకు తెలియ చెప్పడనికి ఎలాంటి అడ్డంకి
ఉండనక్కరలేదు. అయినా పాలక పక్షాలకు హైకోర్టులో ఉన్న పెండిరగ్ అంశం ఎప్పుడూ దళితులకు న్యాయం చేయడనికి అడ్డంకిగానే
కనిపిస్తుంది. ఈ ప్రక్రియే మొత్తం రాజ్యాంగ స్వభావానికి అద్దం పుతుంది.
తమకు ఇతర ప్రాజెక్టులలోలాగా ఇతర ప్రాంత వాసులకు ఇచ్చినట్టుగా కనీసం నష్ట పరిహారాన్ని, ఉపాధిని, ప్రత్యామ్నాయ భూమిని
ఇవ్వాలని లీజు ద్వారా వచ్చిన నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించా లని కోరుతున్నారు. ప్రజలే తమ గ్రామాభివృద్ధికి ఏమి కావాలో
ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇప్పటికైన అక్రమ మైనింగ్ ఆపివేయాలని తమ 217 కుటుంబాలకు, భూమికి బదులు భూమి బదిలి
చేయాలని లేదా ఎకరాకు 3 లక్షలు ఇవ్వాలని, నిర్వాసితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఇప్పటివరకు నష్టపోయిన తమ పంటలకు నష్టపరిహారం
కట్టించాలని, మైనింగ్ రవాణా వలన పాడైన తమ రోడ్లను మళ్లీ కొత్తగా వేయించాలని, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని, వృత్తికారుల
కు వృత్తి సంబంధిత పనిముట్లు ఇస్తూ రుణాలు కల్పించాలని, తాగునీరు, స్మశానవాటికలకు మøలిక సదుపాయాలు కల్పించాలని ఉద్యమం
జరుగుతుంది. ఉద్యమకారులు ప్రజావాజ్యం కింద హైకోర్టును ఆశ్రయించనున్నారు. తమ పర్యావరణ పరిరక్షణకై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు
రిపోర్టు చేయనున్నారు.
గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గజ్జనపూడి కొండపైనా ఇదే లాటిరైట్ మైనింగ్ కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవే
కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. అక్కడ ఇదే తంతు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారాలు లేవు. ప్రజల జీవన విధ్వంసంపై ఎలాంటి
చర్యలు లేవు. అక్కడే పుష్కరాల ప్రాజెక్టు కింద సుమారు 41 ఎకరాల భూమిని 25 ఏళ్లకి ముందు ప్రజల నుండి తీసుకున్నారు. భూమి
కోర్టులో ఉందని నష్టపరిహారం ప్రభుత్వం బాధితులకు చెల్లించలేదు. కనీసం మూడుసెంట్ల భూమిని ఇల్లు కట్టుకోవడనికి ఇవ్వలేని ప్రభుత్వం
కోర్టులో భూ వాజ్యాలు నడుస్తున్నా అక్రమ మైనింగ్ త్రవ్వకాలకు ఇచ్చేసింది. అన్ని భూమి రిజిస్ట్రేషన్స్ నిలిపివేసింది.
నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రదేశాలలో పర్యటించినప్పుడు అడుగుగునా ఒక నిషిద్ధ వాతావరణం కనిపించింది. లాటిరైట్ ఖనిజం తవ్వే
కొండ మీద నుంచి చూస్తే చుట్టూ పచ్చని ప్రాంతం అంతా భయం గుప్పిట్లో బిగుసుకు పోయిందానిపించింది. దుమ్ము ధూళితో ఎర్రటి
మట్టిదిబ్బలు గా మారిన ఆ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోవాలన్న ఉద్వేగం కలుగక
మానదు. అనంతమైన వృక్ష సంపద పెకిలించే మైనింగ్ యాజమాన్యం చిన్న పాటి నర్సరీని నిర్వహిస్తుంది. తరతరాలుగా ప్రకృతి పెంచి
పోషించిన అడవిని మట్టిదిబ్బలుగా మార్చిన యాజమాన్యం మళ్లీ అడవిని ప్రతిసృష్టి చేస్తారట! ఎంతటి హాస్యాస్పదం ! మైనింగ్ వ్యతిరేక
ఉద్యమానికి అక్కడ పనిచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రమేయం, మద్దతు గురించి ప్రశ్నించాం. ఏ పార్టీ తమ డిమాండ్‌కి మద్దతు
ఇవ్వలేదని విప్లవపార్టీ అని చెప్పుకుంటున్న ఒక పార్టీ నాయకత్వం మైనింగ్ కంపెనీల యాజమాన్యానికి దాసోహమైందని, అమ్ముడు పోయిందని
తెలియ చేశారు. ఎంపిటిసి. అభ్యర్థిగా దళిత నాయకురాలు బహుజన సమాజ పార్టీ తరఫున పోటీ చేసింది, ఫలితాలు ఎలా ఉన్నా తమ శక్తి
తెలియ చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఎంపిటిసి ఎన్నికలలో నిలబడ్డం అన్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు
తమ మైనింగ్ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని అలాంటి వారికే ఓటు వేస్తామని లేని పక్షంలో తమ ఓటును కూడ వినియోగించుకోమని
చాలా స్పష్టంగాను తెలియజేశారు.
తమను నిర్వాసితులను చేసి పునరావాసం, బతుకు తెరువు చూపించలేని ఏ ప్రక్రియనైనా ప్రశ్నించే హక్కు ప్రతి పళిలిరునికి ఉంది. వనరులు
కొల్లగొట్టబడంతో ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియక పోయినా కనీసం ఆ గనుల తవ్వకాలకు అనుమతినిచ్చిన రాజ్యానికి కూడ
తెలియకపోవడం క్షమించరాని నేరం. ఈ రిపోర్టు రాస్తున్నప్పుడు అమరుడు ఆర్.ఎస్. రావు 'అరుణతార' (మార్చ్, మే - 2009) లో ప్రత్యేక
మండలాలపై సమీక్ష విరసం ప్రచురణ స్పుùరణకొచ్చింది. ఆయన మాటలల్లోనే 'సామ్రాజ్యవాద పెట్టుబడి ఇక్కడ పెట్టుబడిదారులతో కలిసి
చౌకగా దొరికే భూవనరులను ప్రభుత్వ ప్రమేయం కట్టుబడి లేకుండ విశృంఖలంగా వ్యవహరించనికి, భవిష్యత్తులో దేశంలో ఉండే ఆర్థిక
అభివృద్ధి ఏమైనా ఉంటే అందులో పెద్ద భాగం తీసుకోవడనికి, ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో తయారవ్వబోయే మిగులు
విలువలను వాటి మీద ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలనే అభిలాష ఉంటుంది. ఈ క్రమంలో లాభపే సామ్రాజ్యవాదులు, దేశ పెట్టుబడి
దారులు ఒక పక్కన ఉంటే పేద రైతాంగం రైతు కూలీలు మరో పక్క తీవ్రంగా నష్టపోతారు. ఇక్కడ పెట్టుబడి దారునికి వనరులపై దాహం
అయితే వాటి మీద ఆధారప్డ పేద కూలీలకీ అదే వనరులపై దాహం ఉంటుంది. ఒకటి పెట్టుబడిదారుడికి ధనదాహం అయితే మరో పక్క
పేద వర్గానికి జీవన్మరణ సమస్య అవుతుంది. ఏది అభివృద్ధికరం, ఏది కాదు అనేది చూడనికి ఒక శ్రామికవర్గం వస్తుందో లేదో అనేది
గీటురాయి. అయితే పేద రైతులు, వ్యవసాయ కూలీలు అందులో భాగం కాకుండ ఒక లుంపెన్ ప్రాసెస్‌లో అర్ధ బానిసలుగా ఇరుక్కుపోతారా
అనేది రెండవ గీటురాయి. అక్రమ మైనింగ్‌పై వ్యతిరేకత - అది ఒక ఉద్యమం రూపం దాల్చడం, అభివృద్ధి పథంకాలు - అభివృద్ధిని తెచ్చే
నూతన ప్రజాస్వామిక ఉద్యమం మధ్య తీవ్ర వైరుధ్యంగానే కనిపిస్తుంది'. ఈ మాటలు మైనింగ్ వ్యతిరేక పోరాటానికి కూడ సరిపోతాయని
నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
గతంలో సెజ్, కోస్టల్ కారిడర్, ధర్మల్ విద్యుత్, జిందాల్, మైనింగ్ వ్యతిరేక పోరాటాల్లోలాగ ఈ పోరాటంలో ఇతర ప్రజాస్వామిక
అభ్యుదయ విప్లవకర శక్తులు పాలుపంచుకోవడం లేదు. స్థానిక దళిత నాయకత్వం, అక్కడున్న ప్రోగ్రెసివ్ మీడియా కొంతమేరకు సహాయ
సహకారాలు అందించాయి. కానీ ఒక అక్రమ మైనింగ్‌శక్తులతో తలపమంటే దుర్మార్గ రాజ్యంతో, సామ్రాజ్యవాదశక్తులతోను ఢుకొనడమే.
ఈ ఉద్యమానికి జిల్లాలోని, రాష్ట్రంలోని అన్ని ఉద్యమ, అభ్యుదయ, మానవ, పళిలిరహక్కుల సంఘాలు అండగా నిలబడినపుడే స్థానిక నాయకత్వం
మరింత ధీటుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ల గలదు. రాజ్యం అణచివేతను ఎదుర్కొని విజయం సాధించ గలరు. దోపిు రాజ్యానికి
వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపుతున్న వివిధ ప్రాంతాల ఉద్యమ శక్తుల ఏకీకరణ జరగవలసిన సందర్భంలో మనం ఉన్నాం. అందుకు
మనం ఉద్యమ ప్రాంతాలకి వెళ్లవలసిందే. ఒక ఐక్య కార్యాచరణ కట్టవలసిందే !
(రచయిత న్యాయవాది)
June 2014 veekshanam
-హేమా వెంకట్రావ్

No comments:
Post a Comment