కరపత్రం march 2008
ప్రజా సంఘాలకు, హక్కుల, సంఘాలకు, ప్రజాస్వామ్య వాదులకు మహిళలకు, పత్రికా ప్రతినిధులకు
మేము కాకినాడ సేజ్ బాధిత మహిళా సంఘ సభ్యులము. మా గ్రామాన్ని, భూమిని, ఇళ్ళను, మోసపూరితముగా, బలవంతంగా లాక్కోబడుతున్న వాళ్ళము. ప్రపంచంలో ప్రతి మహిళ తమ హక్కుల పై నడుం బిగించిన రోజున మేము మా కష్టాలను, కన్నీళ్ళను, ఆక్రోషాన్ని, ఆందోళనను సమస్తజనానికి తెలియజేయడానికి మేము ప్రతిఘటన సభను తేది : 07`03`2008న ఏర్పాటు చేసికున్నాము.
ప్రభుత్వము వంటలపోటీలతోను, ముగ్గుల పోటీలతోను మహిళలకు కార్యక్రమం చేపట్టి అసలు సిసలైన సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నది. పావల వడ్డీ సాధికారిత పేరిట మహిళలకు తాయిలం చూపిస్తున్న ఈ ప్రభుత్వం కాకినాడ సెజ్ బాధిత మహిళలకు ప్రజలకు న్యాయం చేయదని మా బ్రతుకులకు సమాధానం చెప్పలేదని సుమారు 4000 మంది కూర్చొన్న సభలో మేము, పురుషులము పిల్లలు ఒక నిర్ణయానికి వచ్చాము ‘‘మా స్కూలు పోతుందా’’ అని కన్నీళ్ళతో అడిగిన మా పిల్లల సాక్షిగా సెజ్ భూతాన్ని తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేసాము. మేమందరము. సెజ్‌లు మాకు వద్దని నిరసిస్తూ సెజ్ ఆక్రమించుకున్న భూమిలోకి గ్రామ పొలిమేర నుండి పాదయాత్ర చేసుకుంటూ 4000 మంది మేము, పరుషులతోను పిల్లలతోను, వృద్దులతోను ప్రవేశించినాము. సెజ్ ఆక్రమిత భూములలోని కంచెను, పెన్సింగ్ రాళ్ళను మా కడుపు కొట్టి నిర్మించుకున్న కట్టడాలను మేము మా మిగతా గ్రామ ప్రజలతో కలిసి ఆవేదనతో కూల్చివేసినాము.
ఇప్పటివరకు మేము అధికారులతో ప్రభుత్వంతో చర్చించాము. న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. కేసు పరిష్కార దిశలో ఉండగానే మా మీద అణచివేత ధోరణితో, అధికార బలగంతో సెజ్ పేరిట కె.వి.రావు సంబంధిత సిబ్బంది మామీద దౌర్జాన్యాన్ని ప్రదర్శిస్తూన్నారు. వివిధ దశలలో న్యాయస్థానాన్ని తమ మధ్యంతర తీర్పులో భూసేకరణకై ప్రజల మీద బల ప్రయోగం చేయవద్దని మమ్ములను దొంగలుగా ముద్రించవద్దని తమ కడసరి తీర్పు తేది : 4`4`2008 వరకు ఎట్టి ఆక్రమణలు చేయరాదని ఉత్తర్వులు ఆదేశించినా, మా భూములలో నిర్మాణాలు కట్టడంతో పాటు మా ఇళ్ళను భూములను స్వాధీన పరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
ఇది ద్రోహం అనిపించవచ్చు. తప్పుగా కనిపించవచ్చు శిక్షార్హులు అవ్వచ్చు కాని మాకు అన్నం పెట్టే పచ్చటి పొలాలను, మాలో భాగమైన సముద్రాన్ని మత్స్య సంపదను ఆఖరికి మాస్వేచ్చాయుత గాలిని స్వంతం చేసుకోవాలనుకున్న ఈ స్వార్థపరులు శిక్షార్హులు కారా? భూమి మీద ఆధారపడ్డ రైతులకు, రైతుకూలీలకు, సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులకు, పశుసంపద మీద ఆధారపడిన యాదవులు, దళితులు, పిల్లలు పెద్దలను కాదనక సెజ్ పేరిట భూవ్యాపారాన్ని చేస్తున్న కె.వి.రావు సంఘ వ్యతిరేకశక్తి కాదా? ఇది ద్రోహం కాదా??
మమ్ములను మా నాయకులను అరెస్టు చేస్తామని కె.వి.రావు పోలీసు యంత్రాంగముతో ఊరు ఊర పహారా కాస్తున్నారు. మా గ్రామాలపై ఏక్షణమైన దాడులు జరగవచ్చు నిర్భందము పెరగవచ్చు మా
ఉద్యమాన్ని, మా నాయకులను ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాము. మాకు కులం, మతం, స్త్రీలు, పురుషులు, వృద్దులు, పిల్లలు అనే బేధాలు లేవు, మేమంతా సెజ్ బాధితులము, ఒకేవర్గము.
మా ఆక్రందనను వినండి మా ఆక్రోషాన్ని అర్థం చేసుకోండి. మా ప్రతిఘటనకు మీ వంతు మద్దతు ఇవ్వండి. మీ సహకారం మాకు స్పూర్తి...
పోరాట అభినందనలతో...
కాకినాడ సెజ్ వ్యతిరేక మహిళా సంఘం
డిమాండ్స్ :
1. మమ్ములను మాకుటుంబాలను నాశనం చేస్తున్న కాకినాడ సెజ్‌ను వెంటనే రద్దు చేయాలి.
2. సెజ్ పేరిట భూవ్యాపారము చేస్తున్న కె.వి.రావు లాంటి భూ(బ)కాసురలను వెంటనే ఇక్కడ నుండి
తరిమివేయాలి.
3. మాపచ్చటి పొలాలను పర్యావరాణాన్ని కాపాడాలి.
4. భూమి మీద ఆధారపడ్డ మహిళలను, రైతు, కూలీలను మా భూముల నుండి వేరు చేయకూడదు.
5. చర్చల సందర్భంలో కె.వి.రావు సంబంధిత ఉద్యోగులు (ప్రభాకర్) మొదలగు వారు స్త్రీలపై జరిపిన
దౌర్జన్యాన్ని ఖండిరచండి.
6. సెజ్ పేరిట జరుగుతున్న భూ ఆక్రమణ ప్రక్రియలో గ్రామాలలో స్త్రీలపై ప్రజలపై జరుగుతున్న
హింసాయుత ధ్రోరణిని వెంటనే ఆపివేయాలి.
7. సెజ్ వలన వాతావరణ కాలుష్యంవల్ల ప్రజారోగ్యం దెబ్బతిన్నడాన్ని ఆపేయాలి.
8. పారిశ్రామిక కాలుష్యం వల్ల జలవనరులను కాలుష్యం నుండి తప్పించి మా మత్స్య సంపదను
జీవనాన్ని కాపాడాలి.
9. భూమి మీద ఆధారపడిన పశుసంపదను కాపాడాలి.
10. వివిధ కులవృత్తుల మీద ఆధారపడిన వృత్తిదారులను మా గ్రామాల నుంచి దూరం చేయకండి.
11. అభివృద్ధి పేరిట వినాశనం మాకొద్దు.
-హేమా వెంకట్రావ్

No comments:
Post a Comment