వర్గం-కులం-జెండర్-అణిచివేత-స్త్రీ విముక్తి-హేమా
వెంకట్రావు
పుస్తక పరిచయం
పుస్తక రచయిత్రి టాన్యా
Hema venkat rau
పుస్తక రచయిత్రి టాన్యా అసలు (తన తల్లితండ్రులు పెట్టిన) పేరును వదిలేసి పోరాటంలో మమేకమవుతూ ఎంచుకున్న పేరు అది. రచయిత్రి భారత సమాజంలో అనేక రకాల దోపిడి, పీడన అణచివేతలు, హింసలకు స్పందించి చిన్న వయసులోనే పోరాట బాట బట్టి సమాజమార్పుకు కృషి చేస్తున్న విశిష్టవ్యక్తి. అది పట్టణం కానివ్వండి, పల్లెకానివ్వండి, అడవికానివ్వండి, సొంతపార్టీ కానివ్వండి ఎక్కడైనా సరే అసమానత దొంతర్లను విప్పిచెప్పి అవసరమైతే ఎదురొడ్డి విప్లీకరించే శక్తిగా మారుతుంది. మహిళా సంఘాల నిర్మాణంలోను, పార్టీ నిర్మాణంలోను క్రియాశీలక చైతన్యం ఆమెది. ఆమె అవగాహన, నడిచిన పోరాట బాటలోని అనుభవాల్ని జోడిరచి మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఒక తాత్విక అందించే ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకం ప్రగతిశీల మహిళ సంఘపు ఆరవ మహా సభల సందర్భంగా రెండవ ముద్రణగా మన ముందుకు వచ్చింది.
ఈ పుస్తకం పరిచయం చేయడం అంటే మన భావాజాలాన్కి, మహిళా ఉద్యమాల్ని తరచి చూచుకోవడమే. మహిళా సమస్యల్కి మూలాలు విశిదీకరిస్తూ విముక్తి ఉద్యమ నిర్మాణాన్కి ఆటంకంగా మారిన పెడధోరణులను ప్రస్తావిస్తాయి. వాటినెలా సరిచేసుకోవాలో, స్త్రీ సంపూర్ణ స్వేచ్చ అంటే ఏమిటో నిర్మాణాత్మక అవసరాలేమిటో ఒక అవగాహన కల్పిస్తాయి. వాటిలోని కొన్ని అంశాలను పుస్తక పరిచయంలో మీకోసం…….
మహిళల సమస్యల్ని వర్గాలకు అతీతంగా చూసే ధోరణి, స్త్రీల హక్కుల పేరిట అశ్లీలతలనూ, సెక్సు విశృంఖలత్వాన్ని ప్రోత్సహించే పెడధోరణి ముందుకొస్తున్నాయి. కుల దృక్పథంలోనే శ్రామిక మహిళల సమస్యల్ని పరిష్కరించుకోవాలనే పెడ ధోరణి, పురుషాధిక్యతకు వ్యతిరేకంగా తక్షణం పోరాడాలనే ధోరణులు ముందుకు వచ్చాయి. మహిళలు ఎదుర్కొంటున్న వర్గదోపిడీని గుర్తించకుండా కేవలం వారెదుర్కొంటున్న పాక్షిక సమస్యల పరిష్కారం పైనే కేంద్రీకరించాలనే పెడధోరణులు తలెత్తుతున్నాయి. సాంప్రదాయక మహిళా దృక్పథాలు వుండనే వున్నాయి. అలాగే మహిళల సమస్యల్ని పోరాట క్రమంలో చేపడుతూనే సోషలిస్టు వ్యవస్థ స్థాపన అనంతరం పూర్తి విజయాలు సాధించుకోవడానికి పోరాడవలసిన కర్తవ్యాన్ని తిరస్కరించి పెడధోరణులూ, పోస్టు మోడరనిస్టు పెడధోరణులు వగైరాలు తలెత్తాయి. తలెత్తుతున్నాయి అంటారు రచయిత్రి.
చివరికి మార్క్సిజం స్త్రీల సమస్యలు పరిష్కరించడానికి మార్గాన్ని చూపలేకపోయిందనీ, మహిళల సమస్యల్ని అది పట్టించుకోలేదనీ విమర్శించే తప్పుడు ధోరణులు కూడా తలెత్తాయి. ఇలాంటి పెడధోరణులకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడకుండా మహిళ విముక్తిని, ముఖ్యంగా శ్రామిక మహిళా విముక్తిని సాధించడం అసాధ్యం. ఇలాంటి పెడధోరణులకు వ్యతిరేకంగా సైద్దాంతిక అవగాహనను స్త్రీలందరికి అందించాల్సిన అవసరం ఉందన్న బలమైన కాంక్షతో ఈ పుస్తకాన్ని స్త్రీ లోకాన్కి అందించడం జరిగింది.
భారతదేశంలో మహిళా ఉద్యమ క్రమం గురించి మాట్లాడుతూ 1930 నుండి ఆవిర్భవించి క్రమంగా వృద్ధి చెందిన మహిళా ఉద్యమాలు 1970ల నుండి సమాజాన్ని స్త్రీల దృష్టి నుండి పరిశీలించడం మొదలయింది. 1980లలో దళిత ధోరణి ఒక ప్రవాహంలా దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ముందుకు వచ్చింది. 1990 నుండి దళిత స్త్రీ వాదం తన గొంతు విప్పించడం మొదలయింది అంటూ సమాజంలో వివిధ ఆలోచనా ధోరణిలను గురించి తెలియచేస్తారు. వివిధ వర్గాలకు స్త్రీలు సంధించిన ప్రశ్నలు, విమర్శలు ప్రస్తావిస్తూ అసలు స్త్రీలపై అణిచివేతపై మార్క్సిజం ఏమి చెబుతుందో వివరిస్తారు. మార్క్సిజం స్త్రీల అణచివేతను కుల దృక్పధం నుండి పరిశీలించలేదంటూ కులాన్ని వర్గంలో కలిపివేయడం, స్త్రీ వాదులు కూడా ‘మహిళలంతా ఒకటే’ అంటూ అగ్రకుల మహిళలను కూడా దళిత మహిళలతో ఏకం చేయడం. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న దళిత పురుషులు దళిత స్త్రీలపై పితృస్వామ్యం అవలంభించబడడం మొ॥ దళిత స్త్రీలు లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తావిస్తారు.
అంతేగాక మొదట స్త్రీలు పురుషాధిక్యతకు వ్యతిరేకంగా పోరాడాలనీ, దాని తర్వాతే మిగతావన్నీ అంటున్నారు స్త్రీ వాదులు. ముందు దళిత మహిళలపై కులం దృష్టితో అమలవుతున్న హింసను ప్రధానమైన విషయంగా కేంద్రీకరించి స్త్రీ విముక్తి కోసం కృషి చేయాలని దళిత ఫెమినిస్టులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీల అణచివేతలో వర్గం ` కులం ` జండర్‌లలో ఏది ప్రాధాన్యత వహిస్తోంది? పరిష్కారమేమిటనేది చారిత్రక అవసరతను పరిశీలించడం జరిగింది.
స్త్రీలపై అణచివేత గురించి మార్క్సిజం ఏం చెబుతుంది అనే ప్రాతిపదికన మొదలవుతుంది రచయిత్రి పరిశోధన.
మార్క్సి`ఏంగెల్సులు మొట్టమొదట కమ్యూనిస్టు ప్రణాళికలో మహిళలపై సాగుతున్న అణచివేత గురించి ప్రస్తావించారు. ఆ తరువాత ‘‘కుటుంబం, వ్యక్తిగత ఆస్థి, రాజ్యం పుట్టుక’’ అనే గ్రంథాన్ని ఏంగెల్స్ రచించారు. స్త్రీల అణచివేత పుట్టు పూర్వోత్తరాలను ఏంగెల్స్ యిందులో విపులంగా విశ్లేషించారు. ఇదొక ప్రామాణిక గ్రంథంగా అనేకులు అంగీకరిస్తున్నారు. ఈ రచనలు వెలువడి 150 సంవత్సరాలు దాటి పోయింది. ఆనాడున్న పరిస్థితులు, మహిళలపై సాగుతున్న అణచివేతలను తమ పరిశీలన మేరకు వాళ్ళు వ్యక్తం చేశారు. ఏదీ మార్పు లేకుండా స్థిరంగా వుండజాలదు. మారుతున్నకాలంలో రూపుమారుతూ వుంటుంది. ప్రాథమిక సూత్రాలను వర్తమాన స్థితికి అన్వయించుకొని అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఈ రోజు మనకు వచ్చే ఆలోచనలే 150 సంవత్సరాల క్రిందటనే ఎ టు జెడ్ వాళ్ళ దృష్టి కెందుకు రాలేదని నిగ్గదీయటం కాదు. మార్క్సిజం ఒక్క స్త్రీలకు సంబంధించిన విశ్లేషణ లేదా సిద్దాంతం మాత్రమే కాదు. అది సమాజంలోని ‘‘పీడిత వర్గాలన్నింటికి (మహిళలతో సహా) సంబంధించిన సాపేక్షిక సమగ్ర సిద్దాంతం’’. ఆనాటికి పురుషాధిక్యత గురించే కాదు, వర్గ దోపిడి`వర్గ విముక్తి గురించి కూడా ఎవరూ శాస్త్రీయంగా చెప్పలేదు అంటారు.
‘‘కుటుంబంలోని శ్రమ విభజన స్త్రీ ` పురుషుల మధ్య ఆస్తి విభజనను క్రమబద్దం చేసింది. శ్రమ విభజన అలాగే వుండిపోయింది. కుటుంబం వెలుపలి శ్రమ విభజన మారినందువల్లనే కుటుంబంలో గతంలో వుండిన స్త్రీ ` పురుష సంబంధాలు కూడా తలక్రిందులయ్యాయి. గతంలో స్త్రీలకి ఇంటిలో ఆధిక్యత ఇచ్చిన కారణాలే ` అంటే కుటుంబ శ్రమకు, ఆమె కార్యకలాపాలకు పరిమితం కావడం ` ఆ తరువాత ఇంటిలో పురుషుల ఆధిక్యతను నెలకొల్పాయి. పురుషుని జీవితావసరాల సంపాదన శ్రమవలె స్త్రీల ఇంటి శ్రమ పరిగణలోకి తీసుకోబడలేదు. పురుషుల శ్రమ సర్వ ప్రాముఖ్యం కలదానిగా స్త్రీల ఇంటి శ్రమ అప్రాముఖ్యమైనదిగా పరిగణించ బడినది’’ అన్నారు. ‘‘ఇంటి శ్రమను అంతకంతకెక్కువగా పబ్లిక్ శ్రమగా మార్చటం ద్వారా అది ప్రైవేట్ ఇంటి శ్రమను అంతం చేయటానికి తోడ్పడుతుందని’’ ‘‘మాతృస్వామిక హక్కు కూలద్రోయబడి, పితృస్వామిక హక్కు ఏర్పడటం, జంట వివాహం క్రమంగా భార్య ` భర్త పద్ధతిలోనికి మార్పు చెందడంతో పురుషుని సర్వాధికారం స్థిరపడిరది. శాశ్వత మొనర్చబడిరది’’ అని ఏంగెల్స్ వివరణను మనకందిస్తారు.
స్త్రీలపై అణచివేత గురించి చెబుతూ సంతానోత్పత్తి కోసం స్త్రీ ` పురుషుల మధ్య జరిగిన శ్రమ విభజనే (సహజమైనది) సమాజంలో మొట్టమొదటి శ్రమ విభజన’’ ‘‘చరిత్రలో ఏర్పడిన మొట్టమొదట వర్గ వైరుధ్యం. దంపతీ వివాహంలో స్త్రీ ` పురుషుల మధ్య వైరుధ్యం అభివృద్ధితోబాటే ఏర్పడిరది. చరిత్రలో మొట్టమొదటి వర్గ అణచివేత (బానిస యజమానులు ` బానిసలు) స్త్రీలపై అణచివేత ఒకే కాలంలో ఏర్పడ్డాయి.’’ ‘‘దంపతీ వివాహం (భార్య`భర్త పద్దతి) చారిత్రకంగా ఒక ముందడుగు. అయినప్పటికీ బానిసత్వం, వ్యక్తిగత ఆస్థి ఏర్పడిన నాటి నుండి నేటి వరకూ పడిన ప్రతి ముందడుగూ సాపేక్షికంగా ఒక వెనుకడుగే’’ అంటారు.
వేతనంలేని స్త్రీల ఇంటి చాకిరీ గురించి మార్క్సిస్టులు మాట్లాడనేలేదనేది వాస్తవం కాదని. ఈ విషయంలో లెనిన్ కొటేషన్‌ను పరిచయం చేస్తారు. ‘‘ఇప్పటివరకూ వున్న స్త్రీల పరిస్థితిని బానిసల పరిస్థితిగా చెప్పవచ్చు. ఇంటి చాకిరీతో స్త్రీలు నలిగిపోతున్నారు. సోషలిజం మాత్రమే దీని నుండి విముక్తి చేయగల్గుతుంది. చిన్న తరహా గృహ ఆర్థిక విధానం నుండి బయటపడి సామాజిక ఆర్ధిక వ్యవస్థకు సాగినప్పుడు, భూమిని సామాజికంగా (సమిష్టిగా) సాగుచేసినప్పుడే ఇది సాధించగలం అప్పుడు మాత్రమే స్త్రీలు స్వేచ్ఛ పొందుతారు. విముక్తి చెందుతారు.’’ దోపిడికాబడ్డ స్త్రీలు తమను తాము విముక్తి చేసుకోవడం, ఇతర దోపిడి చేయబడుతున్న వర్గాల కోసం నడవడం అన్నది స్త్రీ విముక్తిలో భాగమే అంటారు. వివిధ వర్గాలకు చెందిన స్త్రీల పై అణచివేత ఒకేరంగా వుండదు. ‘‘భర్త పెత్తనం అనేది పేద రైతులలో బలహీనంగా ఉంటుంది. కారణం ఆర్ధిక అవసరాల రీత్యా ధనిక వర్గాల మహిళల కంటే ఈ పేద రైతు మహిళలు ఎక్కువగా శారీరక శ్రమ చేయవలసి ఉంటుంది. అందువల్ల ధనిక వర్గాల స్త్రీల కంటే పేద రైతు మహిళకు కుటుంబ విషయాలలో నిర్ణయాలు చేయటంలో ఎక్కువ స్వేచ్ఛ, అధికారమూ ఉంటాయి’’ ఈ అంశాన్ని మావోహునాన్ రైతాంగ ఉద్యమ పరిశోధనా రిపోర్టును ప్రాతిపదికగా తీసుకుంటారు రచయిత.
స్త్రీలకే ఆధిక్యత ఉన్న పరిస్థితి నుండి అణగదొక్కబడే క్రమం గురించి మాట్లాడుతూ ఆ విధంగా మొట్టమొదట స్త్రీలకే ఆధిక్యత ఉన్న పరిస్థితి నుండి, వ్యవసాయం కనిపెట్టి మిగులు సంపద ఏర్పడటంతో స్వార్ధం పెరిగింది. తమ వద్ద ఆయుధ బలం గల పురుషులు మిగులు సంపదతో పాటు సంపద సృష్టించే యుద్ద ఖైదీలను, వాళ్ళ భార్యలను కూడా బానిసలుగా తమ దోపిడీ పెంపుదలకు అవసరమైన బానిస సంతానాన్ని కనియిచ్చే బానిసలుగా మహిళలను మార్చారు. దీనితో పేద ` ధనిక వర్గ వ్యత్యాసం, పురుషాధిక్యత ` స్త్రీల బానిసత్వం ప్రారంభమయ్యాయి. వారసత్వం కోసం, తన సంతాన నిర్దారణ కోసం స్త్రీలపై మరింత నిర్భంధం, పాతివ్రత్యం, ఘోషా వంటి దురాచారాలు అమలు జరిపారు. పని సౌలభ్యం కోసం జరిగిన మొదటి శ్రమ విభజనను మిగులు స్వాహా చేసుకునే స్వార్ధం, స్వంత ఆస్థి భావన ఏర్పడటంతో పరస్పర సహకారంపై ఆధారపడిన శ్రమ విభజన వంశపారంపర్యంగా మార్చారు. వర్ణ విభజన, కులాల స్థిరత్వం జరిగింది. స్త్రీలు ఇంటికి పరిమితమయ్యారు. స్త్రీలపై అణచివేత పలు రూపాల్లో అమలయ్యింది. ఆ తర్వాత స్త్రీ బయటకు లాగడాన్కి నెలకొన్న అవసరాలు, చారిత్రక సందర్భాలు ప్రస్తావిస్తారు.
అయితే చారిత్రక క్రమంలో పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కోసం, ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకుంటూ, అదనపు విలువను మరింత దోచుకొనేందుకు స్త్రీల బయటి శ్రమను ప్రోత్సహించారు. ఫ్యాక్టరీలలో స్త్రీ, బాలకార్మికుల నియామకం జరిగింది. అవసరమైన మేరకు పరిమితంగా స్త్రీ విద్యను ప్రోత్సహించారు. తమ వ్యాపార ప్రయోజనాలకై స్త్రీ స్వేచ్ఛ పేరుతో అందం, మోడల్స్, లైంగిక విశృంఖలత ప్రేరేపించారు. ప్యూడల్ నిరంకుశత్వం నుండి బయటపడిన పురుషులు రాజకీయ హక్కులకై పోరాడారు. ఆ స్పూర్తితో విద్యావంతులైన సంపన్న వర్గాల మహిళలు సైతం తమకు రాజకీయ హక్కు కోసం, ఓటింగ్ హక్కు తదితరముల కోసం పోరాడారు. వీరిని మొదటితరం ఫెమినిస్టులుగా చెప్పవచ్చు. ఆ తదుపరి పౌరహక్కుల కోసం, రాజకీయ హక్కుల కోసం 1960లలో తిరిగి రెండవ తరం స్త్రీ వాదులు పశ్చిమ దేశాలలో పోరాడారు. కానీ వెనుకబడిన వలస ` అర్ధ వలస దేశాల్లోని మహిళలు స్త్రీవిముక్తి సిద్దాంతం ఏదీ లేకుండానే వాళ్ళు అర్ధం చేసుకున్న మేరకు తమ కుటుంబాల,తమ విముక్తి కోసం పురుషులతోపాటు పోరాటాల్లో భాగస్వాములయ్యారు. జాతీయోద్యమంలో, తెభాగా, వర్లీ, తెలంగాణ వంటి పోరాటాల్లో వీరోచిత పాత్ర నిర్వహించారు. అమరత్వంలో, త్యాగాలలో కూడా తమ అంకితభావాన్ని రుజువు చేసుకున్నారు. అనేక మంది అమరులయ్యారు. త్యాగాలు చేశారు. కుల మతాల తేడా లేకుండా దళిత, మైనార్టీ, హిందూ స్త్రీలందరూ ఇందులో ఉన్నారు.
అయితే గత పోరాటాల ద్వారా స్త్రీల స్థితి ఎందుకు మెరుగుపడలేదన్న మన ప్రశ్నకు ఈ పుస్తకంలో జవాబు దొరుకుతుంది. నడుస్తున్న చరిత్ర అటుంచితే ` గత పోరాటాల తర్వాత స్త్రీల పరిస్థితి మారిందా? ఎందుకు మారలేదు? మొత్తంగా పోరాడిన ప్రజలెవ్వరి స్థితి కూడా మారలేదు. కారణం ఆ పోరాటాలను గమ్యం చేరేవరకూ, కడవరూ సాగించకపోవడమే అని అంటారు. సంపన్నుల అనుభవాలేగాదు, పీడితులలో కూడా కార్మికులు, రైతులు, పేదవాళ్ళు, మైనార్టీ మతాల మహిళలు, దళిత స్త్రీలు, జాతులు, తెగల అనుభవాలలో తేడాలుంటాయి.
దక్షిణసియా దేశాల మహిళల వర్క్‌షాపు ఆమోదించిన నిర్వచనం ` ‘‘సమాజంలో ఉన్న లైంగిక వివక్షను, పురుషాధిపత్యాన్ని, జెండరు మీద ఆధారపడే పితృస్వామ్యాన్ని గుర్తించి, వాటిని వ్యతిరేకించే కార్యక్రమాలలో పాల్గొనేవారు ఫెమినిస్టులవుతారు’’. ఫెమినిస్టులలో కూడా వివిధ పేర్లతో, వివిధ విభాగాలున్నాయి. స్త్రీ విముక్తి కోరుకునేది. దానికై కృషి చేసేది ఫెమినిజంగా మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. అంటూ విభిన్న ఫెమినిస్టు తాత్వికతను క్లుప్తంగా వివరిస్తారు. ఆ వివరాలు

1. ఉదారవాద (సంపన్నవర్గ బూర్జువా) ఫెమినిజం :
మొత్తం సమాజంలో అత్యధిక పేద ప్రజలపై, స్త్రీలపై అణచివేతకు కారణమైన ఈ పితృస్వామిక, దోపిడీ వ్యవస్థకు లోబడి ఉండే చైతన్యం ఇది. వీరు వర్గ స్వభావ రీత్యా తమ సంపన్న వర్గాల పురుషులు కోరే, వాళ్ళకభ్యంతరం లేని హక్కులకై మాత్రమే పోరాడతారు. ఉదా: వీళ్ళు ముఖ్యంగా తమ పురుషులతో పాటు ఓటుహక్కు చదువుకునేందుకు, ఉద్యోగం చేసేందుకు హక్కులు, చట్టసభలలో ప్రవేశించే హక్కులు గర్భనిరోధక హక్కులు, విడాకుల హక్కుల వంటి ప్రజాస్వామిక హక్కులపై మాత్రమే పోరాడతారు. వీటి కోసం పోరాడటం తప్పుగాదు కానీ శ్రామిక మహిళల సమస్యలు వీరు ఏమాత్రం చేపట్టరు. ఈ హక్కులను ప్రధానంగా సంస్కరణల ద్వారా పొందాలని చూస్తారు. ప్యూడల్ సంప్రదాయాలను, ఆచారాలను గౌరవిస్తారు.
2. సంప్రదాయక మార్క్సిస్టు ఫెమినిస్టులు :
వ్యక్తిగత ఆస్తి రద్దయ్యి, ఉత్పత్తి పరికరాలపై సమిష్టి యాజమాన్యం నెలకొల్పడంతో దానంతటదే వెనువెంటనే స్త్రీలపై దోపడీ ` అణచివేతలు రద్దువుతాయని ఈ ధోరణి భావిస్తుంది. వీటి కోసం విప్లవ సమయంలో గానీ, ఆ తర్వాత గానీ పోరాడవలసిన అవసరం గుర్తించరు. కుటుంబం అణచివేత వ్యతిరేక పోరాటాన్ని వ్యతిరేకిస్తుంది. కేవలం ఆర్ధిక సమస్యలపై ` వేతనాలు, అసంఘటితరంగ శ్రామిక మహిళలు, ఉత్పత్తిలో భాగస్వామ్యం, అరుదుగా ఆస్థి హక్కుల కోసం పోరాడుతుంది. మన దేశంలో మహిళా సమాఖ్య, మహిళా సంఘం వంటి వాటి వైఖరి ఇదే. వీళ్ళు అనుబంధంగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న ప.బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా మహిళల పరిస్థితి మెరుగుదలకై పోరాడటం లేదు.
3. పెటీ బూర్జువా ఫెమినిస్టులు :
వీరిలో మళ్లీ 1. రాడికల్ ఫెమినిస్టులు 2. సోషలిస్టు ఫెమినిస్టులు 3. సాంస్కృతిక ఫెమినిస్టులు, 4. పర్యావరణ ఫెమినిస్టులు ఉన్నారు. ప్రపంచంలో పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విష సంస్కృతి తమ దోపిడీ, పీడనలకు దెబ్బతగులకుండా, స్త్రీల చైతన్యం ఆ మార్గంలో అభివృద్ధి చెందకుండా ప్రక్కదారి పట్టించేందుకు ప్రచారంలోకి తెచ్చిన స్త్రీల విశృంఖల లైంగిక స్వేచ్ఛ భావనను ముందుకు తెస్తారు. సొంత ఆస్థి పునాదిపై ఏర్పడిన ఈ పితృస్వామిక, పురుషాధిక్యత ఒక్కటే స్త్రీల అధోగతికి ప్రధాన కారణం అంటారు. ముందు దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెబుతారు. ఏ పద్ధతిలో పోరాడాలో నిర్ధష్ట కార్యక్రమం ఉండదు. స్త్రీలు సంఘాలుగా ఏర్పడి ఉమ్మడి పోరాటాలు చేయవలసిన అవసరం లేదంటారు. చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి అనుభవాల ఇచ్చి పుచ్చుకోవాలంటారు. స్త్రీల లైంగికత్వాన్ని పితృస్వామ్యం కంట్రోలు చేస్తుందని, జండర్ వివక్షనూ, స్త్రీలపై హింస, పితృస్వామ్యాలను మార్క్సిజం పట్టించుకోలేదని ఆరోపిస్తారు. మార్క్సిజం ఉత్పత్తిలో లైంగిక శ్రమవిభజన గురించి పరిశీలించలేదంటారు. ఇంటిపని గురించి మాట్లాడలేదంటారు. ఇంటిపని సామాజిక ఉత్పత్తిలో భాగం అంటారు. స్త్రీలపై హింస చరిత్రలో మొదటిది అంటారు. పురుషుల చేతిలో ఆయుధాలు దీనికి కారణమంటారు. జండర్ తేడాలు సహజమైనవి కావని పై నుండి రద్దుబడ్డాయని అంటారు. మరో పోస్ట్‌మోడర్నస్ట్ రచయిత్రి సెక్స్ సంబంధాలు సమాజ పునాదిలో భాగమంటారు.
స్త్రీల పునరుత్పత్తి (సంతానోత్పత్తి) కూడా సామాజిక ఉత్పత్తిలో భాగంగా పరిగణించాలంటారు. విప్లవ సంస్థలు కూడా పురుషాధికత్యతో నిండి ఉన్నాయి. వాటి అనుబంధ మహిళా సంఘాలు సైతం పితృస్వామ్యాన్ని ఎదిరించకుండా వారి తోకలుగా వ్యవహిరిస్తున్నాయని విమర్శిస్తున్నారు. స్త్రీ ` పురుషులు ఒక ఇంటిలో కలిసి ఉండనవసరం లేదని, వివాహం అవసరం లేదని, అసలు కుటుంబ జీవితం ఉండనవసరం లేదని స్త్రీల లైంగిక తృప్తికి పురుషులతో సంబంధాలు అవసరం లేదని, చెప్పేస్తారు. స్త్రీలే పరస్పరం సంతృప్తి పర్చుకోవచ్చని చెప్పారు. టెస్ట్‌ట్యూబ్ బేబీల ద్వారా సంతానం పొందవచ్చన్నారు. స్వలింగ సంపర్కం బలపర్చుతున్నారు. చివరకు పురుషులు కోరితే అద్దెలకు తల్లులవుతామని కూడా చెప్పారు.
పర్యావరణ ఫెమినిస్టులు ప్రకృతి వనరులపై హక్కుల కోసం స్త్రీలు పోరాడటం ముఖ్యం అంటారు. వీరిని శత్రువులుగా చూడనవసరం లేదు. మిత్రపూర్వకంగానే వాళ్ళ అవగాహనలోని లోపాలను ఎత్తిచూపాలి. స్త్రీల విముక్తికి సంబంధించి నిర్ధష్ట పోరాటాలను వీళ్ళు చేపడితే ఆ సందర్భంగా కలిసి పనిచేయవచ్చు. అని స్త్రీల మహిళా విముక్తి ఉద్యమాల్లో పాత్ర విభిన్న తాత్వికతలను పరిచయం చేస్తారు.

4. దళిత ఫెమినిజం :
ఇది ఇటీవలి కాలంలో ఆధునికానంతరవాదం అనే పోస్టుమోడరనిస్టు ధోరణికి చెందినది. పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భావం నుండీ ఇప్పటి వరకూ గల ఆధునిక కాలాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెబుతారు. తాము ఆధునికతకు అనంతరవాదులం అని చెబుతారు.
ఈ ధోరణి సిద్ధాంతాన్ని, ఉమ్మడి పోరాటాన్ని తిరస్కరిస్తుంది. సముద్రనీరు ఎంత ఉన్పప్పటికీ తాగటానికెలా పనికిరాదో ఇది కూడా అలాంటిదే అంటుంది. సమాజంలోని వివిధ సెక్షన్లు పాయలు పాయలుగా తమ స్వంత అనుభవాలపై ఆధారపడి పోరాడతారని చెబుతుంది. వీటికి నూతన సామాజికోద్యమాలు అని పేరు పెట్టారు. ఇవి రాజ్యాధికారాన్ని కోరుకోవటం కంటే స్వయం ప్రతిపత్తిని కోరుకుంటాయి. ప్రతిఘటన స్వభావంతో గాకుండా ఆత్మరక్షణ స్వభావంతో వ్యవస్థ పరిధికి లోబడి సాగుతాయి. తాత్కాలిక ప్రయోజనంతో రాజీపడతాయి. మార్క్సిజం వైఫల్యం వల్లనే ఈ సామాజిక ఉద్యమాలు పుట్టాయంటారు. మార్క్సిజం, సోషలిజం, వర్గపోరాటం వంటివన్నీ మహాకథనాలని ఈ వాదం చెబుతుంది. వాటికి కాలం చెల్లిందని అంటుంది. చరిత్ర అంతమయ్యిందని చెబుతుంది. వర్తమానం, అనుభవాలే కళ్ళముందు వాస్తవాలు అంటుంది.ఈ నూతన సామాజికోద్యమాలు వివిధ బృందాలు తమ అనుభవాల ఆధారంగా గుర్తింపు (అస్థిత్వం) కోసం జరిపే ఉద్యమాలంటారు. బూర్జువా రాజకీయ నాయకులు ప్రమాదకరం కాదంటారు. నిరంకుశ యంత్రాంగం ప్రమాదకరం. కనుక రిజర్వేషన్లు ద్వారా ఆ ఉద్యోగ వర్గాలలో చేరి రాజ్యాధికారం చేజిక్కించుకుంటామని చెబుతారు. మార్క్సిజం ‘‘కులం’’ను వర్గంలో కలిపివేసిందంటారు. కుల సమస్య మొదట పరిష్కారమైన తర్వాతనే మిగతావి అంటారు. ‘‘తాడిని తన్నేవారుంటే వాళ్ళ తలదన్నేవారుంటారు.’’ అన్న చందంగా ఫెమినిస్టులు, దళిత సంఘాలు మార్క్సిజాన్ని ‘మార్క్సిస్టు’ ` ‘‘విప్లవ ఫెమినిస్టులను’’ విమర్శిస్తే ఈ దళిత ఫెమినిస్టులు స్త్రీ వాదుల ఫెమినస్టులు, దళిత సంఘాలను విమర్శిస్తున్నారు. స్త్రీ విముక్తి అవగాహనలో తేడా ఉందని గుర్తించరు. శ్రామిక మహిళా ఉద్యమం పునాదిగా భావించే విప్లవ ఫెమినిస్టులను, మిగతా వాళ్ళను అందరినీ ఒకే గాట కడుతున్నారు.
మహిళా ఉద్యమధోరణులు తీసుకొచ్చిన విమర్శలు వాటి వాస్తవికతలు గురించి విపులీకరిస్తూ.
మన దేశంలో పీడిత ప్రజలపై మూడు రకాల దోపిడీ, అణచివేత అమలవుతున్నది. 1. భూస్వాములు, 2. పెట్టుబడిదారులు, 3. సామ్రాజ్యవాదుల దోపిడీ. అయితే స్త్రీలపై వీటికి తోడు నాల్గవది పురుషాధిక్యత (భర్త పెత్తనం, జండర్, వివక్ష) కూడా అమలవుతున్నది. అంతేగాదు. అదనంగా కుల పీడన కూడా భారతదేశ ప్రత్యేకలక్షణం. అందుకని స్త్రీల అసమానత్వానికి కారణంగా వర్గం, జండర్, కుల వివక్షలను చూడాల్సి ఉంటుంది. వీటిలో వర్గదోపిడీ, జండర్, వివక్ష (పితృస్వామ్యం) ముందు అమలులోనికి వచ్చాయి. ఇవి ప్రపంచవ్యాపితంగా స్త్రీలు అనుభవిస్తున్నారు. కుల వివక్ష తర్వాత అమలులోకి వచ్చింది. ఇది మన దేశానికి ప్రత్యేక పరిస్థితి.
ప్రపంచవ్యాపితంగా సమాజంలో స్త్రీలు 1/3 వంతు శ్రమ నిర్వహిస్తున్నారు. ఇంటిపని, ఇల్లు కేంద్రంగా స్త్రీలు నిర్వహించే గుర్తింపులేని శ్రమ, పిల్లల పెంపకం కలిపితే 2/3 వంతు అవుతుంది. కానీ పురుషుని ఆదాయంతో పోల్చితే 10% మాత్రమే స్త్రీలకు లభిస్తోంది. ఆస్థిలో అయితే 1% మాత్రమే స్త్రీలు అనుభవిస్తున్నారు. స్త్రీల పట్ల ఆర్దిక అసమానత్వం, వర్గదోపిడీ ఎలా ఉందో ఇది తెలియచేస్తుంది.
ఇవిగాకుండా స్త్రీలపై సాంఘిక హింస, రాజ్యహింస, కుటుంబ హింసలు అమలు అవుతున్నాయి. పితృస్వామ్యం వివిధ రూపాల్లో వివిధ సెక్షన్ల స్త్రీలపై దీనిని పితృస్వామిక వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచీ అమలు చేస్తున్నది. కుల వివక్ష, మత వివక్ష కూడా ఇందులో చేరి ఉన్నాయి. స్త్రీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేదు. రాజకీయంగా సమాజంలో రెండో తరగతి పౌరురాలిగా చూస్తున్నారు. ఆచారాలు ఒకవైపు, అశ్లీల సంస్కృతి మరోవైపు పట్టి పీడిస్తున్నాయి. సమాజం ధనిక ` పేద వర్గాలుగా చీలిపోయినప్పటి నుండీ వర్గదోపిడీ ` అణచివేత అమలవుతున్నాయి. ప్రస్తుత వ్యవస్థకు సొంత ఆస్థి పునాదిగా ఉంది. పురుషులకు వారసత్వ హక్కులు ఏర్పడ్డాయి. వాటి పరిరక్షణ కోసం స్త్రీలపై హింస, ఆచారాలు సాగుతున్నాయి.
మనుషులు బ్రతికేందుకు అవసరమైన తిండి, దాన్ని సంపాదించేందుకు అవసరమైన భూమి, నీరు, ఇతర పనిముట్లు, సాధనాలన్నీ కొదిమంది చేతుల్లో పోగు పడ్డాయి. కోట్లాది మంది ప్రజలకు రెక్కలు తప్ప ఆస్థిలేదు. 45% మందికి కూలి జీవనాధారం. ఆస్థిలేదు. ఉపాధిలేదు. కసీన వేతనం లేదు. స్త్రీలకు వీటిలోపాటు సమాన వేతనం లేదు. శిక్షణ లేదు. ప్రమోషన్ లేదు. ఉన్నతోద్యోగాలు లేవు. 51% మంది స్త్రీలు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు.
పురుషుల్లో ఉన్న మేరకైనా స్త్రీలకు హక్కులేదు. వారసత్వ హక్కులేదు. కొడుకులు లేరనుకుంటే మరణించిన వాని ఆస్థి వారింట్లో కలుపుకుంటారు గాని కూతుళ్ళకు మాత్రం ఆస్తి ఇవ్వరు. ఇది గిరిజన సంప్రదాయం, మహిళా విముక్తిని తన ఎజెండాలో ఉంచుకున్న సి.పి.ఎం. వంటి పార్టీ గత 25 సంవత్సరాల నుండీ ప.బెంగాల్‌లో అధికారం నిర్వహిస్తోంది. అక్కడ కూడా పాలిరైతు మరణిస్తే అతనికి వారసులుంటే వారికి బదిలీ చేస్తారు. లేకపోతే అతని భార్యకు మాత్రం ఇవ్వటంలేదు. కొన్ని పనులు, కొన్ని ఉద్యోగాలే స్త్రీలకు కేటాయిస్తున్నారు అంటే ఇక్కడ వర్గ దోపిడీ ` లైంగిక వివక్ష అంటే వర్గ దోపిడీ ` జండర్ వివక్ష ఎలా కలిసిపోయాయో అర్థమవుతుంది. మనకు తెలియకుండానే జరిగిపోతోంది. దళిత మహిళలే ఎక్కువ భాగం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. అంటే వీరిపై ఈ రెండు వివక్షలే గాకుండా కులం రీత్యా చులకనగా చూసే భూస్వాములు, వాళ్ల సంతానం కొందరు వీళ్ళపై లైంగిక అత్యాచారాలు సాగిస్తారు. అంటే ఇక్కడ మూడు రకాల వివక్షలు కలగలిపి సాగుతాయి.
వర్గంతోబాటే వర్గదోపిడీ పరిరక్షణ కోసం మతం, రాజ్యం, చట్టం, నిర్భంధం (హింస) అమలులోనికి వచ్చాయి. వారసత్వం కోసమే స్త్రీలపై పురుషుల పెత్తనం ఆరంభమైంది. నిర్భంధ పాతివ్రత్యం, ఘోషా అమలులోకి వచ్చాయి. స్త్రీల పాతివ్రత్యం, దంపతీ వివాహం నీతి నియమాల సమస్యకాదు. అదే నిజమయితే అవి స్త్రీ ` పురుషు లిరువురికీ అవసరం. పురుషులు అనేకమంది పాత అలవాట్లు ఏదో ఒక రూపంలో కొనసాగిస్తున్నారు. సొంత ఆస్థి పరిరక్షణ కోసమే రాజ్యం ` నిర్భంధం ` చట్టం ` జైళ్ళు ` పోలీసు వగైరా అన్నీ ఏర్పడ్డాయి. ఇవి లేకపోతే అన్నార్తుల ప్రతిఘటనను ఎదుర్కోవటం కష్టం. అందుకే అణచివేత సాధనాలు తలెత్తాయి. ధనవంతుల సేవకై పేదల అణచివేతే దీని ధ్యేయం. అప్పటి నుండి ఇప్పటికి రాజ్యహింస అమలవుతూనే ఉంది. భూమి కావాలంటే, వేతనాలు పెంచాలంటే, ఉపాధి భద్రత కావాలంటే రాజ్యం తుపాకులు ఎక్కుపెడుతోంది. వీటి కోసం పోరాడేవాళ్ళను ఎన్‌కౌంటర్లలో చంపుతోంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ రాజ్య హింసకు బలవుతున్నారు. జాతీయోద్యమ కాలం నుండి నేటి ప్రతిఘటనోద్యమం వరకూ ఇదే వరస. శాంత, లలిత, సుశేన, చింతాలక్ష్మి, అరుణ, పూలమ్మ, రంగవల్లి ఎందరో ఇలా?
ధనవంతుల ఆస్థి పరిరక్షణ, వాళ్ళ రాజకీయాధికార రక్షణ కోసమే. కాశ్మీర్, బొంబాయి, పంజాబ్, ఢల్లీి ఎక్కడైనా ఉద్యమ ప్రాంతాలలో ఉద్యమకారులపై, కుటుంబ స్త్రీలపై, ఇతర స్త్రీలపై అత్యాచారాలూ, హత్యలు.

స్త్రీలపై అణచివేతలో సైలెంట్ కిల్లర్ పాత్ర :
వ్యక్తిగత ఆస్థిని రక్షించాలంటే అణచివేత, నిర్భంధం ఒక్కటే చాలదు. ఆచరణలో పితృస్వామ్యం దీనిని గ్రహించింది. కనుకనే ‘బ్రెయిన్‌వాష్’ కూడా దాని సరసనే ప్రారంభించారు. కర్మ సిద్దాంతం, దేవుడు, పునర్జన్మ, వగైరా రూపొందించి ప్రచారం చేశారు. మత గ్రంథాలు రాశారు. వాటినిండా స్త్రీల గురించి, పేదవారికి, దళితులకు తెలియకుండా తడిగుడ్డతో గొంతులు కోసే (సైలెంట్‌కిల్లర్) నీతులు రాశారు. స్త్రీలను కించపరిచారు. అవమాన పరిచారు. ధనవంతులకు ` పేదలకు, పురుషులకు ` పేదలకు వేర్వేరు విధులు నిర్వహించారు. మతం ఎలా సైలెంట్ కిల్లర్‌గా పనిచేస్తుందో రాజకీయాలు ఈ మతాన్ని ఎలా మార్చుకుంటున్నాయో కొంత వివరణ యివ్వడం జరిగింది.
ఎక్కడ ఏ మతం మెజార్టీగా ఉంటే అది మిగిలిన మైనార్టీ మతాలపై అణచివేత సాగించింది. ఇండియాలో హిందూ ` ముస్లీం ` క్రైస్తవ మతాలు ప్రధానమైనవి. అన్ని మతాలు స్త్రీల విషయంలో ఆంక్షలు విధించాయి. స్త్రీలపై లైంగికత్వాన్ని కంట్రోలు చేసే ప్రయత్నాలే చేశాయి.
హిందూమతం ` ఆస్థి రక్షణ కోసం సతీసహగమనం, బాల్య వివాహాలు, దేవదాసీ, జోగిని వగైరా. ముస్లీం మతం : ఘోషా, బహుభార్యత్వం, స్త్రీల మర్మావయవాల కంట్రోలు క్రిస్టియన్ మతం : తప్పుచేసిన స్త్రీలను రాళ్ళతో కొట్టడం, ఆడమ్ ` ఈవ్. ఆడమ్ క్రింద ఈవ్ అణిగిమణిగి ఉండాలి.రాజకీయానికి మతం తోడవుతుంది. పరస్పర సహకారం అందించుకుంటాయి. రాజకీయ ఆధిపత్యం కోసం మత ఘర్షణలు సృష్టిస్తారు. ఈ ఘర్షణల్లో ఎదుటి మతం స్త్రీలపై ఆత్యాచారాలు జరుగుతాయి. స్త్రీలపై లైంగిక ఆత్యాచారాన్ని ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఒక ఆయుధంగ వాడుతున్నారు.
వర్గ అణచివేతలో భాగంగా వ్యవసాయ కూలీ మహిళలపై భూస్వాములు, వాళ్ళ గుండాలు, రౌడీలు, అత్యాచారాలు సాగిస్తున్నారు. ఇవి గాకుండా ఇంటినుండి బయటికి వెళ్లిన స్త్రీలపై సాంఘిక హింస, అత్యాచారాలు, లైంగిక అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. చెడుపు పేరుతో, మంత్రగత్తెల పేరుతో స్త్రీల పళ్ళు పీకడం, గుండ్లు చేయటం జరుగుతున్నాయి. స్త్రీలను నగ్నంగా ఊరేగించడం కూడా వింటున్నాం.
అనగా కులవివక్షత ఇది ముస్లిం మహిళలపై ఘోషా, తలాక్ వంటి దురాచారాలే గాకుండా ముస్లిం దేశాలలో యువతుల మర్మావయవాలను కుట్టివేసి ఆమె లైంగికత్వాన్ని కంట్రోలు చేసే రాక్షసకృత్యం అమలవుతున్నది. పేదరికం కారణంగా ముస్లిం బాలికలను గల్ఫ్ దేశాలకు అమ్మివేసి పండు ముదుసలలకు పెళ్ళి చేయడం చూస్తున్నాం.
స్త్రీలపై కుల వివక్ష :
మన దేశంలో మతంతోబాటే కర్మ సిద్దాంతంతో భాగంగా శ్రమలను ఉచ్ఛ ` నీచాలుగా పరిగణించారు. శ్రమల ప్రాతిపదికగా వర్ణాలు ఏర్పరచారు. చాతుర్వర్ణ వ్యవస్థ అమలు చేశారు. శ్రమ విభజనను శాశ్వతం చేసే దానిలో భాగంగా వాటికి వంశ పారంపర్యత ఆపాదించారు. కులాల పేరుతో స్థిరీకరించారు. శ్రమనుబట్టి కులం విలువ పరిగణించారు. గొప్పకులాలు ` తక్కువ కులాలు ` అంటరానితనం పేరుతో వర్గీకరించారు. వర్గం ` కులం రెండూ ఒకటేననే వాదన ఉంది. అవి పూర్తిగా ఒకటి కావు. కొంత తేడా ఉంది.
ప్రధానంగా వెనుకబడిన, నిమ్న కులాల వాళ్ళలో అధికజనాభా 80% మంది పేదవాళ్ళు. అదే సమయంలో వెనుకబడిన కులాల పేరుతో ఉన్న వాళ్ళలో కూడా భూస్వాములు, ధనవంతులు ఏదో మేరకు ఉన్నారు. ఒకచోట ఆర్థికంగా వెనుకబడిన కులం మరో ప్రాంతంలో తగిన మోతాదులో ధనిక వర్గంగా
ఉంది. ఉదా : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్‌లో కాపు వర్గం బలంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా యూ.పి.లో యాదవ్, తెలంగాణాలో గౌడ మొదలైనవి.
ఉన్నత వర్గాల్లో, అగ్రకులాల్లో స్త్రీలకు కొన్ని సౌకర్యాలు, అనుభవాలు అదనంగా ఉంటాయి. కానీ స్వావలంబన. నిర్ణయాధికారం ఉండవు. కానీ అగ్రకుల స్త్రీలకు కూడా ఇటీవల దాకా వారసత్వ హక్కు, ఆస్థిహక్కు లేవు. కుటుంబ నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండదు. తమ సంపాదనపై తమకు హక్కు
ఉండదు. వీళ్ళు కుటుంబ హింసకు ఎక్కువ గురవుతారు. వరకట్న హత్యలు, గర్భస్థ పిండ నిర్మూలన, సతి మొదలైనవి అనుభవిస్తారు. వరకట్నం పేరుతో తీసుకెళ్ళే ఆస్థిపై కూడా వీళ్ళకు హక్కు లేకుండా పురుషులే ఖర్చు చేస్తారు. అత్యాచారాలకు, పని స్థలాల్లో లైంగిక వేధింపులకు గురవుతారు.
‘‘ఊరందరికీ అయ్యలోకువ, అయ్యకు అమ్మలోకువ’’ అన్నట్లు వెనుకబడిన కులాల్లో సైతం స్త్రీలు లోకువే. చివరకు తాము కుల వివక్షకు గురవుతూనే, కుల వివక్షకు వ్యతిరేకంగా అగ్రకులాల్లో కంటే కొంత తక్కువే అయినప్పటికీ ఈ కుటుంబాల్లో కూడా ఉంటుంది. దళిత మహిళలపై భూస్వాముల అత్యాచారాలు, అసాంఘిక శక్తులు (గుండాలు, రౌడీలు) లైంగిక దాడులు ఎక్కువ. ఆమె లైంగిక హక్కులు గుర్తించరు.
వ్యక్తిగత ఆస్థి పరిరక్షణకే ఏర్పడిన చట్టాలు, న్యాయస్థానాలు కూడా పితృస్వామిక స్వభావం కలిగి
ఉంటాయి. ప్రధానంగా తీర్పులు పేదలకు, స్త్రీలకు వ్యతిరేకంగా ఉంటాయి. ముఖ్యంగా దళిత, మైనార్టీ స్త్రీలకు న్యాయం చెయ్యకపోగా కించపరిచే వ్యాఖ్యలు చేసే సందర్భాలున్నాయి. ఉదా : దళిత మహిళ భన్వారీదేవి తనపై అత్యాచారం జరిగిందంటూ కోర్టుకెళ్ళితే ఆ న్యాయమూర్తి అత్యాచారం జరిగినప్పుడు నీ కాళ్ళు ఎంత ఎడంగా ఉన్నాయి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం అగ్రకుల పితృస్వామిక స్వభావం తప్ప వేరే కాదు. అలాగే 1980లో మధు రేప్ కేసు వాదన సందర్భంగా కూడా ఆమె వ్యభిచారి అనీ, ఆమెను చూస్తే అత్యాచారం చేసిన వాడికి కోరిక కలిగిందంటూ వెకిలిగా వ్యాఖ్యానించారు. ఈమె మహారాష్ట్రలోని చాద్రాపూర్ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ, రమీజాబీ కూడా ముస్లిం మహిళగా ఆమె బురఖా వేసుకోకుండా రాత్రిళ్ళు సంచరిస్తుంది కనుక ఆమె వ్యభిచారి అని పోలీసులు వ్యాఖ్యానించడం ఏం తెలుపుతుంది. అంటే నిజంగా వ్యభిచారులయితే మాత్రం ఆ స్త్రీలపై లైంగికత్వంపై దాడి చేసే హక్కు
ఉందా? ఇక్కడ జండర్ ` కుల వివక్షలు కలిసిపోయాయి. దళితులను అంటరానివారిగా పరిగణించే అగ్రకుల పెత్తందార్లు దళిత మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి, అత్యాచారాలు చేయడానికి మాత్రం అంటరానితనం అడ్డురాదు.
రాజ్యం చేతిలో కీలుబొమ్మలయిన చట్టాలు వాటి పితృస్వామిక భావజాల వివరణ వుంది. దేవదాసి, బసివిని, జోగిని వంటి దురాచారాలు అమలు జరిగేది కూడా ఎక్కువ భాగం పేదవర్గాల హరిజన (దళిత) కులాల యువతులపైనే. పేదరికం మూలంగా ఆ కుటుంబాలు కూడా దేవాలయాలకు తమ కుమార్తెను జోగినిగా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వర్గ ` కుల ` జండర్ అణచివేతలు కలగలిసి పోయాయి.
దళితులలోనే ఒక సెక్షన్ మహిళలు (పురుషులు కూడా) దళిత హిందువులు (ప్రధానంగా హరిజనులు) అంటరానితనం నుండి తప్పించుకొనేందుకు క్రిస్టియన్లుగా మారి మతం పుచ్చుకున్నారు. వీరికి దళితులు అనుభవించే మేరకు కూడా రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. చర్చి కూడా కుల చర్చిగా తయారయ్యింది. దళిత క్రిస్టియన్లుకు ప్రత్యేక శవపేటికలు, ప్రత్యేక సమాధులు, చర్చిలో ప్రత్యేక స్థలాల కేటాయింపు జరుగుతోంది. దళిత పేటల గుండా హిందువులు మత ఊరేగింపులు నిషేధిస్తారు.
అలాగే ఇటీవల చట్టసభల్లో స్త్రీలకు 33% రిజర్వేషన్ బిల్లు కూడా గత ఐదు సంవత్సరాలుగా ఐదు దఫాలు ఆమోదం పొందకుండా అటకెక్కింది. మహిళల కోటాలో శ్రామిక వర్గానికి చెందిన ఓబిసి మహిళల అంతర్‌కోటా కూడా చేర్చి ఆమోదించవలసింది పోయి దీన్ని ఆటకమీద పడేశారు. ఆ సందర్భంగా లోక్‌సభ సభ్యులైన కొందరు ఎం.పిలు తమ పురుషాధిక్య స్వభావాన్ని చాటుకొంటూ సిసలైన పితృస్వామిక వాదులుగా రుజువు చేసుకున్నారు. ఇప్పటికే స్త్రీలకు ఓటుహక్కు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వాటిని పురుషులు, గ్రామ పెత్తందార్లు కంట్రోలు చేయటం చూస్తున్నాం.
ప్రస్తుత స్త్రీల కోటాలో ఒబిసి మహిళలకు అంతర్‌కోటా కోరటం మంచిదే. కాని ఆ కోరిన దళిత పురుషులు తమ చిత్తశుద్ది గురించి ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఇప్పటికీ ఏదో మేరకు రిజర్వుడు సీట్లు కలిగిన రిపబ్లికన్ పార్టీ వంటివి దళిత మహిళలకు ఎందుకు సీట్లు కెటాయించలేకపోతోంది? అధికారంలోకి రాగలిగే బలం ఉన్న బీహార్, యూపిలలో లాలూ, ములాయం పార్టీలు తమ రాష్ట్రాలలో దళిత మహిళలకు సీట్లు కేటాయించటానికి ఎవరు అడ్డువచ్చారు? ప్రభుత్వం రిజర్వేషన్లు నిర్ణయిస్తేనే స్త్రీలకు సీట్లు కేటీయిస్తారా? అంటే దళిత పురుషులు కూడా పితృస్వామ్యం (ఆధిపత్య దోపిడీ) అమలు జరుపుతున్నారనే దళిత మహిళల ఆవేదన సరైంది కాదా? పితృస్వామిక అగ్రకుల ఆధిపత్య ప్రభావం నిమ్నకులాల పురుషుల్లో సైతం తమతమ స్థాయిలో ఉందనేది కాదనగలమా? అంటూ రచయిత్రి అందర్ని నిలదీస్తారు.
పై విషయాల సారాన్ని మదింపు చేస్తూ రచయిత్రి ఇలా ప్రకటిస్తారు కనుక వీటికి ఆలంభనగా ఉన్న వర్గ వ్యత్యాసాలు, దానికి పునాదిగా సొంత ఆస్థి వ్యవస్థను రద్దు చేయకుండా దానికై వ్యవస్థ మార్పుకోసం పోరాడకుండా స్వంత అనుభవాలు అనే పేరుతో ఎవరి అనుభవాలకు వ్యతిరేకంగా వాళ్ళు విడివిడి బృందాలుగా పోరాడటం వల్ల వాటి నుండి విముక్తి మాత్రం సాధ్యం కాదు. చిన్న చిన్న ఫలితాలు సంస్కరణలు ఏవైనా పొందగల్లుతారేమో గాని మొత్తం విముక్తి మాత్రం పొందజాలరు.
కనుక వర్గం ప్రధానం అంటున్నారని మార్క్సిజాన్ని కించపర్చటం గాదు. అలాగే తమ అనుభవాల పేరుతో ప్రత్యేక ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్న ఫెమినిస్టులు. దళిత మహిళల ఆవేదనల్లోని అంతఃస్సారాన్ని గ్రహించి, వాళ్ళపై గుడ్డి ద్వేషం పెంచుకోకుండా కలిసి కదిలి ఈ వ్యవస్థను దానికి వివిధ రకాల వివక్షల శాఖలను కూడా పోరాటం ద్వారా నిర్మూలించాలి. ఐక్య పోరాటాలు నిర్మించాలి. అవగాహనల్లోని ‘‘తేడా’’లను సరిజేసుకోవాలి. కనుక ఈ పితృస్వామిక వర్గ దోపిడీ ` పురుషధిక్య, కుల, మత, జాతి వివక్షలతో కూడిన వ్యవస్థను మార్చటానికి సమాజానికి విప్లవీకరించటానికి అవసరమైన విప్లవ అవగాహనను, విప్లవ ఫెమినిస్టు అవగాహనను, మహిళా విముక్తి దృక్పథాన్ని ఏర్పరచుకుని పోరాడాలి.
యింక సారాంశంలో మన మహిళా విముక్తి సారాంశంలో దళిత మహిళా విముక్తి వుందని దానిని సరిగ్గా అర్థం చేసుకొనాలని కోరుతూ మహిళా పోరాటాలు లేదా ఉమ్మడి పోరాటాలు చేపట్టాలి. లైంగిక శ్రమ విభజన, ఆస్థి హక్కు, సమాన వేతనాలు, వారసత్వం మొదలైనవి జోడిరచాలి. స్త్రీలు ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలపై జండర్ వివక్షపై పితృస్వామిక అణచివేత, లైంగిక హింస, వరకట్నం, వరకట్న హత్యలు, దురాచారాలు, కుటుంబ హింస, సంబంధిత సమస్యలన్నీ అలాగే దళిత, మైనార్టీ, గిరిజన జాతుల సమస్యలపై అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రత్యేక శ్రద్ధ వహించి చేపట్టాలి.
ఇంటిపని, పిల్లల పెంపకాలను సామాజీకరించే వరకూ కుటుంబంలో ఆ బాధ్యత కేవలం స్త్రీలపై వదిలివేసే పురుషాధిక్య ధోరణులకు వ్యతిరేకంగా వాటి బాధ్యతలు స్త్రీలు ` పురుషులిరువురూ చేపట్టేలా అంతరంగిక పోరాటంపై కూడా తీవ్రంగా కృషి చేయాలి. అలసత్వం ప్రదర్శించకూడదు. స్త్రీల సమస్యలపై పోరాట చైతన్యాన్ని వ్యవస్థ మార్పు కోసం సమాజాన్ని పితృస్వామిక స్వభావం నుండి విప్లవీకరించటానికి చేసే వర్గ పోరాటం వైపుగా అభివృద్ధి చేయాలి. దానికి అనుసంధానం చేయాలి. స్త్రీలలో వర్గ చైతన్యాన్ని, జండర్ చైతన్యాన్ని, కుల నిర్మూలనా చైతన్యాన్ని అభివృద్ధి చేసేలా తర్ఫీదు ఇవ్వాలి. స్త్రీల పోరాటాలను మహిళా సంఘ నిర్మాణంతో జత చేయాలి. విద్యార్థి, ఉద్యోగ, పట్టణ మహిళల సమస్యలన్నింటిపై పోరాటాలు చేపట్టాలి.
ఉమ్మడి పోరాటాలకు స్త్రీలను సమీకరిస్తూనే ప్రత్యేక పోరాటాలు అభివృద్ధి చేయాలి. రెండు పోరాటాల అవసరాన్ని కుల ` మత వివక్ష వ్యతిరేక పోరాటాన్ని అందులో మిళితం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. వర్గ పోరాటాన్ని మాత్రమే గుర్తించి స్త్రీల పోరాటాలను గుర్తించకపోవటమూ, స్త్రీల పోరాటాలను మాత్రమే గుర్తించి వర్గపోరాటాన్ని గుర్తించకపోవటము కూడా తప్పవుతుంది. స్త్రీలు పురుషాధిక్యతకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రథమ కర్తవ్యం అని భావించటం గాని, వర్గ విముక్తి తర్వాత మాత్రమే స్త్రీల విముక్తి, దళిత విముక్తి కోసం కృషి చేయాలని భావించటం గాని సరికాదు. వర్గపోరాటాన్ని ప్రధానాంశంగా భావిస్తూ వివిధ సెక్షన్ల ప్రజల ప్రత్యేక సమస్యలపై కూడా స్త్రీల ప్రత్యేక సమస్యలు, కులం, మతం, వివక్ష, జాతి మొదలైనవి శ్రద్ధ వహించి పోరాటాలు నిర్వహించాలి. వీరిలో వర్గ చైతన్యం కూడా పెంచడం ద్వారా వర్గ పోరాటాలు కూడా బలవత్తరం అవుతాయి. ప్రత్యేక సమస్యలపై అణచివేత నిర్ధిష్ట సమయంలో తీవ్రంగా ముందుకు వచ్చినప్పుడు దానిపై కేంద్రీకరించి కృషి చేయాలి.
వర్గ పోరాటాలు, ప్రత్యేక సమస్యలపై పోరాటాలే గాకుండా దేశ రాజకీయ సమస్యలపై, మహిళలపై వాటి ప్రభావం, రాజకీయాల్లో మహిళల పాత్ర, రిజర్వేషన్లు, నష్టకరమైన చట్టాల రద్దు, కొత్త చట్టాలు, తప్పుడు తీర్పులు, సామూహిక అత్యాచారాలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు, బాలికల అమ్మకాలు వంటి అన్ని సమస్యలపై పోరాడాలి. దేశంపై సామ్రాజ్యవాదుల దోపిడీ, పీడన, సామ్రాజ్యవాద ఏజెన్సీలైన వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యుటిఓ. ఎంఎన్‌సీల దోపిడీ, అణచివేతలపై, సామ్రాజ్యవాదులు ప్రవేశపెట్టే అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కూడా ఇతర సెక్షన్లతో ఉమ్మడిగా పోరాడాలి. ఈ దేశంలోని దోపిడీ`పితృస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వామ్య, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దోపిడీకి పితృస్వామ్యం ` కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి. వర్గ విముక్తి కానిదే శ్రమ విముక్తి కాదు. శ్రమ విముక్తి కానిదే స్త్రీ విముక్తి సాధ్యం కాదు. అందుకే శ్రామిక మహిళా ఉద్యమ నిర్మాణం కేంద్రంగా మహిళా ఉద్యమ నిర్మాణానికి పూనుకోవాలి. అప్పుడే స్త్రీలు అనుభవిస్తున్న వర్గ ` కుల ` జండర్ వివక్షల నుండి విముక్తి చెందుతారు అంటూ సందేశాన్ని యిస్తారు.
రచయిత్రి టాన్యా పోరాడి సాధించుకోవలసిన హక్కుల గురించి పాఠాలు చెప్పిన గురువే కాదు నిత్యం ఆచరణలో సిద్దాంతాన్ని అన్వయించి దాని సారాన్ని స్త్రీలకు అందించారు. గోదారి లోయంత అనుభవాన్ని పొందిన ఆమె ఈ పుస్తకం మొట్టమొదటి ముద్రణ 2006లో జరిగింది. అప్పటి వరకు అంటే 2006 వరకు జరిగిన చారిత్రక సందర్భాలను, సంఘటనలను కొన్నింటిని పాఠకులు అర్థం చేసుకోవడాన్కి ఈ పుస్తకంలో జోడిరచారు. అయితే 2005 చివరిలో స్త్రీల జీవితాల్కి సంబంధించిన కొన్ని చట్టాలు వచ్చాయి. కొన్ని స్త్రీ జీవితాన్ని చిధ్రం చేస్తే అతికొన్ని స్త్రీ జీవితాన్కి ఆసరాగా నిలిచాయి. ఆసరాగ వచ్చిన చట్టాలన్ని మహిళా ఐక్య సంఘటనల పోరాటాల ఫలితమే.
ముఖ్యంగా సామ్రాజ్యవాద దళారి ప్రభుత్వం స్త్రీల జీవితాల్ని చిచ్చుపెట్టే ప్రత్యేక ఆర్ధిక మండలుల ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ద్వారా భూమిని ఒక సరుకుగా మార్చివేసి రైతుల మరి ముఖ్యంగా దళితులకిచ్చిన అసైన్డ్ భూముల నుండే బడా పెట్టుబడిదారి కంపెనీలకు అప్పగించే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో స్త్రీ జీవితం పైన విపరీతమైన ఒత్తిడి పెరిగింది. నిర్వాసిత్వంలో స్త్రీలపై మరింత హింస పెరిగింది. ఈ క్రమంలో సెజ్ వ్యతిరేక పోరాటాల్లో స్త్రీలు కులాలకు అతీతంగా ఒకమేరకు మమేకమవ్వడం చూసాం. పోరాటాలలో స్త్రీలు ప్రధాన భూమిక వహించారు. (‘‘రచయిత్రి, ఆ సంఘం స్వయంగా ఆ పోరాటాలలో ప్రధాన పాత్ర వహించారు’’.) ఆ మేరకు ఈ తాత్విక పరిచయంలో వాటి ప్రస్తావన వుంటే మరింత పుష్టిగా వుండేది. దళిత బహుజన వర్గాల ఐక్య పునాదిగా రాజ్యాధికార సాధన భావనను దెబ్బకొట్టే లక్షింపేట సంఘటన జరిగింది. దళితుల ఊచకోతలో బిసి స్త్రీలు సహాయపడడంలో ఉపయోగపడిన పితృస్వామిక భావజాలం, వాటి వివరణ ఉంటే పాఠకులకు / సామాజిక కార్యకర్తలకు మరీ ముఖ్యంగా స్త్రీలను విడగొట్టాలని ప్రయత్నించే పురుషాదిపత్య వర్గాన్కి కనువిప్పుగా ఉండేది. అలాగే కేవలం కులపునాదిపై రాజ్యాధికారాన్ని పొందుతామనుకునే భావాజాలాన్కి ఒకసమాధానంగా ఉండేది.
2006 తర్వాత మైనార్టీ స్త్రీలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఉధృతంగా పెరిగాయి. కాందమాల్‌లో నన్‌పై అత్యాచారం, అర్థ నగ్నంగా పెరేడ్ చేయించడం, చత్తీస్‌ఘడ్‌లో మైన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నన్‌ను హత్యచేయడం, మంగుళూరులో హిందూమతోన్మాదంతో హిందు సంస్కృతిని కాపాడే పేరుతో క్రిస్టియన్ మైనార్టీలు యువతులను బెదిరించి వేటాడడం… చర్చి పాస్టర్లను చంపి వేయడం లాంటి అంశాలని తడుముతూ మతత్వం హిందు జాతీయవాదం యొక్క వ్యూహం ఎత్తుగడుల గురించి చర్చించి ఉంటే పాఠకులు మతత్వ రాజకీయాలను మరింత బాగా అర్థం చేసుకుని ఉండేవారు.
నిర్భయ కేసులో వచ్చినంత స్పందన ఇతర సామాజిక ఆర్ధిక పోరాటాలకు ఎందుకు రావడం లేదు? దళిత, ఆదివాసి, మైనార్టీల పట్ల మితమైన ప్రతి స్పందన కారణాలు వివరిస్తే చాలా సందర్భోచితంగా వుండేది. అలాగే వనరుల కోసం, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమాల్లో భాగస్వామి అయిన స్త్రీలపై రాజ్యహింస దాని స్వరూపం పట్ల స్త్రీల కోసం పనిచేసే ఎన్.జి.ఓ.ల మౌనం, వాటి పరిమతులు ఉద్దేశాలు రచయిత్రి అనుభవనం, అవగాహన, ఆచరణ ఆధారంగా విశ్లేషించవలసింది. ఈ పుస్తకాన్కి యిది కొరతే.
దళితోద్యమంలో కారంచేడు ఒక మైలురాయి. ఆలీసమ్మ వేసిన ప్రశ్నల స్పూర్తి దళిత ఉద్యమంలో దళిత ఫెమినిజాన్ని ముందుకు తీసుకొచ్చింది. కులం భారత సమాజంలో వర్గాలు, మతాలుగా రూపాంతరం చెందిన తర్వాత వారి స్త్రీలు పడిన వివక్ష హింస తాను ప్రస్తావిస్తూనే వారి విమక్తి ఉద్యమాల్లో భాగం కావాలని చెప్పారు. కాని విభజింప పడ్డ స్త్రీలు, స్త్రీల సంఘాలు అవగాహన, వారు తీసుకోవాల్సిన చర్యలు వివరణ యింకొంత ఉదాహరణతో విపులీకరించ వలసిందిగా కోరటంలో తప్పులేదేమో!
ఏదీఏమైనా రచయిత్రి తన అవగాహనను అనుభవాలను రంగరించి మనందరి కోసం ఒక పుస్తకంగా తేవటం చాలా మంచి ఆలోచన. ఈ పుస్తకం మొత్తం 34 పేజీలే కాని దీని పరిధి ఎంతో విస్తృతమైంది లోతైనది. సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలెన్నో ఒక తాత్వికగా అందించడంలో సమాజం బాధ్యత పట్ల ఆమెకు వున్న కమిట్‌మెంట్‌ను తెలియచేస్తుంది.
ఈ వ్యాసం చదివాక సమాజం, స్త్రీ ఉద్యమాలపట్ల మన అవగాహనను, ప్రాపంచిక దృక్పధాన్ని తరచి చూసుకోకుండా ముందుకు వెళ్ళలేము. మనల్ని ఎంతో ఆలోచింపచేసే పుస్తకం యిది. పుస్తకం చదివాక మహిళా ఉద్యమ నిర్మాణంలో మన వంతు కర్తవ్యం ఏమిటి? అన్న ఆలోచన రాకమానదు. పితృస్వామం కుల మత వర్గ పునాదిగా ఏర్పడ్డ సత్యాన్ని స్పష్టంగా చెప్పగలిగారు. ఆత్మగౌరవం, నిర్ణయాధికారం, సమాన ప్రతిపత్తి ఉన్న స్వేచ్చను కోరుకునే ప్రతి స్త్రీ ఈ పుస్తకం చదవవలసిందే. స్త్రీ విముక్తి కోసం పోరాడుతున్న సంఘాలు, రాజ్యం హింసను ప్రశ్నించి తలపడుతున్న హక్కుల సంఘాలకు ఈ పుస్తకం స్పూర్తిని, నిబద్దతతో కూడిన తాత్వికతను అందిస్తుంది.
లెనిన్ అన్నట్టు మహిళల విముక్తి పోరాటమనేది తన వర్గానికి చెందిన పురుషులకు వ్యతిరేకంగా సాగేది మాత్రం కాదు. ఆమె సాగించే పోరాటం యొక్క తుది లక్ష్యం పురుషులకు వ్యతిరేకంగా నిలవడం కాదు. కార్మిక వర్గ రాజకీయ పాలనను స్థాపించడం. తన వర్గానికి చెందిన మగవారితో భుజం భుజం కలిపిన కార్మిక మహిళలు పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకంగా పోరాడుతారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారి వర్గం ముప్పేట మనపై దాడిచేస్తున్న తరుణంలో మహిళల పాత్ర ఉద్యమాలలో ఎంతో ఉంది. ఈ స్పూర్తికి చేయూత నిచ్చేది వర్గం ` కులం ` జెండర్ అణిచివేత స్త్రీ విముక్తి పుస్తకం. అందుకు రచయిత్రి టాన్యాను, ప్రగతిశీల మహిళా సంఘమును మనం అభినందించవలసిందే.
ఎంతో అర్థవంతమైన కవర్ పేజీతో ఉన్న ఈ పుస్తకం వెల అందరికి అందుబాటులోనిదే…
(రూ. 20/`) అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో దొరుకుతుంది.
– హేమావెంకటావ్ర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
No comments:
Post a Comment