కరపత్రం మే 3, 2008
విశాఖపట్నంలో ఇండస్ట్రీయల్ కోస్టల్ కారిడార్
నిర్మాణానికి వ్యతిరేకంగా జరగనున్న మహాసభ జయప్రదం కొరకు
చలో విశాఖ
పజ్రలారా! పజ్రాస్వామికవాదులారా!!
మత్స్యకారులను, దళితులు, రైతులు, రైతు కూలీలు, పర్యావరణాన్ని, ఆహార ఉత్పత్తులను, సముద్ర ఉత్పత్తులకు నష్టం కలిగించే కోస్టల్ కారిడార్‌ను కలసి కట్టుగా అడ్డుకుందాం. ఈ కోస్టల్ కారిడార్‌ను ఏడాది కాలంగా మత్స్యకారులు, దళితులు, రైతులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవడం లేదు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జి.ఒ. 34 ను విడుదల చేసి కోస్టల్ కారిడార్ నిర్మాణానికి అంగీకారం తెలపడాన్ని ఇండస్ట్రీయల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజలకు, పర్యావరణానికి ఏవిధంగానూ ఉపయోగపడని ఈ కోస్టల్ కారిడార్‌ను పాలకులు, ఉన్నతాధికారులు ఎలా రూపకల్పన చేశారు?? బడుగు ప్రజల సంక్షేమం, ఇందిరమ్మరాజ్యం, రైతురాజ్యం తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్‌ఇజెడ్‌లు, ఫార్మాపార్కులు, రసాయన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో ముందుగా రైతులు, మత్స్యకారులు, దళితులు, గిరిజనులు, బడుగుబలహీన వర్గాలను తినడానికి తిండిలేకుండా చేస్తోంది. ఇదివరకటి ప్రభుత్వాలు పేదలకిచ్చిన అసైన్డ్, ఇనాం భూములను, పేదలు సాగు చేసుకుంటున్న బంజర్లను తిరిగి సేకరించడం అన్యాయం, అప్రజాస్వామికం, ఎన్‌ఇజడ్‌ల చట్టాలను, కోస్టల్ కారిడార్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెంబర్ 34ను వెంటనే రద్దు చెయ్యాలి. ఈ రెండిరటి వల్ల మత్స్యసంపదకు, ఆహారభద్రతకు, పర్యావరణానికి, జీవావరణానికి పెనుముప్పు కలుగుతుంది. ఈ రెండూ పేద, మధ్యతరగతి ప్రజల ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా ఆహారభద్రతకు పెను సవాల్‌గా మారనున్నాయి.
ప్రత్యేక ఆర్ధిక మండలి (ఎస్‌ఇజడ్) చట్టం ఏం చెబుతోంది : ఎన్‌ఇజెడ్ చట్టం ఎగ్జిమ్ పాలసీ 2000 చాప్టర్ 9 పేరా 30లో ఇదొక విదేశీ భూభాగంగా ప్రభుత్వం పేర్కొంటుంది. దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి విదేశీ పాలకులను తరిమి కొట్టారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూ విదేశీ వస్త్రాలను సైతం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆ త్యాగధనుల పోరాట స్పూర్తికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నెత్తిన కొరివి పెట్టే రీతిలో ఈ చట్టాలను తీసుకొచ్చింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని పౌరులంతా రాజ్యాంగ హక్కులను పొందుతున్నారు. ఈ హక్కులకు, దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాసే ఈ చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. ఎస్‌ఇజడ్ చట్టమే ప్రమాధమనుకుంటే అనేక ఎస్‌ఇజడ్‌లు, ఫార్మా పార్కులు, రసాయన పరిశ్రమలతో తీర ప్రాంతానికి ముప్పు కలిగించే మహా ఎస్‌ఇజడ్ లాంటి కోస్టల్ కారిడార్ ఏర్పాటుచేసుందుకు విడుదల చేసిన జిఓ నెంబర్ 34ను తక్షణమే రద్దు చెయ్యాలి.
కోస్టల్ కారిడార్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారు : కోస్తా తీరంలోని తొమ్మిది జిల్లాల్లో దశలవారిగా ఈ కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భూముల సేకరణకు రంగం సిద్దం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో వరి పంట అధికంగా పండే భూములు ఈ తొమ్మిది జిల్లాల్లో విస్తరించి వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకశాఖ వివరాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ చేస్తుందో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉత్తర్వులలో కోస్టల్ కారిడార్‌లో ఫేజ్`1 కింద తూర్పుగోదావరి, విశాఖజిల్లాల్లో 603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షా యాభైవేల ఎకరాల్లో ‘‘పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ రీజియన్’’ (పిసిపిఐఆర్) ఏర్పాటు చేయనున్నట్లు, తర్వాత దశల్లో మిగిలిన జిల్లాల్లో 972 కి॥మీ॥ల పొడవున కోస్టల్ కారిడార్‌ను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పేద, మద్యతరగతి ప్రజల భూములను తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 70 ప్రత్యేక ఆర్ధిక మండళ్ల కోసం భూములు సేకరించడం, ఇవికాక ఇండ్రస్ట్రీయల్ పార్కులు, థీమ్ పార్కులు, మెగా కెమికల్ కాంప్లెక్స్‌లు, ఫార్మా పార్కుల పేరుతో ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూమిని సేకరిస్తోంది. కొత్తగా ఇప్పుడు కోస్టల్ కారిడార్‌ను ఫేజ్`1 క్రింద పిసిపిఐఆర్ పరిధిలో మరో 1.5 లక్షల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఆహార పంటల విషయానికి వస్తే వరి పంటసాగు విస్తీర్ణం 2004`05 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల 86 వేల 202 హెక్టార్లు వుండేది. ఈ ప్రాంతంలో దిగుబడయ్యే బియ్యం 96 లక్షల ఒక వెయ్యి 45 టన్నులు. ఇందులో కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేసే జిల్లాలో పరిశీలిస్తే 20 లక్షల 23 వేల 87 హెక్టార్‌లలో 67 లక్షల 64 వేల 203 టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి.
` శ్రీకాకుళం జిల్లాలో 1,92,993 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 4,54,304 టన్నులు.
` విజయనగరం జిల్లాలో 1,27,575 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 2,95,331 టన్నులు
` విశాఖజిల్లాలో 97,808 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 1,64,472 టన్నులు.
` తూర్పుగోదావరి జిల్లాలో 3,87,424 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 15,09,910 టన్నులు
` పశ్చిమగోదావరి జిల్లాలో 3,87,996 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 16,49,568 టన్నులు.
` కృష్ణా జిల్లాలో 2,55,323 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 8,36,433 టన్నులు
` గుంటూరు జిల్లాలో 2,61,651 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 9,04,883 టన్నులు
` ప్రకాశం జిల్లాలో 93,569 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 3,15,937 టన్నులు
` నెల్లూరు జిల్లాలో 1,86,747 హెక్టార్లలో ఉత్పత్తయిన బియ్యం 6,33,365 టన్నులు
ఇవికాక రాగులు, పెసలు, మినుములు, నువ్వులు, కొబ్బరి, చెఱకు, పొగాకు, మిరప, జీడిమామిడి, మామిడి, పసుపు, అరటి తదితర పంటల దిగుబడి కోస్తా జిల్లాలోనే అధికంగా ఉంది. కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తే వరితో పాటు పైన పేర్కొన్న పంటల దిగుబడి పూర్తిగా దెబ్బతింటుంది. ఈ పరిస్థితిల్లో రాష్ట్ర ప్రజానీకం ఏమి తిని బ్రతకాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కోస్తా జిల్లాల్లో పండుతున్న వివిద పంటల ద్వారా వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ఆర్ధిక, గణాంక విభాగం సేకరించిన లెక్కల ప్రకారం పరిశీలిస్తే మొత్తం ఆదాయం 16,095.35 కోట్ల రూపాయలు.
` శ్రీకాకుళం జిల్లా ఆదాయం 828.75 కోట్ల రూపాయలు.
` విజయనగరం జిల్లా ఆదాయం 856.24 కోట్ల రూపాయలు
` విశాఖపట్నం జిల్లా ఆదాయం 604.07 కోట్ల రూపాయలు
` తూర్పు గోదావరి జిల్లా ఆదాయం 2,238.01 కోట్ల రూపాయలు
` పశ్చిమగోదావరి జిల్లా ఆదాయం 2,302.25 కోట్ల రూపాయలు
` కృష్ణా జిల్లా ఆదాయం 2,289.73 కోట్ల రూపాయలు
` గుంటూరు జిల్లా ఆదాయం 3,335.42 కోట్ల రూపాయలు
` ప్రకాశం జిల్లా ఆదాయం 1,953.85 కోట్ల రూపాయలు
` నెల్లూరు జిల్లా ఆదాయం 1,389.03 కోట్ల రూపాయలు
కోస్తాతీరంలో 972 కిలోమీటర్ల పొడవున విస్తరించి వున్న సముద్రతీరంలో 80 లక్షల మంది మత్స్యకారులు నివాసం వుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక, గణాంక శాఖల లెక్కల ప్రకారం 2005`2006లో ఈ ప్రాంతంలో 6,768.89 కోట్ల రూపాయల విలువ చేసే మత్స్య సంపద లభ్యమయ్యింది. కోస్తా తీరంలో ఇప్పటి వరకూ అక్కడక్కడ వచ్చిన రసాయనిక పరిశ్రమల వల్ల మత్స్య సంపదకు ముప్పు వాటిల్లితోంది. తీరం వెంబడి జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి దుష్పరిణామాలు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే దీనికి సాక్ష్యం. ఈ ఏడాది జనవరి నెలలో పరవాడ మండలంలో వున్న సింహాద్రి ఎన్‌టిపిసి కర్మాగారం నుండి వెలువడిన పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలిసే ప్రాంతంలో అధిక సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృతి చెందాయి. ఫిబ్రవరి నెలలో 14, 15 తేదీల్లో విశాఖనగరంలోని దుర్గాబీచ్ ప్రాంతంలో సముద్రంలో టన్నుల కొద్దీ చేపలు చనిపోయి తీరానికి కొట్టుకు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని కలిగించే వందలాది పరిశ్రమలు ఏర్పాటు చేస్తే జరిగే నష్టం ఏమేరకు వుంటుందో వూహించుకోవచ్చు. పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీయల్ రీజియన్ వలన జరిగే నష్టానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? రాష్ట్రం నుంచి 2004`2005 ఆర్థిక సంవత్సరంలో విదేశీలకు ఎగుమతి చేసిన రొయ్యల్లో రసాయిన అవశేషాలున్నాయని జపాన్, యూరప్ దేశాలు మన మత్ససంపదను వెనక్కు పంపించాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో చేపల వ్యాపారులు ఆ రొయ్యలను సముద్రంలో పారబోసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మత్స్య కారు జీవనంపైన, విదేశీ మారక ద్రవ్యం పైన ప్రభావం చూపే మత్స్యసంపద విషయంలో ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
విశాఖ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు ఏలేరు జలాశయం ఎడమ కాలువ నుంచి వస్తున్న 385 మిలియన్ లీటర్ల నీటిని కోస్టల్ కారిడార్‌కు మల్లిస్తే విశాఖ నగరవాసులకు త్రాగునీరు ఎక్కడ నుంచి వస్తుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. జలయజ్ఞం పేరుతో భారీ ఎత్తున జలాశయాలు నిర్మిస్తున్నామని చెపుతున్న ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి కోస్టల్ కారిడార్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న పిసిపిఐఆర్‌కు పోలవరం జలాశయం ఎడమ కాలువ ద్వారా రోజుకు 1848 మిలియన్‌లీటర్ల వంతున నీటిని సరఫరా చేస్తామని కోస్టల్ కారిడార్ నివేదికలో పొందు పరచడం దళితుల్ని, రైతుల్ని, గిరిజనుల్ని మోసం చేయడంకాదా? పోలవరం జలాశయం నిర్మించ వద్దని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖ్మం జిల్లాలకు చెందిన 300 గ్రామాలకు పైగా గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే వారిని పట్టించుకోకుండా దళితులు, రైతుల ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు పరిశ్రమల ప్రయోజనాల కోసం నీటిని సరఫరా చేయాలని సంకల్పించిడం ప్రజావంచన కాదా? తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట ప్రాంతంలోని దళితుల, నిరుపేదల ఆధీనంలోని అసైన్డ్ భూములు, ఇతర రైతుల భూముల కోసం రోజూ చేస్తున్న 220 మిలియన్ లీటర్ల నీటిని కోస్టల్ కారిడార్‌కు ఇవ్వాలని సంబంధిత నివేదికలో చెప్పడం అన్యాయం కాదా?
ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా నష్టాన్ని కలిగించే కోస్టల్ కారిడార్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిలుపుచేయాలి. కోస్టల్ కారిడార్, ఎస్‌ఇజెడ్‌ల కోసం చేపడుతున్న భూసేకరణను వెంటనే నిలుపుచేయాలి. ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించడం కొరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సంఘాల ప్రజలతో ప్రజా ర్యాలీ బహిరంగ సభ నిర్వహించదలచాము. ఆ సందర్భంగా చలో విశాఖ పిలుపునిచ్చాము. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము.
కోస్టల్ కారిడార్ నిర్మాణం వద్దే వద్దు
డిమాండ్స్ :
` ప్రత్యేక ఆర్థిక మండలుల చట్టాన్ని రద్దు చేయాలి., అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపడీని ఆపాలి.
` కోస్టల్ కారిడార్ నిర్మిస్తే రాష్ట్రంలోని తొమ్మిది కోస్తా జిల్లాలలో నివాసం వుంటున్న మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారు. సముద్రంపై ఆధారపడి ఏటా ఉత్పత్తి చేస్తున్న 6.7 వేల కోట్ల రూపాయల విలువ చేసే మత్స్య సంపదకు ముప్పు ఏర్పడుతుంది.
` సిరులు పండే కోస్తా జిల్లాల్లో భూములు సేకరించి దళితులు, పేద రైతులు, రైతు కూలీలు, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయొద్దు. సారవంతమైన డెల్డాభూములను, అపార మత్స్యసంపద కలిగిన సముద్ర జలాలను కలుషితం చేయవద్దు.
` దళితులు, నిరుపేదలకు ప్రభుత్వ ఇచ్చిన అసైన్డ్ భూములను కోస్టల్ కారిడార్, ఎస్‌ఇజడ్, ఫార్మా ఇండస్ట్రీయల్ పార్కుల కోసం సేకరించడాన్ని నిలుపుచేయాలి.
` పెట్రోల్, రసాయన, పెట్రోకెమికల్ పరిశ్రమల పేరుతో ఆహార భద్రతకు ముప్పు తీసుకు వచ్చి ప్రజలను ఆకలి చావులకు గురిచేయ్యొద్దు.
కార్యక్రమము
తేది : 3`5`2008 సాయంత్రం 4 గం॥లకు బహిరంగసభ
వేదిక : గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
వక్తలు : శ్రీ బి.డి. శర్మ, డా॥ కె. బాలగోపాల్, ప్రొ.॥ ఎస్. శేషయ్య, మేధాపాట్కర్, ఎమ్. రత్నమాల, బొజ్జాతారకం, హైకోర్టు న్యాయవాది, ప్రజాకవి వంగపండు ప్రసాద్, నాయుడు వెంకటేశ్వరరావు మరియు మత్స్యకార, దళిత, రైతు సంఘాల ప్రతినిధులు
ఐక్య కార్యాచరణ మరియు సంఫీుభావ కమిటి :
మత్స్యకారుల హక్కుల వేదిక, మత్స్యకారుల సాహితి సమితి, మత్స్యకారుల హక్కుల సాధన సమితి, జైభీమ్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, కాకినాడ ఎస్.ఇ.జెడ్. వ్యతిరేక పోరాట కమిటీ, కాకినాడ ఎస్.ఇ.జెడ్. వ్యతిరేక పోరాట మహిళ సంఘం, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సమాఖ్య, మత్స్యకారుల యువజన సంక్షేమ సంఘం, జలజనుల, మత్స్యకారుల సేవా సంఘం, ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ, భీమిలి మండల మత్స్యకారుల సంక్షేమ సంఘం, సంజీవిని జలవాయు కాలుష్యబాదితుల సంక్షేమ సంఘం (శ్రీకాకుళం), సాంప్రదాయ మత్స్యకారుల సంక్షేమ సంఘం (శ్రీకాకుళం), మత్స్యకారుల సహకార సొసైటి (శ్రీకాకుళం), మత్స్యకారుల జల, వాయు, కాలుష్య బాదితుల సంఘం (బుడుగట్లపాలెం), సాంప్రదాయ మత్స్యకారుల ఐక్యవేదిక (విజయనగరం), తీరప్రాంత మత్స్యకారుల సంక్షేమ సంఘం (విజయనగరం), తీరప్రాంత వాడ బలిజ సంక్షేమ సంఘం, కోస్తా మత్స్యకారుల సంక్షేమ సంఘం, కడలి సామాజిక ఉద్యమం, లీగల్ ఎయిడ్ సెంటర్ ఫర్ పూర్ అండ్ వుమెన్, సముద్రతీర మత్స్యకార్మికుల యూనియన్ (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు), ఆంధ్రప్రదేశ్ మరపడవల ఓనర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, దళఙత బాపుజన్ ఫ్రంట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ కిసాన్ సభ, సమాలోచన (అనకాపల్లి), సాక్షి హ్యుమన్ రైట్స్, స్నేహ, జమీన్ బచావో ఆందళన, దళిత విముక్తి, కుల నిర్మూలన పోరాట సమితి, మానవ హక్కుల వేదిక, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, పి.ఓ.డబ్ల్యు., స్త్రీశక్తి, ఇండియన్ అసోసియేషన్ ఫర్ పీపుల్స్ లాయర్స్, అచ్యుతాపురం, రాంబిల్లి మండల సెజ్ బాధితుల సంఘం, తూర్పు గోదావరి సాంప్రదాయ మత్స్యకారుల సంక్షేమ సంఘం, లైట్ వెల్ఫేర్ అసోసియేషన్
ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక పోరాట సమితి.

-హేమా వెంకట్రావ్

No comments:
Post a Comment